పిల్లి గడ్డం ఆంద్రబాబు గోడమీది వేషాలు ప్రజలకు పూర్తిగా తెలిసి పొయినై. ఆయిన కల్లబొల్లి మాటలు ఇప్పుడు తెలంగాణాల వినేటందుకు ఎవ్వరు సిద్ధంగ లేరు. దానికి మరో దృష్టాంతం విఫలమైన రణభేరి. ఆయిన కాలం చెల్లిన చాణక్యం ఆ పార్టీ చేవ చచ్చిన భజన సంఘం నాయకుల తోని రణభేరి మోగించ లేదు సరికదా తన పార్టీకి తెలంగాణాల చావుడప్పు మాత్రం మోగించుకుంది.
తెలంగాణాల అడుగు పెట్టేతందుకు మొకం లేక చెంచాగిరీ చేసే నాయకులతో తెలంగానకోసమని దొంగ సభ పెట్టి, ఓహో తెలంగాణాల మాకూ బలముంది అని నిరూపించుకోవాలన్న దొంగ బుద్ధికి జనం సరిగ్గ బుద్ధి చెప్పిన్రు. ఇప్పటికన్నా ఆ పార్టీ గోడమీది పిల్లి వేషాలు మానకుంటే ఆంధ్రాలనన్న గెలుస్తది. లేకపొతే రెండిటికి చెడ్డ రేవడి కావడం మాత్రం ఖాయం.
తెలంగాణా తెలుగుదేశం నాయకులందరు కూడి నిర్వహించిన సభల కనీసం వందల మంది జనం కూడ జమ కాలేదంటే ఇంకా తెలంగాణాల ఆ పార్టీ నీళ్ళు వదులుకున్నట్టే. ఇప్పటికైన తెలంగాణా తెలుగుదేశం నాయకులు ఈ విషయం తెలుసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకే మంచిది. ఇప్పుడు గూడ తెలుసుకోక పొతే వాళ్ళ రాజకీయ జీవితం భూస్తాపితమై పోయిందని గ్రహించాలె. వీళ్ళకు తెలంగాణాల దిక్కుండదు, ఆంధ్రాల గెలిచే దమ్ములేదు. మొత్తానికి వీళ్ళు ఆంధ్రబాబు వేషాలకు పావుల్లాగా బాగనే పనికొస్తున్నరు. కాని చివరికి ఆంద్రబాబు ఆంధ్రల బాగనే ఉంటడు, కాని తెలంగాణాల వీళ్ళు తిరుగ లేరన్న విషయం మాత్రం వీళ్ళు తెలుసుకోవాలె.
అయ్యా తెలంగాణా తెలుగుదేశం నాయకులారా! మీరు ఇంత వెన్నెముక లేని మనుషులని తెలువక ఇన్నాళ్ళు ఓటేసినందుకు ఇక్కడి ప్రజలు సిగ్గుపడుతున్నరు. మీరు నిజంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కొరుతుంటే ఈ క్రింద ఇచ్చిన అవకాశాల్ల ఏదో ఒకటి చెయ్యండి.
- మొదటిది ఆంధ్రబాబు కపట నాటకాలు బయట పడేటట్టు చెయ్యడం. ఈ పని ఇప్పటికే నాగం చేస్తుండు. ఆయినకు సపోర్టు చేయ్యున్రి. మీ పార్టీ విధానం ప్రత్యేక తెలంగాణా నా, సమైక్య వాదమా తేల్చి చెప్పేటట్టు చెయ్యున్రి.
- మీ నాయకుడు తేల్చి చెప్పకపోతే మొత్తం తెలంగాణా తెలుగుదేశం పార్టీ వొల్లంత బయటికి వచ్చేయండి. మీరు TRS లనో, ఇంకో పార్టీలనో చేరే అవుసరం లేదు. మీరే ఇంకో తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకొని JAC ల కలువున్రి. అందరితోని కలిసి పోరాటం చెయ్యున్రి. అప్పుడు ప్రజలు మిమ్ముల నమ్ముతరు.
- పై రెండు పనులు చేసుడు ఇష్టం లేక పొతే 'మేం సమైక్యాంధ్ర వాదులం' అనినా ప్రకటించున్రి. చేతనైతే ప్రజలని సమైక్యాంధ్ర వైపు మళ్ళించే టందుకు ప్రయత్నించున్రి. ఏం జరుగుతదో చూద్దాం. కనీసం నాయకులనిపిచ్చుకుంటరు.
తెలంగాణా సాయుధ రైతాన పోరాటానికి ముందు
ReplyDelete"తెలంగాణా సామాన్య ప్రజానీకం "దొరా నీ కాల్మొక్త బాంచెను " అనే టోళ్ళు .
ఆ తర్వాత ప్రజలు ఆ మాటను విసర్జిన్చిండ్లు.
ఇప్పడు
తెలంగాణా రాజకీయ దగుల్భాజీలు ఆంద్ర దొరల ముందు
సిగ్గు శరం లేకుండా ఆ మాటను అంటూ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతున్నారు.
వాళ్ళు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశ పడుతున్నారు.
గదే గీ తీ డీ పీ రణభేరి ఇచ్చిన సందేశం !
"చంద్ర బాబు దొరా నీ కాక్మోక్త బాంచెన్ !"
Yadagiri
యాదగిరి గారు,
ReplyDeleteమీరు చెప్పింది నిజం. కృతఙ్ఞతలు.