ఆంధ్రోల్లు చెప్పే అబద్ధాల లిస్టులో ఇదొకటి. పీవీ నరసింహా రావును తెలంగాణా ప్రజలు ఓడించినరట! అప్పుడు ఆంధ్రా వాళ్ళు పూనుకొని తలా ఒక చెయ్యేసి గెలిపించినరట! నిజంగా ఎంత బాగుంది బై వినేటందుకు!
అసలు పీవీ రాజకీయ చరిత్ర ఒక సారి చూస్తె విషయం అర్థమైతది.
పీవీని 1957 నుండి 77 వరకు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది తెలంగాణాయే. 1977 నుండి 84 దాంక వరంగల్ నుండి ఎంపీగా గెలిచిండు. 1984 ఎన్నికల్ల మాత్రం ఎన్టీయార్ ప్రభంజనంల అందరు కాంగ్రెస్ నాయకుల్లాగానే పీవీ కూడ ఒడి పోయిండు. అయినా ఆ ఎన్నికల్ల మధ్యప్రదేశ్ లోని రాంటెక్ నుండి ఎంపీగ గెలిచిండు.
మరి గియ్యన్ని జరుగుతున్నప్పుడు సదరు ఆంధ్రా ప్రజలకు పీవీ లోని గొప్ప నాయకుడు కనపడలే. ఎవ్వరు కూడ తమ స్థానాలు వదులుకొని 'రావయ్యా పీవీ నిన్ను గెలిపిస్తం' అని చెప్పలే.
ఆ తర్వాత రాజీవ్ గాంధీ కూడ పీవీకి పెద్దగా ప్రాధాన్యం ఇయ్యలేదు. పీవీ క్రియాశీల రాజకీయాల్లోంచి దాదాపుగా రిటైర్ అయ్యిండు. 1991 పార్లమెంటు ఎన్నికల్ల పోటీ కూడ చెయ్యలేదు. ఆ టైముల ఆధ్రోల్లు ఎవ్వరు గూడ వచ్చి 'అయ్యా పీవీ! నువ్వు అప్పుడే రిటైర్ కావద్దు. నువ్వు చెయ్య వలసిన పని చాన ఉన్నది. మా దగ్గరి నుంచి గెలువు' అని చెప్పిన పాపాన పోలే.
కాని తర్వాతనే అసలు గమ్మతు జరిగింది. ఎన్నికల ప్రచారంల రాజీవ్ గాంధీ చనిపొయ్యిండు. కాంగ్రెస్ ఎన్నికల్ల పెద్ద పార్టీగ గెలిచింది గని పూర్తీ మెజారిటీ రాలే. గా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపే టందుకు కాంగ్రేసోల్లకు పీవీ తప్ప ఎవ్వరు దిక్కు లేకుంట పొయ్యింది. రాజకీయాలు మానుకున్న పీవీని తీసుకపోయ్యి ప్రధాన మంత్రి కుర్చీల కూసబెట్టిన్రు.
గట్ల ఎంపీ కాకుండనే పీవీ ప్రధాని అయ్యిండు. కాని ప్రధాని అయ్యినంక ఐదేండ్ల లోపల యాడినించన్న ఎంపీగ ఎన్నిక కావాలె. లేక పొతే ప్రధాని పదవి ఊడి పోతది.
గప్పుడు పీవీ దేశానికి ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. గాయిన చెప్పితే ఏ కాంగ్రెస్ ఎంపీ అయినా సీటు ఖాళీ చేసి ఇయ్యవలసిందే. గది మనం చూసిన, చూస్తున్న చరిత్ర.
గప్పుడే మల్లొకసారి ఆంధ్రా తెలివి తేటలు బయట పడ్డై. పెద్ద పెద్ద కాంట్రాక్టులు పట్టాల్నంటే ప్రధానిని మంచి చేసుకోవాలె. ప్రధానికి ఏం అవసరం? ఎంపీగ గెలుసుడు అవసరం.
గప్పుడు నంద్యాల నుండి గంగుల ప్రతాపరెడ్డి రాజీనామా చేసిండు. గా ఎలక్షన్ల ఎన్టీ రామారావు ఎవ్వరినీ తెలుగుదేశం నుండి పోటీకి నిలబెట్ట లేదు. దాన్తోని పీవీ నాలుగు లక్షల మెజార్టీతో గెలిచిండు.
దీంట్ల మన సమైక్య సోదరులకు సంకలు గుద్దుకునే విషయం ఏముందో వాళ్ళే చెప్పాలే. పవర్ లో ఉన్న పీవీ నంద్యాల నుంచి కాకపొతే నాగాలాండ్ నుంచైనా గెలిచే వాడే మన మన్మోహన్ లాగా!
పీవీని గెలిపిచ్చుడు సంగతేమో, గని ఉద్యమాలు చేసి ఆయినను రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దె దింపింది మాత్రం ఆంధ్రా వాళ్ళే ననేది చరిత్ర చెప్పుతున్న సత్యం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీవీ భూ సంస్కరణలు అమలు చేసిండు. తెలంగాణాలో అమలైన భూ సంస్కరణలు ఆంద్రాల గూడ చెయ్యడానికి పూనుకునుడే పీవీ చేసిన తప్పు. ఇది సహజంగనే ఆంధ్రా బూర్జువా భూస్వామ్య వాదులకు నచ్చలేదు. పైకి ముల్కీ నిబంధనల పేరు చెప్పినా, జై ఆంధ్రా ఉద్యమానికి అసలు కారణం మాత్రం పీవీని గద్దె దించుడే. పీవీ తో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించుడు ఈ ఉద్యమ పరిష్కారాలలో ఒకటి.
పీవీ దిగిపోవడం తోటి ముల్కీ ఏదో ఒక రూపంలా అట్లనే ఉన్నా, భూసంస్కరణలు మాత్రం పూర్తిగా ఆగిపోయినై.
chaalaa baagundi mee visleshana
ReplyDelete- Yadagiri
Mr.Srikanthachari,
ReplyDeleteRajinama chesinadi Bhuma Nagireddy garu kadu biddaa....Gangula family nundi regin chesinaru
naveen,
ReplyDeleteThanks, Corrected.
Thanks Yadagiri
ReplyDeleteఅసువంటి పి.వి గారి భూమిని కబ్జా చేసిన చరిత్ర కూడా మీ తెలంగాణా వాళ్ళది. పాపం ఆయన ప్రధానమంత్రి అయికూడా మీకు జడిసి మూసుక్కూచోవలసి వచ్చింది.
ReplyDeleteabbaa anaa neeku bhale telivE , Yadanumchi vatchimede
ReplyDeletevoleti
ReplyDeleteఏ భూములో కాస్త చెప్పుతరా? సీలింగు దాటితే ఎవ్వరి భూములైనా కబ్జా చెయ్య వలసిందే.