1956 కెళ్ళి చూడ బడితిమి. ఒప్పందం ప్రకారం ఒక్కటిగ కలిస్తిమి. అది మొదలు మోసాల మీద మోసాలు జరుగుతనే ఉండే.
మొదటి దెబ్బ కలిసిన తెల్లారే ఉపముఖ్య మంత్రి పదవికి తెడ్డు జూపిండ్రు. నిన్నటిదాంక ఉపముఖ్యమంత్రి చేసినాయనకు కూడ ఉప ముఖ్యమంత్రి అంటే ఆరో వేలు లెక్క కనపడ్డది. కనీసం ఆ ఆరోవేలు కూడా ఇయ్య దరియ్యలేదు గాయనకు.
రెండో దెబ్బ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు పీకేసిండ్రు. ఇంక విచ్చల విడిగ ఇక్కడి భూములు కొనేటోనికి అడ్డే లేకుంట పొయ్యింది.
మూడో దెబ్బ ముల్కీ రూల్సు పీకేసుడు. కోర్టుల ముల్కీ రూల్సు కేసుల తెలంగాణాకి అనుకూలంగా తీర్పు వస్తే దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే నడిపిండ్రు. ముల్కీ రూల్సుకి ఓర్వలేని వాళ్ళు ఏదో ఇక్కడ ఉద్దరిస్తున్నట్టు చెప్పుతారు. ఇక్కడి వనరులు మింగుడు దప్ప ఇంకోటి తెలువని వానికి సమైక్యంగ ఎన్ని రోజులు ఉంటె అంత మంచిగుంటది. అందుకనే సమైక్యతా రాగం.
ఇట్ల లెక్క పెట్టుకుంట పొతే ఎన్నో మోసాలు. కృష్ణా బేసిన్ నీళ్ళు పెన్నకు పంపుతరు. ఇక్కడి ప్రాజెక్టులు పాతికేండ్లు, యాభయ్యేండ్లు ఎనుకకు పోయినా సరే, ఇక్కడ నికర జలాలకు తికానా లేక పోయినా సరే, అక్కడ మాత్రం మిగులు జలాకకు రయ్యి, రయ్యి మనుకుంట ప్రాజెక్టులు పూర్తయితయి.
హైదరాబాదు ఉద్యోగాలను ఫ్రీజోను కింద మారుద్దమని సూస్తరు. దొంగ సర్టిఫికెట్లు తెచ్చి ఇక్కడి ఉద్యోగాల్ల దూరుతరు. ఇయ్యన్ని ఎవరో పోరగాల్లు చెప్పే ఉత్తుత్త మాటలు గాడు, గిరగ్లానీ అనేటాయన పరిశోధించి చెప్పిన మాటలు.
ఇయ్యన్ని ఒక ఎత్తయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడి భూములు, జాగలు కబ్జా చేస్తరు. ఆ కబ్జాలు చేసుడు కూడా అభివృద్ధే నని కతలు చెప్పుతరు.
ఈ దోపిడీలను ఆపే పేరుతోటి 610 జీవోలను తీసినా, జలయజ్ఞాలను చేస్తున్నమని చెప్పినా, అన్నీ గూడ వాళ్ళ మేళ్ళ కోసమే పెట్టుకుంటున్నరని ప్రతి ఒక్కరికి తెలిసి పొయ్యింది. మీ 610 జీవోలు తెలంగాణా వాళ్ళను ట్రాన్స్ఫర్ చెయ్యడానికి మాత్రమె పనికొస్తయి. మీ జలయజ్ఞాలు పోతిరెడ్డిపాడు, పోలవరం కట్టేతందుకే పనికొస్తయి. అంతే గని వీటితోని తెలంగానోల్లకు వీసమెత్తన్నలాభముండదని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది.
ఇన్ని సంవత్సరాల తర్వాత తెల్సిన దేంది? ఆంధ్రా దోపిడీ దారుల అక్రమాలు ఆగిపోవాలంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తప్ప వేరే మార్గం కనపడుత లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయితే అన్ని అద్భుతాలు జరుగక పోవచ్చు. కనీసం పక్కోడు వచ్చి ఆక్రమిస్తుంటే కొమ్ము కాసే ప్రభుత్వం ఉండదు. (ఒక వేళ ఉన్త్తడి అనుకున్నా సమైక్య వాదులకు నష్టం లేదుగా?). ఇక్కడి నిధులు పక్క రాష్ట్రంల కరసు పెట్టే అవకాశం ఉండదు. ఇక్కడి నీళ్ళకు పక్క రాష్ట్రంల ప్రాజెక్టులు కట్టే పరిస్థితి ఉండదు. ఆ విధంగ రాష్ట్రం విడిపోతే కొన్ని చాలా సమస్యలకు ఆటోమేటిగ్గా పరిష్కారాలు దొరుకుతయి.
మరి ఇన్ని నిజాలు చూసుకుంట ఇంకా సమైక్యంగా ఉండాలె, మీకిష్టం లేక పోయినా మీతోటే కలిసుంటాం అనేటోళ్ళను ఏమనాలె? దురాక్రమణ దారులంటే తప్పేంది? ఆంద్రాల ఉన్న సామాన్య ప్రజలు, ఇక్కడి కొచ్చి బతుకుతున్న సామాన్య ప్రజలమీద ఇక్కడి వాళ్లకు కోపం లేదు. కాని తెలంగాణా ప్రజల ఆకాంక్షలను పట్టించుకోక, సమైక్యాంధ్ర అని మాట్లాడే వారు ఎవరైనా సరే తెలంగాణా వ్యతిరేకులు, దురాక్రమణ శక్తుల అనుకూలురు అనే మేం అనుకుంటం.
మరి మీ తెలంగాణా నుండి ఎన్నికై అనేక పదవులు చేపట్టిన ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి, రక్షణ, ఆర్ధిక, నీళ్ళ మంత్రులు, ఎంపీలు,ఎంమ్మెల్యేలు.... వీళ్ళంతా దోపిడీ గాళ్ళు కాదా, మరిన్నాళ్ళు వాళ్ళు ఏం పీకేరు.. వాళ్ళని మీరు ఏం పీకుతున్నారు... మీ వాళ్ళ చేతిలోని అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ దోచుకోబడుతునే వుంటారు... మీ ఖర్మ.. మా దౌర్బాగ్యం...
ReplyDeleteayya! maa telagana vallu enni rojulu cm ga vunnaru? mee seemandhra vallu enni rojulu cm ga vunnaro koddiga lekka chusi cheppandi. chenna reddy cm ga vunte dimpataniki matha kalahalu srustinchidi e pratam vallo koddiga cheppandi. plz.
ReplyDeleteఅయ్యా,
ReplyDeleteఇప్పటిదాకా దేశాన్ని ఏలిన నాయకులంతా దోపిడీగాళ్ళే. అయితే మా వాళ్ళు వేరే వాళ్ళ నీళ్ళు కొల్లగొట్టుక తేలేదు. మావోళ్ళను తీసుకపోయి వేరే ప్రాంతాలల్ల అక్రమంగ ఉద్యోగాలిప్పించ లేదు.
రేపు గూడ మా రాష్ట్రంల గీల్లే ఉంటరు. అయితె ఎవరి లెక్క వాళ్ళకుంటది. పొత్తు పేరు జెప్పి చేసే దోపిడీలు ఉండవు.
telangana vidipote daniki manchi jarugutundo chedu jarugutundo devuderugu. kachitanga andhra prantaniki matram melu jarugutundi. vidipotene better. andhra abhivruddi chendutundi. telangana pratyeka rashtra korikaa teerutundi ea godava undadu. - vamsi
ReplyDeleteమనం క్రికెట్ లో ప్రపంచ కప్పు గెలిస్తే "అరే! అందులో నార్త్ ఇండియా వాళ్ళు ఆడారు. సౌత్ నుండి ఒక్క శ్రీశాంత్ మాత్రమే వున్నాడు.ఈ విజయం మనది కాదు" అని అంటామా! లేదే. అది మన అందరి విజయం అని దేశమంతా పండగ జరుపుకోలేదా. ఏ సీమ వాళ్ళు పదవిలోకి వచ్చినా ప్రజలను దోచుకోవడమే తప్ప ఎవరికీ మంచి చేయరు. నేతలు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా అన్యాయం చేసినపుడు వారిని నిలదీసి అడగాలి. వెనుకబడిన ప్రాంతాలు రాష్ట్రంలొ అంతటా వున్నాయి. మనకు ప్రతి స్థాయి లొనూ లంచగొండితనం పేరుకుంది. పరస్పర నిందలవలన ఒరిగేదేమీ లేదు. ఏ రాజకీయ నాయకుడూ తన పొట్ట, తన వారి పొట్ట, తన పార్టీ పొట్ట నిండనిదే ఆదర్శాలు వల్లించడు. మనం మన అమూల్యమైన కాలాన్ని ఈ రాజకీయ నాయకుల ప్రలోభాల కొసం వృధా చేస్తున్నాం. మనను రెచ్చగొట్టి మనం విరిగితే ఆధిపత్యం సాధించొచ్చనే తెలివైన తమిళుల ఆలోచన. ఇవన్నీ అర్ధం చేసుకోకుండా అందరినీ ఏదో ఉద్ధరిస్తున్నామనుకునె మీ గుండె ఘోష వృధా ప్రయాస. ఇది అనవసరమైన మనస్పర్ధలు ఎక్కువ చేస్తుందె తప్ప ఇంకేమీ చెయదు. ఇప్పటికైనా సమాజానికి ఉపయొగపడే అంశాలమీద మీ దృష్టిని కేంద్రీకరించండి.
ReplyDeleteనిన్న విశాక సమైక్య వాదులు కే సి ఆర్ ని ఒసామా బిన్ లాడెన్ తో పోల్చి
ReplyDeleteతమ కుళ్ళును, సాడిజాన్ని, కంత్రి బుద్ధిని ప్రదర్శించుకున్నారు.
గీ కంత్రి గాళ్ళ తోనా కలిసుండేది. వీలా సంయాక్యతను సహోదరత్వాన్ని కోరుకునేది.
తూ తూ తూ
సమైక్యత అంటే గీ హవుల కార్యక్రమమా ?
ఆంద్ర నక్కలు కుక్కలు, తోడేళ్ళు తెలంగాణాను బాకర గాళ్ళను చేసి ఇంకా ఆడించాలని చూస్తున్నాయి.
ఇదివరకు చెల్లిందేమో గానీ ఇగ చెల్లదు
వాళ్ళ నఖరాలు ఇక నడవవు.
-Yadagiri
వంశి,
ReplyDeleteవిడిపోతే తెలంగాణాకి, ఆంధ్రాకి కూడా మంచే జరుగుతది. మానసికంగా విడిపోయి రాష్ట్రంగ కలిసి ఉండుడు కన్న, రాష్ట్రాలుగ విడిపోయి తెలుగు వారిగ కలిసుందాం.
@Anonymous May 4, 2011 4:44 PM
ReplyDeleteఅరె అన్నా, నచ్చితె దేశంల అందరిని ఆరాధిస్తమన్నా. ఆ మాటకొస్తె విదేశీయులను కూడ అభిమానిస్తం. దానికి దీనికి లంకె యేంది?
విడిపోవడం వల్ల ఇప్పుడున్న ప్రాంతీయ పక్షపాతానికి ముగింపు పలుకొచ్చు. కలిసి ఎన్నేల్లున్నా ఈ సమస్యలు పెరుగుతయే గని పరిష్కారం గావని ఈ 55 ఏండ్లల్ల తెలిసి పొయ్యింది.