ఆజాదు ఆంధ్ర నాయకుల తోని మీటింగు పెట్టిండు. ఆ మీటింగు ప్రారభించుకుంట ఎమ్మెల్యేల చెప్పుడు మొదలు పెట్టిండు. "నేను ఇంతకు ముందే తెలంగాణా నాయకులతోని మీటింగు పెట్టిన. గాళ్ళు మాత్రం సమైక్యాంధ్ర ఒద్దంటే ఒద్దని చెప్పుతున్నరు. తెలంగాణా విడగొట్టుడు తప్ప దేనికి గూడ ఒప్పుకోరట. మరి మీరేమంటరు?" అని అడిగిండు.
వెంటనే ఒకాయన లేచి అందుకున్నడు.
"అదెలా కుదురుతుందండీ? మాదంతా తెలుగుజాతి. మా జాతి సమైక్యత కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. అంతే గాని ఆంధ్రులను చీల్చడానికి మాత్రం ఒప్పుకోం."
ఆజాదు అర్థంగాక అడిగిండు. "అదేంది? కాసేపు తెలుగంటవు. కాసేపు ఆంధ్రా అంటవు. నీది తెలుగుజాతా? ఆంధ్రా జాతా?"
"అయి రెండూ పర్యాయ పదాలేనండీ" ఇంకొకాయన సర్ది చెప్పిండు.
"అట్లనా! మరి జాతి సమైక్యత గురించి మీరే ఎందుకు బాధ పడుతున్నరు? ఆల్లెందుకు బాధ పడుతలేరు? ఇద్దరు అనుకుంటెనే గద సమైక్యత సాధ్యపడేది?" అడిగినడు ఆజాదు.
"వారు కూడా సమైక్యత కోరుకొనే మాతో కలిసేరు. అరవై ఏళ్ళు గడిచాక ఇప్పుడెందుకు వద్దనుకుంటున్నారో అర్థం కావడం లేదు."
"సరే, నాకర్థమయ్యింది లెండి." అన్నడు ఆజాదు. "కానీ మీరెంత చెప్పినా ఇంకా ఆంధ్రప్రదేశ్ కలిపి ఉంచుడు సాధ్యం కాదు. మొన్న జరిగిన ఎన్నికలల్ల మీరు జగన్ను అరికట్ట లేక పోయిన్రు. మీ ఆంధ్రాల పార్టీ మొత్తం జగన్ వైపు తిరుగుతదని సర్వేలు చెప్పుతున్నై. ఇంక తెలంగాణాల నన్న పార్టీ నిలబడాలె నంటె తెలంగాణా ఏర్పాటు తప్పనిసరిగా చెయ్యాలే. గదే విషయం మేడం మీకు చెప్పమన్నరు. రాష్ట్రం విడిపోతది. ఇప్పుడు చెప్పున్రి, కలిసుండుడు తప్ప ఇంకేమన్నా కండిషన్లు ఉన్నయా?"
"అలాగైతే హైదరాబాదు మాకిచ్చేయండి"
"డిల్లీ కూడా" ఇంకొకాయన అన్నడు.
"వార్నీ, డిల్లీ ఎందుకు?" ఆశ్చర్యం తోని అడిగిండు ఆజాదు.
"మరే, మా బాబాయి కొడుకు అక్కడో కిరాణా కొట్టెట్టి డిల్లీని డెవలప్పు చేసేడు. మరి డిల్లీని డెవలప్పు చేసింది మేమే కదా? మరలాంటప్పుడు డిల్లీ మాదే కదా?"
"మీ అసాధ్యం కూలా! కాసేపాగితే న్యూయార్కు కూడా మాదే ననే లాగున్నరే!" ఆశ్చర్య పోయిండు ఆజాదు.
"అంతే కాదు, ఇంకా ఉన్నాయ్ కండిషన్లు"
"అట్లనా, చెప్పుండ్రి నాయనా, విని తరిస్తా!"
"కృష్ణా, గోదావరి నీళ్ళు ఒక చుక్క కూడా తెలంగాణలో వాడ్డానికి వీల్లేదు. ఇప్పుడు ఎలా వాడుకుంటున్నామో, అప్పుడు కూడా మొత్తం నీళ్ళు మేమే వాడుకోవాలి."
"వీలైతే నదులకు ఆపక్కా, ఈపక్కా పక్కా గోడలు కట్టించాలి, తెలంగాణలో" వెనకనించి అరిచిండు ఇంకొకాయన.
"వార్నాయనో, ఇంత తెలివి తేటలున్న మిమ్ములను ఎట్ల భరించార్రా నాయనా వాల్లిన్ని రోజులూ?" ముక్కుమీద వేలేసుకుండు ఆజాదు. "ఇంతకు ముందే కదరా జాతి సమైక్యతా, తొక్కా తోలూ అన్నరు? సరే, ఇంకా జెప్పున్రి, విని రాసుకుంట".
"మరేం లేదండీ, మాకుర్రోల్లు అడిగితే కాదనకుండా తెలంగాణా లోకల్ కేండిడేట్ సర్టిఫికేట్ జారీ చేయాలి. దీనికోసం తెలంగాణా సెక్రెటేరియట్ లో ఒక సెల్ పెట్టాలి."
"అంతే కాదు, ఆంధ్రా కేండిడేట్లకు తెలంగాణా ఉద్యోగాల్లో 80 శాతం వాటా ఏర్పాటు చేయాలి. వింటున్నారా ఆజాద్ గారూ?"
ఇంకెక్కడి ఆజాద్! మూర్చొచ్చి పడిపొయ్యిండు.
ఇంకా మాకుర్రోల్లు హైదరాబాదులో భూములు కబ్జాలు జేస్తుంటె చూడనట్టు ఊకోవాలె, తెలంగాణాలో సివిల్ కాంట్రాక్టులన్నీ మాకావూరుకు, లగడపాటికే రావాలె, అక్కడ ఉన్న మైనింగ్ భూములన్నీ మాకే రాసివ్వాలె.
ReplyDeleteemi nidra poyinraa manollu?
ReplyDelete