అయ్యలారా
మాకు ఒక్క రాష్ట్రం అయితే వచ్చే మేలు లేదు, రెండు రాష్ట్రాలు అయితే జరిగే కీడు లేదు. ఎన్ని రాష్ట్రాలైనా మా బతుకు మేం బతుక వలిసిందే. మా చావు మేం చావ వలిసిందే.
తెలంగాణాల దొంగ సర్టిఫికెట్ల తోటి ఉద్యోగాలు తెచ్చుకునే మీలాంటి పైరవీ కారులకు నష్టమేమో తెలవదు కాని, ముక్కు సూటిగ పొయ్యే మాలాంటి సామాన్యులకు వచ్చే నష్టమేమీ లేదు.
తెలంగాణా వేరైనంత మాత్రాన గోదారికి, క్రిష్ణమ్మకు వాళ్ళేమన్న అడ్డుకట్ట లేస్తరా? వాళ్ళ నీళ్ళు వాళ్ళు వాడుకుంటారు. మన నీళ్ళు మనం వాడుకోవాలే. అయినా మాదగ్గర భూములెక్కడున్నయి సారూ? ఉన్న భూములన్నీ మీరే బినామీ పేర్ల మీద వేల వేల ఎకరాలు రాసుకున్నరాయే. భూములు పంచుతానని వచ్చిన తెలంగాణా పంతులును కుర్చీ మీంచి గెంటివేసింది మీరు కాదా సారూ!
మేము విడిపోయినా కూలో, ఉద్యోగమో చిల్లర వ్యాపారమో చేసుకోవాలె. కలిసున్నా అయ్యే చేసుకోవాలె. ఆ మాత్రం దానికి లోకం మునిగి పోతున్నదన్నట్టు అరిచి గోల పెట్టుడెందుకు సారూ.
తొమ్మిదో తారీకు అర్ధరాత్రి చిదంబరం ఏదో చెప్పినడట. పదోతారీకు నాకు సరిగా తెల్వకనె పాయె, నేనెక్కడా నుండి చెందాలిస్తిని? ఎక్కడ ఉన్నది ఉద్యమం చేస్తిని సారూ? ఏడ చూసినా పెద్ద పెద్ద కటౌట్లు, ప్లేకార్డులు, పోస్టరులు, డ్రామా డ్రెస్సులు, షామియానాలు, స్టేజీలు ఏడకెల్లి వచ్చినయి సారూ. తెలంగానోల్లకయితే చెప్పరు, కనీసం నాకయినా చెప్పండి సారూ.
మీరు ఉద్యమాలు చేసుకుంట ఆడోల్లు మొగోళ్ళు ముద్దులు పెట్టుకుంటా ఉంటే, నిమ్సుల గంతులేసుక ఉరుకుతా వుంటే శానా బాగా అనిపిచ్చింది సారూ. అట్లనే మా సమస్యలపై కూడా మీరు ఉద్యమాలు చేస్తే చూడాలని ఉంది సారూ!
నేను హైదరాబాదు ఏం జేసుకొను సారూ. ఆడికి పోవాలంటే చార్జీలకు కూడా డబ్బులు సాలవు. పొద్దు మాపు మీ దగ్గర చాకిరీనే సరిపోయే, అక్కడికి పోయి నేనేమి చేతు సారూ? ఆ రాజదానేదో ఇక్కడనే ఉంటే పుష్కరాని కొక్క పాలైనా వెళ్లి అసెంబ్లీ నో, హైకోర్టునో చూసి వస్తును కదా బాబూ.
మాటి మాటికి మీరు హైదరాబాదును డెవలప్ చేసినం అని చెప్తారు. హైదరాబాదు డెవలప్ అయితే నాకేం ఒరిగింది సారూ? అయినా హైదరాబాదులో బిజినేసులు చేసి మీరు డెవలప్ అయినరు దప్ప అక్కదోల్లకు మాత్రం మీరు చేసింది ఏమున్నది సారూ?
నా అక్క కొడుకు బెంగులూర్ల జాబు చేస్తుండు. నా చెల్లె కొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తుండు. ఇప్పుడు ఆ రెండు కూడా మనకు ఇవ్వమంటే ఇస్తరా సారూ. అయినా ప్రైవేటు ఉద్యోగం చేసే టందుకు ఏవూరైతే ఏంది సారూ?
మీరు తెలంగాణా పోయినా ఫర్వాలేదు, హైదరాబాదు పోనియ్యమంటున్రు. మరి కరీంనగర్ల ఉన్న మా చుట్టాలేంగావాలే సారూ? తెలంగాణా ఊర్లల్ల ఉన్న 20 - 30 లక్షల మంది మనోళ్ళు ఏం గావాలె సారూ? మీ ప్రేమ హైదరాబాదు మీదనా ఆంధ్రా ప్రజల మీదనా? అర్థం కావడం లేదు సారూ!
మాటి మాటికి ఒకే జాతి, అన్నదమ్ములము అని అంటారు. మరి మీ అన్నదమ్ములంత కలిసే ఉంటున్నారా, విడిపోయి ఉంటున్నారా సారూ. మా యిండ్లలో నయితే విడిపోతేనే బాగుపడుతం సారూ. మీ పెద్దోల్ల ఇండ్ల సంగతి నాకు తెలవదు. ఏకరాల కొద్ది ఇండ్లు ఉంటాయట కదా? ఒక్కొక్క ఇంట్లో ఎంత మంది ఉంటారు సారూ? తెలువక అడుగుతున్నా, ఏమనుకోకండి!
అలాగ అనుకుంటున్నారా?
ReplyDeleteఏమిడిదీ సుత్తి సారూ? వినివిని చెవులల్ల సీసం పేర్క పోయిందన్నట్టు. ఇర్వై నాల్గు గంటలు చావగొడుతున్రు. గారడి చేస్తున్రు. గడిబిడి చేస్తున్రు.ఈ లెక్కన పానం తీసుడేందే. చారన్నా.
ReplyDeleteఔ అన్నా,
ReplyDeleteగా ఆంధ్ర పెట్టుబడిదారుల గారడి మాటలు ఇనలేక మన ఆంధ్ర సోదరులు చెవులల్ల గుడ్డ పేలికలు పెట్టుకుంటున్నరట!
super.
ReplyDeleteవిశ్వరూప్, Thanks
ReplyDelete