కాంగ్రెస్ పెద్ద విలనే. ఐతే మన ప్రతిపక్ష నాయకుడు చెయ్య వలసినది ఏమిటి? ఆ విలనీని ఎండ గట్టాలె. ఆ పార్టీ తప్పులను బయట పెట్టాలె. కానీ వారికంటే ముందు అవే తప్పులు తానే చేస్తూ దొరికి పొతే? అధికార పక్షం మీద వత్తిడి పెంచుడు అటు పెట్టి తానే అధికార పక్షానికి టార్గెట్ గా దొరికిపోతే?
మన ప్రతిపక్ష నాయకుడి ప్రస్థానం పోయిన ఆరు సంవత్సరాల నుండి మొత్తం ఇదే రీతిగా నడుస్తున్నది. రాజశేఖర్ రెడ్డి ఒక వైపు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంటే ప్రతిపక్ష నాయకుడు చేష్టలుడిగి నిలబడి పోయిండు. ఏ కుంభకోణం చూసిన మొదట ఈ మహాత్ముని వ్యవహారాలే ముందు బయటికొస్తయి.
ఫలితం, ఏ కుంభకోణం మీదా చివరి వరకూ పోరాటం చేయ లేక పోవడం. ప్రతిదీ తనపేరు బయటికి వచ్చే సరికి మధ్యలోనే ఆపి వేయడం.
ఓబులాపురం మీద నాగం గట్టి పోరాటం చేసిండు. కాని అది ఎందుకో మధ్యలో ఆగిపోయింది. తీరా చూస్తే గాలికి గనులు కేటాయించింది ఈ మహానుభావుడే.
MR ప్రాపర్టీ పై పోరాటం అసలు మొదలే కాలేదు. కారణం, ఈయన, ఈయన తైనాతీలు లబ్ది దారులలో ముందు వరుసలో ఉండుడు.
భూముల కేటాయింపు, సెజ్జుల కేటాయింపు, ఏది మాట్లాడ బోయినా అది అధికార పార్టీ వారు పాత ఫైళ్ళు బయటికి తియ్యడం, ఆ ఫైల్లల్ల ఈ మహానుభావుడు చేసిన వ్యవహారం కన్నా వాళ్ళు చేసింది మెరుగ్గానే ఉన్నట్టు నిరూపించడం (కనీసం ఫైళ్ళ మీద) తో ఆరోపణలు అన్నీ వీగి పోయ్యేవి.
కనీసం రామలింగ రాజు విషయం లో కూడా ప్రోభుత్వాన్ని ఏమీ అనలేక, పైనించి ప్రభుత్వం నించి లోకేష్ బాబును రామలింగ రాజే చదివించిండని ఆరోపణలు వస్తే చేష్టలుడిగి నిలబడ్డ చరిత్ర చంద్రబాబుది.
ఫలితంగా 2009లో అధికారం లోకి రాలేక పోయిండు. అధికారం కోసం వేసే వెధవ నాటకాలల్లో భాగంగా తెలంగాణా ఏర్పాటుని సమర్ధించిండు అంతరాత్మ ఏమాత్రం ఒప్పుకోక పోయినా. ఆయన అంతరాత్మ అసలు రంగు డిసెంబరు 9 డిల్లీ హోంమినిస్టర్ అధికారిక ప్రకటన రాంగనే బయట పడ్డది.
నాయకత్వ పటిమ అదికారంల ఉన్నప్పుడు కాదు, ప్రతి పక్షంల ఉన్నప్పుడే బయట పడుతది. చంద్రబాబు నాయుడు ప్రజాకర్షణ కలిగిన నాయకుడు కాదు. కేవలం ఎత్తులు, పైఎత్తులతో రాజకీయం నడిపే ఇలాంటి నాయకుడు ధైర్యంగా path breaking నిర్ణయాలు తీసుకోలేడని గత ఆరేడు సంవత్సరాలుగా బయట పడి పోయింది.
తన చేతగానితనం తోటి ఇప్పటికే ఆడిన మాటలు తప్పే నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన మాటలు రెండు ప్రాంతాలలోనూ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈయన ఎంత రైతు బాంధవునిగా పోజు పెట్టినా ఈయన గతంలో చెప్పిన 'వ్యవసాయం దండుగ' అన్న మాటలే ప్రజలకు గుర్తు వస్తయి. ఈయన ఎంతగా సబ్సిడీలు ప్రకటించినా గతంలో ఈయన రద్దు చేసిన సబ్సిడీలే ప్రజలకు గుర్తుకు వస్తయి. అలాగే రేపు ఈయన తెలంగాణా ఏర్పాటుకు సపోర్టు చేస్తనని చెప్పినా డిసెంబరు పదో తేదీన నరం తెగిన ఈయన నాలుకనే ప్రజలకు కనపడుతది. తెలంగాణలో నైతే భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. ఆంధ్రాలో కూడా ఈయన పరిస్థితి అంతకన్నా ఏమంత నయంగ లేదు.
Looks like you forgot Chirujeevi factor for 2009 election results.
ReplyDeleteకాంగ్రెస్ తెలంగాణాకు విలన్ ... కానీ చంద్రబాబుకు, టీడీపీకి కాదు.!!
ReplyDeleteఎందుకంటే సోనియమ్మా ఆదేశిస్తే గంటలోపల టీడీపీ తెలంగాణాకు అనుకూలమని
లేఖ ఇస్తాడట.
అమ్మ ఆదేశిస్తే ఆంద్ర బాబు శిరసా వహిస్తాడు..
కాంగ్రెస్ వాడు సమైక్యాంధ అని దొంగ నిరాహార దీక్ష మొదలు పెడితే టీడీపీ అమ్మ
కావలించుకుని ముద్దు పెట్టుకుంటుంది.
కాబట్టి కాంగ్రెస్ టీడీపీకే విలన్ కాదు బాస్ ...బాస్ ...బాస్ !
- Yadagiri