ఈ సమైక్య వాదులు చెప్పేవి అబద్ధాలని ఒకరు చెప్పుడు అవసరం లేదు. నిన్నొక మాట చెప్పి, అంతలనే నాలిక తిప్పే ఘనాపాటీలు మన సమైక్యవాదులు.
నిన్నటి దాంక రాష్ట్రాలు విడగొట్టవద్దు. దేశ సమైక్యత కీ భంగం కలుగుతడి (?) అన్నోళ్ళు, ఇప్పుడు UP వొళ్ళు మూడు రాష్ట్రాలు చేసే టందుకు రెండో ఎస్సార్సీ అడిగితె, వెంటనే వీళ్ళు గూడ రెండో ఎస్సార్సీ పాత అందుకున్నరు. వీళ్ళకు రాష్ట్రమే విడిపోవుడు ఇష్టం లేనప్పుడు రెండో ఎస్సార్సీ, మూడో ఎస్సార్సీ అవసరం ఏమున్నది?
రెండో ఎస్సార్సీ అంటే ఇప్పుడు 18 రాష్ట్రాల డిమాండ్లు ముందుకు వస్తయని వీళ్ళకు దెల్వదా? తెలుసు. వీళ్ళ ఉద్దేశం ఒకటే. ఏదో ఒకటి చెప్పి మరింత గడువు తీసుకోవాలె. అప్పటికి ఏదో ఇంకో కుట్రకి ఉపాయం తట్టుద్ది. అంతే గని వాళ్ళు చెప్పే మాటలకు, పైకి వల్లిస్తున్న సిద్ధాంతాలకు పొంతన కుదుర్తదా, లేదా అన్న విషయం వాళ్లకు అవసరం లేదు.
ఇప్పటికే నలభై కోట్లు వృధా చేసి శ్రీకృష్ణ కమిటీ వేయించిన్రు. దానిమీద కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటది అని తెలువంగానే ఎస్సార్సీ పాత అందుకున్నరు.
నిజానికి వీళ్ళకు ఎస్సార్సీ తోటి పని లేదు, దేశ సమైక్యత తోటి పని లేదు. అట్లా అని ఆంధ్రా బడుగు జనాల మీద ప్రేమా లేదు. వీళ్ళ ఆలోచన అంతా ఒకటే. ఎట్లా హైదరాబాదుల కబ్జాలను కాపాడు కోవాలె. ఎట్లా పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఫలానోల్లను అడ్డం పెట్టుకొని పట్టాలె. ఎట్లా మరిన్ని కబ్జాలు చెయ్యాలె. గియ్యే వీళ్ళకున్న ఆలోచనలు.
గుండె ఘోష మీ ఒక్కరి సొంతం కాదు కాస్త మా గుండె ఘోష కూడా చదవండి
ReplyDeleteకొత్త పోస్ట్: http://shankaratnam.blogspot.com/
తెలంగాణా సోదరులారా! ఈర్ష్య పడండి..ఇదుగో మా ప్రాంతపు నిజమైన అందాలు
అయితె ఏమంటవన్నా? మీ భూములు కావాలె నన్నమా? మీ నీళ్ళు గుంజుకుంట మన్నమా? మీ ఉద్యోగాలు లాగేస్త మన్నమా? మీ బతుకు మీరు బతుకమనే, మమ్ములను ఒదిలేసి మరింత మంచిగ బతుకమనే కోరుకుంటున్నం.
ReplyDeleteఅంతే గని మా భూముల, నీళ్ళ, ఉద్యోగాల, పట్టణాల కబ్జా చేస్తమంటే మాతం ఊరుకునేది లేదు.
ఎహే ఆపండి ఈ గోల. ఎప్పుడు చూసినా మా భూములు, మా నీళ్ళు , మా ప్రాంతం అంటూ ఓ నస. ఏ ప్రాంతం నీళ్ళ మీద, భూమి మీద ఎవడి పేరూ రాసున్డదని దేశం లో ఎవడైనా ఎక్కడైనా బ్రతకచ్చని తెలీదా? అక్కడకి మీరొక్కరే దేశం లో అమాయకులు మిగిలిన ప్రాంతాల వాళ్ళు మిమ్మల్ని అడ్డంగా దోచేసుకున్తున్నట్టు గోల పెడుతున్నారు. అందరూ దొంగలే బాబూ. మధ్య నలిగి చచ్చేది సామాన్య జనమే. మీ వాదం మీకు ఎంత గొప్పదో అవతలి వాళ్ళ వాదం కూడా వాళ్లకి అంతే గొప్పదని మీరు ఎందుకు అనుకోరు? మీరు చేస్తే సంసారం వాళ్ళు చేస్తే వ్యభిచారమా? తెలంగాణాలోనూ సమైక్య వాదులున్నారు, కోస్తా సీమ ప్రాంతాలలోను వేర్పాటు వాదులున్నారు అంత మాత్రాన వాళ్ళని ఆ ప్రాంత ద్రోహులుగా అనేస్తారా? మీకున్న అభిప్రాయం చెప్పుకునే స్వేచ్చ వాళ్లకి ఉండకూడదా?
ReplyDelete"ఈ సమైక్య వాదులు చెప్పేవి అబద్ధాలని ఒకరు చెప్పుడు అవసరం లేదు. "
నేను సమైక్య వాదినే. నేను అబద్ధాలు చెబుతానని మీరు అనుకున్తున్నట్టే మీరు చెప్పేవన్నీ అబద్ధాలే అని నేను ఎందుకు అనుకోకూడదు.? సరే శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు చెప్పినట్టే రెండవ src వద్దు అందాం. మరి కలిపి ఉంచడమే అత్యుత్తమ పరిష్కారం అన్న శ్రీకృష్ణ కమిటీ తీర్పుకి మీరు తలోగ్గుతారా? లేదూ రెండవ ఎస్సార్సీ వేయాలంటారా? అప్పుడు మేము చెప్పిన అబద్ధాలు ఏమున్నాయి? అది మీరు అడిగినట్టేగా?
@ఏ ప్రాంతం నీళ్ళ మీద, భూమి మీద ఎవడి పేరూ రాసున్డదని దేశం లో ఎవడైనా ఎక్కడైనా బ్రతకచ్చని తెలీదా
ReplyDeleteతెలుసు గదా? మరి విడిపోతే మీకిబ్బంది ఏమిటి? అది చెప్పండి ముందు.
@మరి కలిపి ఉంచడమే అత్యుత్తమ పరిష్కారం అన్న శ్రీకృష్ణ కమిటీ...
అదే శ్రీక్రిష్ణ కమిటీ తెలంగాణా వారు ఒప్పుకుంటేనే అని ఒక క్లాజు కూడా పెట్టింది తమ్ముడూ.
@అప్పుడు మేము చెప్పిన అబద్ధాలు ఏమున్నాయి? అది మీరు అడిగినట్టేగా?
మరి మీరు తీర్పుకు అంత తలొగ్గే వారైతే రెండో ఎస్సర్సీ ఎందుకో? అలోచించు తమ్మీ.
"తెలుసు గదా? మరి విడిపోతే మీకిబ్బంది ఏమిటి? అది చెప్పండి ముందు."
ReplyDeleteమరి మీకూ తెలిసినప్పుడు "మా భూములు" "మా ప్రాంతం" అని ఈ గుండె ఘోషల పేరుతో ఇతరులని ఆడిపోసుకోవడం ఎందుకు? ఈ దేశం లో ఎవరైనా ఎక్కడైనా ఉండచ్చు అన్నప్పుడు కలిసుంటే మీకొచ్చే ఇబ్బందేంటి? జస్ట్ ప్రాంతం పేరు మారిపోతే, ప్రత్యేక రాష్ట్రం గా విడిపోతే పరిస్థితి మారిపోతుందా? బిన్ లాడెన్ పేరును మహాత్మా గాంధీ అని మారిస్తే అతను శాంతి కాముకుడు అయిపోతాడా?
"అదే శ్రీక్రిష్ణ కమిటీ తెలంగాణా వారు ఒప్పుకుంటేనే అని ఒక క్లాజు కూడా పెట్టింది తమ్ముడూ."
మీరు విడిపోవాలంటే అన్ని ప్రాంతాల వారి అంగీకారం తోనే అని కూడా చెప్పింది అన్నయ్యా.
"మరి మీరు తీర్పుకు అంత తలొగ్గే వారైతే రెండో ఎస్సర్సీ ఎందుకో? అలోచించు తమ్మీ."
తీర్పుకు తలొగ్గి సమైక్యం గానే ఉంచమంటే మీకు నచ్చట్లేదు కదన్నా మరి
@ ఈ దేశం లో ఎవరైనా ఎక్కడైనా ఉండచ్చు అన్నప్పుడు కలిసుంటే మీకొచ్చే ఇబ్బందేంటి?
ReplyDeleteకలిసుంటే వచ్చే ఇబ్బందులు కాదు. ఇప్పటికే వచ్చిన ఇబ్బందులు అనేక కమిటీలు తేల్చి చెప్పినయి. చేసుకున్న ఒప్పందాలు వమ్మయినై. అది ఇప్పటికే రుజువైన చరిత్ర.
ఒప్పందాలు వమ్మయిన విషయాన్ని శ్రీక్రిష్న కమిటీ కూడా ధ్రువీకరించింది. అలా ధ్రువీకరించిన శ్రీక్రిష్న కమిటీయే మళ్ళ ఇంకొక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని కలిసి ఉండమని మీరు చెప్పిన ఆరో సూత్రం కింద చెప్పింది. ఇంతకు ముందు ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థను కూలదోసిన ఈ సమైక్య వ్యవస్థ మరో కొత్త దాన్ని కూలదోయదు అనే నమ్మకం తెలంగాణల ఎవ్వనికీ లేదు. అందుకే మేం మా రాష్ట్రం మాగ్గావాలె నంటున్నం.
@తీర్పుకు తలొగ్గి సమైక్యం గానే ఉంచమంటే మీకు నచ్చట్లేదు కదన్నా మరి
నచ్చినా నచ్చక పోయినా విడిపోయే వాడే ఇలాంటివి కోరుకుంటడు. సమైక్యంగా ఇప్పుడున్నదేకదా? దానికి ఎస్సార్సీ ఎందుకు? ఏదొ ఒక కమిటీ తో కాలయాపన చేద్దామనుకునే వాళ్ళకే ఇటువంటి ఆలోచనలు వస్తయి.