Wednesday, May 4, 2011

తెరాస ను ఎందుకు బలపరచాలి?

తెలంగాణా లోని ఇతర పార్టీల నాయకులకు తెలంగాణా సాధన పైగల చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు. కానీ ఇతర పార్టీలకు తెలంగాణా ఒక అంశమే కానీ అదే ప్రధానం కాదు. పైగా ఆయ పార్టీల అధినాయకత్వానికి ఒక పొలిటికల్  కంపల్స్హన్ వచ్చినప్పుడే గతంలో తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందే కానీ స్వతహాగా వారికీ తెలంగాణా ఏర్పాటు పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 

తెలుగుదేశం పార్టీనే తీసుకుంటే, 2009 ఎన్నికల ముందు వరకు సమైక్య నినాదం తో ఉన్న ఆ పార్టీ కేవలం కాంగ్రెస్ ను ఓడించడానికి, తెరాస తో పొత్తు పెట్టుకోవడానికే తెలంగాణా కు అనుకూల నిర్ణయం తీసుకుంది. 2009  డిసెంబర్ 9 ప్రకటన ముందువరకు తెలంగాణా విభజనకు అనుకూలమన్న వాళ్ళు డిసెంబర్ 23 ప్రకటనను వ్యతిరేకించక పోగా కొత్తగా  రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. పార్టి వేదికపై పార్టీ అధికార విధానానికి వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులు మాట్లాడుతుంటే ఎక్కడా అభ్యంతర పెట్టడం లేదు. 

కాంగ్రెస్ విషయానికొస్తే, 2004 లో ప్రజల్లో ఉన్న తెలంగాణ సెంటిమెంటు ను ఉపయోగించుని తెలుగు దేశం నుంచి అధికారం లాక్కోడానికి తెలంగాణ జపం చేసిన ఆ పార్టీ అధికారం లభించగానే తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టింది. 2004 డిసెంబర్ 9 న  తప్పని పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి మళ్లి డిసెంబర్ 23 కల్లా వెనక్కు తిసుకుంది. ప్రజల మనోభీస్తానికి అనులంగా, చిరకాలంగా ఉన్న డిమాండు ను పరిష్కరించే దిశగా ఆలోచించాల్సిన పార్టీ, ఆలోచించగలిగే అవకాశం కలిగి ఉన్న పార్టీ తమ తక్షణ రాజకీయ అవసరాలకోసం తెలంగాణా ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వందలాది విద్యార్థుల, యువకుల మరణానికి కారనమవుతూంది.

తమతమ రాజకీయ అవసరాల కోసం తెలంగాణా అంశం పై రోజుకో వైఖరి తీసుకునే పార్టిలు రేప్పొద్దున ఇదే పొలిటికల్ కంపల్స్హన్ తో తెలంగాణా కు వ్యతిరేకంగా అధినాయకత్వాలు నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏమిటి పరిస్థితి? అప్పుడు  పార్టీల నుంచి బయటకు వచ్చే నిర్ణయం తీసుకున్నా అప్పటికే కాలాతీతం కాదా?

తెరాస పార్టీకి మరో ౩౦ సీట్లు ఉన్నట్లయితే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదన్నది సుస్పష్టం. కనుక తెరాసను బలోపేతం చేయాలనే కెసిఆర్ నిర్ణయం లో ఏతప్పూ లేదు. 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తెలంగాణా నాయకులు కూడా ఈ విషయం గ్రహించి తమ తమ పార్టీల నుంచి బయటికి వచ్చి తెలంగాణా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది.  వాళ్ళు తమ తమ పార్టీ లలో తెలంగాణా శాఖలు ఏర్పాటు చేసుకుని స్వతంత్రం గ పని చేయడం మంచిది లేదా ఒక ఉమ్మడి వేదిక పైకి వచ్చి పని చేయాలి. ఒకవేళ వారికి తెరాస పట్ల గాని, కెసిఆర్ పట్ల గాని ఎమన్నాఅభ్యంతరాలుంటే, తెలంగాణా రాష్త్రం ఏర్పడిన తరువాత మళ్లి ఎవరి గూటికి వాళ్ళు వెళ్లి పోవచ్చు. 

తెలంగాణా సాధన తప్ప మరే సమస్య ప్రస్తుత సమయం లో ముఖ్యం కాదనే ఆలోచనలో ప్రజలు ఉంటె ఈ నాయకులు మరో ప్రాంతం ఎన్నికల్లో తమ పార్టీ విజయం గురించి ఆలోచించడం సరైంది కాదు.

వీరంతా తక్షణమే ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం.

8 comments:

  1. తొండికో మొండికో మొదటినుండీ తెలంగాణా ఏర్పాటుకు నీజాయితీగ కొట్లాడుతున్నది TRS ఒక్కటే. ఆ సంగతి ఇప్పుడు ప్రజలకి గూడ బాగనే అర్థమయ్యింది. 2014ల 90% సీట్లు TRS గెలవడం ఖాయం. అప్పుడు 1000 మంది లగడపాటిలు, పదివేలమంది మిగతావాల్లు వచ్చినా తెలంగాణా నాపలేరు.

    ReplyDelete
  2. మే లో సరయిన నిర్ణయం తీసుకోని తెలంగాణా కాంగ్రేస్, TDP లీడర్లకు శాశ్వత రాజకీయ నిరుద్యోగమే.

    ReplyDelete
  3. తెలంగాణా కోసం ఎన్ని పార్టీలు, ఎన్ని జే ఎ సి లు కృషి చేస్తున్నా సమైక్య వాద శత్రు మూక ఒక్క టీ ఆర్ ఎస్ నీ కే సి ఆర్ ని మాత్రమె టార్గెట్ చేయడం చూస్తె చాలు టీ ఆర్ ఎస్ కే సి ఆర్ ల ప్రభావం సత్తా కమిట్ మెంట్ అర్ధం అవుతుంది.
    సమైక్య వాద మూక కేవలం కే సి ఆర్ టీ ఆర్ ఎస్ లను మాత్రమె వేర్పాటు వాదులు, తెలబాన్లు అని నిదిస్తూ కాంగ్రెస్ టీడీపీ తదితర పార్టీల తెలంగాణా నాయకుకులు చేసే తెలంగాణా పోరాటాన్ని గుర్తించడం లేదు.
    నిన్న కే సి ఆర్ ని ఒసామా బిన్ లాడెన్ తో పోల్చి వాళ్ళ కుళ్ళును, సాడిజాన్ని, కంత్రి బుద్ధిని ప్రదర్శించుకున్నారు.

    ReplyDelete
  4. meeru kevalam telangana vaipu nunche choostunnaru. ee telangana sentiment kevalam KCR political career kosam rechagodutunna vidhaanam. KCR ki nijanga telangana devolopment pai interest ledu. telangana ni kevalam okkale baagucheyagalaru. adi telangana people only.

    ReplyDelete
  5. "తెరాస పార్టీకి మరో ౩౦ సీట్లు ఉన్నట్లయితే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదన్నది సుస్పష్టం"

    While this is definitely true, let us also not forget a more important fact.

    The movement's intensity today is not from electoral politics but direct action. We would have achieved Telangana if TRS resorted to the agitational model in 2001 itself.

    KCR's strategy of aligning with one party or other in a bid to form Telangana has failed. He realized it after the 2009 elections and changed his track resulting in an immediate upsurge.

    ReplyDelete
  6. KCR దేనికోసం చేసినా, ఆయన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం పోరాడినంత కాలం తెలంగాణాలో ఆయనకు సపోర్టు ఉంటుంది. ఒక వేళ మీరన్నట్టు ఫిరాయిస్తే మిగతా పార్టీలకు పట్టిన గతే ఆయనకూ పడుతుంది. 1969 నాటి ప్రజలు కాదు ఈనాటి తెలంగాణా ప్రజలు.

    ReplyDelete
  7. నిజంగా ఒకేళ : ఫర్ సపోజ్ __ తెలంగాణా గాని వచ్చిందే అనుకో అన్నా !
    నీ ఓటె వరికే ... అన్న(గద్దరన్న) తెలంగాణా కా ? అక్క(ఇజ్జి శాంతక్క) తెలంగాణా కా? పెద్దన్న(పెద ముక్కున్న కెసీఆర్) కా? పెద్దక్క (విమలక్క) కా? చిన్నాన్న (నాగం) కా?
    మందు, ముక్క.. ఇంకా అడిగినవి కాదనుకుండా ఇచ్చే వోడు (మనోళ్ళకి కావలసింది అదేగా) ఆ టయానికి ఎవడైతే వాడికా? మరి నవాబు ల మాటో? నిజాం వారసులు కదా ? ఆంధ్రా వోళ్ళకన్నా ఎక్కువగా మిమ్మల్ని దోసుకున్నాళ్ళు కదా ? ఆ మాత్రం విశ్వాసం వుండొద్దు?
    ___ఈ కామెంట్ కి చాలా మంది లాగే తమరు రిప్లై ఇవ్వలేదు... వాస్తవాలు చేదుగానే వుంటాయి...

    ReplyDelete
  8. తెలంగానా వచ్చినంక...

    ఏ తొక్కగానికి ఓటేసినా వాడు తెలంగానాకే పని చెయ్యాలె.

    వాళ్ళే ఎందుకు? చంద్రబాబో, లగడపాటొ, కిరణ్ కుమారో తెలంగాణాల సెటిలైనా వాల్లగ్గూడ ఓట్లేస్తం. నువ్వు నిలబడితె నీగ్గూడ. సరేనా?

    ReplyDelete