పోలవరం ప్రాజెక్టుపై మొదటినుండి వివాదాలే నడుస్తున్నయి. అటు ఒరిస్సా ప్రభుత్వం, ఇటు పర్యావరణ వాదులు ఈ ప్రాజెక్టు ఒద్దంటే ఒద్దని మొత్తుకుంటున్నరు. అక్కడ నివసిస్తున్న లక్షలాది ఆదివాసీలు తమ భవిష్యత్తు గురించి దేవుని మీద భారం మోపిన్రు. అయినా వారి గోడు వినేదెవరు?
ఈ ప్రాజెక్టు కట్టితే ఎంత భూమి అదనంగా సాగవుద్దో, అంతకంటే ఎక్కువ భూమి మునిగి పోతదంటే అందరు ముక్కు మీద వేలేసుకుంటున్నరు.
ఒకపక్క ప్రాజెక్టు కట్టి కాలవలు తొవ్వకుండా శ్రీరాం సాగర్ అట్లనే పెట్టిండ్రు. ఇంకో పక్క అనుమతులున్న ప్రాణహిత పక్కకు పెట్టినరు. ఏ అనుమతులు లేక, పైనుంచి పక్క రాష్ట్రాల కేసులతో నలుగుతన్న పోలవరం మీద మాత్రం ఎక్కడ లేని ప్రేమ జూపిస్తున్నరు. వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నరు.
ఈ పోలవరం ప్రాజెక్టు కట్టితే రెండు లక్షల ఎకరాల భూమి నీళ్ళల్ల మునిగి పోతది. రెండు లక్షలకు పైపెచ్చు ప్రజలు ఇండ్లు వాకిళ్ళు పోగొట్టు కుంటరు. ఇక లక్షలాది జంతువులు, మిలియన్లాది చెట్లు కనుమరుగైతయి. ఇంట భీభత్సం సృష్టించి ఈ ప్రాజెక్టు కట్టేది ఎందుకు, మూడో కారు నికరం జేసుకోనీకి.
ఎంత అన్యాయమో చూడున్రి. ఒకవైపు నీళ్ళు లేక, బోర్లు ఎండిపోయి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఒక్క కారుకు నీల్లోచ్చినా చాలురా దేవుడా అని మొత్తుకుంటున్నరు. ఇంకోపక్క రెండు కార్ల పంటకు నీల్లున్నా, మూడో కారు కూడా నికరంగా పందాలేనని చెప్పి మందిని ముంచే ఎవ్వారాలు చేస్తున్నరు. ఇది న్యాయమా, అన్యాయమా ఒక్కసారి ఆలోచించున్రి.
అదే ప్రాణహిత కట్టితే తెలంగాణా కరువుసీమల కనీసం ఒక కారుకు ప్రాజెక్టు నీళ్ళు వస్తయి. కరెంటు కష్టాలు, బోర్ల కష్టాలు తప్పుతయి. ఎత్తిపోతలకు కొంత కరెంటు కాలినా, బోర్ల మీద కరెంటు కర్చు తగ్గి, కరెంటు ఆదా అవుతది. రైతులు సిటీలకు వలసలు బొయ్యి కూలి పని చేసుకునుడు తప్పుతది.
ఇప్పుడు తాజాగ కేంద్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టుకే సహాయం చేస్తం అంటుంది. అది ప్రాణహితో, పోలవరమో తేల్చి చెప్పమని మనలనే అడిగింది.
సమైక్యవాదులారా, ఇప్పుడు చెప్పున్రి. మీరు ఏది కావాలంటరు? ప్రాణహిత చేవెల్ల కావాలంటరా? పక్కవాడు ఎట్లబోతే మాకేంది, మాకు పోలవరమే కావాలెనని మొండికేస్తరా? మీ సమైక్యవాదం ఎంత నికార్సైనదో దీన్ని బట్టి తెలుస్తది.
మీ సమైక్యవాదాన్ని నిరూపించుకోనీకి మీకొక మంచి అవకాశం వచ్చింది. మీ వీర సమైక్యవాద ఎంపీలు లగడపాటి, రాయపాటి, కావూరి తదితరులు మాకు పోలవరం వద్దు, ప్రాణహిత ఇవ్వండి అని కేంద్రానికి ఒక మెమొరాండం ఇయ్యన్రి.
మీ సమైక్యవాద ఎమ్మెల్యేలంత కలిసి పోలవరాన్ని ఆపి, ప్రాణహితకు కేంద్ర అనుమతి ఇయ్యమని అసెంబ్లీల తీర్మానం చేయించి కేంద్రానికి పంపున్రి.
మీ సమైక్యవాద జేయేసీలేమన్న ఉంటె అయ్యన్ని కలిసి "పోలవరం వద్దు, ప్రాణహిత ముద్దు" అని ఉద్యమం జేయ్యున్రి. ముద్దుల ఉద్యమాలు మీకు కొత్తేం గాదుగా! గప్పుడు మీ మాటలు మేం నమ్మగలుగుతం. మీకు మీ ఉద్యమం నిజాయితీ మీద నమ్మకం ఉంటె అది నిరూపించు కుంటందుకు ఇదొక మంచి అవకాశం.
ఇది జెప్పంగనే ఒకాయన "మేం గట్ల చేస్తే మీ ఉద్యమం మానేస్తామని గ్యారంటీ ఇస్తారా?" అని ఆడుగుడు మొదలు పెడ్తడు. దానికి సమాధానం గూడ ఇప్పుడే చెప్త. 55 ఏండ్ల నుండి మీరు చేసిన పనుల తోని నమ్మకాన్ని పోగొట్టు కున్నరు. ఇప్పుడు న్యాయం దిక్కు మాట్లాడి మీ విశ్వాసనీయతని పెంచుకొండ్రి. మీరు నిజాయితీ పరులే అని తెలంగాణా ప్రజలు నమ్మితే ఉద్యమం దానంతట అదే పోతది.
ఎంత ఆశ.
ReplyDeleteఆశ దోశ అప్పడం !
యాభై ఐదేండ్ల నుంచి మోసం, దగా, దోపిడీ చేస్తున్నా
ఇంకా మీలో దింపుడు గల్లం ఆశ చావలేదన్నమాట.
సరే
అందుకే మేము ఒబామా కు సమైక్య వాదుల తరఫున ఒక రేప్రజేంటేషన్ ఇస్తున్నాం.
పాకిస్తాన్కు ఖబర్ లేకుండా ఒసామా బిన్ లాడెన్ ను జంపినట్టు,
గడాఫీ ఇంటి మీద బాంబుల వర్షం కురిపించినట్టు
మా భారత సర్కార్కు తెలవకుండా తెలంగాణా లాడెన్ కే సి ఆర్ ఇంటిమీద, కోదండరాం ఇంటిమీద బాబులు వేసి
గీ తెలంగాణా లొల్లి లేకుండా జేయమని వేడుకున్తున్నాం
శిరసువంచి ఒబామాకు పాదాభి వందనం హేస్తున్నాం
అంటే గాదె రా భై మీ భాషల కాల్మొక్తున్నం.
ఇగ మీ పని ఖలాస్ కాచుకోన్డ్రి.
your comment is excellent ... you are correct don't believe samaykavadulu. veelu pachi avakasvadulu...
ReplyDeleteI am not wondered if you people have sent that letter. You only exposed your true nature doing that.
ReplyDeleteYou are proving the point of some one mentioning you Andhraites helped to Kouravas in Mahabharath.
You people are no lesser than Jayachandra who helped Ghori to defeat Prithviraj.
నిజానికి ఇది మీకే చక్కని అవకాశం. మీరు ఎన్నుకున్న నాయకులు చవటలు కాదు సమర్దులే అని నిరూపించుకోవాలంటే పోలవరం కాదు ప్రాణహితే కావాలి అని మీ నాయకులని ఎలుగెత్తి చాటమనండి. కాదూ మా వాళ్ళు అసమర్ధులు అంటారా? అంత అసమర్ధులు ప్రత్యెక తెలంగాణా ఇచ్చినా సాధించేది ఏమీ ఉండదు కాబట్టి మీరంతా సమైక్యాంధ్రకు జై కొట్టండి. ఏమంటారు?
ReplyDeleteపై అనానిమస్,
ReplyDeleteమావోల్లు మొదటి నుండి పోలవరం వద్దు, ప్రాణహిత కావాలనే అంటున్నరు, ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండ అన్ని పార్టీల వాల్లు. ప్రాణహిత వొద్దు, పోలవరం కావాలె అన్నోల్లు ఎవరైన మీకు కనిపించిన్రా?
నిస్పక్షపాతంగ మాట్లాడుతమని నిరూపించు కోవలసినది సమైక్యవాదులు.
@Anonymous:
ReplyDeleteWhy do you want Obama's help? Why don't you try it yourself?
Sorry I forgot andheras don't havve guts. They only know how to cheat.
Brother Obama: don't trust these guys. After a few years, they will claim they developed Manhattan, divert US wealth to their districts and install tegulu statues on Times Square.
నాకొకటే అర్ధం కాదన్నా... టాంక్ బండ్ మీద విగ్రహాలు పెడదామని ఆలోచన వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ గారు అప్పటి రాష్ట్ర తెలుగు భాషా గౌరవ అధ్యక్ష పదవి లో వున్న శ్రీ నారాయణ రెడ్డి(సి.నా.రె) గార్ని _ (తెలంగాణా ప్రాంతం వారు) ఎవరి ఎవరి విగ్రహలు పెట్టాలో నిర్ణయించమని కోరితే ఆయన ఇంకా మిగిలిన కమిటీ సభ్యులు కలసి ఆలోచించి ఈ విగ్రహాలు పెట్టారు.. మరి మీరు ఎవర్ని నిందించాలి? మీ తెలంగాణా వారినే.... మీరు రాసిన లిస్టు లో వున్న అందరి విగ్రహాలు ఇప్పటి పాలక వర్గం అనుమతితో పెట్టుకోండి ఎవరు వద్దన్నారు? స్వతంత్రం వచ్చిన తరువాత ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎం.పీ లు తెలంగాణా నుంచి ఎన్నికై దర్జాగా పదవీ కాలం వెలగ పెట్టారు కదా? మరి అప్పుడూ ఇప్పుడు కూడా స్టేట్ కేనినెట్ లో ముఖ్యమైన పదవులన్నీ మీ తెలంగాణా ప్రాంతం వాళ్ళవే? మరి నిలదీసే దమ్ము, ధైర్యం లేదా? ఎందుకు మా ఆంధ్రా వాళ్ల మీద మీ ప్రతాపం? అభివృద్ది కాని మీ జిల్లాల్లో తమ పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందేలా చేసినందుకా? పైసా విలువ చెయ్యని మీ భూముల విలువ కోట్లకి పెంచినందుకా?
ReplyDelete