Saturday, November 17, 2012

తల్లిని పొగిడితే పిల్ల గునిసిందట


ఒక నాయకుడు:
ఆయన కరడు గట్టిన సమైక్యవాది. కాని ప్రజలు చెంప చెల్లు మనిపించి గద్దె దింపిన తర్వాత వోట్లకోసం జై తెలంగాణా అంటడు. తెలంగాణా వస్తున్న తరుణంల తెప్ప తగలేస్తడు... రెండుకళ్ళ సిద్దాంతం తోటి రెండు నాలుకల జపం చేస్తడు. ఉత్తరం ఇస్తానంటడు... ఉత్తుత్తి నాటకం ఆడుతడు. అయితే ఎన్నికలు దగ్గెర పడుతుంటయి. వోట్లు అడిగే టందుకు జనం కాడికి రావలసి వస్తది. జనం మధ్యన పాదయాత్రలు చేయవలసి వస్తది. అయితే జనం తన్ని, తరిమి కొడుతరేమోననే భయం మొదలైతది. అందుకోసం కుట్రలు పన్నుడు శురూ జేస్తడు.

ఒక దళిత ఉద్యమ కారుడు:
ఆవేశంగ ఉపన్యాసాలిస్తడు. తనకన్నా గొప్ప తెలంగాణా వాది  లేడని చెప్తుంటడు. ఎప్పుడు చూసినా ఉద్యమానికి వెన్నుపోటే పొడుస్తుంటడు. ABCD ఇప్పిస్త అనంగానే అసలు ఆయన గెలుస్తడా ఓడుతడా అని చూడకుండ, తన మనుషులతోటి సమైక్యవాద నాయకునికి రెండంచెల వలయాన్ని కల్పించి తెలంగాణా మొత్తం తిప్పిస్తడు. ఆ నాయకునికి ఇంకా తృప్తి కలగక పోతే, తెలంగాణా పోరాట యోదులకు కులం రంగు పూసి, వారి ఇళ్ళ మీదకు తన చెంచాలను పంపిస్తాడు, దాడులు చేయిస్తడు. అట్రాసిటీ కేసులు పెట్టిస్తడు.

ఒక పాత్రికేయుడు:
పగటి వేషగాడి పాదయాత్రకు ఒక పచ్చ కామెర్ల పాత్రికేయుడు 'చంద్రయాన్' అని పేరు పెడుతడు. పార్టీ కరపత్రంకన్న అధ్వాన్నంగ తన పత్రికను మార్చి తరించి పోతడు. అరచేతి మీద స్వర్గాన్ని చూపెట్టినట్టు, పేపరు మీద ప్రభంజనాన్ని సృష్టిస్తడు. నాలుగు సంవత్సరాల క్రితం ఏ దళిత ఉద్యమ కారులచేత శృంగ భంగం పొందిండో, వారినే తెలంగాణా ఉద్యమం మీదకు ఉసికోల్పే ప్రయత్నాలు చేస్తడు.

ఒక ఆమాత్యురాలు:
పుట్టిన జాతి మీద ఏనాడూ ప్రేమ చూపెట్టిన దాఖలాలు లేవు, కోట్లు కూడపెట్టుకునే యావ తప్ప. కులాన్ని వదిలేసి రెడ్డిగా మారి దశాబ్దాలు గడిచినా, అవసరార్థం మాత్రం కులం గుర్తుకు వస్తది. తెలంగాణా కోసం తల్లి చూపెట్టిన తెగువలో ఒక శాతమైనా జన్మలో ఎప్పుడూ చూపక పోయినా, ఆ మాట ఎవరన్న అంటే, అది తన కులాన్ని తిట్టినట్టు కలరింగు. ఇలాంటి వారిని దళితులంటే అది దళితులకే అవమానం.

2 comments:

  1. మోసగాడి డిక్లరేషన్లకు విలువెంత? పాదయాత్ర సాగడంకోసం ముందే "బాడుగనేతలను" కొనుక్కున్నడేమొ.

    ReplyDelete
    Replies
    1. అవును. ఒకప్పుడు "బాదుగ నేత" అని చెప్పి దాడులు చేయించుకున్న పాత్రికేయునికి, ఇప్పుడు ఆ బాడుగ పనుల నీడలో నడుస్తున్న యాత్ర "చంద్రయాన్" లెక్క కనిపిస్తుందట! కోదండరాం మాటలు మాత్రం బూతుల్లెక్క వినిపిస్తున్నయట.

      Delete