Wednesday, October 24, 2012

కింద పడ్డా నేనే మిర్రు... గిదీ, సమైక్య వాదం.

ఆంధ్రోళ్ల దాష్టీకం తెలంగాణ బాక్సర్లపై దాడి 



- నలుగురు క్రీడాకారులకు గాయాలు
- అంతర్ జిల్లా చాంపియన్‌షిప్‌లో ఘటన
హైదరాబాద్, టీ మీడియా ఖేల్ ప్రతినిధి: క్రీడాపోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాల్సిన క్రీడాకారులు ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ప్రాంతీయ తత్వంతో రెచ్చిపోయి దాడులకు దిగారు. తోటి క్రీడాకారులను విచక్షణా రహితంగా చావబాది గాయపరిచారు. ఇది జరిగింది విశాఖపట్నంలో. దాడి చేసింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన బాక్సర్లు కాగా, దాడికి గురైన బాధితులు తెలంగాణకు చెందినవారు. వివరాల్లోకెళితే విశాఖ మురళీనగరంలోని వైశాఖి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 19న రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల క్వార్టర్‌ఫైనల్స్‌లో ఆంధ్ర బాక్సర్‌పై హైదరాబాద్ బాక్సర్ విజయం సాధించాడు.

దీంతో ఓటమిని భరించలేకపోయిన ఆంధ్ర బాక్సర్లు స్టేడియంలోనే అంతా చూస్తుండగానే తెలంగాణ బాక్సర్లపై గూండాల్లా విరుచుకుపడి పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో హైదరాబాద్ చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన విక్టోరియా ప్లే గ్రౌండ్ బాక్సర్ ఆదిత్య తల పగలగా, మహేష్‌చారి, లోకేష్, నరేష్, విక్రమ్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహ్మద్ అలీ తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొం దుతున్నారు. అయితే ఈ దాడి జరుగుతున్నప్పుడు స్టేడియంలోనే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించగా, ఏపీ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు మౌనం దాల్చడం గమనార్హం.

చావబాదారు
‘లైట్ ఫ్లై వెయిట్ విభాగం బౌట్‌లో పాయింట్లపరంగా హైదరాబాద్ బాక్సర్ సిద్దార్థ్ ముందంజలో నిలిచినా, ప్రత్యర్థి, స్థానిక బాక్సర్ ఎల్లారి గెలిచినట్లుగా రిఫరీ ప్రకటించారు. దీంతో ఇదెక్కడి న్యాయమంటూ మేం ప్రశ్నించడం వాళ్లకు నచ్చలేదు. అంతే ఒక్కసారిగా అక్కడున్న లోకల్ బాక్సర్లంతా గుమికూడి మాపై మూకుమ్మడిగా దాడి చేశారు. రౌడీల్లా ప్రవర్తించి రక్తం చిందేట్లు చావగొట్టారు. ఈ సమయంలో వాళ్లను వారించాల్సిన నిర్వాహకులు చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప, ఏమీ చేయలేకపోయారు. దీంతో మేం టోర్నీని బాయ్‌కాట్ చేసి హైదరాబాద్ వచ్చేశాం. కానీ వాళ్లు మాత్రం హైదరాబాద్ జట్టు వాకోవర్ ప్రకటించిందంటూ ప్రత్యర్థులను తర్వాతి రౌండ్లకు పంపించారు’.


2 comments:

  1. తెలంగాణా వాళ్ళని తెలబాన్‌లు అనే ఆంధ్రావాళ్ళు వాస్తవానికి నమ్ముతున్నది తాలిబాన్ తరహా భావజాలాన్నే.

    ReplyDelete
    Replies
    1. Thanks ప్రవీణ్.

      చంద్రబాబు లాంటి రెండు కళ్ళ సిద్ధాంతికి ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపినా సహించలేని సమైక్య వాదులు, ఆంధ్రాలొ మాత్రం జై ఆంధ్రా ఉద్యమ కారులను తమ కనీస మానవ హక్కులను కూడా వినియోగించుకోనివ్వడం లేదు. వసంత నాగేశ్వర్రావు ఉదంతం ఒక ఉదాహరణ. తోటి ఆంధ్రులైన "జై ఆంధ్ర" ఉద్యమకారుల పరిస్థితి ఇలా వుంటే, ఇక తెలంగాణా వాదుల సంగతి చెప్పేదేముంది?

      Delete