Monday, May 23, 2011

యాదయ్య ఉత్తరం ఎందుకు కాలలేదు?

తాము సమైక్య వాదులమని చెప్పుకును కుంటా విశాలాంధ్ర మహాసభ అని పేరు పెట్టుకున్న ఒక బ్లాగులోని రాతలు ఒకసారి చూడున్రి.
"ఏదో కొంత మంది చనిపోయిన విద్యార్థుల దగ్గర ఆత్మహత్యా పత్రం పెట్టినంత మాత్రాన మా తెలంగాణా ఉద్యమాన్ని మీ ఆంధ్రోల్లు మమ్మల్ని అరాచక శక్తులతో పోల్చడం ఏమైనా బాగుందా?"
ఇట్లాంటివి ఆ పోస్టుల చాలానే ప్రేలాపనలున్నయి. అయ్యన్నీ ప్రస్తుతానికి వదిలేద్దాం. సదరు పెద్దమనిషి పోస్టు మీద వచ్చిన వ్యాఖ్యలకు జవాబిచ్చు కుంట చెప్పిన మాటలు కింద చూడున్రి.
"ఒక వ్యక్తి తన శరీరాన్ని నిప్పుతో తగుల పెట్టుకొంటే తొంభై శాతం శరీరం తగులబడింది కానీ అతనివద్ద ఉన్న ఆత్మహత్యా పత్రం తెల్ల కాగితంలా ఉంటే మీకు ఎలా ఉందోకానీ నాకు ఆ విధంగా కాగితం తగలబడకుండా ఉండే సాంకేతిక పరిజ్ఞానం తెలిస్తే మన శాస్త్రజ్ఞులకు తెలిపి పేటెంట్ తీసుకొందామను కొంటున్నాను." 
ఇయీ, సమైక్యవాదిని, మనం కలిసి ఉండాలే, మనం సహోదరులం అని చెప్పుకునే పెద్దమనిషి మాటలు.

సోదరుడు కాకపోయినా శత్రువనుకున్నా, యాదయ్య చావు చూసినోల్లకు గుండె చెరువైతది. అటువంటిది మన సమైక్య సోదరునికి ఆ ఆత్మహత్యల పెట్టుడు ఉత్తరాలు కనపడ్డాయి. పేటెంట్లు కనబడ్డయి. సాంకేతిక పరిజ్ఞానం కనపడ్డది. ఇటువంటి రాతలు రాస్తున్న మనిషి నిజానికి తెలంగాణా జనానికి మేలే చేస్తున్నడు. తెలంగాణా మొత్తం ఏకమై ఈపాటికే తీసుకున్న నిర్ణయాన్ని ఈ మనిషి తన రాతల తోటి మరింత బలపరుస్తున్నడు. ఇటువంటి వాళ్లతోటి మాకు పోసగదని నిరూపిస్తున్నడు.

అసలు ఆ ఉత్తరం ఎందుకు కాలలేదు? ఆ ఉత్తరం అతని దగ్గెర ఉంటె కదా కాలేతందుకు? అది ఆయన బ్యాగుల దొరికింది.

అతడు కాల్చుకున్న సమయంల తీసిన లైవ్ ఇక్కడ చూడున్రి.


నది రోడ్డుమీద అంతమంది జనంల, తెలంగాణా కోసం బయలెల్లిన ర్యాలీల, కాల్చుకుని చచ్చిన మనిషి కనపడడు, ఉత్తరం ఎందుకు కాలిపోలేదన్న ఆలోచన మాత్రం వస్తది.

సదరు వ్యాఖ్యలు రాసిన పెద్దమనిషికి బ్లాగు ముఖంగా కృతఙ్ఞతలు, మీ విషపు టాలోచనలు బయట పెట్టుకుంటున్నందుకు. మా సంకల్పం మరింత బలపడేటందుకు మీ వంతు కృషి చేస్తున్నందుకు!

2 comments:

  1. నిద్రపోయేటోళ్లని నిద్రలేపొచ్చు శ్రీకాంత్, నిద్ర నటించే వాళ్లని లేపలేము. యాదయ్య ఆత్మహత్య చేసుకున్నరోజు నేను అక్కడే ఉన్నాను. అంతకు ముందు నేను తీసిన ఫొటోల్లో యాదయ్య కనపడ్డాడు. ఆరోజు నేను రాసిన బ్లాగు పోస్టు ఇదిగో:

    http://hridayam.wordpress.com/2010/02/22/on-yadaih/

    కొణతం దిలీప్

    ReplyDelete
  2. ఉద్వేగంతొ కూడిన మీ పోస్టు చదివిన దిలీప్ గారూ. ఆరోజు సంఘటన కళ్ళకు కట్టినట్టు రాసిన్రు.

    ధన్యవాదాలు.

    ReplyDelete