Thursday, May 26, 2011

నాగం చేసిన తప్పేంది?

నాగంను సస్పెండు చేసి తానూ నిజంగా ఆంద్రబాబునే అని మరోసారి నిరూపించుకున్నడు ఆపార్టీ నాయకుడు. 'జై తెలంగాణా' అంటే ఆ పార్టీల నేరమని మరోసోఆరి రుజువైంది. 

ఇంతకీ నాగం చేసిన తప్పేంది? తెలుగుదేశం పార్టీ వొళ్ళు మేం తెలంగాణాకి వ్యతిరేకం కాదని, ప్రనభ్ కి లేఖ యిచ్చినం అని ఒక్కతీరుగా చెప్పుకుంటరు. ఆ లేఖనే మరోసారి నాయకుని సంతకం తోటి చిదంబరానికి ఇయ్యమని చెప్పిండు. కాని ఇది తెలుగుదేశం పార్టీ వోళ్లకు పెద్ద నేరంగ కనిపిచ్చింది.

నిజంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణాని సమర్ధిస్త వుంటే ఆ విషయాన్ని చిదంబరానికి లేఖ ద్వారా తెలుపోచ్చు. ఆ విధంగ తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్ మీద ఒత్తిడి తేవొచ్చు. కాని ఆ పార్టీ ఉద్దేశం అది కాదని, తెలంగాణా ఉద్యమాన్ని ఎట్లైన చేసి అణిచి వేసుడే అనేది చిన్న పిల్లగానికి కూడా అర్థమైన విషయం. ఇంకా మేం జన్నాన్ని మభ్యపెట్టుతున్నమని నమ్ముతున్న ఆంధ్రబాబుకు పన్నెండు డిపాజిట్లు గాయబై పోయినా కూడా బుద్ధి రాలేదు. 

లేఖ రాయమని అధినాయకున్ని ప్రశ్నించిన పాపానికి పోలిట్ బ్యూరో సభ్యుడని గూడ చూడక సస్పెండు చేసిన పార్టీకి, మరి బహిరంగంగా ఆ పార్టీ విధానాలు వ్యతిరేకించుకుంట ముద్దుల ధర్నాలు చేసిన మనుషులు, రాజీనామాలు చేసి ఉద్యమాలు చేసిన మనుషుల మీద మాత్రం చర్య తీసుకోవాలె అని అనిపించ లేదు. దీన్ని బట్టే తెలుస్తది అది ఆంధ్ర పక్షపాత పార్టీ మాత్రమే కాని ఇంకోటి కాదని. 

ఇటువంటి ఆంధ్రా పార్టీని సామాన్య కార్యకర్తలు అందరూ ఇప్పటికే వదిలేసిన్రు. దానికి నిన్న వెలవెల పోయిన రణభేరి సభే సాక్ష్యం. ఇప్పుడు ఆంధ్రబాబు వెనుక ఉన్నది పదవులకు ఆశపడి బూట్లు నాకే కొద్దిమంది నాయకులు మాత్రమే. ఈ నాయకులు నిజాం కాలం నించీ ప్రజలకు ద్రోహం చేసుకుంట ఎవనివో ఒకని బూట్లు నాకుతనే ఉన్నారు. తెలంగాణా పోరాటంల చావు దెబ్బ తిన్న వీళ్ళ తండ్రులకు తెలుసు తెలంగాణా దెబ్బ అంటే ఏందో. ఇప్పటికన్నా వచ్చి ప్రజల్ల కాలువక పొతే వీళ్ళకు అంతకన్నా పెద్దదెబ్బ పడక తప్పదు.

8 comments:

  1. you can't just blame babu

    his suspension proposed by TDP telangana MLAs

    as a TDP head, babu with two eyes just accepted it

    ReplyDelete
  2. నిజమే,

    కాని, చంద్రబాబు కథ, స్క్రీన్-ప్లే, డైరెక్షన్ లేకుండ తెలుగు దేశంల పార్టీల ఏదైన జరుగుతదంటే నమ్మేదెవరు?

    అలా చేసినందుకే గద నాగంని సస్పెండు చేసింది? తన డైరెక్షన్‌ల ఆడినందుకే గద, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగ పార్లమెంటులో ప్లకార్డులు పట్టిన ఆంధ్ర ఎంపీలు, రాజీనామా చేసి కాంగ్రేస్ వాల్లతో కలిసి ఉద్యమాలు చేసిన పయ్యావుల, ఎర్రం, ఉమాలను చూసి చూడనట్టు వదిలింది?

    ReplyDelete
  3. mundu mee bakkanna ni adagandi..cross voting chesina MLA s ni suspend chesi marala enduku vaatesukunnaado.....enaadinaa KCR jendaa pakkana pettaadaa ? tecchedi ichhedi meme ane congress ni nilateeyadu enduku ? delhi nundi vachhe mootalu madya lo aagipotaayanaa?

    naagam ki chandra babu lenidi jagan lo emi kanapadindo...laksha kotla balupu chusi nammakam kaligindaa

    ReplyDelete
  4. చంద్రబాబు స్క్రీన్ప్లే చేసాడు అంటే, మీ తెలంగాణా MLA లు అంత వెధవలా?

    ReplyDelete
  5. నాగం ఏ తప్పు చేసాడని ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో చావ చితక్కోట్టారో తెలంగాణా ఉద్యమకారులు

    ReplyDelete
  6. http://onlyforkarthik.telugumedia.asia/2011/05/blog-post.html

    ReplyDelete
  7. ఈదే నాగం ని ఉస్మానియా లో కొట్టారు తెలంగాణా వాదులు మల్లి అదే తెలంగాణా TDP mla ల ఫై నిన్న దాడి చేసారు, ఇది తెలంగాణా వాదమా? తెరాస వాదమా ? plz మేలుకోండి

    పోనీ తెరాస వాదమే అనుకొన్నా వాళ్ళు మొత్తం తెలంగాణా వాదననే తీసుకెళ్ళి సోనియా కి whole sale గ తాకట్టు పెట్టటానికి తహ తహ లారు తున్నారు

    plz మేలుకోండి, ప్రజలని రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడటానికి వివేకమంత మైన అర్ధవంతమైన వైపు మీ ఆవేశాన్ని మళ్ళించండి

    ReplyDelete
  8. >>>చంద్రబాబు స్క్రీన్ప్లే చేసాడు అంటే, మీ తెలంగాణా MLA లు అంత వెధవలా?

    తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు so called ఆంధ్రా సమైక్య వాదులు గమ్మున ఊరుకోలే. వళ్ళ లాగే వీళ్ళూ. నాయకుడికి వ్యతిరేకంగ నోరు తెరిస్తే నాగం గతే గద.

    >>>నాగం ఏ తప్పు చేసాడని ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో చావ చితక్కోట్టారో తెలంగాణా ఉద్యమకారులు

    అప్పటికి ఇప్పటికి నాగం మాటల్లో చేతల్లో వచ్చిన మార్పే అప్పుడు కొట్టినా, ఇప్పుడు నెత్తిన పెట్టుకున్నా.

    >>>తెలంగాణా వాదులు మల్లి అదే తెలంగాణా TDP mla ల ఫై నిన్న దాడి చేసారు

    తప్పకుండ చేస్తరు. ఒకవైపు సమైక్య వాదం నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు కాళ్ళు మొక్కుకుంట, ఇంకో వైపు తెలంగాణా కోసం పోరాడుతమంటె తెలంగాణాల జనం నమ్మే స్థితిల లేరు.

    >>>సోనియా కి వ్హొలె సలె గ తాకట్టు పెట్టటానికి తహ తహ లారు తున్నారు

    మీకు ఆ భయం అవసరం లేదు. అది మేం జూసుకుంటం. 5000 మంది కూడా రాని సభకు మూడు వేల మంది పోలీసులను సెక్యూరిటీ పెట్టించుకున్న చంద్రబాబు కన్నా కాంగ్రేసుతోని కుమ్మక్కయింది ఇంకెవరు? దమ్ముంటే చంద్రబాబుని ఆ కాంగ్రేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగ అవిష్వాస తీర్మానం పెట్టమనండి, ఎవరు ఎవరికి తాకట్టుబడ్డరో తెలుస్తది.

    ReplyDelete