Sunday, January 29, 2012

పాపం పిచ్చి దివాకర్!


ఈ జేసీకి సీయం కుర్చీ కాదు కదా కనీసం మంత్రి పదవి కూడా రాక పోవడంతో బుర్ర పని చేయడం మానేసినట్టుంది. లేకపోతే హెంతమాట? తెలంగాణాకి ఐదింట రెండేళ్ళు సీయం పదవి ఇవ్వాలంటాడా? 

యాభై ఐదేళ్ళ రాష్ట్రంలో పట్టుమని సంవత్సరం కూడా తెలంగాణా మనిషిని సీయంగా వుండనివ్వని వాళ్ళు తడవకు రెండేళ్ళు అవకాశం ఇస్తారా? ఈ రెండేళ్ళూ, కాంట్రాక్టులూ, వసూళ్ళూ, నిధుల మళ్లింపులూ  ఏం గావాల? అస్సలు కుదరని పని కదా?   

అదంతా అటుంచితే తానే సీయంనని కలలు కనే చెంద్రబాబు పనేం గావాల? కలలో నైనా ఆయన కుర్చీపై ఇంకొకరిని... అందునా బామ్మర్దో, మరదలో, అల్లుడో, కొడుకో కాకుండా ఎవడో తెలంగాణా మడిసిని అస్సలు ఊహించే పనేనా? ముందూ వెనుకా ఆలోచించే మాట్లాడుతున్నావా దివాకర్ రెడ్డీ?

ఇక పోతే నిరంతర ఓదార్పులతో దండ యాత్రలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో సీయం కుర్చీ అంటే అది పిత్రార్జితంతో సమానం. ఆయన పిత్రార్జితాన్ని వేరొకరితో పంచుకోమంటావా పిచ్చి దివాకర్! పాపం 


2 comments:

  1. తెలంగాణా వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అతనికి వ్యతిరేకంగా మళ్ళీ జై ఆంధ్ర ఉద్యమం వస్తుంది. ఆ తెలంగాణా వ్యక్తిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలిగించిన తరువాత మళ్ళీ సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అని అంటారు.

    ReplyDelete
  2. పాపం JCను ఆడిబోసుకోకండి సార్. ఆయన రాజకీయ సలహాదారుడు ఎవరో తెలుసా? ఆయన ఇంట్లో పని చేసే తోటమాలి.

    వ్యంగ్యం కాదు నిజమే. ఇంతక ముందు ఆయన "తెలంగాణా వేరయితే ఆంధ్రోల్ల ఆస్తులు కొల్లగొడదామని ఎదురు చూస్తున్నామని మా తోటమాలి చెప్పాడు" అని సెలవిచ్చిన విషయం గుర్తు లేదా?

    రాజకీయ నిరుద్యోగం ఆంద్ర "వినాయకులకు" పాత రోగమే. ప్రకాశం, సంజీవ రెడ్డి లాంటి వాళ్ళు లో ఓడిపోయినంక ఆంద్ర కావాలన్నరు. రాజ్యసభ సీటు రాకబోయే సరికి డ్రామారావుకి "తెగులు ఆత్మగౌరవం" అక్కరయింది. పచ్చకామేర్లోనికి లోకమంతా పచ్చగా అగుపిస్తదన్నట్టు అందరూ తమలక్క ఉంటరనుకుంటున్నడు పాపం దివాకర్!

    ReplyDelete