Wednesday, January 18, 2012

విశాలాంధ్ర వాదులూ, మీకు మీరే సాటి!

చాలా కాలం తర్వాత యధాలాపంగా బ్లాగు కామెంట్లను చూస్తూ వుంటే విశాలాంధ్ర కూటమికి చెందిన ఒకాయన ఒక వ్యాసం లింకు ఇస్తూ వాచిపోయేలా జబ్బలు చరచుకోవడం కనిపించింది. సరే, ఈయన ఇంత ఇదిగా చెబుతున్నాడు గదా, ఏముందో చూద్దాం అని అక్కడకు వెళ్ళడం జరిగింది. అది తనకు తానుగా తెలంగాణా వాణ్ని అని ప్రకటించుకునే, గుంటూరు జిల్లా నుండి వచ్చి నల్లగొండ జిల్లా శివార్లలో సెటిలైన కుంటుంబం తాలూకు పెద్దమనిషిది. తీరా చదివాక, 'హత విధీ, ఈ చెత్తను ఇంధనంగా భ్రమించేనా, విశాలాంధ్ర వాదులు సమైక్యవాద  బోగీలను నడిపించాలని చూస్తున్నది?' అనుకోక తప్పలేదు.  

ఈ పెద్దమనిషి రాసిన వ్యాసం రెండోలైన్లోనే ఇతని ఆలోచనా ధోరణి బట్టబయలై పోయింది. ఏమంటాడో చూడండి.


When the Nizam of Hyderabad in 1947 started toying with the idea of becoming an independent ruler, Nehru ordered the Indian Army into Hyderabad and merged the territory into the Republic of India.


నిజాం హైదరాబాదు స్వతంత్ర దేశంగా వుండాలని ఆలోచించాడట, ప్రతిగా నెహ్రూ భారత సైన్యాన్ని పంపించి హైదరాబాదుని ఇండియాలో కలిపాడట. ఇక్కడ తెలంగాణా ప్రజలు తమ స్వాతంత్ర్యం కోసం చేసిన నిజాం వ్యతిరేక పోరాటం పై చిన్న ప్రస్తావన కూడా లేదు. ఏదో దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా వుంది ఈయన వ్రాసిన విధానం. తన పరువు సంగతి ఎలా వున్నా,  ఈయన తన రాతలతో నెహ్రూ పరువు కూడా తీసేలా వున్నాడు! అవునుమరి! దోపిడీ కాంక్షా, విస్తరణ వాదమే నరనరానా ఎక్కించుకున్న వారికి  నెహ్రూనో, పటేలో చేసిన పని అలా కాక ఇంకెలా కనబడుతుంది? 


ఈ పెద్దమనిషి పేల్చిన మరో పెద్ద జోకు ఇక్కడ చూడండి.


The Commission recommended the merger of Telugu speaking Nizam region with the Andhra state, but recommended a waiting period of 5 years before the merger, to allay some of the concerns expressed by a handful of Congress party leaders. 


SRC సమైక్యాంధ్రకు సిఫారసు చేసిందట. కాని అయిదు సంవత్సరాలు ఆగమని చెప్పిందట. ఎందుకు? గుప్పెడు కాంగ్రెస్ వాదులు వద్దన్నారు కాబట్టి. మరి ఆ తర్వాత లైన్లోనే ఈ పెద్దమనిషి ఏం వ్రాస్తాడో చూడండి.


When a resolution for merger was placed in the Hyderabad assembly, 2/3rd of the legislators from Nizam ruled Telugu region favoured an immediate merger.


ఒకవైపు వద్దన్న కాంగ్రెస్ వాదులే అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీతో వెనువెంటనే కలవాలని కోరుకున్నారట!


అసలు మొదటి ఎస్సార్సీ ఏం సిఫారసు చేసిందో ఇక్కడ చూడండి.



దీంట్లో ఎక్కడైనా అలా సిఫార్సు చేసినట్టు కనిపించిందా?

నిజానికి నలమోతు ఎంత దాయడానికి ప్రయత్నించినా కళ్ళకు కట్టినట్టు కనపడే వాస్తవం ఇదీ. 1961 వరకూ తెలంగాణా రాష్ట్రం హైదరాబాదు రాష్ట్రంగా కొనసాగాలని ఎస్సార్సీ స్పష్టంగా చెప్పింది. ఆతర్వాత ఏర్పడే అసెంబ్లీ మూడింట రెండువంతుల మెజారిటీతో అంగీకరిస్తేనే తెలంగాణాను విశాలాంధ్రలో కలపాలని అది స్పష్టంగా చెప్పింది. దీనికి విరుద్ధంగా ప్రవర్తించి, ముందుగానే కలయికకు అంగీకరించింది మాత్రం నలమోతు చెప్పిన ఆ గుప్పెడు కాంగ్రెస్ పెద్దమనుషులు మాత్రమే. 

ఇలా ఈ పెద్దమనిషి అబద్ధాల పరంపరను వివరించుకుంటూ పోతే, మన సమయం వృధా చేసుకోవడం తప్ప అది ఎంతకూ తరిగేది కాదు. ఇంత నిర్లజ్జగా ప్రాంతీయ పక్షపాతంతో రాతలు రాసే పెద్దమనిషి సమైక్యతా రాగాలు తీయడం ఎవరిని మెప్పించడానికి?

ఈ పెద్దమనిషి రాతలే సదరు విశాలాంధ్ర గుంపుకు సిద్ధాంత గ్రంధాలు. ఇక వీరి సంస్థ తీరు తెన్నులు అన్యులెరుగ తరమా? 

8 comments:

  1. if you write 100 post it doesn't matter . they will talk like this only. i had very good experience. they never change ...it mean they don't want know truth.

    ReplyDelete
  2. My comment on the VMS site:

    Jai GottimukkalaJan 17, 2012 11:10 PM

    వేరు రాష్ట్రం దేశప్రయోజనాలకు శ్రేయస్కరం కాదు'-నలమోతు చక్రవర్తి

    "2/3rd of the legislators from Nizam ruled Telugu region favoured an immediate merger":

    Why was there no vote? Even if true, is it eternal?

    "Eventually, after a great deal of deliberation, Nehru's government agreed to constitute all non-Hindi speaking states of India along linguistic lines"

    False. Maharashtra & Gujarat were formed many years later. Punjab & Haryana were formed after Nehru & Shastri both died.

    "Breaking this national model of linguistic states will open a pandora's box for similar movements across several linguistic states of India"

    The movements for Harit Pradesh, Bundelkhand, Vidarbha, Bodoland, Gorkhaland etc. are quite old and popular. VP Sathe raised Vidarbha demand in the late seventies. Movements win or fail on their own strength, not as a domino effect as the author tries to project.

    In any case Bodoland, Gorkhaland, Tulu Nadu & Konkan are a logical extension of the linguistic states principle he is fighting to "preserve". What is so great about Telugu that it can have its own state but deny it to Bodo, Nepali, Tulu & Konkani languages?

    A quick glance at the first few paragraphs of the article throws up a hotchpotch of arguments debunked several times. The author is obviously good at preaching to the converted at not at convincing anyone else.

    ReplyDelete
  3. @Jai,

    Obviously there is no one to answer to your logical points. Since their premise itself is irrational. All that they construct upon that is nothing but height of irrationality.

    ReplyDelete
  4. @శ్రీకాంతాచారి:

    వాల్లకేం కావాల్నోవాళ్ళకే తెల్వదు. తెలంగాణా ఇయ్యోద్దనే ఒక్క మాట తప్ప ఇంకో ముచ్చట రాదు. ఎందుకు ఇయ్యొద్దని కాని, అసలు చెప్పనీకే ఆయన ఎవరని (what is your locus standi?) కాని అడుగుతే జవాబు దొరకిది. బాయిలో కప్పలక్క ఆంద్ర తప్ప వేరే విషయం తెల్వనోడు భాషా ప్రాతిపదకను ఉద్దరిస్తడట.

    SKC page 434: "It also rejected the theory of “one language one state” arguing that there could be more than one State speaking the same language without offending the linguistic principle."

    Note: It above refers to SRC.

    దీని భావమేమి తిరుమలేశ? నలమోతు వారికి SRC ని overrule చేసి కొత్త నిర్వచనాలు ఇచ్చే అధికారం ఎవరు ఇచ్చిన్రు?

    ReplyDelete
  5. నలమోతు చక్రవర్తి తనది హాలియా దగ్గర చింతగూడెం అని చెప్పగానే నాకు అర్థమైపోయింది, అతనిది కోస్తా ఆంధ్ర నుంచి వలస వెళ్ళిన కుటుంబం అని. హాలియా ప్రాంతంలో కోస్తా ఆంధ్రులు చాలా మంది ఉన్నారు. వలస వచ్చిన కుటుంబానికి చెందిన నలమోతు చక్రవర్తిని చూపించి తెలంగాణాలో సమైక్యవాదం ఉందని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు విశాలాంధ్ర మహాసభవాళ్ళు. అలాగైతే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కూడా తెలంగాణాకి చెందినవాళ్ళు చాలా మంది ఉంటారు. జగ్గయ్యపేటలో ఉన్న తెలంగాణావాదులని చూపించి కోస్తా ఆంధ్రలో తెలంగాణావాదులు చాలా మంది ఉన్నారని అంటే సమైక్యవాదులు ఒప్పుకుంటారా?

    ReplyDelete
  6. ప్రవీణ్, నలమోతు చక్రవర్తి పెరిగింది హైదరాబాదులోనే. తన "స్వగ్రామం" తో ఆయనకు సంబంధాలు లేవు.

    ఆయన కుటుంబీకు లెవరూ సమైక్య వాదులు కారు. నలమోతు కాకాలు ఇద్దరు 69 ఉద్యమంలో జైలుకెళ్ళారు.

    ReplyDelete
  7. నిజమే, నలమోతు చక్రవర్తి చిన్నాన్నలు ఇద్దరూ 1969 ఉద్యమంలో చెరసాలకి వెళ్ళి వచ్చారు. అయితే నలమోతు చక్రవర్తి తెలంగాణాలో పుట్టిన సమైక్యవాది అని నమ్మేసేవాళ్ళకి హాలియా మండలం యొక్క లొకేషన్ ఎక్కడుందో తెలియదనే అనుకుంటాను, ఆ ప్రాంతంలో కోస్తా ఆంధ్రులు చాలా మంది ఉన్నారనే విషయం కూడా తెలియదనే అనుకుంటాను. చిన్నప్పుడు మేము ఒక గిరిజన మీటింగ్‌కి నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు నేనూ, మా నాన్నగారు మిరియాలగూడ స్టేషన్‌లో ట్రైన్ దిగి నాగార్జున సాగర్ వెళ్ళాము. అప్పుడు హాలియా పట్టణం కనిపించింది. హాలియా పట్టణం కోస్తా ఆంధ్ర సరిహద్దుల్లో ఉందనే విషయం నాగార్జున సాగర్ వెళ్ళినవాళ్ళలో చాలా మందికి తెలుసు, విశాలాంధ్ర మహాసభ ప్రోపగాండాని నమ్మేసేవాళ్ళకి తప్ప. కోస్తా ఆంధ్ర సరిహద్దుల్లో కాకుండా ఏ వరంగల్‌లోనో, ఏటూరు నాగారంలోనో ఒక్క సమైక్యవాదినైనా చూపించమంటే విశాలాంధ్ర మహాసభవాళ్ళు చూపించలేరు.

    ReplyDelete
  8. "ఏ వరంగల్‌లోనో, ఏటూరు నాగారంలోనో ఒక్క సమైక్యవాదినైనా చూపించమంటే విశాలాంధ్ర మహాసభవాళ్ళు చూపించలేరు"

    అంతెందుకు హైదరాబాదులో అనేక ఆంధ్రా కాలనీలు ఉన్నాయి (చిక్కడపల్లి, వనస్థలిపురం etc.) ఈ ప్రాంతాలలో మనకు "విశాలాంధ్ర" వాదం మచ్చుకయినా కనిపించదు. కాట్రగడ్డ ప్రసూన లాంటి సెటిలర్ నాయకులు తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తున్నారు.

    The only Hyderabad based Andhras opposing Telangana are the Y2K andhras (aka KPHB andhras) i.e. the "educated" people who came after 1996.

    ReplyDelete