ఏడొందల మంది చచ్చిపోతే రాష్ట్రం ఇవ్వాలా అని తాజాగా ఒక సమెక్కుడు వాది ప్రశ్న. ఇంతకీ ఈ ప్రశ్న వేసిన వాడు ఇచ్చేవాడూ కాదు, చచ్చే వాడూ కాదు. వాడు రాసిన వెకిలి రాతలకు లింకు కూడా ఇవ్వబుద్ధి కావడం లేదు. తెలంగాణా నాయకులను, జనాన్ని రోజూ బ్లాగుల్లో దూరి తిడుతూ వికృతానందం పొందే వాళ్ళలో వీడొకడు.
ఇక వీడికి సమాధానం ఇవ్వడం అవసరమా అనేది మరో ప్రశ్న. అవసరం లేదు. కాని చర్చ ఎలాగూ వచ్చింది కాబట్టి మన వాదన చెప్పక పోతే ఎదుటివాడే కరెక్టని అమాయకులు నమ్మే అవకాశం వుంది.
ఇక చావుల విషయానికి వస్తే, ఒకే ఒక్క చావును చూపెట్టి రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళెవరో కొత్తగా చెప్పాల్సిందేముంది? కాని ఇప్పుడు తెలంగాణలో ఎవరూ శవ రాజకీయాలు చేయడం లేదు. చేస్తే గీస్తే అలాంటి రాజకీయాలు సీమాంధ్రకు చెందిన జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నాడేమో.
తెలంగాణా వాదులు ఎవరినీ ఆత్మహత్యలు చేసుకోవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఓదార్పులంటూ కొంతమంది చేసినట్టుగా glorify చేయడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇవన్నీ ఈ మెక్కుడు వాదులకి కనపడవా?
ఇక పోతే ఈ ఆత్మహత్యలన్నీ నిజం కాదని ఇంకో వాదన. హత్యలంటూ మరో వాదన. ప్రతీ ఆత్మహత్యకీ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. ఎంక్వైరీలున్నాయి. ఏమాత్రం నిజం కాకపోయినా, మరోటయినా తప్పుడు చిత్రీకరణలు అమోఘంగా చేసే మెక్కుడు ప్రభుత్వం వారిదే.
ఇక చివరిగా చెప్పే విషయం. మోసం చేసిన ప్రభుత్వం చేష్టలకు నిశ్చేష్టులైన, జనంలోని ఆవేశ పరులు ఉక్రోషంతో తీసుకున్న నిర్ణయాలు ఆ ఆత్మహత్యలు. వారు తెలంగాణా సాధించడం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజల ఆవేశాలకు అదో సూచిక.
పదిమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటేనే ప్రతిపక్షాలు కల్లోలం చేస్తాయి. ప్రభుత్వం దిగివచ్చి కమిటీలు వేసి కారణాలు వెదుకుతుంది. కమిటీలు వేసేది పదిమంది చచ్చినందుకు కాదు. దానికి కారణమైన సమస్యలోని లోతుపాతుల గురించి.
కాని వలస ప్రాతిపదికగా దశాబ్దాలుగా మెక్కుడుకి అలవాటుపడిన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వందల ఆత్మహత్యలను గుర్తించక పోవడంలో ఆశ్చర్యం లేదు. మూడేళ్ళ పిల్ల కుటుంబ కలహాలవల్ల హత్యకు గురైతే హడావుడి చేసి బెజవాడకు పరుగులెత్తిన చంద్రబాబు, తెలంగాణలో ఇన్నివందల ఆత్మహత్యల గురించి ఒక్క మాట మాట్లాడ లేదంటే, ప్రధాన ప్రతిపక్షం తీరు ఎలా వుందో తేటతెల్లం.
కాంగ్రెస్, తెలుగుదేశం, జగన్ పార్టీ... ఏదైనా సరే తెలంగాణా విషయం వచ్చే సరికి ఇవన్నీ ఒక తాను బట్టలే. అన్నిటి ధ్యేయం ఒక్కటే... తెలంగాణా ఎప్పటికీ ఏర్పడకుండా చేయడం. దానికోసం ఎన్ని కుమ్మక్కులైనా అవుతారు... ఎన్ని కుట్రలైనా చేస్తారు. కాబట్టి అప్రమత్తంగా వుండ వలసినది ప్రజలే. రానున్న అన్ని ఎలక్షన్లలో నడ్డి విరవడమే వీరికి సరైన శిక్ష.
http://articles.timesofindia.indiatimes.com/2010-02-24/hyderabad/28149215_1_telangana-ramoji-swamy-chellapur
ReplyDeletehttp://ibnlive.in.com/blogs/shaikahmedali/2200/61558/the-anatomy-of-telangana-agitation.html
@Anonymous
ReplyDeleteమీరిచ్చిన లింకులకు, ఈ వ్యాసానికి ఎటువంటి సంబంధం లేదు. అయినా ఆత్మహత్యలపై వచ్చిన వేలాది వ్యాసాల్లో ఆ రెండే మీ 'పచ్చ' కళ్ళకు కనబడితే ఆశ్చర్యం లేదు.
naa kaameT peTTae dhairaM laedu.. iMka miiru testaaraa telaMganaa..
ReplyDeleteమీదో కామెంటూ. అది పెట్టడానికి ధైర్యమూ.
Deleteవెకిలి రాత లెలాగూ తమ బ్లాగులోనే తరిస్తున్నారుగా. అక్కడే ఏడవండి. మళ్ళీ ఇక్కడెందుకు?
suicides aa thokkaaa????
ReplyDeleteyo! ennayaaa??? hyderabad meeda depend ayi unna other area people ki maatrame combined state kaavaalani undi!!
migatha vaariki ee mathramoo ledu!! mee laaga pandagalaku taagi dance lu vese culture kaadu maadi....edo....kalipesaaru...50 years nunchi vundi kaabatti maa vaallu pettubadulu pettaru....bathukudaamane...
iyyala pommante....kudaradu!
idi edo memu pettubadulu pettaka munde saadhinchukoni undaalsindi!!!
3 years kritam telangaana antene ee prantamo teliyani vaallu kooda unnaaru,,,,,sudden gaaa eda nunchi puttuka vachindayyaaa????
meee KCR, HARISH RAO lanu nammutunnaaraa?? nammakapoyinaa....evado oka vedhava vastaadu kadaa...telangaanaa ku! vaadini nammutunaaaraa???
eee politicians antaaa dochuku tine vaalle!!! KCR ayinaa...babu ayina...jagan ayinaaa...
janalu eppudooo edhavale india lo!!!
ivannee maanukoni....world globalize avutunna ee time lo....emi cheste mee prantham...baagu padutundo check chesukoni...atu vaipuku vellandi...
eeee politicians ni namminatha kaalam...meeku...chippe!
nenaithe....ee application lo choodale.....If you are Andhra or Telangaana ani!! enduku kottuku chastunaaro teliyadu!! kaakapothe....chaala mandi cheta thittulu maatram tintunnaru!!!!
eda nunchi vaste em??? jobullo ee roju maatlaada valsindi english lone!!! mee yaasa, aaa yaasa kaadu!!! koncham burra use cheyyandi!!!
తమరి పెట్టుబడుల సిద్ధాంతం బహు బాగా వుంది. తమరి సిద్ధాంతం ప్రకారం పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు, బంగళాలు, రాల్వే లైన్లు, రోడ్లు వేసిన బ్రిటష్ వారు భారత దేశానికి ఎప్పటికీ స్వాతంత్ర్యం ఇచ్చి వుండాల్సింది కాదన్న మాట! పాపం ఆ బ్రిటీష వారికి మీ ఆంధ్రా తెలివి తేటలు లేవు మరి!
ReplyDeleteకనీసం బ్రిటీష వారు దేశం వదిలి వెళ్లారు కాబట్టి పెట్టుబడులన్నీ ఇండియాకే వదిలేసి వెళ్లారు. కాని మీ పరిస్థితి అది కాదు. ప్రతి భారతీయుడికి భారద్దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకొనే అవకాశం వుంది. అలాగే మీక్కూడా.న్యాయంగా సంపాదిన్చినవైతే మీ పెట్టుబడులు మీకే వుంటాయి. అన్యాయంగా బొక్కినవైతే ఎంక్వైరీలు జరుగుతాయి. అంతే.
సాఫ్ట్‌వేర్ కంపెనీలవాళ్ళు తమ కార్యాలయాలని అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి సౌకర్యాలు ఉన్న హైదరాబాద్ లాంటి నగరాలలోనే పెడతారు. విజయవాడ, గుంటూరు లాంటి నగరాలలో పెట్టమంటే పెట్టరు. అందుకే ఈ సమైక్యవాదులు (హైదరాబాద్‌వాదులు) హైదరాబాద్ ఒక్కటే కావాలంటున్నారు. వీళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలు మాత్రమే కానీ రామగుండం ఎరువుల ఫాక్టరీ, వరంగల్ ఆజంజాహీ మిల్, నెల్లిమర్ల జూట్ మిల్ మాత్రం కానే కాదు. విజయనగరం జిల్లాకి వెళ్ళి అక్కడి నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికులకి హైదరాబాద్ కోసం సమ్మె చెయ్యమని చెప్పండి. హైదరాబాదా? అదెక్కడ ఉంది అని ఆ కార్మికులు అడుగుతారు. హైదరాబాద్ ఎక్కడ ఉందో తెలియనివాళ్ళు ఉన్న విజయనగరం జిల్లాలో కూడా హైదరాబాద్‌తో సంబంధం ఉన్న కొందరు ధనవంతుల పిల్లలు సమైక్యవాద బేనర్లు పట్టుకుని వీధుల్లో ఊరేగితే దానికి సమైక్యవాద టివి చానెళ్ళు బాగా పబ్లిసిటీ ఇచ్చాయి.
ReplyDeleteనిజానికి వీరి బాధ పెట్టుబడుల గురించి కూడా కాదనుకుంటాను. ఎందుకంటే లగడపాటికి పదమూడు రాష్ట్రాల్లో పెట్టుబడులున్నాయి. కాకపోతే భారీ బడ్జెట్ కలిగిన ఈ పెద్ద రాష్ట్రంలో అధికారం చెలాయిస్తూ, పెద్ద ఎత్తున కాంట్రాక్టులు సంపాదిస్తున్నారు. వాటిలో ఇష్టం వచ్చినట్టు నిధులు కైంకర్యం చేస్తున్నారు. ఉదాహరణకి రాజీవ్ గాంధీ రహదారిని తీసుకుంటే ఎనిమిదొందల కోట్ల ప్రాజెక్టును పద్నాలుగొందల కోట్లకు పెంచారు. తీరా కర్చు చేసిన మొత్తం చూస్తే నాలుక్కోట్లు కూడా మించలేదు. http://telangaanaa.blogspot.com/2011/10/blog-post_13.html.
Deleteఇలా రాష్ట్రాన్ని తినమరిగిన వారికి చిన్న రాష్ట్రాలతో వారి ఆటలు సాగావేమో ననే భయం ఒకటుంది. అంతే కాదు ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్లంతా సీమాంధ్ర వాళ్ళే. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తమకు కాంట్రాక్టులు దక్కవేమోననేది కూడా వీరి ఆలోచన. తెలంగాణా కాంట్రాక్టర్ లైన వెంకటరెడ్డి లాంటివాళ్ళు తెలంగాణా ఉద్యమాన్ని సమర్థించడంలో ఉద్దేశం అదే.
"సాఫ్ట్‌వేర్ కంపెనీలవాళ్ళు తమ కార్యాలయాలని అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి సౌకర్యాలు ఉన్న హైదరాబాద్ లాంటి నగరాలలోనే పెడతారు."
Deleteమరి అలాంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తెలంగాణాలో పెడుతూంటే మన స్టేటే కదా అని ఊరుకున్న మిగిలిన ప్రాంతాల వాళ్ళు ఇప్పుడు విస్తరి మొత్తం వడ్డించాక అది పట్టుకు పారిపోతామని తెలంగాణా వాళ్ళు అంటే ఊరుకుంటారా?
నేను అడిగిన అసలు ప్రశ్నకి సమాధానం చెప్పు. పెట్టుబడులు అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలు మాత్రమేనా? నెల్లిమర్ల జూట్ మిల్, గరివిడి ఫెర్రోఎలాయ్స్ ప్లాంట్, బొబ్బిలి సుగర్ ఫాక్టరీ తదితరాలు పరిశ్రమలు కావా? మన దేశ కరెన్సీ విలువ తక్కువ కావడం వల్ల సాఫ్ట్‌వేర్ కంపెనీలకి విదేశీ ప్రోజెక్ట్‌ల ద్వారా వచ్చే డబ్బులు పుష్కలంగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెట్టడం మాత్రమే పెట్టుబడిలాగ కనిపించిందా?
Deleteరవి కుమార్,
Deleteఈ విమానాశ్రయానికి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ వాటా 13% మాత్రమే. అదీ భూమి రూపంలో. ఆ భూములు తెలంగాణాకి చెందినవి. ఇక్కడ మీరు వడ్డించిన విస్తరేమీ లేదని తెలుసుకోండి.
శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కర్చులు తీయమంటే గుడ్లు తెలేశారు కదా, చెప్పలేమని! అవి తీస్తే బయట పడేది ఇక్కడ కర్చు పెట్టిన దేంతో, దండుకున్నదెంతో. విమానాశ్రయాలు నగరాన్ని బట్టి వస్తాయి కాని రాష్ట్రాన్ని బట్టి కాదు.
"ఈ విమానాశ్రయానికి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ వాటా 13% మాత్రమే. అదీ భూమి రూపంలో. ఆ భూములు తెలంగాణాకి చెందినవి."
Deleteఅదే సార్ నేనూ చెప్తూంటా. అదే జస్ట్ 13% భూమి ఏ విజయవాడ లోనో, వైజాగ్ లోనో ఎందుకు కేటాయించలేదు? రాజధాని అనే కదా ఇక్కడ కేటాయించింది. ఆ మాత్రం ఖాళీ భూమి అక్కడ లేకనా? నిజం చెప్పాలంటే అదే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వైజాగ్ లో పెట్టి ఉంటె ఒక పక్క ఓడరేవు, ఇంకో పక్క ఎయిర్ పోర్ట్ లతో వైజాగ్ ఎక్కడ ఉండేదో ఊహించుకోండి. అఫ్కోర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే ఇప్పటికీ వైజాగ్ లో రావచ్చు. ఓడరేవు మాత్రం తెలంగాణా రాష్ట్రానికి కలలో కూడా సాధ్యం కాదు. ఒక రాష్ట్ర అభివృద్ధి లో తీరప్రాంతం పాత్ర తీసేయలేం కదా.
మొదటి SRC చత్తీస్‌గఢ్ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించిందని తెలిసినా చత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన BJPని సమైక్యవాదులెవరూ ఎందుకు విమర్శించలేదు? అప్పట్లో పక్కా సమైక్యవాద పార్టీ అయిన తెలుగు దేశం కూడా ఆ విషయంలో నోరు మూసుకుని ఉంది. తమ దాక వచ్చేసరికే విభజనవాదం వల్ల పెద్ద నష్టం అనిపించిందా? చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్‌లు ఏర్పడినంతమాత్రాన తెలంగాణా ఏర్పడదు అని అప్పట్లో సమైక్యవాదులందరూ అనుకుని నోరు మూసుకున్నారా?
Deleteరవి కుమార్,
Deleteవ్యాపార సామర్థ్యం లేకుండా స్థలం కేటాయించ గానే విమానాశ్రయం వచ్చే వీలుంటే మీ (వి)నాయకులు ఇప్పటి దాకా ఆగుతారా? ఇప్పుడు కేటాయించు కోండి, ఎవరొద్దన్నారు?
కాని మీ నాయకులు చేసే పని అది కాదు. హైదరాబాదులో భూములు అమ్మి, వచ్చిన డబ్బులతో ఇడుపులపాయలోనో, కడపలోనో, చిత్తూరు లోనో నికరమైన డబ్బులతో అభివృద్ధి చేసుకోవడమే మీకు తెలిసిన పని. ఇక్కడేమో BOOT తరహా ప్రాజెక్టులు, అక్కడేమో నికరమైన నిధులతో ప్రాజెక్టులు.
ప్రవీణ్,
Deleteఒక్క వోటు, రెండు రాష్ట్రాలు అన్న BJPని కాకినాడ, నరసాపురం లోక్ సభ స్థానాల నుండి గెలిపించారు కూడా.
మొదటి SRC చత్తీస్‌గఢ్ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించింది. చత్తీస్‌గఢ్‌లో ఇనుము, బొగ్గు లాంటి మార్కెట్ విలువ ఎక్కువ ఉన్న ఖనిజాలు ఉన్నాయి కాబట్టి ఆ ఖనిజాలని అమ్మగా వచ్చే డబ్బులతో మధ్య ప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలని అభివృద్ధి చెయ్యొచ్చు అని అన్నారు. ఆ విషయం తెలిసి కూడా BJP చత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మన రాష్ట్రం విషయానికొస్తే హైదరాబాద్‌లో ఎన్ని బంగారపు పూతలు పూసినా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందవు. అవి కోస్తా ఆంధ్ర ప్రాంతాలైనా అభివృద్ధి చెందవు. హైదరాబాద్ ఒక తెల్ల ఏనుగు. హైదరాబాద్ తెలంగాణాకి వెళ్ళిపోతే కోస్తా ఆంధ్రకే భారం దిగిపోతుంది.
DeleteMr.Praveen Sarmaji..
ReplyDeleteఒక్క విజయనగరం వాళ్ళకే కాదు.. రాష్ట్రం లో ఏ మూల నున్న వాళ్ళకైన "హైదరాబాద్" అంటే తెలుసు (రాజధాని కాబట్టి).. కాని బావిలో కప్పల్లాగ వున్న తెలంగాణా వాళ్ళకే మిగిలిన ప్రపంచం గురించి తెలీదు..
ఛా, నిజమా? విజయనగరం జిల్లా పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలోని కొందరు గిరిజనులకి ప్రభుత్వం అనేది ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. ఒకసారి విజయనగరం జిల్లా కూనేరు రైల్వే స్టేషన్‌లో ట్రైన్ దిగి అక్కడ ఆటో ఎక్కి మారుమూల గిరిజన గూడలకి వెళ్ళి చూడు, తెలుస్తుంది. ప్రభుత్వం అనేది ఉందని తెలియనివాళ్ళకి హైదరాబాద్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నువ్వు విజయనగరం జిల్లాలో కాపులు, వెలమలు ఎక్కువగా ఉండే తూర్పు ప్రాంతాలు చూసుంటావు. గిరిజనులతో పోలిస్తే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి హైదరాబాద్ ఎక్కడుందో వాళ్ళకి తెలుస్తుంది. హైదరాబాద్ వెళ్ళే ట్రైన్‌లు విజయనగరం, చీపురుపల్లి స్టేషన్‌లలో ఆగుతాయి కాబట్టి విజయనగరం, చీపురుపల్లిల చుట్టు పక్కల హైదరాబాద్ ఎక్కడుందో తెలిసినవాళ్ళు ఉంటారు. గిరిజనులు ఎక్కువగా ఉండే కూనేరులో హైదరాబాద్ ఎక్కడ ఉందో అడుగు, వాళ్ళు తెలియదనే అంటారు.
Deleteశ్రీకాకుళం జిల్లాలో కూడా కాపులు ఎక్కువగా ఉండే పాలకొండ, వీరఘట్టం ప్రాంతాలవాళ్ళకి హైదరాబాద్ ఎక్కడ ఉందో తెలుసు. గిరిజనులు ఎక్కువగా ఉండే భామిని లాంటి ప్రాంతాలవాళ్ళకి మాత్రం హైదరాబాద్ ఎక్కడ ఉందో తెలియదు.
voleti,
ReplyDeleteకొంతమందికి మాత్రం రాజధానుల గురించి బాగా తెలుసు. అప్పుడు మద్రాసు, ఇప్పుడు హైదరాబాదు. కలలన్నీ వాటిమీదేగా!
బాబూ ప్రవేనా.. బాహ్య ప్రపంచంతో సంబధం లేని గిరిజనలు ఈ రాష్ట్రం లోనే కాదు దేశమంతా వుంటారు.. నీలాంటి తెలివైన గిరిజన్లు పేరుకి చివర "శర్మ" అని పెట్టుకుంటే కాదు.. అలాంటి వార్ని చేతనైనంతవర్కూ ఎడ్యుకేట్ చెయ్యాలి.. వాళ్ళని కూడా మన గొడవల్లోకి తీసుకురావడమెందుకు..
ReplyDeleteగిరిజనులందరూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేనివాళ్ళు కాదు నాయనా. రెండు వందల సంవత్సరాల క్రితం చత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం, డోంగర్‌గఢ్ ప్రాంతాలకి చెందిన గిరిజనులకి బ్రిటిష్‌వాళ్ళు & మరాఠాలకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది. అగ్రకులాలవాళ్ళు ఉండే గ్రామాలలో సెల్ టవర్లు నిర్మించి గిరిజన గ్రామాలకి రోడ్లు కూడా వెయ్యని పాలకులు ఉంటే గిరిజనులకి బయటి ప్రపంచంతో సంబంధం ఎలా ఏర్పడుతుంది?
Delete