Friday, January 20, 2012

సమైక్యవాదుల భాగోతం


ఎలాంటి తర్కానికీ అందని నీతులు సమైక్యవాదులవి. తర్కానికి దూరంగా ఉండడానికి కారణం వారు చెప్పే దానిలో సహజ న్యాయం లోపించడమే. మచ్చుకు ఇవి చూడండి.

రెండుకోట్ల జనాభాకి ప్రాంతీయ స్వపరిపాలన కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన పొట్టి శ్రీరాములు అమరజీవి, అసమాన త్యాగశీలి. అంతకు రెట్టింపు జనాభాకోసం అదే ప్రాంతీయ స్వపరిపాలన కోసం రాష్ట్రం కావాలని అడుగుతున్న తెలంగాణా వాదులు వీరి దృష్టిలో వేర్పాటు వాదులు!

భాష పేరు చెప్పి నాడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేస్తే అది అసమాన మైన పోరాటం. అదే ఇంకొకరు తుళువ నాడో, బోడోలాండో కావాలంటే అది దేశ సమగ్రతకి ముప్పు!

తాము విడిపోతే మాత్రం తమ ప్రాంతంలో లేకున్నా, మూడొంతుల మంది జనం తమభాష మాట్లాడకున్నా మద్రాసు నగరం కావాలి. అదే ఇతరులు విడిపోతే మాత్రం వారి ప్రాంతంలో లేకున్నా, వారి జాతి కాక పోయినా హైదరాబాదు నగరం మాత్రం వారికి ధారాదత్తం చేయాలి. (అలాగైతే ఒప్పుకుంటారట!)

కలిసి ఉన్నంత కాలం తెలంగాణా ప్రజలంటే లోకువ, హేళన, అసహ్యం, చిన్న చూపు, ఏవగింపు. విడిపోయే పరిస్థితి వస్తే మాత్రం తెలుగుజాతి అంతా ఒక్కటే.

కలిసి ఉన్నంత కాలం తెలంగాణా ప్రజలు ప్రాజెక్టుల గురించి మాట్లాడితే "అబ్బే, మీరు మెట్ట మీదున్నారుగా, మీకు నీళ్ళెలా వస్తాయి? నీరు పల్లమెరుగును కదా!" అనే మాటలు. విడిపోయే పరిస్థితి వచ్చే సరికి "తెలంగాణా నుండి నీరు రాదు" అని గగ్గోలు. తెలంగాణా ఏర్పడగానే గురుత్వ నియమాలు మొత్తంగా మారిపోతాయేమో!

తెలంగాణాలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన సమైక్య వాదులు తిరగలేక పోతే అది భావ స్వేచ్ఛకు విఘాతం. అదే ఆంధ్రాలో ఆంధ్రాప్రాంతం వారే ప్రత్యేకాంధ్ర వాదం చెప్పడానికి బయటికి వెళ్ళే పరిస్థితి లేక పోతే, వారిని వారి సభా ప్రాంగణంలోనే విమస గూండాలు చితగ్గొడితే మాత్రం అది ప్రజాగ్రహం!

3 comments:

  1. వాళ్ళని సమైక్యవాదులు అని పిలవఢం ఆపండి. వాళ్ళు సూడో సమైక్యవాదులు.

    ReplyDelete
  2. తెలంగాణా ప్రజల గుండె ఘోషని చాలా ఎఫెక్టివ్ గా చెప్పారు.
    అభినందనలు.
    ఈ వాస్తవం ఆంద్ర లోని మానవతావాదులకు తెలుసు.
    కాని ఆంద్ర దగుల్భాజీ నేతలకు, ఆంద్ర చాల్బాజి గాండ్లకు, తెలంగాణాను దోచుకు తినమరిగిన ఆంద్ర పందికొక్కులకు మాత్రం తెలిసినా
    తెలియనట్టు నటిస్తున్నారు.
    ఆ నటన ఏంటో కాలం సాగదు

    - Praveen, Warangal

    ReplyDelete