Saturday, January 28, 2012

ఒక మిత్రుడితో సంభాషణ


"గుడ్ మార్నింగ్ అండీ!"

"గుడ్ మార్నింగ్. బాగా అలసి పోయినట్టు కనిపిస్తున్నారు?"

"అవునండీ కూకట్ పల్లినుండి బస్సుల్లో వేల్లాడుకుంటూ వచ్చేసరికి ప్రాణం ఉసూరు మంటుంది."

"అవునా? అక్కడ సొంతిల్లుందా?"

"లేదండీ, రెంటుకే"

"మరి ఇక్కడే హిమాయత్ నగర్లో చూసుకోవచ్చుగా?"

"కాదండీ, అక్కడ రెంటు కొంచం రీజనబుల్ గా ఉంటుందని..."

"ఎంతిస్తున్నారు?"

"ఎనిమిది వేలండీ, డబుల్ బెడ్రూం ఫ్లాట్"

"ఇక్కడ కూడా అంతకన్నా ఎక్కువేమీ కాదే! ప్రయత్నించారా?"

"లేదండీ, మేం అక్కడే వుంటాం. అక్కడైతే మా వాళ్ళంతా వుంటారు."

"అంటే మీ అమ్మా, నాన్నా వాళ్ళు కూడా వున్నారా?"

"వాళ్లిక్కడ లేరండీ, ఊళ్లోనే వుంటారు."

"మరి బంధువులున్నారా?"

"బంధువులంటే బంధువులు కారండీ, తెలిసినాళ్ళున్నారు."

"మీ ఊరి వాళ్ళా?"

"అబ్బే కాదండీ, పరిచయస్తులు."

"ముందునుంచీ పరిచయమా?"

"లేదండీ, ఇక్కడికొచ్చాకే పరిచయం."

"ఇక్కడకి షిఫ్టైతే ఇక్కడ కూడా పొరుగువాళ్ళు పరిచయ మౌతారుగా?"

"లేదండీ, మేం అక్కడే వుంటాం. అక్కడే మాకు బాగుంటది".

"మరి రోజూ, రావడం పోవడం ఇబ్బందని మీరే అంటున్నారుగా?"

"ఫరవా లేదండీ. సర్దుకుంటాను. మాకక్కడే నచ్చిందండీ."
  
"అలాగా!!!"

12 comments:

  1. "మీ ఊరి వాళ్ళా?"

    "అబ్బే కాదండీ, మా కులపోల్లు"

    ReplyDelete
  2. పదేళ్ళ క్రితం హయాత్నగర్ లో ఇల్లు కట్టుకున్న మిత్రుడు అది అమ్మి ఇప్పుడు కుకట్పల్లి లో ఫ్లాట్ కోనేదుకు పరయత్నిస్తున్నాడు. అక్కడి నుంచి రావడం కష్టం కదా అంటే అక్కడ అంతా మా వాళ్ళు ఉన్నారు . పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మా వల్ల మధ్య ఉండడం మంచిది అన్నాడు. పోనీ అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే యెంత సేపు వెళ్ళగానే అంతా తెలిసిపోతారు , అంతా మా వాళ్ళే కదా అన్నాడు

    ReplyDelete
  3. సమైక్యవాదులకి తెలంగాణా మీద అంత ప్రేమ ఉంటే కూకట్‌పల్లిలో కాకుండా ఏ ఖమ్మంలోనో, సత్తుపల్లిలోనో స్థిరపడొచ్చు కదా. సత్తుపల్లి ప్రాంతంవాళ్ళ భాష కూడా కోస్తా ఆంధ్ర భాషలాగే ఉంటుంది కాబట్టి భాష కూడా ఒక సమస్య కాదు. అంత నమ్మకం కలగకపోతే విశాఖపట్నం నుంచి మణుగూరు వెళ్ళే బస్‌లో ప్రయాణించి చూడండి. సత్తుపల్లి వరకు ఎక్కిదిగే ప్రయాణికులందరూ కోస్తా ఆంధ్ర భాషలోనే మాట్లాడుతారు. కొత్తగూడెం, మణుగూరులలో తెలంగాణా భాష పదాలు వినిపిస్తాయి. అలాగే సత్తుపల్లి నుంచి ఖమ్మం బస్‌లో వెళ్ళేటప్పుడు VM బంజరలో కూడా కోస్తా ఆంధ్ర భాష వినిపిస్తుంది.

    అసలు పాయింట్ ఏమిటంటే చదరపు కిలోమీటర్‌కి కేవలం 175 మంది జనాభా ఉన్న ఖమ్మం జిల్లా లాంటి వెనుకబడిన ప్రాంతం మన సమైక్యవాదులకి అవసరం లేదు కానీ పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లూ, ఫ్లైఓవర్లూ ఉన్న హైదరాబాద్ నగరం ఒక్కటే వాళ్ళకి కావాలి.

    ReplyDelete
  4. సెటిలర్లు అన్ని ప్రాంతాలలో ఉన్నారనే కదా మొన్న పోచారం ఎన్నికలలో తె.రా.స వాళ్ళ ఏడుపు.

    ReplyDelete
    Replies
    1. ravi kumar,

      నిజామాబాదు సెటిలర్లు ఇప్పుడు వచ్చిన వారు కాదు, వారు నిజాం కాలం నుంచే వున్నవారు.

      పోచారం భారీ మెజారిటీ తోనే గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రావడానికి చాలా ఇతర కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది పోచారం తెలుగుదేశంలో వున్నప్పటి సమైక్యవాద మూలాలు. రెండోది తెలుగుదేశం, కాంగ్రెస్ కుమ్మక్కయి దేశం పోటీ చేయకుండా కాంగ్రెస్ కి వోట్లు మళ్ళించడం.

      Delete
  5. ఖమ్మం, వరంగల్ జిల్లాలలో స్థిరపడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలవాళ్ళలో ఎక్కువ మంది చిల్లర వ్యాపారులు. నిజామాబాద్ జిల్లాలో స్థిరపడిన గుంటూరు జిల్లావాళ్ళలో ఎక్కువ మంది రైతులు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారులైతే కేవలం హైదరాబాద్‌లోనే స్థిరపడతారు కానీ ఈ వెనుకబడిన జిల్లాల ముఖం కూడా చూడరు.

    ReplyDelete
  6. హిమాయత్ నగర్ పక్కల చిక్కడపల్లి, గాంధినగర్ లాంటి చోట్ల మస్తు మంది సెటిలర్లు ఉన్నరు. వీళ్ళెవరూ కూడ తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఎప్పుడో రెండు మూడు ఏళ్లకు ఒకసారి ఆంధ్రకు పోతరు తప్ప ప్రతి సంక్రాంతికి ఉరుక్కుంటపోరు. సెటిలర్లకు ఇటీవలి వలసవాదులకు (KPHB andhras aka Y2K andhras) ఎక్కడ కల్వది.

    ReplyDelete
    Replies
    1. to all arrogant t-vadis and the author of this article

      who make rubbish comments



      hyderabad is the capital of andhra pradesh that is the only reason that andhra people are living in hyderabad,had andhra state being conitiued as it is in 1956 or andhra being separated in 1973 not even an ant from andhra would have entered hyderabad.

      the author should clarify how andhras are called settlers and people from other states are not??
      sindhis can establish sindhi colony but it is wrong for the author abdhra people living in kphb colony

      Delete
    2. Hey, hold on,

      Until 1956 there was no unified state. You people should have kept quite, but you didn't. Your eyes are on Hyderabad. That is the reason you came here. Alas, if you could manage to purchase new tents, may be you didn't choose to come here. Our bad luck.

      Even now, we don't want you or your ants to go back, we just want a separate state, a politico geographical division. Not more than that.

      Delete
  7. That is the reason you came here. Alas, if you could manage to purchase new tents, may be you didn't choose to come here. Our bad luck.

    its not your bad luck but its a bad luck of andhra people all the development in hyderabad would have been happened in our cities. You have mentioned about tents the central leaders at that time lacked vision or else they would have helped andhra from economic crunch.


    i think i asked you a question i think you dont have any dare to answer it or may be you dont have an answer for it

    ReplyDelete
  8. its not your bad luck but its a bad luck of andhra people all the development in hyderabad would have happened in our cities. You have mentioned about tents the central leaders at that time lacked vision or else they would have helped andhra from economic crunch.


    i think i asked you a question i think you dont have any dare to answer it or may be you dont have an answer for it.

    finally, i am not a samiakhyavadi i want my region to set an example to this country.

    ReplyDelete
    Replies
    1. It does not require any dareness to answer your meaningless question. A settler is the one who came and settled from a different place. It may be an andhraite, telanganite or north indian. Hope you got it clarified.

      Several times we explained you that we are not against any settler but we are against to be ruled by a different region.

      If you are not a samaikyavadi, then probably you don't have any problem to get divided and progress. But you wouldn't... reason is simple, the un-ethical greediness commonly displayed by you people for Hyderabad city which is not yours and you can no way get it if you divide.

      Delete