Monday, January 30, 2012

తెలంగాణా ఏర్పడితే ...


తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావడానికి వీల్లేదు.

ఎందుకు?

తెలంగాణా ఇస్తే ఇస్లామిక్ ఛాందసవాదం పెరుగుతుంది.

అలాగా? మరి BJP ఎందుకు సపోర్టు చేస్తుంది? ఒవైసీ ఎందుకు వ్యతిరేకిస్తుండు?

ఏమో నాకేం తెలుసు? BJP కి అది ఇష్టమేమో? ఒవైసీకి ఇష్టం లేదేమో!

!!??! 

అంతే కాదు. కమ్యూనిస్టు అరాచక వాదం కూడా పెరుగుతుంది.

అలాగా? మరి మీరే మొన్న కమ్యూనిష్టులు KCR ను తిడుతుంటే వంత పాడారుగా?

అవును KCR ను తిడితే వంత పాడుతాం. జై తెలంగాణా అంటే తిడుతాం.

తెలంగాణా ఏర్పడితే మీకొచ్చే నష్టమేమిటి?

మాకేం నష్టం లేదు. మేం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాం. కాక పోతే చిన్న రాష్ట్రాలు దేశ సమగ్రతకు గొడ్డలి పెట్టు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం.

తెలంగాణా చిన్న రాష్ట్రమేమీ కాదే? ఒక వేళ కేంద్రం ఇవ్వక తప్పదంటే ఏం చేస్తారు?

హైదరాబాదుని మాత్రం ప్రత్యేక రాష్ట్రం చేయాలని పోరాడుతాం. లేదా మా చెంచాల చేత పోరాటం చేయిస్తాం.

హైదరాబాదు మరీ చిన్న రాష్ట్రం కదా? అప్పుడు దేశ సమగ్రతకి విఘాతం కలగదా? టెర్రరిస్టులు ఊడి పడరా?

!?%#@*?!
  
   



8 comments:

  1. Anna
    endhuku intha kastapadi post raasavu. manmu edi matladina thappe antaaru. musukoni kurchunna thappe. terichina thappe. vallu mathramu edi matladina corrrrrrrrrecte

    matalu nerchina ?????????????

    intha correctgaa neevu adigina malli argument cheyyadaaniki S***u lekunda vastharu

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ,


      మీరు చెప్పింది నిజమే కావచ్చు. తర్కవిహీనంగా మాట్లాడే వాడితో దేవుడు కూడా గెలవలేడు.

      కాని ఎవరి వాదన తర్కబద్ధమైందో ప్రజలు తప్పకుండా తెలుసు కుంటారు.

      Delete
  2. కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే RSS కూడా ప్రత్యేక తెలంగాణాని సమర్థిస్తోంది. తెలంగాణా ఏర్పడితే మావోయిస్ట్‌లు బలపడతారనే భయం వాళ్ళకి లేదు కానీ కూకట్‌పల్లి వాసులకి మాత్రం ఉంది. కూకట్‌పల్లి వాసులు నిజంగా భయపడుతున్నారంటే నమ్మడానికి తెలంగాణా ప్రజలు చెవిలో పువ్వులు పెట్టుకుని ఉన్నారు. RSS was founded as virulent anti-communist organisation and they are on same stand even now. RSS is supporting separate Telangana statehood because they know that Telangana statehood movement is not Maoist oriented.

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ్ గారు,

      బ్రిటిష్ పాలానను సిద్ధాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు వ్యతిరేకించినట్టే ఇక్కడా అన్ని పార్టీల వారు తమ తమ సిద్ధాంతాల కతీతంగా సమర్థిస్తున్నారు. న్యూడెమోక్రసీ, భాజపా కలిసి జేయేసీగా మారి పోరాడడమే దీనికి ఉదాహరణ. కేవలం ప్రాంతీయ దోపిడీని సమర్ధించే వారే తెలంగాణా వాదాన్ని వ్యతిరేకిస్తున్నారు.

      Delete
  3. ఈ మధ్య కొన్ని రోజుల నుండి ఈ బ్లాగువైపు రావడానికి కుదరలేదు.

    అద్భుతంగా రాస్తున్నారు మిత్రమా!

    జై తెలంగాణ

    ReplyDelete
    Replies
    1. దిలీప్ గారు,

      మీరు చేసే కృషిలో నాది ఆవగింజ వంతు కూడా కాదు. ధన్యవాదాలు.

      Delete
    2. మీకు అభ్యంతరం లేకపోతే ఒక సారి నా ఈమెయిల్ ఐడి కి మెయిల్ చేయండి. మీరు అజ్ఞాతంగా ఉండదలుచుకుంటే ఫరవాలేదు, మెయిల్ చేయాల్సిన పనిలేదు.

      Just delete this comment. don't approve it.

      Delete
  4. నువ్వు బ్లాగులు చదవకపోయినా నువ్వు పెట్టిన మిసన్ తెలంగాణా వెబ్‌సైట్‌ని రోజూ చదువుతున్నాను దిలీప్. అక్టోబర్ నెలలో బ్యాండ్ విడ్త్ కన్సంప్షన్ ఎక్కువై నీ వెబ్‌సైట్ ఓపెన్ అవ్వకపోతే నీకు మెయిల్ పంపింది నేనే. ప్రకాశం పంతులు గారి గురించిన తుపాకీ లాంటి వార్తని చదివిన తరువాత నవ్వు ఆపుకోలేక చచ్చాను. తన జీవిత చరిత్రలో తన గురించి తాను గొప్పగా వ్రాసుకునేవాళ్ళు ఉన్నారు. కానీ ఇతరుల జీవిత చరిత్రలో కూడా లేని గొప్పతనాన్ని చూపించేవాళ్ళు ఉంటారని మొన్ననే తెలిసింది.

    ReplyDelete