హిందూలో CNN-IBN & CNBC-TV18 సర్వే రిజల్ట్స్ లో కొంత భాగాన్ని తెలంగాణా ఏర్పాటుకు సంబంధించినవిగా ప్రచురించారు. అవి పట్టుకుని సమైక్యవాద బ్లాగర్లు, కొన్ని సమెక్కుడు మిధ్యమాలు తెలంగాణా ప్రజల అభిప్రాయం విభజనకు వ్యతిరేకంగా వుంది అనే భావం వచ్చేలా ప్రచారం మొదలు పెట్టారు.
వాస్తవానికి హిందూ ఏమి ప్రచురించింది అని వెదికితే మన విషాంధ్ర బ్లాగులో ఇది దొరికింది.
ఎడమ వైపు వున్న ప్రశ్నను పట్టుకుని వీరంతా రాష్ట్ర విభజన కేవలం యాభై శాతం మందే కోరుతున్నారు అని చెప్తున్నారు. దాన్ని బట్టి పట్టిక కింద రాసి వున్న ప్రశ్న ఎవరూ చదవడం లేదనుకోవాల్సి వస్తుంది. ఆ ప్రశ్న ఏమిటి?
People have different opinions on the issue of separate Telangana state. Some peple say that Andhra Pradesh should be bifurcated into Andhra Pradesh and Telangana. While some say that the State should be Andhra, Telangana and Rayalaseema. Others say that the Andhra Pradesh should continue as united State. What is your opinion on the issue?
ఈ ప్రశ్నే ఒక గందరగోళంగా వుంటే దానికి వారు ప్రకటించిన ఫలితాలు మరింత గందరగోళంగా, తప్పుదోవ పట్టించేవిగా వున్నాయి.
రెండు రాష్ట్రాలుగా విడిపోవాలని చెప్పినవారు (తెలంగాణాలో): 50%
మూడు రాష్ట్రాలుగా విడిపోవాలని చెప్పినవారు (రాయలసీమలో): 1%
కలిసి వుండాలని చెప్పినవారు (కోస్తాలో): 90%
పై ఫలితాలను చూస్తేనే తెలుస్తుంది అవి ఎంత అసంపూర్తిగా వున్నాయో! ఉదాహరణకు తెలంగాణాలో మూడురాష్ట్రాలుగా విడిపోవాలని ఎంత మంది చెప్పారు? మూడు రాష్ట్రాలుగా విడిపోవడమంటే తెలంగాణావాదం కాదా? ఆ వివరాలు లేవు. పోనీ కలిసే వుందామని ఎంత మంది చెప్పారు? అదీ లేదు. ఏమీ చెప్పకుండా ఎంత మంది వున్నారు? అది కూడా ఇవ్వలేదు. ఇలాంటి వివరాలు పట్టుకొని సర్వే ఫలితాలంటూ గగ్గోలు పెట్టడం మొదలు పెట్టడం ఎంతవరకు కరెక్టు?
మరి ఫలితాలను ఇలా అసంపూర్తిగా ప్రచురించడం, అదీ హిందూలో, చాలా అసహజంగా కనిపిస్తుంది.
బొమ్మలో ఎడమవైపు వున్న ప్రశ్న, తెలంగాణా వారు చెప్పినా సమాధానాలు ఇలా వున్నాయి:
1. రాష్ట్రం రెండుగా విడిపోవాలి: 50% మంది అవునన్నారు.
2. రాష్ట్రం మూడూగా విడిపోవాలి: వివరాలు ఇవ్వలేదు.
3. రాష్ట్రం మొత్తం కలిసి వుండాలి: వివరాలు ఇవ్వలేదు.
2, 3 వివరాలు ఇవ్వకుండా, ఫలితాల గురించి చర్చించలేము.
ఇక కుడివైపునున్న ప్రశ్న, తెలంగాణా వారి సమాధానాలు:
యధాతధంగా వుంచాలి: 13 + 5 = 18%
విడదీయాలి: 48 + 4 + 1 + 2 = 55%
అసలు శ్రీకృష్ణ కమిటీ ఏమిటో తెలియదు అని 27% మంది చెప్పారు.
ఈ తెలియని 27% మందిని తీసివేస్తే విభజించాలని చెప్పిన 55% మంది మొత్తం సమాధానాలు చెప్పిన వారిలో 75% అవుతారు. ఇది నాలుగింట మూడొంతుల మెజారిటీ. విడిపోవడానికి ఆంధ్రావారి ఇష్టాయిష్టాలతో పని వుండదని గ్రహించండి, అది 90% అయినా వంద అయినా.
చివరగా ఆ సర్వేలో చెప్పిందేమంటే, "తెలంగాణాలో విడిపోదామనేవారి సంఖ్య పెరిగింది. కాని ఆంధ్రాలో కలిసుందామనుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా వుంది" అని.
రెండువైపులా కోరిక వుంటేనే కలిసుండడం సాధ్యపడుతుంది. ఏ ఒక్క పక్షంలో అది లేక పొయినా విభజన అనివార్యం అని సర్వత్రా ఎరిగిన సూత్రం. కాని మన సమైక్యవాదులు సహజ సూత్రాలకు అతీతులు కదా మరి!
అదే మనకు అనుకూలంగా ఎవడో తెహల్క అనే తుమ్రి పత్రిక రాస్తే అది పెద్ద అనాలసిస్. మంచిది అన్న, నువ్వు మొదటి రత్నానివి ముడుకోట్లలో.
ReplyDeleteమా మనసులో మాట
ReplyDeleteహైధరాబాద్ మా రాష్ట్ర రాజధాని. మేము జీవిస్తున్న నగరం. ఈ నగరాన్నిఎన్నో ఏళ్లతరబడి నుంచి రాళ్ళు కొట్టి, రప్పలు ఏరి, తుప్పలు నరికి, మా చమటతో, మా రక్తంతో, మా కష్టార్జితంతో ఎంతో సుందరనగరంగా తీర్చిదిద్దామ్. ఎన్నో సంవత్సరాలుగా అన్ని కులాలు, మతాలవారు అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి జీవిస్తున్నాము. ఇప్పుడు వాడుపోతే వీడు, వీడుపోతే నేను, నేను పోతే నా అమ్మా మొగుడని ఏ వేర్పాటువాదులయినా ఈ నగరం మాది, మీరు ఇక్కడనుంచి వెళ్లిపొండి అని అంటే వారిని తరిమి కొడ్తాం. ఇంతకాలం మేమేంతో సహనంగా ఉన్నాం. సహనానికీ ఓ హద్దు ఉంటుంది. బ్లాక్ మెయిలింగులకి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, వసూళ్లకి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయిజంతో వచ్చినా, ఎదుర్కొనేందుకు సిద్దంగా వున్నాం. బ్లాక్ మెయిలర్లకు సెల్యూట్ లు, వసూల్ రాజాలకు జిందాబాద్లు కొట్టే చచ్చు బ్రతుకు కాదు మాది. ఇక మీదట మేం కళ్ళు దించుకొనేది నేలను చూడటానికి ఉంటుంది కానీ, స్వార్థ రాజకీయనాయకులకు భయపడి మాత్రం కాదు. తలదించుకోవాల్సింది తప్పుచేసినప్పుడు కానీ, తప్పుడు నాకొడుకులకి కాదు. ఈ సుందరనగరం మా త్యాగ ఫలితం, మా శ్రమ ఫలితం. ఈ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని గానే ఉంటుంది. ఈ దేశం లో ప్రతివొక్కరికి ఈ నగరంలో జీవించే హక్కు ఉంది.
@Anonymous,
ReplyDeleteఇలాంటి పనికి రాని కామెంట్లు మానేసి విషయం మీద చర్చిస్తే మంచిది.
@రక్తచరిత్ర
ReplyDelete>>>హైధరాబాద్ మా రాష్ట్ర రాజధాని. మేము జీవిస్తున్న నగరం.
జీవించండి ఎవరొద్దన్నారు? రేపు తెలంగాణా ఏర్పడ్డా అది మీరాజధానే. అక్కడే మీరు జీవించొచ్చు. ఇప్పుడు బెంగుళురు, చెన్నైలలో జీవిస్తున్నట్టుగా. అది కాక అధికారన్నడ్డం పెట్టుకొని అద్దగోలు ఆక్రమణలు, కబ్జాలు చేద్దామంటే కుదరదు.
>>>ఈ నగరాన్నిఎన్నో ఏళ్లతరబడి నుంచి రాళ్ళు కొట్టి, రప్పలు ఏరి, తుప్పలు నరికి, మా చమటతో, మా రక్తంతో, మా కష్టార్జితంతో ఎంతో సుందరనగరంగా తీర్చిదిద్దామ్.
A million dollar lie. No one is ready to buy!
నువ్వు రాకముందే ఇక్కడ అసెంబ్లీ వుంది, సెక్రెటేరియట్ వుంది, ఉస్మానియా యూనివర్సిటీ, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, మెటర్నిటీ, ఫీవర్ మొదలైన స్పెషాలిటీ హాస్పిటల్స్ వున్నాయి, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వున్నాయి. మింట్ కాంపౌండ్ వుంది. అప్పటికే హైదరాబదు దేశంలో ఐదో పెద్ద నగరంగా వుంది. నువ్వు వచ్చింది దీన్ని డెవలప్ చేయడానికి కాదు, నీకు వనరులు లేక, తెంట్లలో రాష్ట్రం నడపలేక, దీని వనరులను వాడుకోవడానికి, అదీ మా షరతులకు ఒప్పుకొని. నువ్వు చేసిందేం లేదు ఇక్కడ, దీని రెవెన్యూలను దారి మళ్ళించడం తప్ప.
>>>ఎన్నో సంవత్సరాలుగా అన్ని కులాలు, మతాలవారు అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి జీవిస్తున్నాము.
ఒప్పుకుంటాను. తమరి చుండూరు, కారంచేడులాగా ఇక్కడ వుండదు మరి!
>>>ఇప్పుడు వాడుపోతే వీడు, వీడుపోతే నేను, నేను పోతే నా అమ్మా మొగుడని ఏ వేర్పాటువాదులయినా ఈ నగరం మాది, మీరు ఇక్కడనుంచి వెళ్లిపొండి అని అంటే వారిని తరిమి కొడ్తాం.
నువూ ఇదివరలో చేసిన కామెంట్లవల్ల నీ సంస్కృతి తెలుసు కాబట్టి ఈ మాటలకు పెద్దగా ఆశ్చర్యం కలుగలేదు. తరిమికొట్టడం నీ సంస్కృతి. మొన్న క్రృష్ణాలో, నిన్న తూర్పుగోదావరిలో, గుంటూరులో జరిగిందదే. మేమే కనుక తరిమి కొట్టాలనుకుంటే తెలంగాణాలో ఊరూరా వున్న కుటుంబాలు పదేళ్ళ ఉద్యమ చరిత్రలో కూడా ఇంత నిర్భయంగా బతకవు. మేం వాళ్ళు కూడా మావాళ్ళనే అనుకుంటున్నాం.
మేం కేవలం మా రాష్ట్రం మాత్రమే కోరుకుంటున్నాం. నువ్వు తరిమికొట్టగలిగితే తరిమికొట్టి చూడు, చివరికి ఏం జరుతెలుస్తుంది. నిజాంనే తరిమికొట్టిన వాళ్ళం, నువ్వో లెక్కా?
>>>ఇంతకాలం మేమేంతో సహనంగా ఉన్నాం. సహనానికీ ఓ హద్దు ఉంటుంది. బ్లాక్ మెయిలింగులకి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, వసూళ్లకి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయిజంతో వచ్చినా, ఎదుర్కొనేందుకు సిద్దంగా వున్నాం.
బాలయ్య దైలాగులు బాగానే బట్టీ పట్టావ్. సినిమాల్లో ట్రై చెయ్యి.
>>>బ్లాక్ మెయిలర్లకు సెల్యూట్ లు, వసూల్ రాజాలకు జిందాబాద్లు కొట్టే చచ్చు బ్రతుకు కాదు మాది.
వారే మీరైనప్పుడు ఇక సలాం కొట్టే ప్రశ్నేదీ?
>>>ఇక మీదట మేం కళ్ళు దించుకొనేది నేలను చూడటానికి ఉంటుంది కానీ, స్వార్థ రాజకీయనాయకులకు భయపడి మాత్రం కాదు. తలదించుకోవాల్సింది తప్పుచేసినప్పుడు కానీ, తప్పుడు నాకొడుకులకి కాదు.
మళ్ళీ బాలయ్య డైలాగులు! చిలిపి!!
>>> ఈ సుందరనగరం మా త్యాగ ఫలితం, మా శ్రమ ఫలితం.
ఏ నగరమైనా అక్కడ బతికే వాళ్ళ శ్రమ ఫలితమే. మీరూ ఉన్నారుగా, ఓ ఐదారు లక్షలమంది, (శ్రీకృష్ణ కమిటీ చెప్పిందే, నేను కాదు), ఆ మేరకు మీరూ కష్టపడ్డారు. మిమ్మల్ని పొమ్మని ఎవరూ అనడం లేదే! ఎందుకు ఆ ఉలికిపాటు?
>>>ఈ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని గానే ఉంటుంది. ఈ దేశం లో ప్రతివొక్కరికి ఈ నగరంలో జీవించే హక్కు ఉంది.
అవును, తెలంగాణా రాజధానిగా.
Watch the comedy here http://chaduvari.blogspot.com/2011/08/blog-post_15.html
ReplyDeleteచూశాను ప్రవీణ్ గారూ,
ReplyDeleteదున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు, అక్కడ యాభై అంకె కనబడగానే లగెత్తుకొచ్చారు కొంతమంది.
అదొక ప్రైవేట్ సర్వే. దానికి అంత ఇంపార్టెన్స్ అవసరం లేదు. ఒకవేళ అది ప్రభుత్వం చెయ్యించిన సర్వే అయితే అది బూటకపు సర్వే అని తెలంగాణావాదులు ఆ సర్వే చేసిన మీడియావాళ్ళ కార్యాలయాలపై దాడులు చేసేవాళ్ళు.
ReplyDelete$శ్రీకాంతాచారి గారు
ReplyDeleteసర్వే వెనక సత్యమెంతో బట్టబయలు చేసినందుకు ధన్యవాదాలు.రగడపాటి తైనాతీలు ఎంత ఖర్సేట్టారో సర్వే కోసం.. పాపం..బ్లాగుల్లో కూసింత పెట్టినట్లుంది. మొన్నో సర్వే ఆంధ్రాలో జగన్ గారికే ఆదరణ ఎక్కువ ఉందని తేల్చింది. మరాలెక్కన సర్వేలన్నీ సత్యమైతే బొల్లిసెంద్రి కి కాలం మూడినట్లేనా? ఏం మాట్లాడరే పచ్చమేతావులు? ;)
#దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు, అక్కడ యాభై అంకె కనబడగానే లగెత్తుకొచ్చారు కొంతమంది.
;)))))
If the survey had reported the truth, "samaikyavadis" would have condemned it as Tamil kutraand accused Hindu newspaper of being anti-AP (the way they are writing nonsense against Sushma Swaraj)
ReplyDelete