తెలుగు జాతీ, సమైక్యతా అంటూ ఇన్నాళ్ళూ రాగాలు తీసిన సీమాంధ్ర నాయకులు హైదరాబాదు పై తమకున్న అత్యాశ నగ్నంగా బయటపడ్డ తర్వాత, ఇక అలాంటి మాటలవల్ల ఎలాంటి ఉపయోగం లేదని గ్రహించారు. అందుకే ఆజాద్ వద్ద చిత్ర విచిత్రమైన అబద్ధాల మాటల గారడీకి తెరలేపారు.
హైదరాబాదులో అరవై లక్షల మంది సీమాంధ్రులు ఉన్నారట!
మొన్నటి జనాభా లెక్కల ప్రకారం హైదరాబాదు జనాభా ఉన్నదే నలభై లక్షల మంది. సరే శివారు ప్రాంతాల జనాభా కలుపుకున్నారనుకున్నా, అరవై లక్షలమంది మీరే వుంటే మరి తెలంగాణా వారు ఏమైనట్టు? తెలంగాణా వారు కాక, మిగిలిన సిక్కులు, మరాఠీలు, మార్వాడీలు, సిందీలు, లోదీలు, మొదలైన వారంతా ఏమైనట్టు? సరే మీరు చెప్పిందే నిజం అనుకుందాం.
మరి అరవై సంవత్సరాలు కాకుండానే అరవై లక్షల మంది వచ్చి ఇక్కడి వారిని తరిమేసి తిష్ట వేసిన వారిని దురాక్రమణ దారులంటే తప్పేమిటి? ఇలాగే ఉండనిస్తే రేపు వందశాతం కారని భరోసా ఏమిటి? వీరి లెక్కల్లోని నిజానిజాలు కాస్త పక్కకు పెడితే, ఉద్దేశాలు మాత్రం స్పష్టంగానే అర్థమౌతున్నాయి. ఇక్కడ వున్నా స్థానికులను వందశాతం నయాన్నో, భయాన్నో, ప్రభుత్వ సెజ్జుల పేరుమీదనో బయటికి పంపి వంద శాతం హైదరాబాదును కబ్జా చేసేదే ఆ ఉద్దేశం.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే దేశం ముక్కలవుతుందట! 500 రాష్ట్రాలు ఏర్పడతాయట!
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరి అవన్నీ ఏర్పడ్డప్పుడు లేనిది తెలంగాణా
ఏర్పడితేనే దేశం ఎందుకు ముక్కలౌతుందో వారే చెప్పాలి. ఒక రాష్ట్రం వేరుపడితేనే దేశం ముక్కలైతే మరి మద్రాసు నుండి వీరి ముక్క ఊడలాక్కున్నప్పుడు ఆ తెలివిడి ఏమైందో?
అసలు తెలంగాణా రాష్ట్రం అనగానే వీరికి దేశ సమైక్యత గుర్తుకు రావడం మరో విచిత్రం. దేశమ్మీద అంత ప్రేమ ఒలకబోసేవారు మరి చత్తీస్గడ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఎక్కడ నిద్రబోయారో, అప్పుడు దేశ సమైక్యత ఎందుకు గుర్తుకు రాలేదో అర్థం కాని విషయం.
అసలు దేశ సమైక్యత ఎలా సిద్ధిస్తుంది. అసలు మన దేశ ఏర్పాటే భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. విడివిడిగా వుండి ఒకే భారతజాతి అనే భావం కలిగివుందామా? లేక ఒకే రాష్ట్రంగా వుండి రోజూ కొట్టుకుంటూ, మాది తెలుగుజాతి అంటూ భారతజాతిని ధిక్కరిద్దామా?
రాళ్ళు రప్పలు వున్న హైదరాబాదుని వీల్లోచ్చి అభివృద్ధి చేశారట.
రాళ్ళు రాప్పలే వుంటే వీళ్ళు హైదరాబాదుకు అసలు వచ్చే వారే కాదని ఈరోజు రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెపుతాడు. కర్నూలులో టెంట్లలో ఆంద్ర రాష్ట్రాన్ని నడపలేక, భవనాలు కట్టుకోవడానికి డబ్బుల్లేక, అప్పటికే సౌభాగ్యవంటంగా వెలుగుతున్న హైదరాబాదుపై కన్నేసి కాదా విశాలాంధ్రకోసం అర్రులు చాచింది? రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క హైటెక్ సిటీ భవనం తప్ప అదనంగా చేసిన నిర్మాణం ఏమిటో అర్థం కాదు. దానికి బదులుగా అనేక ఓడరేవులు ఆంధ్రా ప్రాంతంలో నిర్మాణం కావడం వాస్తవం కాదా? ఇక రోడ్లు, వంతెనలంటారా, తెలంగాణా మొత్తం ఎండబెట్టి ఆమాత్రం చేయలేరా?
రాష్ట్రం ఏర్పడ్డప్పటినుండి తెలంగాణా, ఆంద్రాల నుండి వచ్చిన రెవెన్యూ ఎంత? ఖర్చు ఎంతో చెప్పమని శ్రీకృష్ణ కమిటీ అడిగినా కూడా చెప్పలేక పోయారు. చెప్పితే అసలు భండారం బయటపడుతుంది కాబట్టి ఆ లెక్కలు ఎప్పటికీ బయటికి రావు. మరి ఏం ముఖం పెట్టుకొని హైదరాబాదును అభివృద్ధి చేశామంటారో అర్థం కాదు!
ఒక్క నూటా యాభై ఏండ్లు తప్ప ...
ReplyDeleteమూడు వేల ఏండ్ల నుంచి ...
తెలుగు వాళ్ళంతా కలిసి వున్నారట.
ఇంతకంటే మసి బూసి మారెడు కాయ చేయదం ఇంకొకటి ఉంటుందా ?
శ్రీ క్రుష్ణ దెవరాయలు, రాజ రాజ నరెంద్రుదు ఏ ఆంధ్ర ,ఏ కన్నడ రాజు పరిపాలించారు తెలంగానా ప్రాంతాన్ని?
పాలిస్తే గీలిస్తె తెలంగానా ప్రాంతపు కాకతీయులు, శాతవాహనులు వరంగల్, కరిమ్నగర్ రాజధానిగా చెసుకుని కొంత ఆంధ్ర భాగాన్ని పాలించారు. కొతకాలం నైజాం నవాబు కొన్ని ఆంధ్ర జిల్లలను పాలించి వదిలెసారు. అంతె.
అయినా ఆ నాటి తెలుగు రాజులు పరస్పరం ఒకరి తొ ఒకరు యుధ్ధాలు చెసుకుంటూ ఎవడి రాజ్యాన్ని వాడు పెంచుకుంటూ పొయాడు తప్ప తెలుగు వాల్లను ఒక్కటి చెసె కార్యక్రమం ఆనాడు ఎమీ లెదు కదా /
ఇప్పుడు కూడా ఆంధ్ర దొపిడీ దార్లు తమ దోపిడీ సామ్రాజ్యాన్ని విస్తరించుకునెందుకే తెలంగాణాను పట్టి పీడిస్తున్నారు.
సమైక్యత గిమైక్యత పచ్చి బూటకం.
- Yadagiri, Hyderabad
1765లో బ్రిటిష్‌వాళ్ళు కొండపల్లి కోటపై దాడి చేసిన తరువాత నిజాం నవాబులు సర్కార్ జిల్లాలు (శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి)లని బ్రిటిష్‌వాళ్ళకి అప్పగించారు. 1765 నుంచి 1953 వరకు 188 ఏళ్ళ కాలంలో కలగని సమైక్య భావం 1953 తరువాతే సడెన్‌గా కలిగిందంటే నమ్మడానికి చెవిలో పువ్వులు పెట్టుకోవాలి. అప్పట్లో మరాఠాలని ఎదిరించడానికి సైన్యం సరిపోక బ్రిటిష్‌వాళ్ళ సహాయం కోసం ఆశించి, బ్రిటిష్‌వాళ్ళు అడిగినప్పుడల్లా జిల్లాలని ఇచ్చేసేవాళ్ళు నిజాం నవాబులు. 1818లో మరాఠాలు పూర్తిగా ఓడిపోయిన తరువాతైనా సమైక్య భావనలు కలిగి తెలుగు మాట్లాడే జిల్లాలన్నీ ఒకే పాలనలోకి రావాలని అప్పటివాళ్ళు ఎందుకు కోరలేదు? అంత వరకు ఎందుకు కానీ మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలని వేరు చెయ్యాలని కోరిన పొట్టి శ్రీరాములు కూడా అన్ని తెలుగు జిల్లాలు ఒకే పాలనలో ఉండాలని కోరలేదు. కేవలం మద్రాస్ రాష్ట్ర విభజన కోసం ఉద్యమించాడు, అంతే.
ReplyDeleteసమైక్యవాదులు చేస్తున్నవాదనలు విచిత్రంగా ఉన్నాయి. తెలుగువాడు గుండె ముక్కలైనా భరించగలడు కానీ రాష్ట్రం ముక్కలైతే భరించలేడట! 1765 నుంచి 1956 వరకు కోస్తా జిల్లాలు, తెలంగాణా జిల్లాలు వేర్వేరు రాష్ట్రాలలోనే ఉన్నాయి. ఈ 191 ఏళ్ళ కాలంలో ఏ ఒక్క తెలుగువాని గుండె ముక్కలవ్వలేదు. 1953 వరకు సమైక్యవాదం అనే కాన్సెప్ట్ రానే లేదు. కానీ మన సమైక్యవాదులు తెలుగువాళ్ళు వందల సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నారన్నట్టు మాట్లాడుతున్నారు.
ReplyDeleteయాదగిరి గారు, ప్రవీణ్ గారు,
ReplyDeleteనిజమే, ఈ విషయం నేను రాయడం మరిచి పోయాను. ఈ విషయంపై నేను గతంలో రాసిన టపా ఇక్కడ చూడండి.
తెలుగునేల మొత్తం ఒక్క రాజు ఏలుబడిలో ఎప్పుడూ లేదు. వుంటే గింటే దాంట్లో తెలుగు వారితోబాటు తమిళులో, కన్నడిగులో, మరాఠీలో కూడా కలిసి వున్నారు. అచ్చంగా ఈ ఇరవై మూడు జిల్లాలే ఒక దేశంగా వున్న కాలాన్ని ఇంతవరకు ఏ చరిత్రకారుడూ కనిపెట్ట లేదు. అప్పుడు ఒకే రాజు పరిపాలించాడని చెప్పి ఆ కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర కలిపేసుకుందామా?
అసలు ఎప్పుడో ఏరాజు కాలంలోనో కలిసున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కలిసుంటాం అనేదే పసలేని వాదన. అలా అనుకుంటే మొఘలుల కాలంలో అఫ్గనిస్తాను నుండి బర్మా వరకూ ఒకే దేశంగా వుండేవి. ఇప్పుడు సాధ్యపడుతుందా? అలాగే ఉత్తర దక్షిణ భారత దేశాలు ఎప్పుడు కూడా ఒకే రాజు ఏలుబడిలో లేవు. అంత మాత్రాన మనమంతా ఒకే దేశం కాకుండా పోతామా?
వాళ్ళ మొఖాలకు .. ఈ మూడు వేల సంవత్సరాలలో కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర కలిసి (గత 150 సంవత్సరాలు తప్ప) ఎప్పుడైనా కలిసున్నాయా?
ReplyDeleteరాజరాజ నరేంద్రుడు గోదావరి మండలాన్ని పాలిస్తున్న కాలంలో, రాయల సీమను పల్లవులు, తమిళ చోళులు పాలించారు. కృష్ణదేవ రాయలు రాయల సీమతో కూడిన కన్నడ దేశాన్ని పాలిస్తున్నప్పుడు, ఉత్తరాంధ్రను గజపతులు పాలించారు. టిప్పు సుల్తాన్ రాజ్యంలో రాయల సీమ ఉన్నప్పుడు, ఆంధ్ర ప్రాంతాన్ని నిజాములు పాలించారు. క్రీస్తు పూర్వం కూడా కలింగ దేశం వేరు.. ఆంధ్రక దేశం వేరు.. ద్రావిడ దేశం వేరు.
ఇంకా వాళ్ళలో ఎవరెవరు ఎన్నాళ్ళపాటు తెలంగాణతో కలిసున్నారో మరోమారు లెక్కలేసుకొని ఆ మతి లేని ఆజాద్ బూట్లు నాకమనండి. సిగ్గు లేని జన్మలు! సమైక్య వాదానికి సరైన సమర్థన చెప్పలేక పుట్టెడు అబద్ధాలు అల్లి, సిగ్గు ఎగ్గు లేకుండా వాగారు వెధవలు. ఇంక వాళ్ళు ఏం మొహాలు పెట్టుకొని "అబద్ధాల పునాదులపై తెలంగాణ ఉద్యమం పుట్టింది" అంటారో అర్థం కాదు. చరిత్ర దాస్తే దాగదు - నలుగురు వింటే నవ్వుకొంటారన్న బుద్ధి కూడా లేని మూర్ఖులు. నన్నడిగితే - ఇలాంటి బుర్ర లేని దరిద్రులను తయారు చేసినందుకు, సీమంధ్రలో చరిత్ర అధ్యాపకులను ఉరి తీయాలి.
ఒకప్పుడు కడప జిల్లా టిపూఉ సుల్తాన్ పాలనలో ఉండేది. టిప్పూ సుల్తాన్ ముస్లిమైనా అతను కడప ప్రాంతంలోని ఒక హిందూ దేవాలయం నిర్వాహణ ఖర్చులకి డబ్బులు ఇచ్చాడని అక్కడి పూజారులే చెపుతారు. టిప్పూ సుల్తాన్ ఓడిపోయిన తరువాత కడప నిజాం పాలనలోకి వెళ్ళింది. కర్నూల్ మాత్రం ముఘల్ చక్రవర్తుల పాలన నుంచి నిజాం పాలనలోకి వెళ్ళింది. రాయలసీమ జిల్లాలు కూడా అన్ని వేళలా ఒకే పాలనలో లేవు.
ReplyDeleteహైదరాబాద్ జనాభా కోటి అని అబద్దం చెప్పండి. ఎద్దు ఈనింది అంటే దూడని కట్టెయ్యండి అన్న సామెతలాగ హైదరాబాద్‌లో కోటి మంది సీమాంధ్రులు ఉన్నారని సమాధానం వస్తుంది.
ReplyDeleteIn continuation to this, please see my blog:
ReplyDeletepannagashayi.blogspot.com
shayi,
ReplyDeleteseen your blog, good writeup, keep it up
thanks
ఇదీ సీమ-కోస్తా వారు ఆజాద్ కి చెప్పిన 62 లక్షల వార్త.
ReplyDeletehttp://www.eenadu.net/archives/archive-11-8-2011/panelhtml.asp?qrystr=htm/panel5.htm
ఇందులో ఎక్కడా హైదరాబాఉలో వీరంతా ఉన్నారని లేదు. మీకెక్కడ కనిపించిందో చెప్పగలరు. వారన్నది ఇది. '56 లో 34.4% ఉన్న జనాభా ఇప్పుడు 41.7% అయింది. అంటే మిగతా ప్రాంతాలకన్నా చాలా ఎక్కువగా పెరిగింది దానికి కారణం మానించి వచ్చిన వలసల వల్లే అని.
మొత్తం వీళ్ళ వలసల వల్లే అనేది తప్పు కానీ, అత్యధిక శాతం దానివల్లే అన్ని అనుకోక పోవటానికి కారణమేమిటొ చెప్పగలరు. It is very natural to believe there has been lot of inter district migration.