Friday, August 5, 2011

ఆడలేక మద్దెల ఓడన్నట్టు...

ఆడలేక మద్దెల ఓడన్నట్టుంది మన చిదంబరం పరిస్థితి. అన్ని పార్టీలు ఏకాభిప్రాయం సాధించాలని ఒక ఉచిత సలహా పారేసిండు పార్టీల మీదికి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీల కూడా ఏకాభిప్రాయం లేదని ఒప్పుకున్నడనుకోండి. అంది వేరే విషయం.

అసలు కాంగ్రెస్ పార్టీల ఏకాభిప్రాయం లేకపోవుడు చేతనే ఈ సమస్యంత వచ్చింది. కాంగ్రెస్ పార్టీల ఏకాభిప్రాయం వుంటే చిదంబరం చర్చలకు పార్టీకి ఇద్దరు చొప్పున పిలిచేటోడే కాదు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగాకుంట ఇద్దరినీ పిలిస్తే అది తెలుగుదేశం పార్టీ సక్కగ ఉపయోగించుకొని గోడమీది పిల్లి అవతార మెత్తింది. చంద్రబాబు రెండుకళ్ళ బాబుగా మారిండు.

అందుకని చిదంబరం ముందు తమ పార్టీ వాళ్ళను ఒక నిర్ణయానికి రమ్మని చెప్పితే బాగుంటది. కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయానికి వస్తే మిగతా పార్టీల అభిప్రాయాలు చెప్పించుడు కష్టంగాదు. పార్టీకి ఒక్కరిని, అదీ రాష్ట్ర స్థాయి అధ్యక్షులను పిలిస్తే, కచ్చితంగా ఒకే అభిప్రాయం వస్తది. ఏ పార్టీ రంగు ఏందో ప్రజలకు తెలుస్తది. దాగుడు మూతలు బందైతై.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని ధనార్జనే ధ్యేయంగా వున్న కాంగ్రెస్ పార్టీకి యీ విషయం మీద ఒక పాలసీ అంటూ ఉన్నదా అనేది కోటి వరహాల ప్రశ్న. లేదు అనేది అందరికీ తెలిసిన జవాబు. ఏరోటి దగ్గర ఆపాట పాడడమే ఆ పార్టీకి తెలిసిన ఒకే ఒక విద్య.

ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో వున్నది కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీని పూర్తిగా ఇరుకున పెడితేనే కాని 2014 లోపు తెలంగాణా ఏర్పాటు సాధ్యం కాదు.  కాబట్టి ఇప్పుడు 2014 కన్నా ముందుగా తెలంగాణా సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీని తీవ్ర వత్తిడికి గురి చేయడం తప్ప వేరే మార్గం లేదు. తెలంగాణా సాధించక పొతే తమకు పుట్టగతులుండవని, ఇంకా ప్రజలను మోసగించలేమని ఇక్కడి ప్రజాప్రతినిధులకు స్పష్టం కావలసిన అవసరం వుంది.

కేంద్రంల బల్బు వెలుగాలెనంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులను నొక్కడం తప్ప మరో మార్గం లేదు.


4 comments:

  1. భారతీయ జనత పార్టీ కాంగ్రెస్ ను అధికారంనుండి దించి తను అదికారం పొందడమే ధేయ్యంగా పెట్టుకొన్నది గాని ప్రజల గురించి ఆలోచించడం లేదు. తను అధికారంలో లేము కదా ఏమిచేసిన జరుగుతుంది అనుకుంటే పొరపాటే. తెలంగాణా విషయంలో తమ ఆలోచన మార్చుకోవాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుండే గాదు దేశం నుండి కూడా దూరం కావలిసిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.

    ReplyDelete
  2. బందులు చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    వెర్రి సన్నాసులు ఐనాం కానీ ఢిల్లీ కి వెంట్రుక కూడా ఊడలె !
    రాస్తా రోకో , రైల్ రోకోలు చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
    మహాగర్జన కి లక్షల మంది వస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
    మిలియన్ మార్చ్ చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
    వంటా వార్పూ చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
    సహాయ నిరాకరణ చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
    అందరూ రాజీనామాలు చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం

    గిప్పుడు సకలజనుల సమ్మె అంటున్రు ...చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అంటున్రు .
    ఈసారి పరమ వెర్రి సన్నాసులు ఐతాం
    ఎన్నిసార్లు అయినా ఐతనే ఉంటాం .

    ReplyDelete
  3. ఢిల్లీయే కాదు, సీమాంధ్రుల దిమ్మ కూదా తిరిగిందనే విషయం పై కామెంట్ చూస్తే అర్థం అవుతూనే ఉంది.

    ReplyDelete
  4. చివరికి వెర్రి సన్నాసులు ఎవరు అయ్యేది వేచి చూడండి. లేదంటే లగడపాటి, కావూరిల విషపు కౌగిలి నుంచి ఇప్పటికైనా బయట పడండి.

    ReplyDelete