Friday, August 5, 2011

రెచ్చగొడుతుంది ఎవరు?

మాట మాట్లాడితే సమైక్య వాదులు చెప్పేది ఏమంటే 'కొంతమంది నిరుద్యోగ నాయకులు తెలంగాణా ప్రజలని రెచ్చగొడుతున్నారు' అని.

అసలు రెచ్చగొట్టేది ఎవరు? తెలంగాణాకు ప్రతి విషయంలోనూ మొండి చేయి చూపించే పాలకులు కాదా?

ఆంధ్రాలో సమైక్యవాదులు ఎన్ని ప్రదర్శనలు నిర్వహించినా, కొండొకచో విధ్వంసాన్నే సృష్టించినా అక్కడ పోలీసనే వాడే కనపడడు. అదే తెలంగాణలో విద్యార్థులు ఒక ప్రదర్శన నిర్వహిస్తే దాన్ని లాఠీలతో మంద బలాన్ని పంపించి అణచి వేస్తారు. ఇది రెచ్చగొట్టుడు కిందికి రాదా? రెచ్చి పోయిన ప్రజల కోపం ఎలాంటి పరిణామాలకైనా రూపు దాల్చవచ్చు. కాని దాదాపు అన్ని సార్లు తెలంగాణా ప్రజలు ఏంటో వివేకంతో, సహనంతో పోలీసు ఆకృత్యాలను  సహిస్తున్నారు.

2004 లో కాంగ్రెస్, 2009 లో తెలుగుదేశం రెండూ తెలంగాణా రాష్ట్రానికి మద్దతు పలికాయి. కాని తర్వాతి కాలంలో వాటి మోసపూరిత విధానాలు రెచ్చగొట్టడం కాదా? తెలంగాణా ప్రజలకు ఏమైనా చెప్పొచ్చు, తర్వాత ఎలాగైనా మాట మార్చొచ్చు అన్న నాయకుల కుత్సిత బుద్ధులు చూసిన తర్వాత కూడా రెచ్చి పోక పోతే ఇక తెలంగాణా ప్రజలు ఒక జాతిగా మనగలగడమే అనుమానాస్పదంగా మారుతుంది.

సరే అవన్నీ వదిలేద్దాం. గత సంవత్సరం మార్చిలో అసెంబ్లీలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా 14F తొలగించాలని తీర్మానం చేసాయి. కాని జరిగిందేమిటి? అప్పటి నుండి ఏ ముఖ్యమంత్రి తీర్మానం అమలుకు చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు కనిపించవు. కాని దాని స్పూర్తికి విరుద్ధంగా పోలీసు పరీక్షలు నిర్వహించడానికి మాత్రం ఆఘమేఘాల మీద నిర్ణయాలు జరుగుతాయి. సగటు తెలంగాణా పౌరుడిలో ఉద్యమ స్పూర్తిని ఇలాంటి చర్యలు మరింత రెచ్చగొట్టక  మానుతాయా?

అగ్నికి ఆజ్యం పోసినట్టు చిదంబరం 14F పై అసెంబ్లీలో మరొక తీర్మానం చేసి పంపండని చెప్పడం చూస్తుంటే తెలంగాణా ప్రజలంటే వీరికి ఎంత చులకనో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఇదివరకు తీర్మానం చేసిన అసెంబ్లీ ఇంకా చేతనావస్థలో ఉండగానే అదే విషయంపై మరొక తీర్మానం కోరడమంటే, ఇది ఒక్క చిదంబరం బుర్రలోంచి వచ్చింది కాదని సులభంగానే అర్థమౌతుంది. దీని వెనుక బలమైన ఆంధ్రా లాబీలున్న సంగతి ఊహకందే విషయమే.

ఇలా చెప్పుకుంటూ పొతే రాష్ట్రం ఏర్పడ్డ తెల్లారే పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కింది మొదలుగా ఈనాటి వరకు తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టిన వైనాలు లెక్కలకు అందవు. ఒక జాతిని మొత్తంగా అన్యాయాలకు గురి చేస్తూ, అవమాన పరుస్తూ రెచ్చగొడుతున్నా కూడా ఇప్పటివరకూ తెలంగాణా ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు. తమను తాము ఆహుతి చేసుకున్నారు తప్ప చీమకు కూడా అపకారం తలపెట్టలేదు.

కాని ఏజాతైనా కలకాలం అణగి మణగి ఉండలేదు. ఆ సమయం ఇప్పుడు తెలంగాణా ప్రజలకు వచ్చింది. తమకు జరిగిన జరుగుతున్న అన్యాలపై ఉవ్వెత్తున ఎగుస్తున్న ప్రజావేశం ఇప్పటికీ అదుపులోనే వుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను మన్నించి మసలుకోక పొతే జరగబోయే పరిణామాలు మాత్రం రాష్ట్రానికి, దేశానికి ఏమాత్రం క్షేమకరం కావు.  

9 comments:

  1. ఆంధ్ర రాజకీయ నాయకులు తోడేళ్ళ లాంటి వాళ్ళూ.
    ఎమాత్రం మాన్వత్వం లిని నరరూప రాక్షసులు.
    పౌరుష హీనులు
    అందుకె ఇంత జరిగినా
    తెలంగానా ప్రజలు ఇంతగా ఖాండ్రించి ఉమ్ముతున్నా
    తుడుచుకుంతూ సమైక్య వూలలు పెట్టగలుగుతున్నారు .
    వీల్లకు సిగ్గు రాదు.
    పిచ్చి కుక్కను తరిమినట్టు తరమాల్సిందె

    ReplyDelete
  2. Hello Mr.Sreekanth chary what you said is correct.

    ReplyDelete
  3. రెచ్చగొట్టడం అంటే ఏమిటి ?

    ReplyDelete
  4. భారతీయ జనత పార్టీ కాంగ్రెస్ ను అధికారంనుండి దించి తను అదికారం పొందడమే ధేయ్యంగా పెట్టుకొన్నది గాని ప్రజల గురించి ఆలోచించడం లేదు. తను అధికారంలో లేము కదా ఏమిచేసిన జరుగుతుంది అనుకుంటే పొరపాటే. తెలంగాణా విషయంలో తమ ఆలోచన మార్చుకోవాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుండే గాదు దేశం నుండి కూడా దూరం కావలిసిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.

    ReplyDelete
  5. 14f రద్దు వల్ల తెలంగాణాకు లాభం ఏమిటి? అదిలేక పోతే హైదరాబాదు 6వజోనులోకి వెల్తుంది. కాని అదిలాబాదు, కరీంనగర్, వరంగల్ మరియి ఖమ్మం 5లో ఉండటం వల్ల వాళ్లవరు హైదరాబాదులోని ఉద్యోగాలకు లోకల్ కారు.

    V ADILABAD, KARIMNAGAR, WARANGAL & KHAMMAM

    VI HYDERABAD, RANGAREDDY, NIZAMABAD, MAHABUBNAGAR, MEDAK & NALGONDA

    ReplyDelete
  6. సోదరా!

    మిగతాజోన్లలో పోలీసు ఉద్యోగాలు మిగతా జోన్లవారే ఎలాగైతే పొందుతున్నారో, ఆరోజోన్లో కూడా అలాగే పొందడం ఆరోజోన్ వారి హక్కు. తెలంగాణావాదులు న్యాయంకోసం పోరాడుతున్నరు, అలాగే ఆరోజోను కోసం కూడా. అది ప్రతి పనీ లాభనషాలతో బేరీజువేసుకొని, అదీ పక్కోడికి నష్టం వచ్చినా పర్వాలేదు, మనకు మాత్రం లాభం రావాలని ఆలోచించే మీ లాంటి వాళ్ళకు అర్థం కాదులే.

    ReplyDelete
  7. " అది ప్రతి పనీ లాభనషాలతో బేరీజువేసుకొని, అదీ పక్కోడికి నష్టం వచ్చినా పర్వాలేదు, మనకు మాత్రం లాభం రావాలని ఆలోచించే మీ లాంటి వాళ్ళకు అర్థం కాదులే"

    14F తీసివెయ్యడం వల్లనా, ఉంచడం వల్లనా పక్కవాడికి నష్టం వచ్చేది :).

    ReplyDelete
  8. 14F వుంటే,

    6 వ జోన్‌కి న్యాయంగా రావలసిన హైదరాబాదు ఉద్యోగాలు రాష్ట్రం మొత్తానికి చెందుతాయి. 6వ జోన్ వారు నష్టపోతారు. మిగతా జోన్ల వారికి వారి ఉద్యోగాలే కాక, అదనంగా హైదరాబాదు ఉద్యోగాలు కూడా వస్తాయి.

    14F తీసేస్తే,

    జోనల్ సిస్టం వుంది కాబట్టి ఎవరి జోన్ ఉద్యోగాలు వారికే వస్తాయి. నష్టం లాభం అన్న ప్రసక్తి వుండదు. కాకపోతే తెలంగాణా వుద్యోగాలు అప్పనంగా దోచుకోక పోతే నష్టం అని భావించే కొంతమందికి ఇది "నష్టం" అనిపిస్తే అనిపించ వచ్చు.

    ReplyDelete
  9. ఆరో జోన్ వాళ్ళ ఉద్యోగాలకోసం ఐదో జోన్ వాళ్ళు ఆశ పడరు. తెలంగాణా వాళ్ళది సీమాంధ్ర బుద్ధి కాదు. ఇది సీమాంధ్రులకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకు సమ న్యాయం అంటే ఏమిటో తెలియదు.

    ReplyDelete