చూసారుగా. ముల్కీ నిబంధలను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా 'జై ఆంధ్ర' ఉద్యమాన్ని సృష్టించారు. ఏళ్ళ తరబడి అక్రమ ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ తిష్ట వేయవచ్చు. ఇక్కడే రిటైర్ మెంటు కావచ్చు. కాని ఏదో ఒక్క నిర్ణయం తెలంగాణాకి అనుకూలంగా వస్తే మాత్రం భరించలేరు.
ఇప్పుడు హైదరాబాదుకు చెందిన పోలీసు ఉద్యోగాలు ఆరోజోనుకి కాకుండా రాష్ట్రం మొత్తానికి దాఖలు పరిచే 14F వంతు. ఇంకా 14F పూర్తిగా రద్దు కానే లేదు, అక్కడ మాత్రం ఉద్యమాలు మొదలై పోయాయి. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఈ విషయంపై ఏకీభవించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయంపై వీరిచ్చే గౌరవం ఇది. ఇక ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణా హక్కులు పరిరక్షించ బడతాయనుకోవడం ఎండమావిని చూసి కుండలో నీరు పారబోయడం లాంటిదే.
వీరి పధ్ధతి చూస్తే రాష్ట్రం విభజించడానికి ఆజాద్ పెద్దగా కష్టపడ వలసిన అవసరం లేదేమోనని అనిపిస్తుంది. తెలంగాణాకి ఓ పెద్ద ప్యాకేజీ, తెలంగాణలో ఓ రెండు నీటిపారుదల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం లాంటి తెలంగాణాకు మేలు చేసే నాలుగైదు విషయాలను ప్రకటించారంటే చాలు, ఆటోమేటిగ్గా తిరిగి 'జై ఆంధ్రా' ఉద్యమం ఊపందుకుంటుంది. రాష్ట్ర విభజన సులభం అవుతుంది.
http://teluguvartalu.wordpress.com/2011/08/10/14f-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81-%E0%B0%B0%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE/
ReplyDelete