Tuesday, July 3, 2012

మా రాష్ట్రం మాగ్గావాలె



మాకు ఈ రాష్ట్రంల అన్యాయం జరుగుతుంది. మాకు రావలసిన నీళ్ళు మాకు వస్తలేవు. మాకు రావలసిన ఉద్యోగాలు మాకు వస్తలేవు. మాకు రావలసిన కాలేజీలు యూనివర్సిటీలు మాకు వస్తలేవు. ఒక వేళ వచ్చినా సవతి తల్లి ప్రేమ లెక్క అక్కడ మూడొందల కోట్లు కర్చు పెడితే ఇక్కడ మూడు కోట్లు కూడా కర్చు పెడుతలేరు. ఇంక నాణ్యత ఏముంటది?

నిన్నటికి నిన్న తెలంగాణా ప్రజల నోటికాడి నీళ్ళను కూడ లాక్కపోయి వాళ్ళ మూడో కారుకు పారించుకున్నరంటే ఇంకా కలిసి వుండడం అవసరమా?

ఈ మాట మేమడుగుతుంటే ఒకడేమో ఇక్ష్వాకుల కాలం నుంచీ అందరం కలిసే వున్నమంటడు. ఇంకొకడేమో తెలుగు భాష మాట్లాడే వాళ్ళంత ఒక్కతాన ఉండాలె నంటడు. ఇంకొకడు మరీ బలుపెక్కి విలీనం చెందినంక తెలంగాణల విద్యాసంస్కృతి పెరిగిందని కూయబట్టిండు.

విద్యా సంస్కృతి వీడి అమ్మ సొత్తు లెక్క మాట్లాడబడుతడు. అసలు విద్య అంటే ఏందో తెలుసా ఇసుమంటోల్లకు? శ్రీచైతన్య, నారాయణల బట్టీ గొట్టుడే వీళ్ళకు తెలిసిన ఒకే ఒక విద్య.

కాలం గడిచే కొద్దీ ప్రతి దేశం లోనూ, ప్రాంతం లోనూ జీవన ప్రమాణాలు మెరుగు పడుతూనే వుంటయి. అది రాజుల పాలన అయినా రాక్షసుల పాలన అయినా. రెండొందల సంవత్సరాల తెల్లోని పాలనల కూడా జీవన ప్రమాణాలు మెరుగుపడ్డయి అన్నది కాదనలేని నిజం. అంత మాత్రాన మనం కలకాలం వాని కిందనే బతుకాల్నా?

అసలు ఇట్లాంటి కూతలు కూసే వాళ్ళ ఉద్దేశాలు ఏంటియో అర్థం కావు. 'ఈ రాష్ట్రంల సమానత్వం లేదు, సవతి ప్రేమ వుందిరా బై, దానికి నిదర్శనం ఈ నీళ్ళ నిధుల మళ్లింపు' అని చెప్తుంటే దానికి సమాధానం వుండదు.

వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంట యంటే, 'నేను లోటస్ పాండ్లు, లాంకో హిల్సు కట్టుకున్నా కావొచ్చు, నువ్వు గుడిసె నుంచి పెంకుటిల్లుకు వచ్చినవు కదా? అందుకని నువ్వు కూడా అభివృద్ధి చెందినవు' అన్నట్టు.

నేను అభివృద్ధి చెందితే అది నా రెక్కల కష్టం తోని. ఆంధ్రా ప్రాంతపు సామాన్య ప్రజలు కూడా దాదాపు వాళ్ళ రెక్కల కష్టం తోనే అభివృద్ధి చెందినరు. కాని ఆంద్ర జనాభా ఎక్కువ కాబట్టి పాలన ఆంధ్ర నాయకుల గుప్పిట్ల వుంది. అందువల్ల దోచింది దోచుకుంటున్నరు, మిగిలింది ఆంధ్రల కర్చు పెడుతున్నరు. తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నరు. 

మా రాష్ట్రం మాకుంటే దాన్ని పాలించే నాయకుడు మంచోడైనా, చెడ్డోడైనా, కాంగ్రేసోడు అయినా తెలుగుదేశపోడు అయినా మాకు బాధ లేదు. అప్పుడు మా నీళ్ళతోని పక్క రాష్ట్రంల డ్యాములు కట్టలేడు. మా పైసలతోని పక్క రాష్ట్రంల యూనివర్సిటీలు, దావఖానాలు కట్టలేడు. అందుకనే మా రాష్ట్రం మాగ్గావాలె. 

16 comments:

  1. శ్రీకాంత్ గారు.. ఏదయినా సఫలం కావాలంటే మనం చేసే పనిలో శ్రద్ధ్హ వుండాలి.. నిజాయితీ వుండాలి.. కాని తెలంగాణా ఉద్యమం అంతా ఒక పద్దతి లేకుండా జరుగుతుంది.. ఉద్యమం అంటే బస్సుల మీద రాళ్ళు.. వేరే ప్రాంతం వాళ్ళ మీద దాడులు, విగ్రహాల ద్వంసం కాదు...అందులో స్పష్టత వుండాలి.. సకల జనుల ఉద్యమం చెశారు, అప్పటి నుంచి ఆ సాకు చూపి ప్రభుత్వం ఇంకా కరంట్ కొతలు విదిస్తూనే వుంది రాష్త్రం మొత్తం. చివరకి ప్రజలకు ఏమన్న ఓరిగిందా .. లేదు.. నాయకులకి ప్యాకేజీలు వచ్చాయి.. సమ్మె చేసిన ఉద్యోగులకి జీతాలు వచ్చాయి.. చివరకి నష్టపోయింది ఎవరు..అన్ని ప్రాంతాల ప్రజలు..
    తెలంగాణా కంటే ఉత్తర కోస్తా జిల్లాలు , రాయలసీమ జిల్లాలు, ప్రకాశం లాంటి జిల్లాలు అభివృద్ది చెందాయనుకొంటున్నారా ? లేనే లేదు.. ప్రాంతం అభివృద్ది అంతా నాయకుల చేతుల్లొనే వుంది.. నాయకులని ఎన్నుకోవటం మీ చేతుల్లో వుంది.. మీరనుకొంటున్నట్లు అన్ని జిల్లాలకి సమర్దవంతమయిన నాయకులు లేరు.. కేవలం చిత్తూరు, కడప లాంటి జిల్లలకే మంచి నాయకత్వం వుంది.. గుంటూరు, కృష్ణా, గోదావరి, వరంగల్ లాంటి కొన్ని జిల్లాలు భౌగోళికంగా కొంత సారవంతంగా వున్నాయి..

    మహారాష్త్ర బాబ్లీ కడితే తెలంగాణాకి ఎంత నష్టమో , కర్ణాటక ఆలమట్టి కట్టినందువల్ల ..సీమాంధ్రకి అంతకంటే ఎక్కువే నష్టం.. మనవాళ్ళు కలిసి వుండి కూడ ఏమి పీకలేకపోయారు..ఇంక విడిపోయి ఏమన్నా సాధిస్తారా ? ఆలోచించండి..

    సాగర్ గేట్లు తీసి నీళ్ళు వదిలినందువల్ల అందరికంటే హైదరాబాదీలకే ఎక్కువ నష్టం.. దానికి ఎవరి రాజకీయ వకాల్తా అవసరంలేదు..

    మీ వ్యాసంలో వాడిన భాష ఒకసారి మళ్ళి చూడండి.. వాడు, వీడు, అమ్మ సొత్తు, కూతలు..అన్నీ ఇలాంటి పదాలే వున్నాయి.. నిజంగా రాష్త్రం కావాలంటే ముందు ఇలాంటి భాష వాడటం తగ్గించి సహనం అలవర్చుకోండి.. ఉద్యమానికి అది చాలా ముఖ్యం.. కె.సి.ఆర్ , కోదందరాం లాంటి వాల్లు వాడుతున్నరు అంటే, వాళ్ళకి నిజంగా రాష్త్రం అక్కర్లేదు..వాళ్ళ అవసరాలు వాళ్ళకి బాగానే తీరుతున్నాయి..

    నా మాటల్లో ఏమయినా తప్పుంటే క్షమించండి ..

    ReplyDelete
    Replies
    1. Reddy sahib, very clever comment. Some of the phrases are gems of skullduggery!

      "నాయకులకి ప్యాకేజీలు వచ్చాయి"

      ఎవరికీ? ఆధారాలు లేకుండా గాలి ఖబుర్లెందుకు సార్!

      "కర్ణాటక ఆలమట్టి కట్టినందువల్ల ..సీమాంధ్రకి అంతకంటే ఎక్కువే నష్టం.. "

      తెలంగాణకు కృష్ణ నది నీళ్ళు అవసరం లేదా? సీమాంధ్రులకు మాత్రమె కృష్ణా జలాలలో వాటా ఉందా?

      "సాగర్ గేట్లు తీసి నీళ్ళు వదిలినందువల్ల అందరికంటే హైదరాబాదీలకే ఎక్కువ నష్టం"

      హైదరాబాదు తెలంగాణాలోనే ఉందని విషయం తమకు తెలియదా? హైదరాబాదును వేరు చేసి చూపించడంతోనే మీ మనసులోని అసలు విషయం బయట పడింది.

      మీ వ్యాఖ్యలో ఒక్క విషయమయినా ప్రస్తుత టపాకు సంబందించిందా? లేదే. Why don't you comment on the water diversion to Krishna delta?

      Delete
    2. అంతా ఒక పద్దతి లేకుండా జరుగుతుంది.. ఉద్యమం అంటే బస్సుల మీద రాళ్ళు.. వేరే ప్రాంతం వాళ్ళ మీద దాడులు, విగ్రహాల ద్వంసం కాదు.

      How many incidents did you count in these 12 years? What do you say the 10 days (fake) movement by your friends and the vandalism took place? Try to compare this movement with any other movement on the earth including our national independence movement, you will come to realize.

      For the remaining things, Jai has already given you the fitting reply, thank Jai.

      Delete
  2. chaary garu
    విద్యా సంస్కృతి వీడి అమ్మ సొత్తు లెక్క మాట్లాడబడుతడు. అసలు విద్య అంటే ఏందో తెలుసా ఇసుమంటోల్లకు? శ్రీచైతన్య, నారాయణల బట్టీ గొట్టుడే వీళ్ళకు తెలిసిన ఒకే ఒక విద్య.

    wah kya baat hai!!!when andhra corporate colleges dont know education values then why do students of telangana region make a beeline to join these colleges and their parents dont even hesitate to send them to andhra region which in ur opinion an unsafe region to live and its people who have imperialist nature and non cosmopolitan. why dont you show ur true spirit in boycotting these colleges.

    విద్య ఒక్కడి సొత్తని ఎవ్వడు చెప్పలేదు మీకు మీరె ఊహించుకుంటె ఎవ్వరు ఎమి చెయ్యలెరు

    finally, i condemn CM's unilateral decision in releasing water to krishna delta

    ReplyDelete
    Replies
    1. Hi Friend,

      It is not the question of going or not going.

      Such compulsions are created wantedly, see how these groups are opposing to discard EAMCET and introduce grading instead of marks!

      If people are going to Dirty Picture, it does not mean theat it is bringing us 'cultural revolution'. Hope you understand.

      Delete
    2. Can we think of one reason why Narayana & similar "battee factories" don't open schools in any other state? The answer is simple: their tactics will not work elsewhere.

      Delete
    3. @ chaary garu

      like any other corporate colleges in the country andhra colleges are working in the same manner dominating the education system and destroying the education values.i was just condemning your view point of adding regional color to education system

      Delete
  3. Telangana MuddhubiddaJuly 3, 2012 at 10:10 PM

    Anna namsthe..
    Mana telangana vallu endhi anna itla udhyamamau chesthundlu. Oka pakka vishalandhra lo maname mundhu unnamu.. abivruddhi antha mana daggare jarigindhi ani mike lalo tega arusthunnaru. aina maname udhyamamu chesthunnamu vidipodhaamani.

    Kaani valla daggara thakkuva abivruddhi jarigina nidhulanni manke karchu pettinaa vallu mathramu kalise undhamu undhamu ani antunnaru.

    Idi nijanaga telanagana vallu ajakarulaki chesthunna anyyamamu.

    chudandi telangana prajalara... e e ajakarulatho kalisi untene manaki ekkuva anyamau jaruguddhhi.. e ajakarulu entha manchi vallantee valla kadupu madchikonina mana telangana prajalaki pedathaaru..

    nannu nammandi... vishahla ajakarulu cheppe neethulu ave..

    ReplyDelete
    Replies
    1. కరెక్టుగ చెప్పినవన్నా!
      వాల్లు తిన్నా తినకున్నా మనకు తిండి పెట్టి, వాల్లు ఎండి పోతుంటె, మనం తిన్నదరుగక ఉద్యమం చేస్తున్నమట! బాగలేదు కత? ఇనుకుంట కూసుంటె బాగనే చెప్తరు గిట్లాంటి కతలు మస్తుగ.

      Delete
  4. Telangana MuddhubiddaJuly 3, 2012 at 10:14 PM

    monna endo smikhaya jac anta... endharu telanaga vallu unnaru samikhya jac lo..

    pichhi pichhi kathalu cheppadaaniki e ajakarulu eppudu mundhe untaaru. 5 votelu padithe chaalu telangana lo telangana vadhame ledhante... manmu edina cheppithe adi thappanta.. mana vadhanlu anni thappu vallithe oppu. andhuke kadha mimmulani tarimi veyyalani chusedhi.. e buddhule mammulani udhyamaniki purikolpayi.. mee maata abadhhamu.. me manssu abaddhamu.. mee sanskuruthi abdaddhamu.. anni mosalu abaddhalu. evandi anukuntene dabbulu vasool chesi paaripothaaru kadhaaa... chi.. avi oka brathukulenaa..

    ReplyDelete
  5. >>>మా రాష్ట్రం మాకుంటే దాన్ని పాలించే నాయకుడు మంచోడైనా, చేద్దోడైనా, కాంగ్రేసోడు అయినా తెలుగుదేశపోడు అయినా మాకు బాధ లేదు<<<
    ప్రత్యేక రాష్ట్రం వచ్చినంత మాత్రాన సామాన్యుని కష్టాలు తీరవు
    తెలంగాణాని ఆంధ్రా వాళ్ళు దోచుకోకుండా మీ నాయకులు ఆపలేకపోయిన అసమర్ధులు
    వాళ్ళకే ఓట్లేసే మీరు అమాయకులు
    వేణు గోపాల్ గారు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను
    మీ తెలంగాణా కి ఆంధ్రా వాళ్ళు శత్రువులు కాదు
    మీరు ఓట్లేసి గెలిపించిన రాజకీయ నాయకులు
    వేటగాడు వెధవ అయితే పులి పళ్ళు ఇకిలించింది అని ఒక సామెత
    రాజకీయ నాయకులు కరెక్ట్ గా ఉంటె నీళ్ళు ఎందుకు పోతాయి ?నిధులు ఎందుకు రావు ?
    దోచుకోవడం, నీళ్ళు, లాంకో హిల్స్ , ఈ కబుర్లు అన్నీ పక్కన పెట్టి ప్రజాస్వామ్యం ద్వారా తెలంగాణా సాధించండి
    2004 ఎన్నికల్లో తెలంగానా ఇస్తాం అని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ని నమ్మకుండా ఉండటం మంచిది

    ReplyDelete
    Replies
    1. శాస్త్రి గారూ, ఇప్పటి సమస్యే తీసుకోండి. ఈరోజున తెలంగాణా రాష్ట్రం ఉండి ఉంటె, నల్గొండకు తాగు నీరు ఇవ్వకుండా డెల్టాకు సాగు నీరు ఇవ్వడం కుదిరేదా? రాజకీయ నాయకులు ఎంత "ఇంకరెక్టు"గా ఉన్నా నీటి తరలింపు జరిగేది కాదు.

      రాష్ట్రం వచ్చినంత మాత్రాన కష్టాలు *అన్నీ* తీరవు నిజమే. కానీ రాష్ట్రం రాకపోతే కష్టాలు *ఏవీ* తీరవు (exaggerated deliberately, please don't take it in a literal sense). ఈ వ్యత్యాసం తమరి లాంటి విజ్యులు పెద్ద మనుసుతో అర్ధం చేసుకుంటే బాగుంటుంది.

      ప్రజాస్వామ్యం ద్వారా తెలంగాణా సాధించాలనే అందరి అభిమతం. అయితే డిసెంబర్ తొమ్మిదిన "దాదాపు సాధించిన" తెలంగాణా అప్రజాస్వామికంగా వచ్చిందా?

      Delete
    2. Hi Sastri,

      Agreed that we are fools to vote bad guys. Then how could andhra people vote frauds like YS and Jagan? Or do you want us Telanganites also to elect such goons to loot the state on the name of development?

      You are seeming to be under impression that andhra people are electing good guys and hence development. But the case is different.

      Andhra people are consistently coming into power because they are more in numbers. They are able to accumulate more number of MLAs in this parliamentary system. They do development only on the interest of commissions. But, in the process they allocate funds. Since they have power with them, they brutally allocate to single region. Like the waters that are opened to Coastal area.

      I agree, if T MLAs are more, probably the same things would have happened in the reverse manner. Since these two regions are distinctly different, they can not become one even after 100 years. Which is why these differences. And due to the same reason, we are asking for a separate state.

      In my opinion, the only possible solution for this is to give 50% of share of MLAs to Telangana irrespective of its population and the remaining 50% should go to andhra and rayala seema. But constitutionally this can never happen and hence the separation.

      If we are separate, there would be no scope for bias. You enjoy your resouces and I enjoy mine. There would be no chance for diverting funds or waters.

      Delete
    3. Hi Jai,
      Thanks for your reply.

      Delete
  6. @chaary garu

    nobody is patronizing our leaders as saints ur leaders are not sincere in representing people's cause tell me why congress and tdp leaders dont resign when they are told to do so. i can give you one example to prove how they didnt protect the interest of their people, when neelam sanjeeva reddy didnt appoint deputy cm not even one telangana leader complained to nehru, dont give baseless arguments that andhra leaders controlled and dominated them moreover ur leaders are not fools to be dominated by some one

    ReplyDelete
  7. Telangana MuddhubiddaJuly 16, 2012 at 7:27 PM

    ithadu evaro emo emo maatalu raasaru. kannesamu athadi blog lo comments enable chese dhyrayamu kuda ledhu.

    IThadu matalu matladuthunnadu.

    Peddha peddha matalu use chesaadu. Sunnithamgaa vishyamu cheppachhu.

    Ilanti valla valane kadha manamu vellani eppudu thanni tharimeyyala ani chusedhi.

    http://teluguyogi.blogspot.in/2012/07/blog-post_16.html

    Memu ikkada janthu balile.. mari meeru narabalilu isthunnaru.
    http://www.blogger.com/comment.g?blogID=31063414&postID=7855534309685134724

    ReplyDelete