ట్రైను వైజాగులో ఆగింది. సూట్ కేసు బ్యాగూ తీసుకొని రొప్పుతూ లోనికి వచ్చాడు సుబ్బారావు. జేబులోంచి టికెటు తీసి బెర్తు నంబరు చూసుకున్నాడు. అప్పరు బెర్తు.
"పేరేంటి అండీ?"
"యాదగిరి"
"మీది పై బెర్తా?"
"కాదు, కింది బెర్తు"
సుబ్బారావు బయట కొనుక్కొచ్చిన కూల్ డ్రింకు బాటిలు, చిప్సు ప్యాకెట్, నీటుగా సూట్కేసు మీద అమర్చాడు. "యాదగిరి గారూ, తీస్కోండి" అంటూ కొన్ని చిప్సూ, కొంత కూల్ డ్రింకు యాదగిరి కి ఇచ్చాడు. ఇలా కొంతసేపు లోకాభి రామాయణం నడిచింది. ఇంతలో చీకటి పడింది.
"అన్నా, కొంచెం పైకి వెళ్తవా? నాకు పండుకొనే టైమైంది".
"పైకెళ్ళడ వేంటి. నేను ఐదున్నర గంటల నుండీ నేను ఈ సీటుపై ఉంటేనూ? ఇప్పుడు పైకెళ్ళ మానడం న్యాయమా?"
"గదేంది వయ్యా గట్లంటవూ? గీ సీటు నాది. నేను రిజర్వు చేసుకున్నది. నీ సీటు పైది. కూసుంట నంటే కూసోనిచ్చి నందుకు నాదే అనబడితివి?"
"ఊరికే కూచున్నానా? నా చిప్సు, కూల్ డ్రింకు నీ సూట్ కేసు మీదనే కదా పెట్టాను? ఇద్దరం కలిసే కదా ఆరగించాం? వాటి పెట్టుబడి నేనే కదా పెట్టాను. ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాను?".
"ఏందన్నా, గట్ల మాట్లాడ వడితివీ? కూసొంగనే సీటు నీదైతాదే? మర్యాదగ లేచిపో. లేక పొతే బలవంతంగా లేపవలసి వస్తది."
"ఏంటీ? బలవంతంగా లేపుతారా? నా ఆత్మా గౌరవం(?) దెబ్బతింది. నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి. లేకపోతే నేను చచ్చినా లేవను."
"ఏందన్నా! కాలికి వేస్తే మెడకు వెయ్య బడితివి? నువ్వు అంత నొచ్చుకుంటే నేనే తప్పైందని ఒప్పుకుంట తియ్యరాదే! కొంచెంలే అన్నా, నీకు పుణ్యముంటది. అసలే నాకు నిద్రొస్తుంది."
"అయినా సరే, నేను లేవను. లేవనంటే లేవను. క్షమాపణ చెప్పగానే సరిపోలేదు.. నా చిప్సు పాకెటు, కూల్ డ్రింకు వచ్చినప్పుడు నీ సూట్ కేసు మీద పెట్టాను. వెళ్తే గిల్తే ఆ సూట్ కేసు తీసుకుని మరీ వెళ్తాను. అంతే తప్ప ఊరికే పోయే ప్రసక్తే లేదు. నువ్వు సూట్ కేసు వదులుకో, నాకు వెళ్ళడానికి అభ్యంతరం లేదు."
"^&*^$#*%*^*$!!!"
బాగుంది :))
ReplyDeleteప్రవీణ్ గారు,
DeleteThannks
సుబ్బారావు , యాదగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. యాదగిరికి హైదరాబాద్ లో కొంత స్థలం ఉంది. ఇద్దరు దానిలో ఒక బిల్డింగ్ కట్టి వ్యాపారం చేద్దామనుకున్నారు. స్థలం పెట్టుబడిగా పెట్టినందుకు యాదగిరికి 50 % బిల్డింగ్ కట్టడానికి పెట్టుబడి పెట్టినందుకు సుబ్బారావు కి 50 % అనుకున్నారు. ఇద్దరూ కలిసి మంచి బిల్డింగ్ కట్టారు. అప్పుడు
ReplyDeleteయాదగిరి: "అరె భాయి మన partnership ఇంక చాలు రా భాయి"
సుబ్బారావు: "అలా అంటారేంటి యాదగిరి గారు, ఈ బిల్డింగ్ లో 50 % నాది కదా అది అమ్మేశాక నా దారి నేను చూసుకుంటాలే"
యాదగిరి: "అట్లా కుదరదు రా భాయి , స్థలం నాది, బిల్డింగ్ కట్టిన వాళ్ళు మా ఊరి వాళ్ళు నువ్వేం చేసినావు రా భాయి"
సుబ్బారావు: "ఊర్లో ఉన్నదంతా అమ్మి పెట్టుబడి పెట్టిన కదా, బిల్డింగ్ కట్టడానికి"
యాదగిరి: "నీ బిల్డింగ్ ఏమి నాకు అవసరం లేదు రా భాయి నీ బిల్డింగ్ తీసుకొని నువ్వు వెళ్ళిపో"
సుబ్బారావు: "$^&*#()@&*$&^&"
మీ వ్యాఖ్యలో ఒక చిన్న తేడా. సుబ్బారావు, యాదగిరి కలిసి బిల్డింగు కట్టలేదు. యాదగిరి బిల్డింగులు చూసి టెంట్లో (మీరు సరిగానే చదివారు, గుడారంలో) వ్యాపారం చేయలేక పిల్లిలా మెల్లిగా వచ్చి యాదగిరి బంగళాలో చేరాడు సుబ్బారావు. యాభైనాలుగేళ్ళలో బిల్డింగు నిండా తన వాళ్లను నింపే సరికి యాదగిరి కళ్ళు బైర్లు కమ్మాయి. నా బంగళా నుండి బయటికి వెళ్ళు అనేసరికి, బంగాళాయే నాదనేశాడు సుబ్బారావు.
Deleteమిగిలిన స్టొరీ కూడా మీకు నచ్చినట్లు మార్చేసి రాయండి మరి.
Delete