పేరు భుజంగంలా వినిపించడమే కాదు, తెలంగాణా మాట వినబడితే చాలు, బుసలు కొట్టే పెద్దమనిషి ఒకాయన, (అంతకన్నా ఏం చేయగలడు లెండి?) ఈయన ఉండేది పరాయి దేశంలో, ఈయనకు ఇంకో ఆంద్రదేశం కావాలట! అయితే సమైక్యవాదం కాకపోతే ఆంద్రదేశం. ఏదో సామెత గుర్తుకు రావడం లేదూ?
అయినా మనకెందుకు లెండి, ఎవరి రాతలు వాళ్ళిష్టం! కాకపోతే ఈయన ఏవో పేపరు కటింగులు తెచ్చి తింగర వాదనలు చేస్తూ వుంటే మాత్రం సమాధానం చెప్పక తప్పదనిపించింది. ముందుగా ఈయన తెచ్చి పెట్టిన పేపర్ కటింగు చూద్దాం. ఇది పేపర్ కటింగే నండోయ్! ఈనాడు వారిది! సదరు పెద్దమనిషి సొంత సమాచారం ఎంతమాత్రం కాదు, ఇంగ్లీషోడి కాపీరైటు చట్టం అడ్డం రావడానికి!
ఇక ఈయన అవాకులు చూద్దాం.
గుంటూరులో దేబ్బయ్యారు శాతం మాత్రమె సొంతిల్లు కలవారు ఉన్నారు కాబట్టి, అదే మహబూబునగర్లో తొంభయ్యొక్క శాతం మంది వున్నారు కాబట్టీ, మహబూబునగర్ గుంటూరు కన్నా అభివృద్ధి చెందింది అని ఈయన గారి అభిప్రాయం.
ఈయనగారి లెక్కనే తీసుకుంటే మరి రంగారెడ్డి జిల్లాలో అరవై శాతం మందికి మాత్రమే సొంతిల్లున్నాయి. అంటే సగం హైదరాబాదు విస్తరించి వున్న రంగారెడ్డి కన్నా కూడా మహబూబునగర్ అభివృద్ధి చెందిందన్న మాట! భేష్! తమరి మేధావి తనానికి జోహారులు.
ఇక హైదరాబాదు నగరం లో చూద్దును కదా, యాభై శాతం మందికి కూడా సొంతిల్లు లేవట! సదరు పెద్దమనిషి లెక్క ప్రకారం హైదరాబాదు మహబూబునగర్ కన్నా వెనుక బడింది! మరి ఇన్నాళ్ళూ మేం డెవలప్ చేశాం, మేం డెవలప్ చేశాం అనేదంతా ఉత్తుత్తిదేనా? భేష్! నా మహబూబు నగరం ఎంత గొప్పది! జంట నగారాలకన్నా, విశాఖ కన్నా, పశిమ, తూర్పు గోదార్ల కన్నా, గుంటూరు కృష్ణాల కన్నా గొప్ప జిల్లా అన్న మాట మా జిల్లా! ఎంత గొప్ప సత్యం తెలిసిందో కదా ఇన్నాళ్ళకు!
ఇక మన మేధావి గారు తన పూరింటి సిద్ధాంతాన్ని వివరించిన విధంబెట్టిదనిన: మహబూబు నగర్లో ఇరవై ఐదు శాతం పూరిల్లు వున్నాయి. గుంటూరులో ఇరవై శాతమే వున్నాయి. కాని జనాభా ఎక్కువ వుండడం వలన మహబూబు నగర్లో కన్నా గుంటూరులో పూరిల్లలో ఉండేవారు ఎక్కువ. కాబట్టి మహబూబు నగరు అభివృద్ధి చెందిన జిల్లా!
ఇలాంటి సిద్ధాంతాలు క్రోడీకరించగల అభినివేశం మన సారు సొంతం. ఇళ్ళ విషయం లో పనికొచ్చిన శాతాలు పూరిల్ల విషయంలో పనికి రాలేదు మన మేధావికి! ఇక్కడ నెంబర్లు పనికి వచ్చాయి.పై పట్టిక చూడండి. కడప కన్నా ఎక్కువ పూరిల్ల శాతం (అవును, నేను శాతాలే చెపుతున్నాను) వున్నాయి కాబట్టి కరువుతో అల్లాడే అనంతపురం, కడప జిల్లాల కన్నా గుంటూరు బీద జిల్లా అయిపోయింది మరి! ఎంతటి విధి వైపరీత్యము!
ఇక మన ప్రత్యేకదేశవాది (పైకి మాత్రమే, లోలోన కరడు గట్టిన సమైక్యవాది) తమ దృష్టి మరుగుదొడ్ల మీదికి ప్రసరించారు. సరే, ఆయనిచ్చిన పట్టికనే చూద్దును కదా, గుండె ఆగినంత పనైంది.
హతవిధీ, గుంటూరులో ముప్పై తొమ్మిది శాతం మందికి మరుగుదొడ్లు లేవా? అయ్యో అనుకుంటూ తల కాస్త పైకి తిప్పి మహబూబు నగర్ వైపు చూద్దును కదా, మూర్చ వచ్చినంత పనైంది. ఎందుకో తెలుసా? మహబూబు నగర్ జిల్లాలో దేబ్బయ్యోక్క శాతం మందికి మరుగుదొడ్లు లేవు? మరి ఈ పెద్దాయనేంటీ, తలా తోకా లేని లెక్కలు చెపుతాడు? తాను శ్రమపడి తెచ్చుకున్న పేపర్ కటింగు కూడా చదవలేదా పాపం!
ఇక పోతే బైకు, టీవీ, కంప్యూటరు అంటూ ఏకరువు పెట్టాడు. శాతాలు సహకరించలేదేమో గురూ గారికి! తలకాయల్లెక్క మొదలు పెట్టాడు. ఎవరు, దొంగేడుపు లేడుస్తున్నదీ?
he was just another over smart Andhra fellow.
ReplyDeleteAndra bloggers will over respond and make too much noise if any small mistake is found in a T blog. but none of them respond to the wrong interpretations of this kind andhra blog.
Thanks Kalidasu
ReplyDelete