Saturday, March 31, 2012

సమన్యాయం



తమిళ తంబితో
కలిసుండడం
చేతకాక

సమన్యాయం
స్వపరిపాలన అంటూ
నినాదాలు చేశావ్

తట్టా బుట్టా సర్దుకుని
కర్నూలుకొచ్చి
కుంపటి పెట్టావ్

కుంపటి వున్నా కూడా
ఇల్లూ లేదు
వాకిలీ లేదు

కనపడింది
ఇల్లూ వాకిలీ చల్లగా వున్న
తెలంగాణా

ఇంకేం!
పరిగెత్తుకోచ్చావ్
దేబిరించావ్
అవుననే దాకా వదల్లేదు

మందబలం చూసావ్

అందాలా లెక్కావ్
వాసాలు లెక్కించి
మోసాలు చేసావ్

మా వాటా
మేమడిగి
మా పాలాన
మేం చూసుకుంటాం
అంటే

సమైక్యత
అంటూ
సొల్లు చెప్తున్నావ్

నాడు మద్రాసుతో
విడిపోయినప్పుడు
ఏమైంది
నీ
సమైక్యత?

No comments:

Post a Comment