Saturday, March 24, 2012

తెలంగాణా కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్ళు



ఉప ఎన్నికల్లో ఓటమిపాలు కాగానే తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కొత్త పాత మొదలు పెట్టారు. ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెప్తూ వీరు ప్రజల్ని గత అరవై సంవత్సరాలుగా మోసాలకు గురి చేస్తూనే వున్నారు. అంతకు ముందు నిజాంలతో కుమ్మక్కై ప్రజల్ని కాల్చుకు తిన్నది కూడా ఈజాతి వారే నన్నది తెలంగాణా ప్రజలు ఎప్పటికీ మరిచిపో కూడదు.

కిరణ్ ఎందుకు రాజీనామా చేయాలి? సీమాంధ్ర వాడు కాబట్టి సీమాంధ్ర పక్షపాతం చూపితే చూప వచ్చు. కానీ మరి తెలంగాణా నాయకులై వుంది వీళ్ళేం చేశారు? సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతున్నప్పుడు రాజీనామాలు చేసి ప్రజల్లోకి ఎందుకు రాలేదు.

ఆలోచించి చూస్తే వీరి గోల ఎందుకో అర్థం కాక మానదు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగు దేశం పూర్తిగా చిత్తినా నేపథ్యంలో తెలంగాణా వాదుల సెగ వీరి వైపు మల్లడం ఖాయం. వీరిని ఇప్పటికైనా రాజీనామాలు చేసి ప్రజల్లోకి రావాలని JAC వారు ఇప్పటికే ప్రకటించారు. ఇక ముందు మరింత వత్తిడి తెచ్చే అవకాశం వుంది. ఇప్పుడు వీరు చేసేదాల్లా వీరి చేతగాని తనాన్ని కప్పి పుచ్చు కునేందుకు చేసే తాటాకు చప్పుళ్ళు మాత్రమే.

 

No comments:

Post a Comment