Tuesday, March 13, 2012

నేను తెలంగాణాకు వ్యతిరేకం కాదు - చంద్రబాబు


వందలాది పోరలు
తెలంగాణా రందితోటి
వొళ్ళు కాల్చుకోని
ఉరేసుకొని చస్తుంటే
నీకు తెలంగాణావాదం కనపడదు

ఉద్యోగులు వ్యాపారులు
బడిపిల్లలు బడుగు జనులు
జీతాలను పణంబెట్టి
సకలజనులు సమ్మె జేసినా
నీకు తెలంగాణా వాదం వినపడదు

నిన్నటికి నిన్న
అసెంబ్లీలో తెలంగాణా
తీర్మానం పెట్టాలని
తోటి ఎమ్మెల్యేలు వాకవుట్లు చేస్తే
నీకు తెలంగాణా వాదమే లేనట్టనిపిస్తది

ఉప ఎన్నికలు వచ్చి
తెలంగాణా సీట్లకోసం
వోట్లు కావాలని గుర్తొచ్చి
మీటింగుల్లో దేబిరించేటప్పుడు మాత్రం
నువ్వు తెలంగాణాకు వ్యతెరేకం కాదా?

ఈ ఒక్క కారణం చాలదా సారూ
నిన్ను తెలంగాణా
పొలిమేర చివరిదాకా
తన్ని తరిమేసేటందుకు?
నీ పార్టీ అడ్రసు హరాం జేసేటందుకు?


  

3 comments:

  1. రెండు కళ్ళు కాదు, నాలుగు నాలుకల సిద్ధాంతం

    ReplyDelete
  2. ౧) రాజ శేఖర రెడ్డి :
    " నేను తెలంగాణాకు అద్దమూ కాదు నిలువూ కాదు "
    ౨) చంద్ర బాబు:
    " నేను తెలంగాణాకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడ లేదు మాట్లాడ బోను."
    ౩) కిరణ్ కుమార్ రెడ్డి:
    " తెలంగాణా నిర్ణయం కేంద్రం చేతుల్లో వుంది. కేంద్రం ఎ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టు బడి వుంటాం "

    ఆంద్ర చాల్బాజి మాటలంటే గిట్లుంటాయి.
    గిట్లాంటి మాటలు ఎన్ని చెప్పి ఆనాడు పెద్దమనుషుల ఒప్పందం నాటకం ఆది తెలంగాణాను కబ్జా చేసిన్డ్లో కదా.
    వాళ్ళ చాల్బాజి సంగతి సరే కానీ
    మన తెలంగాణలో పుట్టిన ఊర కుక్కలు ...
    మొతుకుపల్లి నర్సింహులు, జగ్గా రెడ్డి సంగాతెమ్చేయ్యాల్నో గడిసుట రాయి బిడ్డ
    బగ్గ రాయి. నీ కడుపు సల్ల గుండ.

    -Yadgiri, Hyderabad

    ReplyDelete
  3. ఇది కరెక్టు

    ReplyDelete