Friday, March 16, 2012

విశాఖకి 'ప్రత్యేక' రైల్వే జోన్ కావాలి



విశాఖకి 'ప్రత్యేక' రైల్వే జోన్ కావాలి
గుంటూరుకి 'ప్రత్యేక' హైకోర్టు బెంచీ కావాలి
సీమకి 'ప్రత్యేక' బోర్డు కావాలి

ఇవన్నీ ఎందుకు?
అధికార వికేంద్రీకరణకు
పరిపాలానను సులభతరం చేయడానికి
ప్రజలను భాగస్వాములు చేయడానికి
వివక్షను తగ్గించడానికి
ప్రజాస్వామ్యం పెంపొందించడానికి

ఇన్ని ప్రత్యేకాలు కావాలని
మీరే అంటున్నప్పుడు
అవే ఉద్దేశాలతో
అంతకన్నా గొప్ప కారణాలతో
మేం
ప్రత్యేకరాష్ట్రం కావాలంటే
అంత ఉలుకెందుకు?

9 comments:

  1. మీ వాదన విచిత్రంగా ఉంది. ఒక సౌలభ్యం కోసం ఒక సౌకర్యాన్ని అడగడం వేరు. ఏ సౌలభ్యమూ లేకపోయినా కేవలం కొన్ని దురుద్దేశాలూ, ద్వేషాలూ, కుళ్ళాలోచనలూ మనసులో పెట్టుకుని ఏకంగా ఇంటికి నిప్పెట్టెయ్యాలని ప్రయత్నించడం వేరు. అలాగే సౌలభ్యం కోసం విడిపోవడం వేరు. కానీ కేవలం విడిపోవడమే ఏకైక అజెండాగా పెట్టుకుని ఆ తరువాత సౌలభ్యాల్ని ఇన్వెంట్ చేయడం వేరు. ఒక ఇంట్లో ముసలి భార్యాభర్తలు ఒక గదిలో ఉంటారు. పడుచు భార్యాభర్తలు ఇంకో గదిలో ఉంటారు. వాళ్ళ పిల్లలు మరో గదిలో ఉంటారు. అంతమాత్రాన వాళ్ళ మధ్య పొరపొచ్చాలున్నట్లు కాదు. వాళ్ళు ఇహ విడిపోవాలనీ కాదు. అదొక సౌకర్యం అంతే.

    చెబితే మీరు బాధపడొచ్చు గానీ చెప్పక తప్పదు. ఈ డిమాండ్ అటకెక్కేసింది.

    ReplyDelete
    Replies
    1. మిత్రమా,

      ఎవరిది విచిత్రమైన వాదన? ఒక రైల్వే జోనుకు, ఒక హైకోర్టు బెంచీకి

      ఏ సౌలభ్యాలు ఉన్నాయో, లేవొ నిర్ణయించుకోవల్సింది విడిపోయేవారు తప్ప, దురుద్దేశాలు పెట్టుకొని ఆ ప్రక్రియను ఆప బూనేవారు కాదు. కుళ్ళు ఆలోచనలు ఎవరివో డిసెంబరు తొమ్మిది వరకూ మిన్నకుండి, పదినాడు దొంగ ఉద్యమాలను చేసినవారిని చూస్తే చాలు, ఇట్టే తెలుస్తుంది.

      విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికి అనేక వేదికల పై చర్చించడం జరిగింది. అసెంబ్లీలో పార్లమెంటులో కూడా చర్చకు వచ్చాయి. చంద్రబాబులాంటి నాయకులు కూడా మొసలి కన్నీరు కార్రుస్తూ మద్దతు తెలుపడం జరిగింది (రాదని మనసులో అనుకుంటూ).

      మీ కుటుంబం ఉదాహరణే తీసుకుందాం. భార్యా భర్తలు, ముసలివాళ్ళు పిల్లలు కలిసి వుండవచ్చు. కాని రెండు వేర్వేరు జంటలని కలిపి వుంచడం అసాధ్యం. మీకు తెలంగాణా వారంటే ముసలివాళ్ళలానో, పిల్లల్లానో కనబడుతున్నట్టుంది. అది పొరబాటు ఆలోచన. తెలంగాణా ప్రజలకు తమ రాజ్యాంగ బద్ధమైన కోర్కెలు సాధించుకునే హక్కు వుందని గుర్తించండి. వాటిని ఆపగలిగే ఎలాంటి హక్కూ తమ బోటి వాండ్లకు లేదు. కాకపోతే డబ్బు బలంతో కొంతకాలం ఆపగలరేమో, అంతే.

      Delete
  2. "ఈ డిమాండ్ అటకెక్కేసింది"

    ఈ మాట అనడం మీకు, వినడం మాకు కొత్త కాదు. ప్రతి రెండు మూడేళ్ళకొకసారి మీరు అంటూనే ఉంటారు. ఎంత ప్రాపగండా చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఈ డిమాండు అటక ఎక్కదనే విషయం మీకు అర్ధం అయిన రోజున మీకే మంచి జరుగుతుంది.

    ReplyDelete
  3. రెండు డివిజన్‌ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదు. తూర్పు కోస్తా రైల్వేలో విశాఖపట్నం, ఖుర్దా డివిజన్లలోని కొన్ని స్టేషన్‌లు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి.

    ReplyDelete
  4. మీరెన్ని సార్ల్లు చెప్పినా, మేమూ అన్నిసార్లూ చెబుతూనే వున్నాం, చెబుతూనే వుంటాం...రాజధానితో సహా విడిపోతామంటే కుదరదన్నా...

    ReplyDelete
    Replies
    1. @మన్మధన్,

      మీరెన్ని చెప్తున్నా మనసులో వున్నమాట అదే నని తెలుసు. వచ్చేటపుడు మీరు రాజధాని వెంట తేలేదు, ఇప్పుడు బాధ పడడానికి. అన్ని హంగులు వున్న రాజధానిని ఇన్నాళ్ళు తేరగా అనుభవించారు. ఇక చాల్లెండి. ఇప్పటికైనా మీకంటూ ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోండి. అది మీకే మంచిది.

      Delete
  5. కచితం గా మీ ధిమ్మ తిరిగెలా రాజధని నిర్మిస్థం అప్పుడు మీరె అంటారు ఆంధ్ర వాళు గొప్ప వారు మీకున్నది హైదరాబద్ ఒక్కటె కని మాకు శ్రీకాకులం నుంచి తిరుపతి వరకు అంతా బంగారమె

    ReplyDelete
    Replies
    1. Shall I take it as the reply to Manmathan?

      Anyways, I really appreciate your spirit, unfortunately which is lacked in most of others. Best of luck.

      Delete
    2. Shall I take it as the reply to Manmathan?
      "ఇప్పటికైనా మీకంటూ ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోండి. అది మీకే మంచిది."
      sorry,this reply was intended to you.

      Delete