Sunday, August 25, 2013

సమైక్యతకి ఎవరి కావాలి?


జూలై ముప్పైన దిగ్విజయ్ తెలంగాణా ప్రకటన చేయగానే మరోసారి ఆంధ్రాలో దానికి వ్యతిరేక ఉద్యమాన్ని మొదలు పెట్టారు. అన్ని వర్గాల ప్రజలు కాకున్నా కొన్ని వర్గాలు ఈ ఉద్యమంలో బాగానే పాల్గొంటున్నాయి. అసలు ఈ ఉద్యమం ఏమిటి? దేనికోసం చేస్తున్నారు అన్నదానికి ఎవరివద్దా సరైన సమాధానం లేదు. కాని గత ఇరవై రోజులుగా ప్రతిరోజూ మీడియాలో చూపెడుతున్నది చూసినప్పుడు కనపడేది ఇది. 'మేం సమైక్యత కోసమే ఉద్యమిస్తున్నాం. సమైక్యత తప్ప దేనికి మేం ఒప్పుకోం'. 

అసలు సమైక్యత అంటే ఏమిటి? ఇద్దరు సమైక్యంగా ఉండాలంటే అందులో ఒకరు సమైక్యంగా ఉండాలని అనుకుంటే అది సాధ్య పడుతుందా? ఒకవేళ అలా సాధ్యపడాలంటే సమైక్యత కోరేవాడు ఏం చేయాలి?

ఇవి సమాధానం చెప్పలేని ప్రశ్నలు కావు. వీటికి ఆంధ్రా ప్రాంతపు ప్రజలకు సమాధానాలు తెలియవని కావు. కాని వారు మాట్లాడే మాటలు, చేసే చేతలు చూసినప్పుడు సమాధానాలు తెలియవా అన్న అనుమానం వస్తుంది. వారికి సమాధానాలు తెలుసు. ఒక్క సమైక్యత అన్న పదం తప్ప వారు చేస్తున్న ఉద్యమంలో సమైక్యతా భావాన్ని ప్రతిబింబించేది మరేదీ కానరాదు!

తెలుగు తల్లి వేషధారణ తో పాటు శ్రీకృష్ణ దేవరాయల వేషధారణ వారి ఉద్యమ వైవిధ్యాలలో ఒకటి. కాని విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ దేవరాయలు ప్రస్తుత తెలంగాణా ప్రాంతాన్ని ఎప్పుడూ  పరిపాలించి ఉండక పోవడం! ఆయన ఆంధ్రా ప్రాంతం తోపాటు కన్నడ, తమిళ రాజ్యాలను కూడా పరిపాలించాడు. ఆ రెండు రాష్ట్రాలను కూడా కలిపి సమైక్య దక్షిణ దేశ రాష్ట్రాన్ని (తెలంగాణా కాకుండా) ఏర్పాటు చేయాలని వారి అభిమతమా? కనీసం ఆంద్ర రాష్ట్రాన్ని మొత్తంగా పరిపాలించిన రుద్రమదేవి వేషధారణ చేసినా వారి నినానాదానికి సరైన ప్రతీకగా వుండేది. కాని ఒక తెలంగాణా ప్రాంతానికి చెందినా రాణిని తమ ప్రతీకగా వారు ఒప్పుకోవడమన్నది సందేహాస్పదమే. 

ఇక పొతే సమ్మె ఎవరు చేస్తున్నారన్నది కూడా దగ్గరగా పరిశీలిస్తే, సమ్మె స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. మనకు టీవీల్లో కనిపిస్తున్న దాని ప్రకారం సమ్మెలో పాల్గొంటున్నది NGO లు, RTC వర్కర్లు. వీరు కాకుండా స్కూలు పిల్లలు. 

NGO లు వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందు తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి జనాభాను మించి అత్యధిక దామాషాలో ఆంధ్రా ఉద్యోగులు ఉన్నవిషయం అందరికీ తెలిసినదే. రాష్ట్రం విడిపోతే అదనపు ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వారి భయం. అంతే కాకుండా తెలంగాణలో ఉన్న మిగులు ఆంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతానికి తిరిగి వస్తే, ఆంధ్రా ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వారికి రావలసిన ప్రమోషన్లకు, ఇతర అవకాశాలకు గండి పడుతుందనేది కూడా ఒక కారణం కావచ్చు. వారి ఆందోళనలో అర్థం వుంది, కాని వారు చేస్తున్న ఉద్యమంలో నిజాయితీ లేదు. వారు నిజంగా తమ హక్కుల కొరకు పోరాడితే తెలంగాణా ప్రాంత NGO లు కూడా వారికి మద్దతు పలుకుతారు. కాని అది వదిలేసి సమైక్యత, హైదరాబాదు అనే నినాదాలు పట్టుకుంటే వారు సాధించేది శూన్యం. 

అలాగే RTC ఉద్యోగులు చేసే సమ్మెకు కూడా ఇటువంటి కారణాలే ఉన్నాయి. ఆ సంస్థకు వచ్చే ఆదాయంలో సింహభాగం తెలంగాణా నుండే వస్తుంది. ఆంద్ర ప్రాంతంలో రైల్వేను, ప్రైవేటు బస్సులను ఎక్కువగా ఉపయోగిస్తారు, కాబట్టి అక్కడ వచ్చే రెవెన్యూ తక్కువ. కాని విచిత్రంగా ఎక్కువ ఆదాయం వచ్చె తెలంగాణలో తక్కువ బస్ డిపోలు ఉంటాయి. తక్కువ ఆదాయం వచ్చే ఆంధ్రాలో ఎక్కువ డిపోలు ఉంటాయి. ఆంధ్రా లోని అన్ని డిపోలలో ఆంధ్రా కి చెందిన ఉద్యోగులు మాత్రమే ఉంటారు. అదే తెలంగాణలో మాత్రం ప్రతి డిపో లోనూ కనీసం పది నుండి ఇరవై శాతం వరకూ ఆంధ్రా ఉద్యోగులే ఉంటారు. అదీగాక హైదరాబాదులో వున్న RTC కేంద్ర కార్యాలయంలో ఉన్న వెయ్యి మంది ఉద్యోగులలో ఎనభై శాతం మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే!

దీన్ని బట్టి ఆంధ్రా ప్రాంత RTC ఉద్యోగులు చేసే సమ్మె లోని హేతుబద్ధత కనిపిస్తుంది. CPI అనుబంధ సంస్థ అయిన ఎంప్లాయిస్ యునియన్ కూడా సమ్మెలో పాల్గొంటుందంటే వారు ఎంతటి భయాందోళన లో ఉన్నారో అర్థమవుతుంది. వీరు నిజంగా సమైక్యతను కొరుతున్నారు. ఎందుకంటే సమైక్యంగా ఉండకపోతే, తెలంగాణా నుండి వచ్చే అదనపు రెవెన్యూ లేకపోతే ఆంధ్రా RTC కి మనుగడ లేదు మరి! కాని గత కాలపు పాపాలకు ఎవరో ఒకరు శిక్ష అనుభవించక తప్పదు మరి. కాని వారు నిజాయితీగా తమకు జరుగబోయే నష్టాలు వివరిస్తూ ఉద్యమిస్తే, ఏదో తగు పరిష్కారం దొరక్క పోదు. కాని నెల విడిచి సాము చేసినట్టు సమైక్యతా ఉద్యమాన్ని తలకెత్తుకుంటే ఉన్నదీ, ఉంచుకున్నదీ పోయిందన్న సామెతగా మారుతుంది. ఆ విషయం వారు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. 

ఇక పొతే విద్యార్థుల సమ్మె. పిల్లవాడు పుట్టగానే అమెరికా వీసా గురించి ఆలోచించే ఆంధ్రా పౌరులు, తమ పిల్లలను సమ్మె లోనికి దింపుతారంటే ఆశ్చర్యమే! అయితే దీంట్లో ఉన్న అసలు రహస్యం మీడియా మిత్రుల ద్వారా బట్టబయలయింది. స్కూలు పిల్లలకు రోజూ ఒక గంట సమ్మె ఆటవిడుపు ప్రకటించారు. ఆ గంటలో పిల్లలు అందరూ ప్రధాన కూడలికి వచ్చి రోడ్డు మీద నిలబడాలి. పిల్లలను వరుసలలో నిలబెట్టడం, గంట పూర్తికాగానే తిరిగి క్లాసు రూములకి తీసుకెళ్లడం టీచర్ల బాధ్యత. ఆ తర్వాత క్లాసులు యధావిధిగా నడుస్తాయి. ఈ ఉద్యమంలో మీడియా కూడా ప్రధాన పాత్రధారి కావడం వల్ల, ఆ గంటలోనే మీడియా వారు వచ్చి తమ వీడియో ఫూటేజీలను తీసుకొని వెళ్తారు. ఫాషన్ పరేడ్ లను తలపిస్తున్న ఈ సమ్మెల అసలు రహస్యం  కొంచెం జాగ్రత్తగా టీవీలో చూస్తె వెంటనే అర్థమవుతుంది. 

ఆంధ్రా సోదరులారా! ఇలాంటి ఉద్యమాల వలన మీరు సాధించ గలిగేది శూన్యం. చేవ వుంటే మీకు రాబోయే సమస్యలను ధైర్యంగా వివరించి, సరైన రక్షణల కొరకు పోరాడండి. మేం కూడా మీకు మద్దతు పలుకుతాం. కేంద్రంలో రాష్ట్ర విభజనకు నిర్ణయం జరిగిపొయింది. ఇప్పుడు మీరెంత గింజుకున్నా అది మారదు. మిధ్యా సమైక్య నినాదంతో మీరు కాలయాపన చేయడం వాళ్ళ మీ అసలు సమస్యలు బయటికి రాక, వాటికి పరిష్కారాలు కూడా కనుగొన బడవు. దానివల్ల చివరికి నష్ట పోయేది మీరే!

Friday, August 23, 2013

అశోక్‌బాబు అసలు బండారం!

- దొంగపత్రాలతో హైదరాబాద్‌లో పోస్టింగ్
- అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే అధ్యక్షుడి అవతారం
- అక్రమ బదిలీ నిర్దారించిన విజిలెన్స్
- ఎన్నికలే జరగని ఏపీఎన్జీఓ సంఘానికి గుర్తింపు లేని అధ్యక్షుడు
- హౌజింగ్ సొసైటీలో సభ్యత్వమూ అక్రమమే


నాయకుడు నలుగురికి దారిచూపే వాడై ఉండాలి, అందులోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులకు నాయకత్వం వహించేవాడే ఆక్రమణదారుడైతే ఉద్యమం దారితప్పుతుందని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌కుమార్ వ్యవహా రం కూడా అచ్చం ఇలాగే ఉంది. అశోక్‌బాబు ఉద్యోగ వ్యవహారం అనైతికమని, ఆయన సృష్టించిన దొంగ విద్యార్హత పత్రాలతో పొందిన బదిలీ అక్రమమనీ...

హైదరాబాద్, ఆగస్టు 22 (టీ మీడియా):హైదరాబాద్‌కు ఆయన బదిలీ నిబంధనలకు విరుద్దమనేందుకు కొన్ని పత్రాలు ‘టీ మీడియా’ చేతికి అందాయి. అశోక్‌బాబుతోపాటు ఏపీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ కూడా ఇలాగా ఉద్యోగం సంపాదించాడనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఎపీఎన్జీవో అధ్యక్షుడి హోదాలో ఉన్నట్లుగా చెలామణి అవుతున్న పరుచూరి అశోక్‌కుమార్ కృష్ణా జిల్లా విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యుటీ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేవారు. తదుపరి పోస్టింగ్ అయిన అసిస్టెంట్ కమిర్షియల్ టాక్స్ అధికారి(ఏసీటీఓ) హోదా కోసం తప్పుడు విధానాన్ని అనుసరించి హైదరాబాద్‌కు వచ్చినట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. వాస్తవానికి ఏసీటీవో హోదా కోసం ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత లేదా శాఖాపరంగా బుక్ కీపింగ్ అర్హత కలిగి ఉండాలి. కానీ ఈ రెండింటిలో అశోక్‌బాబుకు ఏ ఒక్క అర్హత లేకపోవడం గమనార్హం. ఇక ఆయన బదిలీకి ఎంచుకున్న వక్రమార్గంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో పర్చూరి అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సమర్పించినట్లుగా...సర్వీస్ రికార్డులో మార్పులు చేర్పులు చేసినట్లుగా స్పష్టంగా రుజువైంది.  విజిలెన్స్  విచారణలో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని...ఆయన అక్రమాలు ఒకటి రెండూ కావని విజిలెన్స్  విచారణ నివేదికను ప్రభుత్వానికి అందించింది.

వీటిపై విచారణ చేసిన రెవెన్యూ విజిలెన్స్  శాఖ తేదీ 30, జనవరి 2013న ప్రభుత్వానికి నివేదిక(మెమో నెం.1716/విజిలెన్స్-1(2)2013-1లో అందజేసింది. అశోక్‌బాబుపై వచ్చిన ఆరోపనలన్నీ వాస్తవాలేనని...ఆయన అక్రమాలకు పాల్పడి ప్రభుత్వాన్ని మోసం చేశారని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం ఆయనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం అని తేలుస్తూ మొమోను జారీ చేసింది. ఇందులో సర్వీసు రిజిస్టర్‌లో పేజి నెంబర్ 6లో ఇంటర్మడియట్ చిదివినట్లు ఉందని వాణిజ్య పన్నుల శాఖ తేల్చింది. అయితే ఆయన ఇందుకు భిన్నంగా డిగ్రీ చదివినట్లగా ఎలా డిక్లరేషన్ ఇచ్చారని ప్రశ్నించింది. ఇందుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలని మెమోలోపేర్కొంది. అయితే ఆయన డిగ్రీ చదివినట్లు తప్పుడు దృవీకరణ ఇచ్చి 2008 ఫిబ్రవరి 11 న ప్రభుత్వం నిర్వహించిన సాంకేతిక పరీక్ష ఎందుకు రాశారని, డిగ్రీ చదివిన వారికి ఈ పరీక్ష అవసరం లేదని కమిషన్ చురుకలు వేసింది. ఈయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినా ప్రభుత్వం ఎందుకో మిన్నకుండి పోతోంది. ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వానికి వాస్తవానికి అశోక్‌బాబు అనర్హుడు.

2012 ఆగష్టులో టెన్యూర్ విధానంద్వారా హైదరాబాద్‌కు బదిలీపై వచ్చిన ఆయన 22 జనవరి 2010న ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వం పొందినట్లుగా రికార్డులు సృష్టించడం విమర్శలకు తావిస్తోంది. ఇది ఎలా సాధ్యమని సొంత ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపణలు చేసున్నా ఆయన నోరుమెదపడం లేదు. దీనిపై కోర్టులో కేసు విచారణలో ఉంది. వాస్తవానికి నిబంధనల ప్రకారమయితే ఇందులో సభ్యత్వానికి సొసైటీ ఏర్పాటయ్యేనాటికి హైదరాబాద్‌లో 5ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. కానీ ఇవేవీ ఆయనకు వర్తించలేదు. తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యంగా కలిసుందామని ఉద్యమిస్తున్న అశోక్‌బాబు తెలంగాణ పోస్టును కొల్లగొట్టి...అక్రమంగా ఉద్యోగాన్ని అనుభవిస్తున్నాడు. విజిలెన్స్  అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగంలో 22 పోస్టులు ఉండగా విజయవాడ డివిజన్లో ఈయన విధులు నిర్వహించాల్సి ఉండగా ఈ కోటాలో కాకుండా తెలంగాణ కోటాలో ఆయన నియామకం కావడం విశేషం. ప్రస్థుతం ఈయన సికిందరాబాద్ డివిజన్లో పనిచేస్తున్నారు.

డిగ్రీ చదవకున్నా చదివినట్లు దొంగ సర్టిఫికేట్...
ఏపీఎన్జీఓ అప్రకటిత అధ్యక్షునిగా కొనసాగుతూ... అసలు ఎన్నికలే జరగని సంఘానికి అధ్యక్షునిగా చెప్పుకుంటున్న అశోక్‌బాబు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆరోపణలును ఎదుర్కొంటున్నారు. అనుభవం ప్రాతిపధికగా జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు శాఖాధిపతుల కార్యాలయాలకు డెప్యుటేషన్ మీద  పంపేందుకు 12.5 శాతం కోటాను ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందుకు ఆయా ఉద్యోగులకు గ్రాడ్యుయేషన్(డిగ్రీ) తప్పనిసరి. ఇదే అంశంలో అర్హతలతో కూడిన విద్యార్హతల జాబితాలతో కూడిన అభ్యర్ధుల వివరాలను తమకు పంపాలని అన్ని శాఖల కమిషనర్లకు 1995 నవంబర్ 10న ప్రభుత్వం ఆదేశించింది.

సరిగ్గా ఇదే అంశాన్ని వాడుకొని హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ కావాలని పథకం పన్నిన అశోక్‌బాబు తనకు లేని అర్హతలను సృష్టించుకున్నారు. డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానంలో 1991లోవిజయవాడలోని ఎన్‌ఐఐటీ నుంచి డిప్లొమా ఇన్ సిస్టం మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తి చేసినట్లుగా ప్రభుత్వానికి తప్పుడు డిక్లరేషన్‌ను సమర్పించాడు..అయితే సర్వీస్ రికార్డుల్లో మాత్రం ఆయన ఇంటర్‌మీడియెట్ మాత్రమే చదివినట్లుగా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు దీనికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు, సర్వీస్ రిజిస్టర్‌ను పంపాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టెలిక్షిగాంద్వారా ఆదేశించారు. దీంతో బెంబేలెత్తిన అశోక్‌బాబు తన గుట్టు బయటపడుతోందని...ఇక దొరికిపోవడం ఖాయమని భావించి యూ-టర్న్ తీసుకుని..‘నాకున్న కుటుంబపరమైన కారణాలవల్ల నేను హైదరాబాద్(హెచ్‌ఓడీ)లో పనిచేసేందుకు సుముఖంగా లేను...నా ధరఖాస్తును ఉపసంహరించుకుంటున్నాను’ అని ప్రభుత్వానికి పంపిన అభ్యర్ధనలో పేర్కొన్నారు. ఇక అక్కడే ఆయన మరో మోసానికి తెగబడ్డారు.

ఆయన చేసిన మోసాన్ని ఆయనే బట్టబయలు చేసుకుని సాంకేతికంగా మరోసారి దొరికిపోయారు. వాస్తవానికి ఇన్‌సర్వీస్ కేడర్‌లో వాణిజ్య పన్నుల సహాయ కార్యదర్శిగా నియామకానికి ప్రభుత్వం నియమించే ఇన్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి...అయితే ఇందుకు డిగ్రీ చదవని వారు మాత్రమే పరీక్ష రాయాలి...డిగ్రీ చదివినవారు దీనిని రాయాల్సిన అవసరం లేదు. అయితే గమ్మత్తుగా డిగ్రీ ఉత్తీర్ణత అయ్యానని చెప్పుకున్న అశోక్‌బాబు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణుడు కావడంతో ఆయన మోసాన్ని ఆయనే దృవీకరించుకున్నారు. గతంలో ఒక ఉద్యోగి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది.‘ప్రత్యక్షంగా లబ్ది పొందకపోయినా సరే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాలను మోసం చేయాలని చూస్తే సదరు ఉద్యోగి ఆ ఉద్యోగంలో కొనసాగేందుకు అనర్హుడ’ని పేర్కొంది. 1996లో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన అశోక్‌బాబును ప్రభుత్వం ఉపేక్షించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికలే జరగలేదు...అధ్యక్షుడెలా అయ్యాడో....
రాష్ట్రంలో 100కుపైగా గుర్తింపు ఉద్యోగ సంఘాల్లో ఒకటిగా ఉన్న ఏపీఎన్జీకు 31మే 2013 వరకు గోపాల్‌డ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే అదే తేదీన ఆయన పదవీవిరమణ చెందడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఏలూరు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు భోగరాజు ఎన్నికల అధికారిగా మే 26న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఎన్నికలను సవాలు చేస్తూ కొందరు ఉద్యోగులు 2013 జూన్ 20న సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇంటెరియం ఇంజక్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ అదేతేదీన అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అసలు ఎన్నికలే జరగని సంఘానికి అశోక్‌బాబు ఎలా అధ్యక్షుడయ్యాడో ఆయనే చెప్పాలి.

హౌజింగ్ సొసైటీలో క్రిమినల్ చర్యలకు సిఫార్సు....
ఏపీఎన్జీఓలకు రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో కేటాయించిన 190 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని, రూ. 13కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని కొందరు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన సాధారణ పరిపాలనా శాఖ(విజిపూన్స-ఎన్‌ఫోర్స్‌మెంట్)శాఖ అక్రమాలు నిజమే అని నిర్దారించింది. వీరు ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ వారిపై వాఖా పరమైన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ఇందుకు హైదరాబాద్ నగర అధ్యక్షుడు పివివి సత్యనారాయణను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చుతూ సీసీఎస్ కేసు నమోదు చేసింది. ఇందుకు 2013 జూన్ 6న కేసు నెంబర్ 81ను నమోదు చేసింది. ఇందులో సెక్షన్ 406, 409, 420, 182 రెడ్‌విత్ 120 సెక్షన్‌లను నమోదు చేసింది.

610, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి నియామకమైన పీవీవీ సత్యనారాయణ...
ఇరిగేషన్ శాఖలో టెక్నికల్ ఆపీసర్గా పనిచేస్తున్న ఏపీఎన్జీఓ హైదరాబాద్ అధ్యక్షుడి ఉద్యోగ నియామకంపై కూడా అనేక అనుమానాలున్నాయి. ఈయన స్వస్థలం తూర్పు గోదావరి కాగా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. అయితే నిబంధనలు ఉల్లంఘించి ఈయన ఖమ్మం జిల్లాలో (జోన్-5) క్లాస్-4 క్యాడర్లో జూనియర్ టెక్నికల్ అధికారిగా ఉద్యోగం పొందారని ఆరోపణలున్నాయి. అయితే ఈయన ధవలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో విధులు నిర్వహించారు. 20శాతం ఉండే ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీలో నాన్ లోకల్‌లో ఉద్యోగం పొందినా ఆయన జోన్ -6లో పనిచేసేందుకు అర్హుడు కాదని నిబంధనలున్నాయి.

అయితే ఇవేవీ వర్తించని రీతిలో ఆయన హైదరాబాద్ చీఫ ఇంజనీర్ కార్యాలయంలో మే 15, 1990న బదిలీపై వచ్చి చేరారు. అనంతరం ఈయన టెక్నికల్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందడం తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నాన్ లోకల్ క్యాడర్లో జోన్-6కు బదిలీపై రావడం అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా5(1)కి వ్యతిరేకమని నిబంధనలు సూచిస్తున్నాయి. దీంతో యన నియామకంపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఐ అండ్ సీఏడి శాఖ విచారణకు స్వీకరించింది. ఇందులో ఆయన సర్వీస్ రికార్డు గల్లంతయిందని...ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవమేనని తేల్చింది. ఈ అవకతవకలపై రాయకోటి కమిషన్‌ను ఆశ్రయించిన కొందరు ఉద్యోగులకు కమిషన్ హామీ ఇచ్చింది కానీ ఈ నివేదిక ప్రభుత్వానికి చేరకపోవడంతో ఆయన తెలంగాణ ప్రాంతంలోనే కొనసాగుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.

అక్రమార్కులే నాయకత్వంలో ఉంటే న్యాయం జరగడం అసాధ్యం
అవినీతి పరులు, అర్హత లేని వ్యక్తులు ఉద్యోగ సంఘాల్లో నాయకత్వం వహించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేతల నాయకత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగకపోగా మరింత అన్యాయం జరుగుతందని గుర్తించాలి. ఇప్పటికైనా ఏపీఎన్జీఓలో పనిచేస్తున్న ఉద్యోగులు వాస్తవాలను గుర్తించి వీరిపై తిరగబడాలి. ఉద్యమం ముసుగులో తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న వీరి దమననీతిని గుర్తించి పక్కకు తప్పిస్తే మంచిది. లేకపోతే సోదరుల్లా కలిసిమెలిసి పనిచేస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విద్వేషాలు రేగడం ఖాయం. ఇప్పటికే తెలంగాణ విభజనకు ఉద్యోగుల్లో మానసిక విభజన జరిగిపోయింది...ఇక భౌగోళిక విభజనే జరగాల్సి ఉందనే వాస్తవాన్ని నేతలు గ్రహించి సహకరించాలి. అక్రమాలకు అడ్డాగా మారిన ఏపీఎన్జీఓ సంఘం గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అశోక్‌బాబును సర్వీసులనుంచి భర్తరఫ్ చేసి ఆయన అక్రమాలపై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ జరిపించాలి

- గంజి వెంక టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు

Wednesday, August 21, 2013

పాడిందె పాటరా..

Seema-Andhra leaders are saying that there was never a discussion happened about Telangana statehood, the decision of Telangana formation was taken in hurry and they were never aware that such a decision will ever be taken.

 

The discussion has taken place at all levels, many times, in media, in public, in and outside the political parties’ internal meetings, through out the Telugu speaking regions, through out the country right from 1948 to till date.

 

It is really funny to note that they have already said the same words when Telangana statehood was announced by Central government in 2009 and they are pretending the same innocence once again now and we all have seen that from 2009 to till date, not even a single day has passed without discussion on Telangana. Print media has spent thousands of pages and Electronic media has spent thousands of hours in this discussion.

 

Here are some of the major milestones where the discussions took place at length.

 

1948-50: Operation Polo, Hyderabad state liberty from Nizam's rule, Military rule by Gen. Chowdary, Employees import heavily from Seema-Andhra saying Telangana people do not know Telugu and English. Telangana employees were replaced by Seema-Andhra imported employees.

1950-52: Gen Melody headed the civilian government in Hyderabad state and further increased employees import to Telangana from Seema-Andhra, many protests happened against it.

1953-56: first SRC lead by Justice Fatal Ali, Reported the opinions of all the regions, aspirations for Telangana statehood and apprehensions of Telangana people if the region is merged with Seema-Andhra.

1956: Conditional merger of Telangana with Andhra state against first SRC's recommendations of keeping Telangana separate.

1969-71: Jai Telangana moment.

1971: Telangana Praja Samithi's huge victory in parliament elections despite Indira Gandhi's wave all over the country.

1972-73: Supreme Court’s judgment in support of Mulki rules, Jai Andhra moment in Seema-Andhra against Mulki rules, Introduction of Presidential orders and 6-point formula.

1996-2001: Start of Mali dasha Telangana udyamam by Telangana intellectuals and many meetings were organized in Telangana, Andhra and also outside India. All those occasions were reported in media and Chandra Babu Naidu, the then CM warned publicly that he would suppress any kind of separatist moments in the state.

1999: Representation for Telangana statehood by all Telangana Congress MLA's to Sonia under the leadership of Y.S.Rajashekar Reddy , the then PCC president of AP. CWC accepted the demand and recommended NDA government to consider forming 2nd SRC to resolve all such demands.

2001: Formation of TRS by Kalvakuntla Chandrasekhar Rao after he resigned from TDP and Dy.Speaker post in a big public meeting.

2003: YSR as PCC president announced that Congress has no objection for Telangana statehood.

2004: Congress formed alliance with TRS in general elections, Sonia said in Election campaigns that she knows and work on the aspirations of people of Telangana for statehood if Congress comes to Power, Added the Telangana statehood in the Common minimum program of UPA government, Added in President’s address and Formed Pranab Mukharjee committee to collect the opinions of all the political parties representing in Parliament and majority of them gave letters in support of Telangana.

2005: TRS ministers in Centre and state governments resigned and withdrew support to Congress governments in protest of the delay in forming the Telangana. KCR and others were holding important cabinet posts in both the governments.

2008: TDP resolution towards formation of Telangana state after lengthy discussions in the party at all levels in all the regions and a letter was given to Pranab committee demanding Telangana statehood.

2009: YSR said in assembly that Congress as a principle agrees formation of Telangana state and Roshaiah committee will be formed to address the concerns of the stakeholders. TDP alliance with TRS in general elections included Telangana statehood in their election manifesto.

2009: Announcement by Chidambaram and Pranab Mucharjee in Parliament that process of Telangana state formation will begin. All the parties except CPM agrees and given letters to home minister of India in one or other way for Telangana statehood and blamed Congress for not taking a decision.

2013: Resolution by UPA allies and resolution in CWC by Congress and requested Central Government to form the state of Telangana.

Tuesday, August 20, 2013

సమైక్యత అంటే?

సమైక్యత కోసం గత కొన్ని రోజులుగా సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమాలు మిథ్యమాలే అన్న విషయం బట్ట బయలు కావడం ఒక కోణమైతే, కనీసం వాటినయినా ఎందుకు చఎతున్నారన్నది బయట బడడం మరో కోణం.

సమైక్యవాద ఉద్యమ కాలులమని చెప్పుకునే వారు మాట్లాడే మాటల్లో సమైక్యత అన్న పదం మొదటి వాక్యంతోనే ఆవిరయి పోతుంది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆకాంక్ష రెండో వాక్యంలో తొంగి చూస్తుంది. ఇక మూడో వాక్యంలో 'హైదరాబాదు మాదే' అన్న సామ్రాజ్యవాద రాక్షసత్వం గోచరిస్తుంది. ఆ తర్వాత ఉద్యోగాలు, నీళ్ళు నిధులు అన్న పదాలు అలవోకగా తొంగి చూస్తుంటాయి.

ఇంకా అర్థం కాలేదా? సమైక్యత అంటే వీరి దృష్టిలో హైదరాబాద్, ఉద్యోగాలు, నీళ్ళు, నిధులు. సరే, వారు చెప్పే వాటిలో ఎంతవరకు నిజాయితీ వుందో పరిశీలిద్దాం.

హైదరాబాదును వారు ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకు రాలేదు ఇప్పుడు అడగడానికి. అది తెలంగాణాప్రాంతం యొక్క అంతర్భాగం. అంతర్భాగం గానే వుంటుంది. వారు ఇక్కడికి వచ్చేటపుడు హైదరాబాదును చూసే వచ్చారు. హైదరాబాదు లేక పొతే కనీసం కలిసే ఆలోచన కూడా చేసేవారు కాదు. హైదరాబాదులో వున్న రాజభవనాలపై ఎంత మక్కువ చూపెట్టారో ఆనాటి ఆంధ్రా అసెంబ్లీలోని ప్రసంగాల పాఠాలను గమనిస్తే అర్థమౌతుంది. హైదరాబాదు పై మక్కువతో కొన్ని షరతులకు అంగీకరించి ఇక్కడికి వచ్చినవారు, ఆ షరతులను నిలబెట్టుకోలేక పోయారు. అందుకే వారు నేడు వెనుదిరిగి పోవాల్సి వస్తుంది.

ఇక ఉద్యోగుల విషయంలో వారు ఎందుకు భయపడుతున్నారు? తెలంగాణా ఏర్పడ్డాక ఎవరి ఉద్యోగులు వారి ఆఫీసులలో పని చేయొచ్చు గదా? ఇక్కడనే వుంది అసలు కిటుకు! అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడి 80%కి పైగా అన్ని ఆఫీసులలోను వారే తయారయ్యారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడే ఆంధ్రా ప్రభుత్వంలో అందరికీ చోటు లేకపోతే వారి గతేమిటి? కొత్త ప్రభుత్వం అధిక మొత్తంలో ఉన్న ఉద్యోగులను భరిస్తుందా? లేక రిట్రెంచి చేసి తీసి వేస్తుందా? ఈ విధ్యమైన భయాందోళనల వలన ఈ సమైక్య ఉద్యమంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులే పాల్గొంటున్నారు.

నిజానికి వారి ఆందోళనలో న్యాయం వుంది. కాని నిజాయితీగా వారి భయాలను వెల్లడించినప్పుడే దానికి విలువ కలుగుతుంది. కాని వారిది  'ఇదీ' అని చెప్పుకోలేని బాధ. చెప్పుకుంటే ఇన్నాళ్ళు తాము తేరగా అనుభవించిన ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల అవకతవకల వ్యవహారాలు నిజమే నని ఒప్పుకొవాలి. ఒకవైపు అవినీతి పెంటమీద కూచుని, న్యాయం చేయమని ఎలా డిమాండు చేయగలరు? అందుకే వారు మాట్లాడగలిగిన ఒకే ఒక మాట 'సమైక్యాంధ్ర'. ఉంగరం ఆఫీసులో పోగొట్టుకొని వీధిలో వెతికితే దొరుకుతుందా? అలాగే వారి సెక్రెటేరియట్ రహస్యాలు బద్దలు కాకుండా న్యాయం జరగడం అసాధ్యం.

ఇక పొతే నీళ్ళ గురించి వాళ్ళు చేసే వాదన. సమైక్యంగా ఉన్నన్ని రోజులు తెలంగాణా వాదులు 'మా నీళ్లన్నీ మీరే దోచుకుంటున్నారు బాబో' అని అరుస్తున్నప్పుడు, తాపీగా 'నీరు పళ్ళానికి పారక పొతే మెరక మీదకు పారుతుందా? మీ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టే వెసులు బాటు లేక పొతే ముఖ్యమంత్రులు మాత్రం ఏం చేయగలరు?' అని పలికారు. ఇప్పుడేమో, తెలంగాణా ఏర్పడితే కృష్ణ, గోదావరి నదులు బిరడలు వేసి బిగిస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి అప్పుడు వీలు కాని ప్రాజెక్టులు ఇప్పుడెలా వీలవుతాయో మాత్రం చెప్పరు. దానర్థం ప్రాజెక్టులు కట్టే వెసులుబాటు ఉండీ  తెలంగాణాను ఇంతకాలం ఎండబెట్టామని ఒప్పుకున్నట్టే కదా? వారి అసలు బాధ ఏమంటే అలవోగ్గా పారించుకుంటున్న అదనపు జలాలను ఇప్పుడు తెలంగాణాతో దామాషా ప్రకారం పంచుకోవలసి రావడమే.

ఇక పొతే నిధుల విషయం. రాష్ట్ర ఆదాయంలో 35% హైదరాబాదు నుండే వస్తుంది. అదీ వీరి పాయింటు. ఈ విషయంలో వారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు కాదు 1956లో హైదరాబాదు కలిసినప్పుడు కూడా భారత దేశంలో 5వ పెద్ద నగరం హైదరాబాద్. అంతే కాక హైదరాబాదుకు మరో ప్రత్యేకత వుంది. హైదరాబాద్ చుట్టూతా, లోపలా నిజాం ముందు చూపుతో ఏర్పాటు చేసిన సర్ఫేకాస్ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ విలువైన భూముల వలననే అనేక ప్రాజెక్టులు హైదరాబాదుకు వచ్చాయి. ఒక వేళ అలాంటి భూములు మరేదైనా సీమాంధ్ర పట్టణంలో వుండి వుంటే తప్పకుండా అక్కడే అభివృద్ధి జరిగి వుండేది.

సీమాంధ్ర నాయకులు చేసిందల్లా అలాంటి విలువైన భూములను పందేరం పెట్టి, తమ అనుయాయులకు ఉపభోక్తం చేయగా మిగిలిన దానిలో కొంత పెట్టుబడిదారులకు రిబేటుగా ఇవ్వడమే. అదీ తాము చేసిన అభివృద్దే అని చెప్పుకుంటే అంతకన్నా అపహాస్యం మరోటి ఉండబోదు.

ముందే చెప్పుకున్నట్టు 1956లోనే హైదరాబాదు దేశంలో ఐదవ పెద్దనగరం. ఇప్పుడు ఆ ఐదో సస్థానానికి బెంగుళూరుతో పోటీ పడవలసిన దుస్థితి. కాబట్టి రాష్ట్ర ఆదాయంలో ఎప్పుడూ హైదరాబాదుడి సింహభాగమే. కాబట్టి హైదరాబాదు ఆదాయాన్ని ఆంధ్రాలో కర్చు పెట్టి ఉంటారు తప్ప, ఆంధ్రానుంచి తెచ్చి హైదరాబాదుకి ఒక పూచిక పుల్ల కూడా కర్చు పెట్టి ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ తీయవలసి వస్తే తెలంగాణాకే సీమాన్ధ్రులు ఎదురిచ్చుకోవలసి వస్తుంది.

ఇప్పుడు బోధపడి ఉంటుంది కదూ సమైక్యత అంటే ఏమిటో? సమైక్యత అంటే వెళ్లేముందు అందినంత దోచుకొని వెళ్ళడం. దానికోసమే ఈ పెట్టుడు మిధ్యమాలు. 

Friday, August 16, 2013

వికృత సమైక్యం

పేరుకు సమైక్యవాద ఉద్యమమంటారు.. కానీ గుంటూరులో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారిని ఓర్వరు. కులం, ప్రాంతం పేరుతో దూషిస్తూ.. బెదిరింపులకు దిగుతారు. మీది తెలుగే.. మాది తెలుగే కలిసుండాలంటారు. కానీ పొట్టచేత పట్టుకొని వైజాగ్‌కొచ్చిన ఇందూరు బిడ్డను చావగొట్టి పంపుతారు. బజారు గూండాల కన్నా హీన స్థాయికి దిగజారి నిలువుదోపిడీ చేస్తారు. ఇక మా సమైక్యవాదం ప్రపంచంలోనే గొప్పదనే డాంబికాలు పోతారు. తీరా చూస్తే దీక్ష చేస్తున్న వ్యక్తికి సహకరించడానికి వచ్చిన సొంత ప్రాంత అధికారిణిపైనే అత్యంత అరాచకంగా దాడికి పాల్పడతారు. రోజురోజుకు వికృత పోకడలకు, అరాచక స్థితికి దిగజారుతున్న సీమాంధ్ర లోని సమైక్య ఉద్యమానికి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

-ఆందోళన ముసుగులో అరాచకాలు
-తెలంగాణ ఉద్యోగిపై గుంటూరులో.. ఇందూరు ఇంజినీర్‌పై విశాఖలో దాడి
-కాకినాడలో మహిళావైద్యాధికారిపై పెండ
-సంక్షేమ శాఖ అధికారి హనుమంతునాయక్‌ను బెదిరించిన ఏపీ ఎన్జీవోలు.. కులం పేరుతో దూషణలు
-ఆంధ్రలో ఉద్యోగం చేయొద్దంటూ బూతుపురాణం
-కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన హనుమంతునాయక్
-ఇందూరు బిడ్డపై వైజాగ్‌లో దాడి
-కాకినాడలో వైద్యాధికారిపై అరాచకం
-తోట వాణికి వైద్యసాయం కోసం వచ్చిన మహిళ అధికారిపై పెండతో దాడి

విజయవాడ, ఆగస్టు 15 (టీ మీడియా ప్రతినిధి):గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుమంతు నాయక్‌ను ఏపీ ఎన్జీవోలు కులం పేరుతో దూషించారు. అంతు చూస్తామనే రీతిలో బెదిరింపులకు దిగారు.

విశాఖపట్నంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న నిజామాబాద్ యువకుడు నవీన్‌పై అక్కడి ‘సమైక్య’ గూండాలు దాడికి దిగి.. చితకబాదారు. అతని వద్ద నున్న నగదు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డును నిలువుదోపిడీ చేశారు. సమైక్య ఉద్యమంలోని వికృత కోణాలను ఎత్తిచూపుతున్న ఈ ఘటనలు గురువారం జరిగాయి. మరోవైపు సొంత జిల్లా అధికారులను సైతం సహించ లేని స్థితిలో సమైక్య ఆందోళనలు దారితప్పుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మంత్రి తోట నరసింహం భార్య తోట వాణి నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి.. ఆమెకు

వైద్య సహాయం అందించేందుకు వచ్చిన జిల్లా వైద్యాధికారిణి పద్మావతిపై మంత్రి అనుచరులు దాడికి దిగి.. ఆమెపై చెత్త, పెండ విసిరి తమ అరాచకాన్ని చాటుకున్నారు. ఆందోళనల పేరిట వికృత స్వభావం సీమాంధ్రలో గంగ సమైక్య ముసుగులో సీమాంవూధలో అసాంఘిక శక్తులు బరితెగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రావడం మొదలు.. ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి సీమాంధ్ర నాయకులు రోడ్లమీదకి తెచ్చిపడేయడం.. ఉద్యమకారుల ముసుగులో అరాచక శక్తులు రంగంలోకి దిగడం.. సీమాంధ్ర పాలకులు, నాయకుల కనుసన్నలలో ఉద్యమం నడుస్తుడటంతో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం.. నియంవూతణ, నిర్బంధం, స్వీయ అస్తిత్వం అంటూలేని భయాలు, అపోహాలు, ఉద్రేకాలతో ఆందోళనలు కొనసాగుతుండటంతో.. రోజురోజుకు సీమాంధ్ర ఉద్యమంలో ఒక మూఢత్వం, మూర్ఖత్వం కలగలిసిన ఉన్మాద పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

సమైక్య ఉద్యమాల పేరిట జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ఆయన తనయుడు రాహుల్‌గాంధీకి పెళ్లి చేయడం, జాతీయ నేతలైన నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను విశృంఖలంగా పగలగొట్టడం, తెలంగాణ ఉద్యమ నేతలైన కేసీఆర్, కోదండరాం బొమ్మలను జుగుప్స కలిగించేవిధంగా, అమానుష పద్ధతిలో చిత్రీకరించి ఊరేగించడం, పుర్రెకు తొచ్చిన ప్రతి అడ్డమైన దాష్టీకాన్ని ఉద్యమంగా చిత్రీకరించడం సీమాంధ్ర ఉద్యమంలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పెట్టుబడిదారులు, కొన్ని స్వార్థరాజకీయ శక్తులు ఎగదోసిన కృత్రిమ ఉద్యమం ఇదని, దీనిని సీమాంధ్ర మీడియా చిలువలుపలువలుగా ప్రచారం చేస్తోందని సామాజిక మేధావి వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న సీమాంధ్ర ప్రజలు కూడా ఈ ఉద్యమానుల చూసి ఏవగించుకుంటున్నారు. ఇప్పటికే అగ్రకుల, ఆధిపత్య, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా సాగుతున్న ఈ ఉద్యమంలో మమేకం కాలేక దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ తదితర వర్గాల ప్రజలు తాము సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ప్రకటించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే హైదరాబాద్‌లోని సీమాంధ్రలకు భద్రత ఉండదు, వారిపై దాడులు జరుగుతున్నాయనే కుంటి సాకులు చెబుతున్న సమైక్యవాదులు.. సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగులు, ప్రజలపై దాడులకు దిగుతుండటం తెలంగాణవాదులు మండిపడుతున్నారు. సమైక్యవాదం పేరిట అందరూ కలిసి ఉండాలని చెబుతున్న సీమాంధ్ర ప్రాంత నాయకులు.. ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారని, ఇదేనా వారు కోరుతున్న సమైక్యవాదమని నిలదీస్తున్నారు.

తెలంగాణ ప్రాంత అధికారిపై ఏపీ ఎన్జీవోల విషం!
సమైక్యాంధ్ర పేరిట నానాయాగీ చేస్తున్న ఏపీ ఎన్జీవోలు కూడా తెలంగాణ ప్రాంత అధికారులపై విషం చిమ్ముతున్నారు. తెలంగాణ ఉద్యోగులను బెదిరిస్తూ.. తిడుతూ అక్కసు ప్రదర్శిస్తున్నారు. సమైక్యాంధ్ర అరాచక ఉద్యమకారులకు తామేమీ తీసిపోమనే స్థాయిలో వికృత స్వభావాన్ని ప్రదర్శించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుమంతు నాయక్‌ను కులం పేరుతో దూషించి.. అంతు చూస్తామనే రీతిలో బెదిరింపులకు, దూషణలకు దిగిన ఘటన తాజాగా వెలుగుచూసింది. సాక్షాత్తు జిల్లా స్థాయి ఉన్నతాధికారుల ఎదుటే హనుమంత్ నాయక్‌ను ఏపీ ఎన్జీవో ఉద్యోగులు బెదిరించారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. కుల ప్రస్తావన తెచ్చి అవమానించారు. బుధవారం గుంటూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. గిరిజన విద్యార్థుల రెసిడెన్షియల్ అడ్మిషన్లను లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు జరిగిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఇందులో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సూర్యానారాయణ, డీటీడబ్ల్యూవో విజయ్‌కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుమంతునాయక్ పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులకు రెసిడెన్షిల్ స్కూల్‌లో అత్యుత్తమ చదువును అందించేందుకు విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు.

ఈ సమయంలో ఏపీఎన్జీవో గుంటూరు పట్ణణ శాఖ అధ్యక్షుడు దయానందరాజు, కార్యదర్శి సుకుమార్‌తోపాటు మరికొందరు ఉద్యోగులు సమావేశ మందిరం వద్దకు వచ్చి లాటరీ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుంత్‌నాయక్ వద్దకు వచ్చిన ఎన్జీవో నేతలు ‘తెలంగాణ వాడివి ఇక్కడికి వచ్చి ఎలా ఉద్యోగం చేస్తున్నావ్, ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ అహంకారాన్ని ప్రదర్శించారు. అక్కడే పలువురు ఉన్నతాధికారులు ఉన్నప్పటీకీ ఎన్జీవో నేతలు మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి హనుమంత్‌నాయక్‌ను టార్గెట్‌గా చేసుకొని దూషణలకు పాల్పడ్డారు. అధికారులు ఎంత వారించినా వినిపించుకోని వారు.. మరింత రెచ్చిపోయి ‘కులం పేరుతో దూషించారు’. సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్‌గా పనిచేస్తున్న దయానందరాజు అనే వ్యక్తి వేలెత్తి చూపిస్తూ మరి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై హనుమంత్‌నాయక్ ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ ‘నేను జిల్లా స్థాయి అధికారిని. ప్రభుత్వం ఎక్కడ నియమిస్తే.. అక్కడ పనిచేసే అధికారం ఉంది. కానీ ఏపీఎన్జీవో నేతలు నా కులం, ప్రాంతం పేరిట దూషించారు. నా ఆత్మభిమానం దెబ్బతిశారు’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ఏపీ ఎన్జీవో నేతలపై చర్యలు తీసుకోవాలి:
టీ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్
గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రూప్-1 ఆఫీసర్ హనుమంతు నాయక్‌పై ఏపీ ఎన్జీవో నేతలు దుర్భాషాలడటం, కులం పేరుతో దూషించడాన్ని తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ ఖండించారు. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఏపీఎన్జీవో నేతలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీమాంధ్రుల ఆధిపత్యం, వారు చేస్తున్న అవమానాలను భరించలేకనే తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. హనుమంతు నాయక్‌ను దూషించిన ఏపీ ఎన్జీవో నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇందూరు ఇంజినీర్‌పై వైజాగ్‌లో దాడి
పొట్టకూటికోసం విశాఖపట్నంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఇందూరు బిడ్డపై సీమాంవూధులు అమానుషంగా దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంతో మదమెక్కిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న కొన్ని అసాంఘిక శక్తులు అత్యంత కిరాతకంగా దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన వివరాలివి.. డిచ్‌పల్లికి చెందిన నవీన్ బీటెక్ పూర్తి చేశాడు. ప్రతిభ ఆధారంగా ఆయన ఆంధ్రాకు చెందిన జేఎంసీ ఇన్‌వూఫాస్ట్రక్చర్ కంపెనీలో ఇంజినీర్ ఉద్యోగం వచ్చింది. 20వేల వేతనంతో కూడిన గౌరవవూపదమైన ఉద్యోగమని కోటి ఆశలతో వారం రోజుల కిందట నవీన్ వైజాగ్‌లోని జేఎంసీలో సైట్ ఇంజినీర్‌గా చేరాడు.

తెలంగాణ ప్రకటన రాగానే వైజాగ్‌లో పనిచేస్తున్న తెలంగాణ యువకులను అక్కడి సమైక్య గూండాలు టార్గెట్ చేసుకున్నారు. దీంట్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం నవీన్ పనిచేస్తున్న చోటుకే వచ్చిన ఆరుగురు ఆంధ్రా యువకులు.. పాశవికంగా అతనిపై దాడిచేశారు. అపస్మారక స్థితికి చేరేవరకు కొట్టారు. అంతటితో ఆగకుండా నవీన్ జేబులో నుంచి రూ. 8వేల నగదు, ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్‌ను కొట్టేశారు. తీవ్ర గాయాలపాలైన నవీన్ తేరుకొని..తెలిసిన స్నేహితుల సాయంతో బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వైజాగ్‌లోని ఇదే కంపెనీలో పనిచేస్తున్న దోమకొండకు చెందిన భూపాల్ రాహుల్ సైతం అక్కడి ఆంధ్ర గూండాల దాష్టీకానికి భయటపడి ఉద్యోగం మానివేసి ఇంటికి చేరుకున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర సీమాంధ్ర ప్రాంతాల నుంచి బతకడానికి వచ్చిన సెటిలర్లను నిజామాబాద్ జిల్లాలో 60 ఏళ్లుగా నివసిస్తున్నారు. వారిని ఇందూరు బిడ్డలు కూడా ఆదరిస్తున్నారు. అదే తమ పిల్లలు ఉద్యోగాల కోసం సీమాంధ్రకు వెళితే.. బతకలేని దయనీయ పరిస్థితి ఎదురవుతుండటంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కాకినాడలో వైద్యాధికారిణిపై పెండతో దాడి
సమైక్యాంధ్ర పేరిట సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల్లో అరాచకత్వం రాజ్యమేలుతోంది. నిన్న కాకినాడలో మంత్రి తోట నరసింహం భార్య తోట వాణి దీక్షా శిబిరం వద్ద అల్లరిమూకలు వేసిన వీరంగం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. మహిళ అని కూడా చూడకుండా సాక్షాతూ జిల్లా వైద్యాధికారిణిపైనే దాడికి దిగారు మంత్రి అనుచరులు. అంతేకాకుండా బుధవారం రాత్రి కాకినాడ వీధుల్లో వారు అరాచకం సృష్టించారు. వారి దౌర్జన్యంతో దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. దారినపోయేవారిని కూడా మంత్రి అనుచరులు చితకబాదారు. కాకినాడ భానుగుడి సెంటర్లో గత ఐదురోజులుగా మంత్రి భార్య తోట వాణి సమైక్యాంధ్ర కోసం నిరాహారదీక్ష చేస్తున్నారు.

బుధవారం వాణి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి జిల్లా వైద్యాధికారి పద్మావతి వచ్చారు. వాణి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే వైద్య సహాయం అందించాలని ఆమె చెప్పారు. అంతే ఆగ్రహించిన మంత్రి అనుచరులు జిల్లా వైద్యాదికారి మీద మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఆమె మీద చెత్త, పెండను కుమ్మరించారు. ఈ హఠాత్ దాడితో నివ్వెరపోయిన జిల్లా వైద్యాధికారి పద్మావతి కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. పోలీసులు అతికష్టం మీద ఆమె రక్షించి అక్కడినుండి తప్పించారు. ఆ తరువాత కూడా మంత్రి అనుచరుల వీరంగం కొనసాగింది. ఒక కుర్చీని రోడ్డు మీదకు విసరగా అటుగా బైక్ మీద వెళ్తున్న ఒక జంటకు గాయాలయ్యాయి. భానుగుడి సెంటర్, పిఠాపురం రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులను దిగ్బంధించిన మంత్రి అనుచరులు రోడ్డునపోయే వాహనదారులు, పాదచారుల మీద కూడా దాడికి తెగబడ్డారు. స్థానికంగా ఉన్న సోడా హబ్ షాపు మీదపడి దాన్ని ధ్వంసం చేశారు. సాయం చేయడానికి జిల్లా వైద్యాధికారి వస్తే ఇట్లా అవమానించడం ఏమి సంస్కృతి అని అక్కడున్న పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యమం పేరిట అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నారని కాకినాడ పౌరులు ఆవేదన చెందుతున్నారు.