Saturday, April 16, 2011

సమైక్య వాదపు కల్లోలం చూడు

సమైక్య వాదపు కల్లోలం చూడు
బలి పోతున్న పసి ప్రాణాలు చూడు.

రౌడీయిజం తెలియని నా హైదరాబాదుల 
బెజవాడ రౌడీల వీరంగం చూడు
జూబిలీ హిల్సులో ఫిల్ము నగరులో 
మసిబారు తున్నట్టి మానవత్వం చూడు

నాజీల మించిన నయా కామందుల 
నైచ్యాల నెదిరించ నక్సలైట్లుగా మారి
ప్రాణాల నొడ్డిన పడుచు వీరుల చూడు 

మత ఘర్షణలు లేని మా తెలంగాణలో 
పర పాలకుల వలన పడలేని కష్టాలు 
గోకుల్ చాటులో కొత్తగా బాంబులు 

అతిలేని గతిలేని మతిలేని దర్యాప్తు 
ఎన్నేళ్ళు సాగేను ఎప్పటికి ముగిసేను
తినుడు యావే తప్ప ధీరత్వమేలేని 
చవట దద్దమ్మలే రాష్ట్రాన్నిఏలంగ!

ఇంక సాగబోవు దోపిడీ రాజ్యాలు 
కుట్ర బాజీ గాళ్ళ కుహనా సమైక్యాలు 
జనం కదిలి వచ్చె సంద్రమ్ము మాదిరి 
దోపిడీ దొంగల పీచ మణుగు తుంది 
ప్రజా గర్జన విని పగుతుంది గుండె

తెలుగుమాత

అయ్యా సమైక్యవాది గారూ,

మాకు తెలిసింది తెలంగాణామాత, భారత మాత, ధరిత్రీ మాత. ఈ మాతలు మాకు చాలు. తెలుగు వారు ప్రపంచంలో పద్నాలుక్కోట్ల మంది ఉన్నారు. ఏ దేశంలో ఉన్నవారు, ఏ రాష్ట్రంలో నివసించే వారు ఆయా మాతల్నే పూజిస్తారు. తెలుగును అభిమానిస్తారు. అంటే కానీ మాది తెలుగుమాత, ఈదేశ మాతతో మాకు సంబంధం లేదని చెప్పరు. ఇంగ్లీషుకు మాత లేదు, హిందీకి మాత లేదు, భాష పేరిట మాతను నిలబెట్టి జనాన్ని మోసం చేయడం మీకే చెల్లింది.

తెలుగు తెలుగు అంటూ భాషా దురభిమానం పెంచి, దాన్ని సామ్రాజ్యవాదంగా మార్చారు. మీ సామ్రాజ్య వాదపు కుట్రలు బట్ట బయలై ఇప్పుడు ప్రజల ముందు నగ్నంగా నిలబడున్నారు. ఇంకా మేం దేవతా వస్త్రాలు కట్టుకున్నాం చూడండీ అంటే నమ్మడానికి జనం మీ అంత తెలివి తక్కువవారు కాదు.

తమరికి తెలియదేమూ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ బీహారు కంటే దరిద్రంగా ఉంది. మీరు ఇంకా ఇక్కడ ఉంది డెవలప్పు చేయవలసిన అవసరం లేదు. తమరు ఎంత తొందరగా విడిపోతే ఇద్దరికీ అంత మంచిది. 

తెలంగాణా దాటి ఇరవై వేల కిలోమీటర్లు వెళ్ళినా, ముప్పైవేల కిలో మీటర్లు వెళ్ళినా అక్కడి ప్రభుత్వానికి లోబడి ఉద్యోగాలు చేసుకుంటారు గాని, మీలాగా తిన్నింటి వాసాలు లెక్క బెట్టరు. ఆ ఘనత మాత్రం మీకే సొంతం. 

సమైక్య వాదులకు మూడు ఆప్షన్లు.

ఇక్కడ వ్రాసిన ప్రేలాపనకు నా సమాధానం.

మీరు ఎన్ని కుట్రలు, వంచనలు చేసినా, ఎన్ని డబ్బు సంచులు డిల్లీలో పంచినా తెలంగాణా ఏర్పాటు కాక తప్పదు. ఒక వేళ 2011 ల కాకపోతే 2014 ల రాక తప్పదు. అప్పటిదాకా మొకాలడ్డుకుంట నిలబడి చెడ్డ పేరు తెచ్చుకోకండి. విడిపోయినాక తెలంగాణా పై మీరు ఆధార పడాలే గాని తెలంగాణా మీ పై ఆధార పడదు. అందుకే మీరు బుద్ధిగా రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటే మీకే మంచిది.

కాబట్టి మీకు మూడు ఆప్షన్లు ఇస్తున్నాం.

1 తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వప్పుకుంటాం. పోలవరం ఏర్పాటుకు అడ్డు చెప్ప కండి. నీటి అర్హత లేకున్నా కూడా రాయల సీమకు మేం తోవ్వుకున్న కాలువలు మూసి వేయకండి. కనీసం అనంత పురానికి తాగు నీరు వదలండి.

2తెలంగాణా ఏర్పాటు వప్పుకుంటాం. మాకు రాజధాని నగరం లేదు. కాస్త మా రాజధాని నగరం కట్టుకునే దాకా హైదరాబాదులోని భవనాలను ఓ ఐదేళ్ళ పాటు ఉపయోగించుకోనివ్వండి.

3తెలంగాణా ఏర్పాటుకు వప్పుకుంటాం. మాదారిన మేం పోతాం, కాని, మా పెత్తందార్లు అక్రమంగా ఆక్రమించిన భూములు, జాగాలు వారికే వదలండి. ఏదో, బతుకు తారు.

ఒప్పుకోరా, సరే, మీ ఇష్టం. అప్పుడు రాజాజీ వెళ్ళగొడితే కట్టుబట్టలతో వెళ్లి పోయినట్టుగా ఇప్పుడు కూడా హైదరాబాదు, తెలంగాణా వదిలేసి వెళ్ళ వలసి వస్తుంది.  

Sunday, February 13, 2011

కుడితిల పడ్డ ఎలుక

ఆరేడు సంవత్సరాలనుండీ అధికారానికి దూరమైన చంద్రబాబు నాయుడికి ఏం జేయ్యాల్నో తెల్వక పిచ్చెక్కు తున్నట్టుంది. అటూ ఇటూ బొయ్యి TRS వెంట బడ్డడు.

కాంగ్రెస్ల PRP విలీనం కాంగనే మస్తు ఖుషీ అయిండు చంద్రబాబు. ఇంక కాంగ్రెస్ అయిదేండ్లు అదికారంల ఉంటదని, గప్పటి లోపట స్టేట్ల జరంత మంచి పేరు తెచ్చుకుందమని అనుకున్నడు. గిప్పుడు గిట్ల ఎలక్షన్లు వస్తే అటు సైడు జగన్, ఇటు సైడు TRS సీట్లన్నీ ఊడ్సుక పోతే, గిప్పుడున్న తొంభై గూడ రావని ఆలోచించిండు. గిప్పుడు PRP విలీనమైంది గాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోదు, తనకు ఫుల్ భరోసా అనుకున్నడు. 

ఇంక మిగిలింది TRS. దాన్ని గూడ గబ్బు లేపితే ఇంక మనదే రాజ్యం అనుకున్నడు. అనుకొనగానే తన తొత్తు గాన్లను పిలిచి TRS కాంగ్రెస్ బ్రాంచి ఆఫీసని ప్రచారం జేయించిండు. PRP కాంగ్రెస్ ల విలీనం అయింది గాబట్టి TRS గూడ విలీనం అయితదని చెప్పితే జనం నమ్ముతరు అనుకొన్నడు. 

అయితే గీయన KCR తెలివి తేటలు తక్కువ అంచనా వేసిండు. ఈయన మాటలను KCR జబర్దస్తుగా ఎదుర్కున్నడు. "అయ్యా, నేను రేపు అసెంబ్లీల అవిశ్వాస తీర్మానం బెడుత. నువ్వు నన్ను బలపరుస్తవా? లేకుంటె నువ్వే కాంగ్రేసు బ్రాంచి ఆఫీసని ఒప్పుకుంటవా?" అని ఒక్కతీర్గ అడిగిండు.

ఏం జెప్తడు చంద్రబాబు? నిన్నటి దాంక "ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందీ,  విశ్వాసం కోల్పోయిందీ" అని కోడి లెక్క గూశిండు. ఇప్పుడు ఏమంటడు? "విశ్వాసం కోల్పోలేదు కాబట్టి బలపరచను" అంటడా? ఎటూ తోయని చంద్రబాబు పరిస్థితి కోరి కోరి కుడితిల పడ్డ ఎలుక లెక్క అయింది.

Sunday, February 6, 2011

అమ్మ దర్శనం

సామాజిక వాదినంటు శానా శానా జెప్పిండు
తెలంగాణా తెస్తనంటు తెగేసి ప్రకటించిండు

డిసెంబరు తొమ్మిదిన డిల్లీలో ప్రకటనొస్తే
సమైక్యాంధ్ర జై అంటూ చావు తెలివి జూపిండు

పరిపాలన జేయలేవు ప్రతిపక్షంలో ఉండని
ప్రజలంతా తీర్పిస్తే బాగలేదు మన అయ్యకి

అధికారం కావాలని ఆరాటం జేస్తున్నడు
అమ్మ దర్శనం కోసం అర్రులు చాస్తుండు