చచ్చిన రెడ్డి కానుండి
ఉద్దెరకు తెచ్చుకున్న
పొల్లు మాటలు
ఉచితాలు
వాగ్దానాలు
గద్దెమీది రెడ్డి కానుంచి
అడిగి తెచ్చుకున్న
పొలీసు మంద
తుపాకులు
గన్ మెన్లు
పక్క ప్రాంతం నించి
పట్టుకొచ్చు కున్న
మందీ మార్బలం
గూండాలు
రౌడీలు
ప్రజల కానించి
పట్టుకొచ్చిన
నమాజు టోపీలు
తలపాగాలు
కుల సంఘాల
రైతు సంఘాల
దగ్గెర నించి
అద్దెకు తెచ్చిన
కండువాలు
అన్నీ
బాగనే ఉన్నై
కానీ...
తెలంగాణా
ఏర్పాటు గురించి
ఒక్క ముచ్చెట
చెప్పనీకి మాత్రం
నీ దగ్గెర
మాటల్లేవు
ఆంధ్ర బాబూ
గిదీ
నీ
పాదయాత్ర
Please read this: http://forproletarianrevolution.mlmedia.net.in/jux/610111
ReplyDeleteI wrote this for exposing those people who are support "Gangato Rambabu" movie.
ఈ సినిమా నేను చూడలేదు గానీ, తెలంగాణా వాదంపై బురద చల్లుతున్నాననే ఉబలాటంతో తెలుగువారిని, తెలుగు తల్లిని కూడా అవమానించాడు పూరీ. మేం, తెలంగాణా వారిమైనా కూడా తెలుగు వారిమే. మా order of preference ఇలా వుంటుంది. తెలంగాణా జాతి - తెలుగు జాతి - భారత జాతి.
Deleteకాని ఈ కుహనా సమైక్య వాదులు మాత్రం తెలంగాణా వారిని పరోక్షంగా తిట్టడాన్ని చూసి ఉబ్బిపోతూ, ప్రత్యంక్షంగా తెలుగు తల్లిని తిదుతున్నా కూడా చప్పట్లు కొడుతున్నారు. ఇదీ వీరికి తెలుగుజాతి పై నుండే గౌరవం.