Saturday, October 6, 2012

కొమురం భీం విగ్రహ ప్రతిష్ఠాపన

ప్రభుత్వం గురువారం అర్థరాత్రి ఏంపని చేసింది?

ట్యాంకు బండు మీద విగ్రహాలు పెట్టింది.

ఎవరివి?

గురజాడ అప్పారావు, త్రిపురనేని రామస్వామి, అన్నమాచార్య, ఆర్థర్ కాటన్.

మరిదొంగల్లెక్క అర్థరాత్రెందుకు? పట్టపగలే పెట్టొచ్చుగా?

వాళ్ళు మహనీయులే. పెట్టే పనే దొంగ పని. పట్టపగలు పెడితే వారి ప్రాంతీయ వివక్ష మరోసారి బయట పడుతది. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటది. రాత్రికి రాత్రి వాటిని నిలబెట్టినంక అంత ప్రభావం ఉండదు కదా?

ఒక ప్రాంతం వారివే ఎందుకు పెడుతరు?

ఎందుకంటే ఒక ప్రాంతాన్ని తర తరాలుగ దోచుకోవాలంటే ఆ పంతం వారి సంస్కృతీ చరిత్రా నాశనం చేయాలి. అందులో భాగమే తెలంగాణా వైతాలికులు తరగతి పుస్తకాల్ల్లో కనుమరుగు కావడం. మహత్తరమైన తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర మన పిలగాల్లకు అస్సలే తెలియక పోవడం. కనీసం హైదరాబాదు మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామక్రిష్ణారావని కూడా వారికి తెలియక పోవడం. ఫలితంగా ఆంధ్రా ప్రాంతానికి ఇక్కడి ప్రజలు శాశ్వతంగ బానిసలుగా పడి  వుండడం.

కొమురం భీం విగ్రహ ప్రతిష్ఠాపన 
అలా జరుగుతుందా?







ఇప్పటికే అలా జరుగుతుంది. ముఖ్యమంత్రి, PCC ప్రెసిడెంటు, ప్రతిపక్ష నేత, DGP, స్పీకరు, హైదరాబాదు పోలీసు కమీషనరు ఇలా అడుగడుగునా వాళ్ళే ఉంటరు. తెలంగాణా ప్రాంతం వారు తమ చరిత్ర, సంస్కృతి ఎరిగి వుండి, ఆత్మా విశ్వాసం కలిగిన వారైతే తప్పక ఎదురు తిరుగుతరు. న్యాయం అడుగుతరు. అది వారికి ఇష్టం ఉండదు. తెలంగాణా వారు ఆత్మన్యూనతతో అణగి మణగి ఉన్నట్టైతే, యధేచ్చగా అన్ని రంగాల్లో తమ దోపిడీ కొనసాగించ వచ్చు.


మరి తెలంగాణా వాదులు ఊరుకున్నరా?

ఊరుకోలేదు. తీవ్రమైన నిరసనలు వెలువడ్డ నేపథ్యంలో శుక్రవారం పగలు కొమురం భీం విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. పాపం ఆ మహానుభావులేం పాపం చేశారో కాని, ఈ మహానుభావుల పాపాల వల్ల అర్థరాత్రులు ప్రత్రిష్టించుకోవలసిన గతి పట్టింది. అదే కొమురం భీం పట్టపగలు ప్రత్రిష్టించ బడ్డ కొమురం భీం విగ్రహం గర్వంగా నవ్వుతూ నిలుచుంది!


3 comments:

  1. కాకి లెక్కల తో వెనకబాటు అంటూ కోరుతునారు రాష్ట్రాన్ని కర్నూల్ నుండి హైదరాబాద్ కు రాజదాని మార్చినపుడు ఏమి అయినై మీ గుండె ఘోషలు. ప్రతీది తప్పుపట్టటం భవిష్యతులో వినాశనానికి దరి తీస్తుంది జాగ్రత్త.

    ReplyDelete
    Replies
    1. స్వందన గారు

      కర్నూలులో టెంట్లలో ప్రభుత్వం నడుపలేక కలుస్తామని దేబిరించింది మీరు. ఇది చూడండి.

      http://missiontelangana.com/1953-andhra-state-capital-kurnool-condition/

      Delete
  2. ఎవరి ఆనందం వారిది.

    ReplyDelete