Friday, June 15, 2012

నమ్మటం లేనట్టుంది!!


ఎనిమిదేళ్ళనుండి
అధికారం లేక
అలమటిస్తున్న
రెండుకళ్ళ సిద్ధాంతి

ఇప్పటికే ముగ్గురు
ముఖ్యమంత్రులను మార్చి
కాంగ్రేసు అధిష్టానం
ప్రజలకు నరకాన్ని చూపిస్తూ
తనకు తానే సైడిస్తున్నా

రాందేవ్ బాబాతో
గడ్డం గడ్డం కలిపినా
బియ్యం, వైద్యం, నగదు
అన్నీ ఫ్రీగా ఇస్తానన్నా
డిపాజిట్లకోసం
దేబిరించాల్సిన పరిస్థితి!

ఏ ఎండ కాగొడుగు పట్టే
చంద్రబాబు మాటలను
ఆంధ్రా ప్రజలు కూడా
నమ్మటం లేనట్టుంది!!

ఆనాడు ప్లేటు ఫిరాయించి
నాలుకను అడ్డంగా తిప్పిన
చంద్రబాబు కంటే
కోట్లు దిగమింగిన
ఫాక్షనిస్టే నయమని
భావిస్తున్నట్టుంది పాపం!!!


   

8 comments:

  1. తెలంగాణా ఇస్తామని పోటీ చేసినప్పడు ఇంతకంటే ఎక్కువ సీట్లు వచ్చినయి!

    పాపం ఆంధ్రబాబుకు ఆంధ్రలో కూడా చిప్పే గతా?

    ReplyDelete
    Replies
    1. అవును Jai,

      ఇప్పటికైనా ఆంద్రబాబు బుద్ధి తెచ్చుకోకపోతే ఆ చిప్ప కూడా బామ్మర్దులు గుంజుక పోగలరు.

      Delete
    2. వాళ్ళకంత సీను లేదన్నా!

      Delete
  2. రెండు కళ్ళ సిద్ధాంతిని విమర్శించడంలో తప్పేమీ లేదు. "మేము సమైక్యాంధ్రకి అనుకూలమే కానీ తెలంగాణా ఏర్పడితే అడ్డుకోము" అని చెపుతూనే తెలంగాణాపై విషం చిమ్మే CPM మేతావులని విమర్శించడం అంత కంటే ముఖ్యం. పరకాలలో ఒక సమైక్యవాద అభ్యర్థికి 805 వోట్లు పడ్డాయని పరకాల నియోజకవర్గంలో 805 మంది సమైక్యవాదులు ఉన్నారు అని నిరూపించే యోచనలో విశాలాంధ్ర మహాసభవాళ్ళు ఉన్నారు. మిసన్ తెలంగాణా వెబ్‌సైట్‌లో కొత్త పోస్ట్ వచ్చింది, చూడు.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. చంద్రబాబుకి ఉన్నది మెల్లకన్ను. ఒక కన్ను తెలంగాణా వైపు చూస్తుంది, ఇంకో కన్ను సీమాంధ్ర వైపు చూస్తుంది. మెల్ల కంటి సిద్ధాంతానికి పెట్టిన అస్పష్టమైన పేరే రెండు కళ్ళ సిద్ధాంతం.

    ReplyDelete