Saturday, June 9, 2012

నిర్ణయం




ఆంధ్రల వున్న పదిహేడు సీట్ల సంగతేమొ గని, సురేఖ రాజీనామా చేసిన పరకాల సీటు మాత్రం అక్కడి ప్రజలకు పెద్ద చిక్కే తెచ్చి పెట్టింది. ఇక్కడ YSR సచ్చిండన్న సానుభూతి లేదు. జగన్ జైల్ల బడ్డడన్న బాధ అసలుకే లేదు. చంధ్రబాబు, కిరణ్ కుమార్ పిలిస్తె పలికే దిక్కు లేదు.

కాని వొచ్చిన చిక్కంతా బిజెపి, టీఅర్ఎస్ మధ్యనే. ఈ రెండీట్ల దేనికి వోటెయ్యలె? ఇదీ పరకాల వోటరు సమస్య.

అవును, బిజెపి పార్టీ తెలంగాణ కోసం గట్టిగనే ప్రయత్నిస్తున్నది. కనీసం ఆ పార్టీ రాష్ట్ర శాఖ (తెలంగాణా ప్రాంతంల) బాగనే ఉద్యమంల పాల్గొంటున్నది.మరి కేంద్రంల పాగా వేసి తెలంగాణ ఇవ్వగలిగిన రెండు పార్టీలల్ల అదొకటి. అందులో ఒక పార్టీ (కాంగ్రేసు) ఇప్పటికే దాదాపుగ ఇయ్యలేననుకుంట చేతులెత్తింది. ఇక మిగిలింది ఇదొక్కటే.

మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలేం జెయ్యాలె? తెలంగాణ ఇస్తనంటున్న బిజెపిని నమ్మాల్నా? తెలంగాణా కోసం పోరాటం చేస్తనంటున్న టీఅరెస్‌ను నమ్మాల్నా? పరకాలల ఎవరికి ఓటెయ్యాలె? ఇదొక పెద్ద చిక్కు సమస్య అయి కూసుంది.

బిజెపికి ఓటెయ్యకపోతె దానికెక్కడ కోపమొచ్చి తెలంగాణ ఇయ్యనంటదో? ఉన్న రెండు పార్టీలు తెలంగాణా ఇయ్యనంటె తెలంగాణా ప్రజలకు దిక్కేంది? ఇనంక టీఆర్ఎస్‌కి ఎయ్యక పోతె పన్నెండేండ్ల నుండి తెలంగాణా కోసమే పాటుపడుతున్న ఆ పార్టీ డీలా పదుద్దేమో? పరకాల వోటరుకు పెద్ద చిక్కే వచ్చింది.

నిజానికి పరకాల వోటరుకే కాదు, తెలంగాణా ప్రజలందరికీ, నిర్ణయించుకోవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈ రెండు పార్టీల మధ్యన సయోధ్య కుదురుద్దన్న ఆశ కనపడుతలేదు కాబట్టి. సయోధ్య కుదిరే ఆశ లేనప్పుడు, తెలంగాణా శక్తి క్షీణించకుండ ఉండాల్నంటే, ప్రజలంతా ఏదో ఒక వైపే ఉండి తీరాలి. లేదంటే డబ్బు, అధికారం దండిగా కలిగిన సమైక్యవాద శక్తులు మనలో మనకే చీలికలు తెచ్చి తెలంగాణా ఉద్యమాన్ని మరోసారి అణచి వెయ్యగలవు.

ఇక పొతే ఈ రెండు పార్టీల తీరు తెన్నులు ఒకసారి పరిశీలిద్దాం.

1969ల దారుణంగ అణచి వెయ్య బడ్డ తెలంగాణా ఉద్యమం టీఅర్ఎస్ పార్టీ పుట్టేవరకు తిరిగి నిలదొక్కుకోలేక పోయింది. అయితే టీఆర్ఎస్ పుట్టింది మొదలు ఉద్యమం దినదిన ప్రవర్థమానమైంది. ఒక్క రక్తపు బొట్టు చిందకుండానే టీఆర్ఎస్ తెలంగాణాను ఒక బలీయమైన నిర్ణయాత్మక శక్తిగా మార్చ గలిగింది.

టీఆర్ఎస్ మీద దాని ప్రత్యర్ధులు చేసే ఆరోపణలు పరిశీలిద్దాం.
1. తెలంగాణా పేరు చెప్పి కుటుంబంలో అంతా పదవులు పొందారు.
2. తెలంగాణా పేరు చెప్పి వసూళ్ళు చేసుకుంటున్నారు.

ఇంతకీ ఇప్పుడు కుటుంబ సభ్యులు రాని పార్టీ యేది దేశంలో? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊరికే పదవులు అనుభవించడం లేదు, వారు తెలంగాణా కోసం నిబద్ధతతో పనిచేస్తున్నరు.

ఇంక వసూళ్ళ సంగతి... ఇది ఇంతవరకూ ఎవ్వరూ నిరూపించలేదు. అయినా నిజమే కావచ్చు. కానీ వసూళ్ళు చేయందెవరు? మొన్నటికి మొన్న ACB ఎంక్వైరీలో బయట పడలేదా అబ్కారీ వసూళ్ళ తంతు గురించి? అధికార పక్షం, ప్రతి పక్షం, జర్నలిస్టులు, అధికారులు అని లేకుండా ప్రతి ఒక్కరూ గద్దల్లెక్క మేసిన వైనం?

అవినీతి అనేది దేశం మొత్తం చేయవలసిన ఒక ప్రత్యేక పోరాటం. దానికి తెలంగాణా ఉద్యమానికి సంబంధం లేదు. ఇక్కడ తెలంగాణా ప్రజలు చూస్తుంది, ఆయా పార్టీలకు  తెలంగాణా పై ఎంత నిబద్ధత ఉంది అని మాత్రమే!

ఇంక బిజెపీ సంగతి చూస్తే... ఆ పార్టీ తాను అధికారంలో వున్నప్పుడు తెలంగాణా ఇవ్వగలిగి కూడా చేతులెత్తింది. చంద్రబాబు మోకాలడ్డితే గప్‌చుప్‌గా ఊరుకున్నాం అని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. అలాంటి వారు మరి ఇప్పుడు ఎలాగివ్వగలరో మాత్రం చెప్పరు. రేప్పొద్దున చంద్రబాబో, జగనో NDA కు మద్దతు ఇస్తూ, తెలంగాణా ఏర్పాటును అడ్డుకుంటే... అప్పుడేం చేస్తారు? ఆ పరిస్థితిలో తెలంగాణా వారంతా బిజెపికి వోటేసి గెలిపించినా అది బూడిదలో పోసిన పన్నీరేగా? తెలంగాణాలో గెలిచిన బిజెపి ఎంపీలు అధిష్టానం మాటను ధిక్కరించ గలరా?

ఇంక బిజెపికి ఎంత నిబద్ధత వున్నది? అని చూస్తే అది కూడా నేతి బీరకాయలో నెయ్యి చందంగనే కనపడుతది. ఎండల లక్ష్మినారాయణ రాజీనామా చేస్తే, కిషన్‌రెడ్డి చెయ్యడు. ఈ కిషన్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణా తెస్తనంటడు.

2G స్పెక్ట్రం గురించో మారోదానిగురించో నెలలకు నెలలు పార్లమెంటును స్థంభింపచేసే బిజెపికి ఒక్కరోజు తొమ్మిది మంది తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు తమ అధికార పార్టీ పైనే పోరాటం చేస్తుంటే మటుకు వారికి చేదోడుగా నిలవాలని అనిపించదు. పైగా వారిని సస్పెండు చేయాలని అనిపిస్తుంది. ఇది బిజెపి ద్వంద్వ నీతికి ప్రత్యక్ష ఋజువు కాదా?

వీటన్నిటిని బట్టి చూసినప్పుడు జాతీయ పార్టీలను నమ్మడమంటే తెలంగాణా ప్రజలు తమ ఓటమి తాము కొని తెచ్చుకోవడమే. తెలంగాణా ప్రజలకు తమ వాణిని వినిపించే పార్టీ వుండడం తప్పని సరి. పార్లమెంటులోని బలాబలాను బట్టి ఎవరిని బలపరచాలి? ఎలా తెలంగాణా సాధించాలి అని తర్వాత ఆలోచించొచ్చు. ఇతరులను బలపరచాలంటే ముందు తెలంగాణా ప్రజలు బలమైన శక్తిగా ఎదగాలి. అందుకు ప్రత్యేక తెలంగాణా ఎజెండా గలిగిన ప్రాంతీయ పార్టీని బలపరచడమొక్కటే మార్గం. ప్రస్థుత పరిస్థితుల్లో అది TRS తప్ప మరోటి కాదు.

14 comments:

  1. విశ్లేషణ బావుంది. కానీ మొన్నమొన్నటి దాకా అందరికీ అర్థమయ్యేలా రాసేవారు. సడెన్ గా ఇప్పుడెందుకీ యాస ? ఇంట్లో మాట్లాడేది రాతలో పెడితే అంత మంచిగ అనిపియ్యదు. వద్దులెండి భయ్యా, పూర్వపు శైలిలోనే లాగించండి. మీకు పుణ్యముంటది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు.

      ఎలా తోస్తే, అలా రాసేయ్యడమే; శైలి గురించి పెద్దగా ఆలోచించ లేదు.

      Delete
    2. @Anonymous:

      ఇది యాస (accent) కాదు, భాష (language). మీరు వెదుకుతున్న పదం మాండలీకం (dialect) లేదా వ్యవహారీకం (spoken language) కావచ్చు.

      Delete
  2. the true colors of bjp and trs are out. They are using public sentiment to gain politically one thing for sure ultimately people are made fools.

    ReplyDelete
    Replies
    1. Thanks for recognizing public sentiment.

      Political parties always try to exploit public sentiment. In the process they promise to deliver what people wanted. TRS and BJP are no excuse.

      Now it is the people who has to choose the better side that is capable of delivering their wishes.

      Delete
    2. "2G స్పెక్ట్రం గురించో మారోదానిగురించో నెలలకు నెలలు పార్లమెంటును స్థంభింపచేసే బిజెపికి ఒక్కరోజు తొమ్మిది మంది తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు తమ అధికార పార్టీ పైనే పోరాటం చేస్తుంటే మటుకు వారికి చేదోడుగా నిలవాలని అనిపించదు. పైగా వారిని సస్పెండు చేయాలని అనిపిస్తుంది. ఇది బిజెపి ద్వంద్వ నీతికి ప్రత్యక్ష ఋజువు కాదా?"

      అది సరే కానీ ఎంతమంది టీ.ఆర్.ఎస్ ఎంపీలు అరపూట కన్నా ఎక్కువగా ఏరోజయినా పార్లమెంట్ లో కనిపించారో చెప్తారా? ఓ రెండు మూడు సార్లు తూతూమంత్రంగా నినాదాలు చేసి నిరసన పేరుతొ పార్లమెంట్ కి డుమ్మా కొట్టే ఆ అన్నా, చెల్లెళ్ళు ఏనాడైనా ఒక్క ప్రజాసమస్య గురించి పార్లమెంట్ లో ప్రస్తావించిన దాఖలా ఉందా? ఈ మాత్రం దానికి వాళ్ళని ఎన్నుకోవడం ఎందుకు? వదిలేస్తే ఎంచక్కా ఫాం హౌస్ లో మందు కొట్టుకుంటూ కూర్చుంటారుగా. పైగా తెలంగాణావాదం వాళ్ళే వినిపించేటట్టు దిక్కుమాలిన ఫోజులొకటి. సిగ్గులేకపోతే సరి.

      Delete
    3. @సత్యం,

      సిగ్గు, ఎగ్గుల గురించి సమెక్కుడువాదులు మాట్లాడుటయా? హెంతమాట?

      తెరాస ఎంపీలు అరపూట అయినా తెలంగాణా గురించే మాట్లాడుతారు. తమరి కావూరి, లగడపాటి, రాయపాటి వగైరాలు తమ సొంత కంపెనీల కాంట్రాక్టు వ్యవహారాలూ తప్పితే పార్లమెంటులో మరొక్కటి మాట్లాడుతారా? కాకపోతే తమరి లీడర్లు ఫాం హవుజుల్లో కాక ఫైవ్ స్టార్ హోటళ్ళలో మందు కొడతారేమో, అంతే తేడా.

      Delete
  3. "సురేఖ రాజీనామా చేసిన పరకాల సీటు మాత్రం అక్కడి ప్రజలకు పెద్ద చిక్కే తెచ్చి పెట్టింది"

    Surekha did not resign. She (along with 15 others) was disqualified by the speaker. Only 2 Rayalaseema seats (Allagadda- Shobha Reddy & Tirupati) are going in for bye-elections because of resignations.

    ReplyDelete
  4. బిజెపికి పరకాలలో డిపాజిట్ కూడా రాలేదు.

    ReplyDelete
  5. @1.ఇక్కడ YSR సచ్చిండన్న సానుభూతి లేదు. జగన్ జైల్ల బడ్డడన్న బాధ అసలుకే లేదు....
    If this is TRUE how could YSRCP give such a tough fight?
    So, ur speculation is wrong. It proves that our TG ppl are also sentimental fools like any other Telugu ppl and on this sentimental weakness only all (incl.TRS) are banking. In fact TRS has a hidden agenda of RISING it's seats and votes beforw TG being really liberated, so as not to beg Sonia(even if TRS has to merge with it)for CM post to KCR!
    @2.చంధ్రబాబు, కిరణ్ కుమార్ పిలిస్తె పలికే దిక్కు లేదు.
    This is also false, as TDP too got a good share of votes despite a sentimenatalodrama bet'n TRS & YSRCP. Remember no one can uproot TDP from TG because it has a strong cadre base at grass roots.
    కాని వొచ్చిన చిక్కంతా బిజెపి, టీఅర్ఎస్ మధ్యనే.

    ReplyDelete
    Replies
    1. Mr Reddy,
      This post was written before election day.

      Praveen has already given the link that explains the votes for Surekha as well as TDP. In fact all these parties have claimed that they are true T vadis.

      Yes T people have sentiment. If TRS doesn't some other party would definitely do. An average T thinker only wishes that the sentiment should not be exploited by a anti-T party/leader.

      Delete
  6. Read this: http://missiontelangana.com/why-did-konda-surekha-get-so-many-votes/

    ReplyDelete