Friday, July 17, 2015

ఇదీ బాబు నిర్వాకం!

సర్కిల్ లో ఉన్నది బోయపాటి శ్రీను 

మొన్న ఎమ్మెల్యేల కుట్రలో "మనవాళ్ళు బ్రీఫుడు మీ" అంటూ అడ్డంగా దొరికిన చంద్రబాబు మరోసారి పుష్కరాల సందర్భంగా ఫోటోతో సహా దొరికి పోయాడు.

చంద్రబాబు ప్రచార కండూతి అందరికీ తెలిసిందే! అయితే అది ఈసారి మరిన్ని వెర్రితలలు వేసి  27 మంది చావుకు కారణమైంది .

పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుపుతానని ముందుగానే ఊహించేసుకుని, అలా జరిపించి నట్టు ప్రపంచ మీడియాకు తన రాజసాన్ని తెలియజెప్పే ఒక ఘోప్ప వీడియో ఉండక పొతే బాగోదని మీడియా సలహా దారులవారు అమూల్యమైన సలహా ఇచ్చారుట! రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు, తొడగొట్టు సినిమాలతో బావమరిదికి హిట్ల మీద హిట్లు ఇస్తున్న బోయపాటి శ్రీను అన్న మనిషిని దర్శకుడిగా నియోగిమ్సుకుని దాదాపు నాలుగ్గంటల పాటు నిర్విరామంగా బాబుగారి పూజా కార్యక్రమ విశేషాలను చిత్రీకరించారట! ఆ చిత్రీకరణ కూడా వీఐపీ ఘాట్ లో అయితే రంజుగా ఉండదని, ప్రజలంతా చుట్టూ నిలబడి (బారికేడ్ల అవతలే అనుకొండి) చూస్తుంటే పెదరాయుడి లెవెల్లో పుష్కర ఘాట్ లో షూట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట!

ఇదంతా రూమరేమో అనుకోవడానికి కూడా వీల్లేకుండా ఫోటోతో సహా దొరికి పోయాడు పెద్దసారు!

2 comments:

  1. ఎన్నిసార్లు అడ్డంగా దొరికినా తప్పించుకునే సామర్ధ్యం ఉన్నవాడే చంద్రబాబు. ఆయన చిక్కడు, దొరకడు :)

    ReplyDelete
    Replies
    1. Afterall he escaped from Revant Reddy case without denying his own voice.

      Delete