Tuesday, January 29, 2013

ఉద్యమం దిశ ఎటువైపు ఉండాలి?


కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదని తేట తెల్లమైన ఈ సమయంలో 2014 లోపల తెలంగాణా వచ్చే అవకాశాలు సన్నగిల్లినట్టే. ఈలోపు ఏదన్నా జరిగి ప్రభుత్వాలు కూలిపోయి మధ్యంతర ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వస్తే తప్ప తిరిగి తెలంగాణా ఏర్పాటు వైపు  అడుగులు పడే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణా ఉద్యమం దిశ ఎటువైపు ఉండాలి?

ఇక ఎన్నికల్లోపు తెలంగాణా రాదనీ ఊరుకుందామా? సీమాంధ్ర మీడియా విజృంభిస్తుంది. ఉద్యమమే లేదు, అంతా చల్లబడి పోయింది అని ఊదర గొడుతుంది. చెవిటి వాడి ముందు శంఖమూదినట్టు ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ప్రభుత్వం ముందు ఎన్ని ఉద్యమాలు చేస్తే మాత్రం ఏం లాభం? అనే ప్రశ్న వస్తుంది.

ఉద్యమం పేరుతో బందులు, స్కూళ్ళు, కాలేజీల మూసివేత, రవాణా ఇబ్బందులు మొదలైన వాటితో ప్రజలు విసిగి పోయే అవకాశం వుంది. సకల జనుల సమ్మెతో సహా ఇప్పటివరకు జరిగిన అన్ని ఉద్యమాలలో తెలంగాణా ప్రజలే బాధలు పడుతున్నారు తప్ప సీమాంధ్ర దోపిడీ దారులపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. ఇక ప్రభుత్వమేమో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకొని తెలంగాణా ప్రజలు, విద్యార్థులు చేసే ఉద్యమాలను అత్యంత నీచమైన అప్రజాస్వామికమైన పద్ధతుల్లో అణచి వేస్తుంది.

ఇంతటి ఉద్యమం వేడిలోనూ పోలీసు రిక్రూట్ మెంటు, గవర్నమెంటు స్కూళ్ళ అప్ గ్రేడేషన్, హంద్రీ నీవా, పోలవరం మొదలైన రూపాల్లో తెలంగాణపై దోపిడీ యధేచ్చగా సాగుతూనే వుంది. దోపిడీ శక్తులు తెలంగాణా ప్రజలు చేసే ప్రజాస్వామిక ఉద్యమాలను చాలా తేలికగా తీసుకుంటున్నాయి. తమ పోలీసు బలగాలతో ఉద్యమాలను అణచి వేస్తూ, తాము ఎలాగైనా బరితెగించ గలమని, ఏమైనా చేయగలమన్న భరోసాను కలిగి ఉన్నాయి. దోపిదీలో భాగం దొరుకుతుంది కాబట్టి  కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి దోపిడీ శక్తులకే వత్తాసు పలుకుతుంది.

ఇటువంటి పరిస్థితులలో తెలంగాణా ఉద్యమం తన దిశను మార్చుకోన వలసిన అవసరం ఉంది. ప్రజాస్వామిక పద్ధతులను వీడకుండానే ఉద్యమ విధానాలలో కొద్ది పాటి మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. డిల్లీలో జరిగిన  అన్నా హజారే, రేప్ కేసు ఉద్యమాలను కూడా అధ్యయనం చేయాలి.

మీడియాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఉద్యమ వార్తలు ప్రచారం ప్రచారం చేయవలసిన అనివార్య పరిస్థితులను కల్పించాలి. ఉద్యమ కార్యాచరణను రూపొందించడంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
ఉద్యమం వల్ల తెలంగాణా, ఆంద్ర ప్రజలకు కాక, సీమాంధ్ర దోపిడీ శక్తులకు, సమైక్య వాదులకు, నాన్పుడు ధోరణితో కాలం వెళ్ళదీస్తున్న రాజకీయులకు ఎక్కువ నష్టం కలిగించేవిగా ఉండాలి. ఆ నష్టం భౌతిక మైనదే కావలసిన అవసరం లేదు.
సీమాంధ్ర దోపిడీ, అక్రమాల గురించి ప్రతి రొజూ ప్రచారం జరుగుతున్నా, వాటిని ఎదుర్కునే ప్రయత్నాలు ఎక్కువగా జరగడం లేదు. ఉదాహరణకు సాగర్ నీళ్ళు, పోతిరెడ్డి పాడు జలాల తరలింపు. రాజోలి బండ, రిక్రూట్ మెంట్లు, నిధుల మళ్లింపు మొదలైనవి. తెలంగాణా ఉద్యమంలో భాగంగా వీటిపై కూడా ఉద్యమించాలి. తమ దోపిడీకి అడ్డంకులు వస్తున్నాయని భావించినప్పుడు దోపిడీ దారుడు కూడా భద్రమైన ప్రదేశాలు (సీమాంధ్ర) వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. 

ఉద్యమాల సంఖ్య తగ్గించి, ఉద్యమ కార్యాచరణను ప్రకటించే ముందే, దాని స్వరూప స్వభావాలను, ఫలితాలను, శత్రువుకు కలిగించే నష్టాలను గురించి సమగ్రమైన విశ్లేషణ చేసుకోవాలి.

తెలంగాణా కనుచూపు మేరలో కనిపించని ప్రస్తుత పరిస్థితులలో ఉద్యమ కార్యాచరణపై పునఃపరిశీలన జరుపుకోవడం అత్యవసరం.
   

5 comments:

  1. ప్రియమైన తెలంగాణా వాదులకు,
    మీ ఉద్యమం లొ న్యాయం ఉందని ఒప్పుకుంటూ మీరు వీలైనంత త్వరగా
    తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోవాలని నిజంగా కొరుకునే క్రిష్ణా జిల్లా వాడిని.
    1).ఇంకో రెండు రోజుల్లో అఖరు రోజు అని చెప్పి, అప్పుడు, "సీట్ల గురించి రాశ్ట్రాన్ని చీలుస్తారా?" అనే ఒక తొక్కలో స్లొగన్ ని అటువేపు వాళ్ళకి ఇవ్వటం కాకతాళీయం గానో నక్కతాళీయం గానో జరిగిందని నేననుకొవడం లేదు. అందులో ఉన్న అసలు సూచన ఎమిటంటే - వాళ్ళు తెలంగాణా ఇవ్వడానికి సిద్ధం గా లేరు.
    2). 1947 నుంచీ కాంగ్రెసు చరిత్ర చూస్తే కొత్త కుంపట్లని రగిలించటం, అరిపొయే కుంపట్లని యెగదొయ్యటం తప్ప కుంపట్లను ఆర్పటం అనేది వాళ్ళకి తెలీదు. కాష్మీర్ కుంపటి నుంచీ ఖలిస్థాన్ కుంపటి మీదుగా ఇప్పటి తెలంగాణా కుంపటి వరకూ అన్నీ వాళ్ళ పుణ్యమే.
    3). మొదటి నుంచీ మీరు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అనే ప్రశ్నకి వెనుకబాటు తనాన్ని చెప్తున్నారు.అది తప్పు కదా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే నినాదం తో అంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రం ఎర్పడే అప్పుడే మీరు ఈ మాట చెప్పారు. ఆరోజు ఎ కారణం తో మీరు కలవం అన్నారో నాకు తెలీదు కాని మీ కొరిక లో న్యాయం ఉండబట్టే మీ మాటకి ఆ రోజున విలువిచ్చారు. ఆప్పుడు మిమ్మల్ని కలిపి ఉంచటానికి "ఫెద్దమనుషుల ఓప్పందం" ఆని ఒకటి కుదిర్చి కధ నడిపించారు. ఆ బల్లకి అటూ ఇటూ కూర్చున్నది కాంగ్రెసు వాళ్ళే. ఈ మధ్యన N.T.R వొచ్చేవరకూ ఈ రాష్త్రాన్ని గాప్ లేకుందా పరిపాలించినా ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కి మీకు అన్యాయం చెసిందీ వాళ్ళే.ఆవునా?వెనుకబాటు తనం కన్నా "వాగ్దానభంగం" అనే గట్టి కారణాన్నిమీరు మీరెందుకు వాడ లేదు?
    4). ఇప్పుడు జరుగుతున్న ఊద్యమమే మొదటిది కాదు. ఇంతకు ముందు చాలామంది చాలా భీకరం గా మొదలు పెట్టి సొంత బాగు కోసం మధ్యలో వొదిలెసి పొయారు. ఇప్పుడలా కాకుందా ఇదే అఖరు సారి - ఇప్పుడు సాధించుకోలేకపొతే ఇకెప్పటికీ సాధించుకోలేం - ఆన్నంత తీవ్రం గా అందరినీ కదిలిస్తున్నది.ఆది నిజం కూదా, ఇప్పుదు మీరు చెడ్డినారె లాగా చేస్తే మళ్ళీ ముందు ముందు ఎవడైనా తెలంగాణా కోసం ఉద్యమిస్తాను అంటే మొహం మీద నవ్వుతారు. అయితే ఇంతగా అందరి లోనూ అవేశాన్ని రగిలించినా ప్రత్యేక రాష్ట్రం వొస్తుందా రాదా అనే ప్రశ్నకి జవాబు మాత్రం మొధటి రోజు లాగే - "ఏమో" అనే తప్ప "వొస్తుంది" అని గ్యారెంటీ లెదు. ఎందువల్ల? ఊద్యమం లొ న్యాయం ఉన్నా ఇన్ని సంవత్సరాలు పరిష్కారం లేకుండా సాగడం మీరు మీ నొటి కొచ్చిన మాటల్ని మట్లాడి పాండిత్య ప్రదర్శన చెయ్యడమే తప్ప ధాన్ని సరిగ్గా ప్రొజెక్ట్ చెయ్యడం లొ ఫెయిల్ అయినందువల్ల కాదా?

    ReplyDelete
  2. 5). ఒక లక్ష్యం కోసం కొంతమంది ఒక చోట చేరి ఉద్యమం చేస్తున్నప్పుదు దాన్ని అడ్డుకోవటానికి తప్పని సరిగా మరి కొంతమంది ఉంటారు. తెలివైన ఉద్యమకారులు చెయ్యాల్సిన పని యెమిటంటే మొదట ఈ రెండు వర్గాలకీ చెందని తటష్తుల్ని తమ కనుకూలంగా మార్చుకోవటం. దాని వల్ల ఇవ్వాళ తటష్తులుగా ఉన్న వాళ్ళు రేపటికి అవతలి వాళ్ళలొ చేరి వాళ్ళ బలం పెరగకుండా ఉంటుంది. తర్వాతగా ఇవ్వాళ వ్యతిరేకిష్తున్న వాళ్ళని రేపటికి సమర్ధకులుగా మార్చుకొవటం చెయ్యాలి. గతం లొ తమ కొర్కెల్ని చక్కగా నెరవెర్చుకున్న ఏ ఊద్యమమైనా ఇలాగే నడిచింది. సాక్ష్యాలు నేనివ్వదం లేదు. మీరు చూడొచ్చు.మీలో ఈ రకమైన తెలివి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. ఫ్రష్తుతం మీరు చేస్తున్న పనులన్ని ఉద్యమం ఆగకుండా కొనసాగడానికి మాత్రమె పనికి వష్తాయి.
    ఊద్యమానికి ప్రతికూలతలు పెరగడం అనేదాన్ని ఉద్యమం మొదలనప్పటి నుంచీ అన్ని సందర్భాల్నీ తరిచి చూస్తే మీరు చెత్త మాటలు మాట్ద్లాడినప్పుడు తటష్తులు మీకు వ్యతిరెకులుగా మారడం వల్లనే అనెది మీకే తెలుష్తుంది.
    6). మీకు తగిలిన టెంకిజెల్లలన్నీ కాంగ్రెసు వైపు నుంచే ననేది మీలొ యెవరికైనా సూచన గా నైనా అర్ధమవుతున్నదా?కాంగ్రెసు మొదటి నుంచీ తాము తెలంగాణా ఇవ్వదల్చుకొలెదనేది తమ ప్రకటనల ద్వారా చాలా స్పష్టంగానే చెబుతూ వచ్చింది. మీరు 'కాంగ్రెసు మాకు వాగ్దానం చేసి మా సప్పోర్టు తొనే కుర్చీ యెక్కిందీ అంటున్న మొదటి రోజుల్లొనే ఏ మాత్రమూ మొగమాటం లేకుందా మా మేనిఫేస్టో లో మేము S.R.C గురించే చెప్పాము తప్ప రాష్ట్రం విడగొట్టి ఇస్తామని చెప్పలేదు అంటూ వొచ్చింది. ఆవునా? అయినా మీరు అన్ని సార్లు కాంగ్రెసు కు బలం పెంచి కాంగ్రెసు ద్వారానే తెలంగాణా తెచ్చుకోవాలనుకున్నారు. మొదటి సారి అంటే ఎంతటి తెలివైన వాడైనా మోసపోవటం సహజమే. కాని అన్నిసార్లూ యేకపక్షం గా అటునుచి యే మాత్రమూ సాయం లేకుందా మీరు మాత్రమే కాంగ్రెసు కి అంత సాయం ఎందుకు చేసారు?మొదటి సారి కాంగ్రెసు వాగ్దానాన్ని నమ్మడం లో అర్ధముంది. కానీ అధికారం లోకి రాగానే అడ్డం తిరిగినప్పుడైనా కళ్ళు తిరిచారా?కేంద్ర మంత్రి వర్గం లొ సభ్యులై ఉంది కూదా కాంగ్రెసు ని పార్లమెంటులొ బిల్లు పెట్టేటందుకు ఒప్పించలేక పొయ్యారు.ఆటువైపు నుంచి మీకు ఏ మాత్రం సాయం లేకపొయినా అన్ని సార్లు యేకపక్షం గా సాయం చెయ్యడానికి కారణం యేంటి?ఇప్పుదు చూడండి - "రాష్ట్రం లోని ఒక ప్రాంతానికి చెందిన ఉప ప్రాంతీయ పార్టీ" అని యెలా వెక్కిరిష్తున్నారో.
    7). ఇప్పటి వరకూ ఉద్యమాన్ని కొనసాగించడానికి యెన్నో సంచలనాత్మకమైన కార్యక్రమాల్ని చేపట్టారు.ఉద్యమం ఆగిపొకుండా నిలబెట్టి ఉంచడానికి కావలసిన 'క్రియేటివిటీ' మీ దగ్గిర పుష్కలం గా ఉంది. కాని ఆపడం యెలా అనేది మీకు తెలుసా? ఆంటే నేను అడుగుతున్నది మీరు తెలంగాణా యెలా సాధించ దల్చుకున్నారు అని.
    8) నాకు తెలిసినంత వరకు రెండే రెండు దారులు.కాంగ్రెసు వాళ్ళు మొదటి నుంచీ కూస్తున్న S.R.C అనే మాట వల్లనూ, ఇంకా రాష్ట్రాల్ని విడగొట్టటానికి ప్రస్తుతం చట్టం లో ఉన్న నిబంధనల గురించి కొద్దిగా తెలిసి ఉండడం వల్ల - 1). రాష్ట్ర అస్సెంబ్లీ లొ బిల్లు పాస్ చెస్తే మూడింట రెండు వొంతుల మెజారిటీ యెస్ గా రావటం. అసలు సిసలైన రాజమార్గం. 2). పార్లమెంటు లో సెంటర్లో అధికారం లో ఉన్న పార్తీ సభలో తమ కున్న మెజారిటీ ని చూసుకుని డిక్లరేషన్ ద్వారా ఇవ్వటం(భాజపా ఉత్తరాంచల్ తొ కలిపి చాలా వాటిని విడగొట్టింది కదా!). మొదటినుంచీ కాంగ్రెసు నుంచి ఇలాంటి సాయం తీసుకోకుండా మీరు అన్ని సార్లు సాయం చేసి ఆ అవకాశాన్ని చేతులారా పొగొట్టుకున్నారు.కాంగ్రెసు తొ ఫ్రెండ్లీ గా ఉన్నప్పుడే దీన్ని సాధించుకోలెక పొయ్యారు, ఇప్పుదు అసలు సాధ్య పడదు. ఆవునా?

    ReplyDelete
  3. 9). ఇక రాష్ట్ర అస్సెంబ్లీ లో బిల్లు పెడితే మూడింట రెండువంతుల మెజారిటీ తెచ్చుకోగలరా? అదీ సాధ్య పడదు.ఎందుకొ మీకూ తెలుసు.నేను ప్రత్యేకం గా చెప్పనక్కర లేదు. ఫ్రధాన ప్రతిపక్ష పార్తీ - అంటే సెకండ్ లార్జెస్ట్ పార్తీ ఐన T.D.P మీకు ఆప్యాయంగా సాయం చేసే పరిస్తితి లెదు. నాకసలు కాంగ్రెసు వాళ్ళు ఇవదానికి ఇష్టం లేక T.D.P లెటరు ఇవ్వలేదని మొదట్లోనూ, ఇచ్చాక అది సరిగ్గా లేదనీ వంకలు పెడుతునప్పుడు చాలా చిరాకుగా అనిపించింది వాళ్ళ బిహేవియర్, మీకనిపించలెదు ఎందుకో మరి! పార్లమెంటు లో బిల్లు పెట్టటానికి T.D.P లెటరు తో పని ఏంటి? లేదంటే రాష్ట్రం లొ బిల్లు పెట్టటానికి బిల్లు వీగిపోకుందా ఉండేటందుకు అడుగుతున్నారా? దూరం నించి చూస్తున్న నాకే సరిగ్గా అర్ధం కాక తిక్కగా అనిపించింది కాంగ్రెసు వాళ్ళ బిహేవియర్ - మీకు అనిపించలేదు,ఎందుకని?
    10). కాంగ్రెసు వాళ్ళు మొదటి నుంచీ S.R.C అని వాగుతుంటే ఎటు పోయి ఎటు వొస్తుందో అనే అలొచన తో నైనా మీరు T.D.P ని విరోధిగా చెసుకుని ఉండాల్సింది కాదు.....?! ఛట్ట పరంగా తేలికగా సాధించుకోగలిగిన రెండు దారుల్లో ఒక దాన్ని కాంగ్రెసు వాళ్ళు తొక్కి పెట్టేసారు. రెందో దారిని మీరు మూసేసుకున్నారు.మూడో దారి యేదైనా ఉందా? ఆప్పుడప్పుడు 'రక్తపాతం' అని కూడా మాట్లాడుతున్నారు. మీ లాగా న్యాయం కోసమని బయల్దేరి మధ్యలో దారి తప్పి రక్తపాతానికి మళ్ళిన ఉద్యమాలన్నీ నిష్ఫలం గా అణగారి పోయినై.ఇక్కడే కాదు లాటిన్ అమెరికా దేశాల్లోనూ మధ్య అసియా లోనూ జరిగిన అంతర్యుధ్ధాలన్నింటినీ తరచి చూడండి. పొరపాటున కూదా ఆ దారిలో వెళ్ళకండి.
    మొదటి నుంచీ మీ ఉద్యమాన్న్ని మంచిగా చూస్తూ మీరు వీలైనంత త్వరగా మీ కోరికని నెరవెర్చుకుంటే బాగుంటుందని ఆశిస్తున్న వాణ్ణి. ఈ విషయాలు ఉద్యమం లో ఉన్న మీరు కూదా అలోచిస్తున్నారా లేదా అని నాకు తోచిన కొన్ని సంగతుల్ని మీ ముందు ఉంచాను.మీరు కూదా వీటిని గురించి అలొచిస్తూ రాష్ట్రాన్ని 2014 యెలక్షన్ల లొపు సాధించుకొ గలమని నమ్ముతుంటే మీరు సరైన దారి లో ఉన్నట్టే. ఆల్ ది బెస్ట్. 2014 యెలక్షన్ల తర్వాత మీ ముఖం యెవడూ చూడడు. నాయుడు బాబు అంతగా విమర్షల తో రెచ్చిపొతున్నా కాంగ్రెసు వాళ్ళు కనీసపు రెస్పొన్సు కూడా ఇవ్వకుందా తనకి పాపులరిటీ పెరుగుతున్నా నిమ్మకి నీరెత్తినట్టు ఉండడానికి కారణం ఎంటో తెలుసా? రానీ. వొస్తే తెలంగాణా ఇవ్వడం అనే ప్రోబ్లెం వాడి నెత్తి మీదే పదుతుంది లే అనే ధీమా! ఇప్పుదు T.D.P తో మీకున్న సంబంధాల ని బట్టి అప్పటి మీ పరిస్తితి ని అంచనా వెసుకోండి. మీరు తెలివి తేటల్ని సరైన పధ్ధతి లొ ఉపయోగించి 2014 కి ముందుగానే రష్ట్రాన్ని సాధించుకోండి. ఎనీ వే ఆల్ ది బెస్ట్ అగైన్.

    ReplyDelete
    Replies
    1. మీ సూచనలకు కృతజ్ఞతలు.
      ఈ అవగాహన తెలంగాణావాదులకు ఉంది. శతృవు బహు రూపాలలో, వాడి దాడి బహు ముఖాలుగా ఉండటం మా ఉద్యమానికి ఒక ఛాలెంజ్. మీరు చెప్పిన ఉదాహరణలు అన్నీ సమైక్య రాష్త్రంలో వాడికున్న ప్రయోజనాలలోని లోతు, విస్తృతిని మాకు ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తూ, మమ్మల్ని మరింత జాగరూకుల్ని చేస్తున్నాయి. ఉద్యమం లో తప్పులు జరగలేదనిగానీ, సందిగ్ధత లేదనిగానీ నేను అనడం లేదు గానీ, కేవలం అవే మా లక్ష్యం చేరుకోకుండా ఆపాయని కూడా అనుకోవడం లేదు.
      తప్పులనుంచి గుణపాఠాలు తీసుకుంటూ, ఆటుపోట్లను తట్టుకుంటూ గమ్యం దిశగా ముందుకు పోయే పరిణితి, నైతిక బలం ఉద్యమానికి ఉన్నాయనే మేము నమ్ముతున్నము. న్యాయం ఆలస్యం గానైనా అంతిమంగా లభిస్తుందనే అనుకుంటున్నాము.

      Delete
  4. మీ సూచనలకు కృతజ్ఞతలు.
    ఈ అవగాహన తెలంగాణావాదులకు ఉంది. శతృవు బహు రూపాలలో, వాడి దాడి బహు ముఖాలుగా ఉండటం మా ఉద్యమానికి ఒక ఛాలెంజ్. మీరు చెప్పిన ఉదాహరణలు అన్నీ సమైక్య రాష్త్రంలో వాడికున్న ప్రయోజనాలలోని లోతు, విస్తృతిని మాకు ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తూ, మమ్మల్ని మరింత జాగరూకుల్ని చేస్తున్నాయి. ఉద్యమం లో తప్పులు జరగలేదనిగానీ, సందిగ్ధత లేదనిగానీ నేను అనడం లేదు గానీ, కేవలం అవే మా లక్ష్యం చేరుకోకుండా ఆపాయని కూడా అనుకోవడం లేదు.
    తప్పులనుంచి గుణపాఠాలు తీసుకుంటూ గమ్యం దిశగా ముందుకు పోయే పరిణితి, నైతిక బలం ఉద్యమానికి ఉన్నాయనే మేము నమ్ముతున్నము. న్యాయం ఆలస్యం గానైనా అంతిమంగా లభిస్తుందనే అనుకుంటున్నాము.

    ReplyDelete