అమ్మా, అన్న కొడుతున్నడమ్మా... నేను వానితోటి ఆడుకోను... పక్క రూంలో ఆడుకుంట.
ఒరే పెద్దోడా. వాణ్ని మళ్ళా కొట్టినవా? ఒక్క నిముషమన్నా నిమ్మలంగ ఉండవు కదా!
లేదమ్మా, నేను కొట్టలేదు. తమ్ముడే నన్ను కొట్టిండు, గిచ్చిండు.
నువ్వు కొట్టక పోతే వాడెందు కేడుస్తడు?
వాడివన్నీ దొంగేడుపులు. నా వాటరు బాటిలు అడుక్కొని నీళ్ళు తాగుతడు. నేను తినే చాక్లేట్టులో వాటా అడుగుతాడు. మళ్ళీ నన్నే కొడుతుంటడు. వాడు చెప్పేవన్నీ నూటొక్క అబద్ధాలు.
అవునా? అయితే వాణ్ని పక్క రూములో ఆడుకోనియ్యి. నువ్వు ఈ రూములో ఆడుకో.
అస్సలు కుదరదు. వాడూ, నేనూ ఒక్క దగ్గరే ఆడు కోవాలి!
ఎందుకురా? నువ్వు చెప్పే మాటల ప్రకారం వాడు లేక పోతే నీకే మంచిదిగా?
ఇప్పుడు వాడు పక్క రూములో ఆడుకుంటే... రేపు పక్కింట్లో పిల్లలు వేరు వేరు రూముల్లో ఆడుకుంటారు. మరుసటిరోజు పొరుగూరు పిల్లలు కూడా వేరు వేరు రూముల్లో ఆడుకుంటారు. ఎల్లుండి దేశం మొత్తం అలాగే ఆడుకుంటారు. అప్పుడు దేశం లోని అన్నల సంగతేం కావాలి?
ఏమవుతుంది? ఎవరి మానాన వాళ్ళుంటారు...
కాదు. పక్క రూములో ఆడుకునే తమ్ముడు నాకు వేలకు వాటర్ బాటిలు నింపుకొచ్చి ఇస్తాడా? వాడి వంతు చాక్లెట్లు కూడా నేను తినగలనా? వాడు లేక పోతే నాకు కాళ్ళు ఎవరు వత్తుతారు?
అమ్మ దొంగా! ఇదా నీ సంగతి!!
No comments:
Post a Comment