- డ్రైవర్, కండక్టర్‌కు గాయాలు ..పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
- మద్యం మత్తులో నానా బీభత్సం.. తెలంగాణవాళ్లనే దాడి: టీఎంయూ
- మద్యం మత్తులో నానా బీభత్సం.. తెలంగాణవాళ్లనే దాడి: టీఎంయూ
తొర్రూరు, డిసెంబర్ 30 (టీ మీడియా): ఆంధ్రా ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ తెలంగాణ బస్సుపై కొందరు దుండగులు దాడి చేశారు. మద్యం మత్తులో నానా బీభత్సం సృష్టించారు. వస్తూనే.. డ్రైవర్, కండక్టర్లపై దాడికి దిగారు. అంతా ‘‘వరంగల్ వాళ్లే.. చితకబాదండి’’ అంటూ అడ్డువచ్చిన ప్రయాణికులపై దాడికి తెగబడ్డారు. వరంగల్ జిల్లా తొర్రూరు డిపోకు చెందిన ఏపీ 36 జెడ్ 146 నెంబర్ బస్సుపై విజయవాడ సమీపంలో కొంతమంది వ్యక్తులు కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి దిగారు. అడ్డువచ్చిన డ్రైవర్, కండక్టర్‌ను తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన ఆదివారం రాత్రి విజయవాడ సమీపంలోని భవానీనగర్‌లో చోటుచేసుకుంది. కండక్టర్ కృష్ణయ్య ‘టీ మీడియా’కు ఫోన్‌లో వివరాలు తెలిపారు. తొర్రూరు డిపో నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరుపతికి బస్సు బయల్దేరింది. విజయవాడ మరో మూడు కిలోమీటర్లు ఉందనగా.. భవానీపురం వద్ద ఏపీ 16 బీసీ 8177 వాహనంలో వచ్చిన ఐదుగురు, ద్విచక్షికవాహనంపై వచ్చిన మరో ఇద్దరు కలిసి తమ వెంట తెచ్చుకున్న కర్రలు, బస్సులోని రాడ్లను తీసుకొని డ్రైవర్ జనార్దన్, కండక్టర్ కృష్ణయ్యలపై దాడి చేశారు.
అడ్డువచ్చిన ప్రయాణికులపై దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ.. దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులు విపరీతంగా మద్యం తాగి ఉండటం, క్రూరంగా ప్రవర్తిస్తుండడంతో ఎవరూ అడ్డుకోలేకపోయారు. దీంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. కొద్దిదూరం వెళ్లాక స్థానికులకు విషయం చెప్పి.. పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. విజయవాడ వన్‌టౌన్ సీఐ ఘటనాస్థలికి చేరుకుని బస్సును స్టేషన్‌కు తరలించి, గాయపడిన కండక్టర్ కృష్ణయ్య, డ్రైవర్ జనార్దన్‌ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఘటనకు బాధ్యులైన నలుగురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్, కండక్టర్ టీఎంయూకు చెందినవారు కావడం, విజయవాడలో ఘటన జరగడంతో తెలంగాణ వ్యక్తులపై కావాలనే దాడులకు పాల్పడ్డారని తెలుస్తోందని, దీనిపై విచారణ జరపాలని టీఎంయూ డివిజన్ కార్యదర్శి మల్లికార్జున్, గౌరవాధ్యక్షుడు సోమయ్య, డిపో కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు.
Curtesy: Namaste Telangana
mental naakodakallara meedku pitchi baaga mudiri poindi
ReplyDeleteEvariki?
Deleteinkekevariki srini garikemo... wait for his reply to confirm
Delete