"సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం తీవ్రతరం చేస్తాం."
తరచుగా సమైక్యవాదులు వినిపించే మాట ఇది. గత రెండు మూడు రోజులుగా మరింత ఎక్కువగా వినబడుతుంది. కేవలం సీమాంధ్రలో ఉద్యమం చేస్తే అది సమైక్యవాదం ఎలా అవుతుంది? గీతకు రెండువైపులా ఉంటేనే అది సమైక్యవాదం అవుతుంది. కేవలం ఒక ప్రాంతం వారు రెండో ప్రాంత భవిష్యత్తు పై ప్రభావం చూపాలనుకుంటే అది దౌర్జన్యం అవుతుంది తప్ప సమైక్యవాదం కాదు.
బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాకు స్వాతంత్ర్యం ఇస్తుంటే బ్రిటిషర్లు ఎలా వుంటుందో అలా వుంటుంది. కనీసం బ్రిటిష్ వారు మనకు పాలకులు, మనం బానిసలం. అయినా వారు అలాంటి ఉద్యమాలు చేయలేదు. కాని కొన్ని సమైక్యవాద ముఠాలు సామ్రాజ్యవాదుల కన్నా హీనం. వీరు కనీసం తాము వలసగా మార్చుకున్న ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారడం కూడా సహించలేరు.
వీరికి తెలంగాణా ప్రాంతం కూడా స్వతంత్ర భారత దేశంలో ఒక భాగమని, ఈ దేశంలో వీరికి ఎన్ని హక్కులు ఉన్నాయో వారికి కూడా అన్ని హక్కులే ఉన్నాయని ఏమాత్రం గుర్తించరు. పైగా తెలంగాణా ఒక రాష్ట్రంగా ఉండాలో, ఉండకూడదో తామే నిర్ణయించ గలమన్న అహంభావాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలమీద ఏమాత్రం గౌరవం ఉన్నవారైనా ఇలాంటి ఫాసిస్టు ఆలోచనలు చేయరు.
సీమలో, ఆంధ్రలో ఉన్న అనేకులైన సహృదయులు తెలంగాణా ఉద్యమానికి అడ్డు చెప్పడం లేదు. వారు తెలంగాణా ప్రజలయోక్క న్యాయబద్ధమైన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఆమోదిస్తున్నారు. కాని కొంతమంది వేళ్ళమీద లెక్క పెట్టగలిగిన పెట్టుబడి దారులు మాత్రం సమైక్య మంత్రం జపిస్తున్నారు. వీరిని పెట్టుబడి దారులు అనడం కంటే, 'న్యాయం నాలుగు పాదాల నడిస్తే, జగన్ తో చంచల్ గూడా జైలులో షటిల్ ఆడవలసిన వారు' అంటే బాగుంటుంది. వీరికి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షల కంటే తాము చేస్తున్న అక్రమ వ్యాపారాలు, భూకబ్జాల పైనే ఎక్కువ మక్కువ. రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి వారు సమైక్యవాదం పేరు చెపుతూ అక్కడి ప్రజలను రెచ్చగొట్టడానికి డబ్బులు వెచ్చిస్తూ శాయ శక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.
వివేచనా పరులైన ఆంద్ర ప్రజలు మాత్రం సమైక్యవాదుల మాటల గారడీ ప్రభావానికి లోను కావడం లేదు. కాని వీరి చెప్పు చేతల్లో ఉండే మీడియా మాత్రం వీరు చేసే చిన్నా చితకా ఉడత చప్పుళ్ళను సింహ గర్జనలుగా చూపడానికి తమ శాయ శక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు ఈరోజు విజయవాడలో జరిగిన NGO సమైక్యవాద మీటింగును ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ చానెళ్ళు ఒక్క సారి కూడా కెమెరాను ప్రేక్షకుల వైపు తిప్పిన పాపాన పోలేదు. అలా తిప్పితే అసలు స్టేజి మీది హుంకారాలకు, స్టేజి కింది సభికుల సంఖ్యకు పొంతన కుదరదని వారికి తెలుసు.
కేవలం సీమాంధ్రలో ఉద్యమం చేస్తే అది సమైక్యవాదం ఎలా అవుతుంది? గీతకు రెండువైపులా ఉంటేనే అది సమైక్యవాదం అవుతుంది.
ReplyDeletecorrect ga chepparu...mari seperate telangana ani meeru vudyaman chesta seperate andhra ela istaru? akkadi vaari prameyam lekunda..vaaru daani kosam udyamam cheyakundane...
Meeru adugutunnadi seperate telangana kaadu..seperate aandhra..adee vaari prameyam lekunda..okasari alochinchu...meeku ippudu unna ade capital to state kaavalante..daani artham seperate Andhra ani..seperate telangana kaadu...capital maredi vaallaku..meeku kaadu...
capital kosame state aaa..??? :)...intha capital pichollu ANDHROLLU innellayindi capital nirminchukune alochana emaina undaa...malli history repeat avvala ....
DeleteDERA NAGAR ...DAARI VETHUKKONDI..TWARAGAAA
@shankar,
DeleteAs usual the same level of irrationality.
During 1953, when you got separated from Madras, did tamils ask for a separate state? Then why did the get a separate state without asking?
Our merger during 1956 was conditional. Since conditions are violated, we are demanding the de-merger. As per the provisions of constitution, we have every right to ask for a separate state. But you people have no right to oppose us.
This comment has been removed by the author.
ReplyDelete