తమ దోపిడీ భాగోతాలు తెలంగాణా ప్రజలు తెలుసుకొని ఒక్కొక్క ఎన్నికల్లో తమని మట్టి కరిపిస్తూ వుంటే, సమెక్కుడు వాదులకు దిక్కు తోచడం లేదు. పక్కవాడి ముద్ద లాగితే గాని ముద్దదిగని దద్దమ్మలకు ఇది నిజంగా ఘోరమైన విషయమే.
అందుకే పుస్తకాల బూజు దులిపి చరిత్ర తిరగేస్తున్నారు. ఇక్ష్వాకుల కాలం నాటి చరిత్రలు ఇప్పుడు వల్లె వేస్తున్నారు.
ఇంతకీ వీరు చెప్పే విషయం... మనమంతా తెలుగు వాళ్ళమే. ఆ.. కాదు కాదు, మనమంతా తెలంగాణా వాళ్ళమే. ఎప్పుడో తెలివాహ నది తీరాన జనాలు నివసించారు. వారే తెలంగాణా వారు. వారు తర్వాత్తర్వాత రాష్ట్రమంతా విస్తరించారు. తెలివాహ నది పేరు తెలంగాణాగా మారింది. కాబట్టి మనమంతా తెలంగాణా వారమే. మొదట మీ తెలంగాణాలో వున్నాం కాబట్టి మేం తెలంగాణా వారిమే. కాబట్టి మనమంతా కలిసే ఉందాం. ఇదీ వీరి వరస.
ప్రపంచ చరిత్రలో భాగంగా మారి పలు ఇతర దేశాల్లో కూడా అధ్యయనం చేయబడ్డ తెలంగాణా సాయుధ పోరాటం తో సహా తెలంగాణాకి సంబంధించిన ఏ చరిత్రను కూడా పాఠ్య పుస్తకాల్లో లేకుండా చేసిన శక్తులే నేడు సిగ్గు లేకుండా మీరు, మేం ఒకటే నంటూ చరిత్ర పాఠాలు వల్లె వేస్తున్నాయి!
తాము ఎదురు లేకుండా రాజ్యాధికారం చేసిన నాడు 'తెలంగాణా' అన్న పదమే బూతు పదంగా మార్చి, అసెంబ్లీతో సహా ఎక్కడా వినపడకుండా చేసిన ఘనులకు, ఈరోజు తాము కూడా తెలంగాణా వారిమేనన్న జ్ఞానోదయం కలుగుతున్నదట! విడ్డూరంగా లేదూ?
ఓ సమైక్యవాదీ! నీ మాటలు వింటుంటే నీకు తెలంగాణా ప్రజల ఆత్మ గురించి ఏమాత్రం తెలిసినట్టు లేదని అర్థమౌతుంది.
నువ్వు తెలంగాణా ప్రజల మనస్సు గెలుచుకోవాలంటే తెలంగాణా వాన్నని చెప్పుకోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆర్తిగా చేయి చాచి మైత్రి కోరేవారిని ఏ ప్రాంతం వారినైనా ఆదరించే నేల ఇది. అది ఆంధ్రా వారే కావచ్చు, ఇతర ప్రాంతాల వారే కావచ్చు. ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే నని నువ్వు ఆడిన దొంగ నాటకమే నువ్వు ఈ రోజు చీకొట్టబడడానికి ముఖ్య కారణం. నువ్వు ఎన్నటికీ మాలో ఒకడివి కాలేవు.
నీలాంటి సమెక్కుడు బుద్ధులు లేని నీ వాళ్ళు ఎప్పుడో మాతో మమేకమై మా ప్రాంతంలో నివసిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని మనసారా ఆకాంక్షిస్తున్నారు. నువ్వు మాత్రం మమ్మల్ని ఇంకా మా జాతిని నీ బానిసలుగా కొనసాగించాలని విశ్వప్రయత్నాలు చేస్తూ నీ దోపిడీ బుద్ధులు బయటపెట్టు కుంటున్నావు.
చివరగా నీకు చెప్పదలచు కొన్నది ఇదీ. యాభయ్యేళ్లుగా నువ్వు మోసాలతో తూట్లు పొడిచిన బంధం ఇప్పుడు నీ పై పై మోసపు మాటలతో గట్టి పడుతుందని భావించడం కేవలం నీ భ్రమ. ఇకపై నీదారి నీది, నాదారి నాది.
శాతవాహనుల కాలంలో తెలుగువాళ్ళు తెలుగులో కాకుండా ప్రాకృత భాషలో మాట్లాడారనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు లేని రంధ్రాలు వెతకడం ఎందుకు? రామాయణం వ్రాసిన కాలంలో ఎకె 47లు ఉండేవి అని అంటే ఎవరూ నమ్మరు కానీ ఆ కాలంలో తెలుగు భాష ఉండేది అని చెపితే సమైక్యవాదులు నమ్ముతారు.
ReplyDeletenijam anna. vaadiki medhadu undhaa. telivi thakkuva daddhamma... arikaaliki bodigundu ki mudipette daridhrudu. manamu mana nela meedhanundi eppudina marwadilanu vellamannama, uttharabharateeyulani velllamannama.. vallu vayaparalau chesthunte vallatho manchigaane untunnamu. mari ee daridhrapu vedhavalanu endhuku pommantunnamu. vallani pommnna endhuku ikkade velaaduthunnaru.
ReplyDeleteమరో ప్రహసనం నలమోతు చక్రవర్తి తాలూకా తొట్టి గాంగు "రాసిన" పుస్తకం. పాత పేపర్లు చదివి తమ వాదనకు అనుకూలమయిన వార్తలను మాత్రమె ఏరి పుస్తకం 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సారయినా ఈ "పుస్తక వ్యాపారం' అచ్చి వస్తుందో రాదో చూడాల్సిందే!
ReplyDeleteబాగుంది
ReplyDeleteజై గారు, స్వార్థమనేది వ్యక్తి కేంద్రకంగా ఉంటుంది కానీ భాషా కేంద్రకంగానో, ప్రాంత కేంద్రకంగానో ఎన్నడూ ఉండదు. కాస్త భౌతిక జ్ఞానంతో ఆలోచిస్తే విశాలాంధ్ర మహాసభవాళ్ళు ఏడ్చేది హైదరాబాద్ కోసమే కానీ భాష కోసమో, ప్రాంతం కోసమో కాదని అర్థమైపోతుంది.
ReplyDelete