వాడు
భూసంస్కరణలను అడ్డుకున్నడు
పేదోళ్ళ భూముమలను ఆక్రమించిండు
ప్రాజెక్టుల నీళ్ళను కొల్లగొట్టి
పెత్తందారు వేషం కట్టిండు
వాడు
కాంట్రాక్టరైండు
ఎమ్మేల్యే అయిండు
ఎంపీ అయిండు
వానికి
నీ, నా తేడా లేదు
వానికి
నీ సొంపేటా, వాన్‌పిక్
నా బయ్యారం, లాంకో హిల్స్
రెండూ ఒకటే
కబళించే పులికి కబళం మాదిరి
కానీ...
మనిద్దరికీ
తేడా ఒకటే
నువ్వు వాని
కొమ్ము కాస్తున్నవు
నేను వాని
దుమ్ము లేపుతున్నను
నేను వానిపై
చేస్తున్న పోరాటాన్ని
మనిద్దరి కొట్లాటగ మార్చి...
వాడు
చోద్యం చూస్తున్నడు!!
భూసంస్కరణలను అడ్డుకున్నడు
పేదోళ్ళ భూముమలను ఆక్రమించిండు
ప్రాజెక్టుల నీళ్ళను కొల్లగొట్టి
పెత్తందారు వేషం కట్టిండు
వాడు
కాంట్రాక్టరైండు
ఎమ్మేల్యే అయిండు
ఎంపీ అయిండు
వానికి
నీ, నా తేడా లేదు
వానికి
నీ సొంపేటా, వాన్‌పిక్
నా బయ్యారం, లాంకో హిల్స్
రెండూ ఒకటే
కబళించే పులికి కబళం మాదిరి
కానీ...
మనిద్దరికీ
తేడా ఒకటే
నువ్వు వాని
కొమ్ము కాస్తున్నవు
నేను వాని
దుమ్ము లేపుతున్నను
నేను వానిపై
చేస్తున్న పోరాటాన్ని
మనిద్దరి కొట్లాటగ మార్చి...
వాడు
చోద్యం చూస్తున్నడు!!
అన్నా వానికి ఎవలూ కొమ్ము కాస్తలేరు. వాని మాయలో పడ్దోల్లు కొందరు మధ్య తరగతి జీవులు మాత్రమె. మామూలు జనాలకు గీ సమైఖ్యాంధ్ర లొల్లి ఏందో, దాని ఎనక ఏముందో తెలుసు.
ReplyDeletebhagundi,sir
ReplyDeletenice!!!!
ReplyDelete