Saturday, August 1, 2015

యాత్ర - రామప్ప గుడి

 పేరు. అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన రామప్ప గుడి తప్పకుండా చూడదగిన ప్రాంతం.

వరంగల్ నగరానికి 77 కిమీ దూరంలో ఉన్న రామప్ప గుడి, రామప్ప చెరువు తప్పకుండా దర్శించ వలసిన ప్రదేశాలు. తెలంగాణా రాష్ట్రం వారసత్వ సంపదకి పెట్టింది పేరే అయినప్పటికీ వాటిలో రామప్ప గుడి తలమానికమైనదని చెప్పవచ్చు. ఇక్కడ వున్న అద్భుతమైన శిల్పకళ చూపరులను ఆశ్చర్య చకితులను చేస్తుంది.

యూరప్ లోని అతి ప్రాచీన కట్టడాలు కూడా సున్నపురాయి లేదా పాలరాతితో వుంటాయి. వీటిని చెక్కడం సులువు. కాని 12 శతాబ్దంలోనే రామప్పలోని అద్భుతమైన శిల్పాలను అత్యంత గట్టిదనం కలిగిన బ్లాక్ గ్రానైట్ రాతితో చెక్కిన విధానం చూస్తే ఆశ్చర్య చకితులను చేయక మానదు. వాటి అత్యంత నునుపైన పాలిష్ ఈనాటి ఉపకరణాలతో కూడా చేయడం అంత సులువైన పని కాదు. మరి ఆ రోజుల్లో వాటిని చెక్కడానికి ఎంత కష్టపడ్డారో అనిపిస్తుంది.

రామప్ప గుడి గురించిన మరిన్ని వివరాలను ఇక్కడ  మరియు ఇక్కడ చూడండి.

రామప్ప గుడిలోని అద్భుత శిల్పాలలో కొన్ని.





టరాజ రామక్రిష్ణ ప్రేరిని శివతాండవ పునఃసృష్టికి ఈ శిల్పమే స్పూర్థి!

త్రిపురాసుర సంహార దృశ్యం

మండపం పైన చెక్కడం

శివ తాండవం





క్షీరసాగర మథనం

నర్తకి - ఆరోజుల్లోనే వున్నట్టి ఎత్తు మడమల చెప్పులు!

నాగిణి


విల్లంబులు ధరించిన వనిత

ఇలాంతి గార్గోయిల్స్ పన్నెండు ఉన్నాయి







Friday, July 17, 2015

ఇదీ బాబు నిర్వాకం!

సర్కిల్ లో ఉన్నది బోయపాటి శ్రీను 

మొన్న ఎమ్మెల్యేల కుట్రలో "మనవాళ్ళు బ్రీఫుడు మీ" అంటూ అడ్డంగా దొరికిన చంద్రబాబు మరోసారి పుష్కరాల సందర్భంగా ఫోటోతో సహా దొరికి పోయాడు.

చంద్రబాబు ప్రచార కండూతి అందరికీ తెలిసిందే! అయితే అది ఈసారి మరిన్ని వెర్రితలలు వేసి  27 మంది చావుకు కారణమైంది .

పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుపుతానని ముందుగానే ఊహించేసుకుని, అలా జరిపించి నట్టు ప్రపంచ మీడియాకు తన రాజసాన్ని తెలియజెప్పే ఒక ఘోప్ప వీడియో ఉండక పొతే బాగోదని మీడియా సలహా దారులవారు అమూల్యమైన సలహా ఇచ్చారుట! రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు, తొడగొట్టు సినిమాలతో బావమరిదికి హిట్ల మీద హిట్లు ఇస్తున్న బోయపాటి శ్రీను అన్న మనిషిని దర్శకుడిగా నియోగిమ్సుకుని దాదాపు నాలుగ్గంటల పాటు నిర్విరామంగా బాబుగారి పూజా కార్యక్రమ విశేషాలను చిత్రీకరించారట! ఆ చిత్రీకరణ కూడా వీఐపీ ఘాట్ లో అయితే రంజుగా ఉండదని, ప్రజలంతా చుట్టూ నిలబడి (బారికేడ్ల అవతలే అనుకొండి) చూస్తుంటే పెదరాయుడి లెవెల్లో పుష్కర ఘాట్ లో షూట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట!

ఇదంతా రూమరేమో అనుకోవడానికి కూడా వీల్లేకుండా ఫోటోతో సహా దొరికి పోయాడు పెద్దసారు!

Wednesday, July 15, 2015

పుష్కరాలు, నాయకుల పూజలు

ప్రజల మధ్య సగర్వంగా పూజలు నిర్వహించిన నాయకుడు ఒకరు. 



***

ప్రజలను బారికేడ్లతో అదిమిపట్టి మూడున్నర గంటలు ప్రత్యేక పూజలు చేసిన నాయకుడు ఇంకొకరు. 




***


ఒక నాయకుడు జనంతో పాటు వెళ్ళి సాధారణంగా పూజ ముగించుకుని వచ్చాడు.

ఇంకో నాయకుడు ఆర్భాటంగా కొన్ని వేల చదరపు గజాల స్థలాన్ని తనకోసం బ్లాక్ చేయించుకుని ప్రజల రద్దీ పెరిగేందుకు పరోక్ష కారకుడయ్యాడు. 

ఫలితం ... 

ఒకరికి కీర్తి !
మరొకరికి అపకీర్తి !! 

27 మంది దుర్మరణం !!!

***

చంద్రబాబు నాయుడు పక్కనే VIP ఘాట్ ప్రత్యేకంగా వున్నా కూడా అక్కడికి వెళ్ళలేదు. 
గంటకు కొన్ని వేల మంది ప్రజలు ఉపయోగించుకోవాల్సిన పుష్కర ఘాట్‌ని తన సొంతానికి బ్లాక్ చేయించాడు.  
తన పూజ అయ్యేంత వరకూ లక్షల జనాన్ని బారికేడ్‌లతో బంధించాడు. 
మూడున్నర గంటల పాటు పూజా పునస్కారాలలో మునిగితేలి, అమూల్యమైన ప్రజా-గంటలను వృధా చేశాడు. 

దాని పరిణామమే తొక్కిసలాట, 27 మంది మరణం.  

ఆ 27 మందిది మరణం కాదు హత్య. 

దానికి బాధ్యుడు, ప్రధమ ముద్దాయి చంద్రబాబు నాయుడు మాత్రమే. 


Saturday, June 20, 2015

మనవాళ్ళు బ్రీఫ్‌డ్ మి.

బా: మనవాళ్ళు బ్రీఫ్‌డ్ మి. వాటెవర్ దె ప్రామిస్, వి విల్ ఆనర్.
-*-
చానెళ్ళు: వీడియో ఇది. బాబు ఆడియో ఇది.
-*-
బా: ఆంధా ప్రజల మీద కుట్రలు జరుగుతున్నాయి. మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు.
రాజ్‌దీప్: అయితే టేపుల్లోని వాయిస్ మీదేనా?
బా: అది నాకెలా తెలుస్తుంది?
రాజ్‌దీప్: అయితే ఆ వాయిస్ మీది కాదా?
బా: ఏమో! ఫ్యాబ్రికేటేడ్ కావచ్చు. కట్ అండ్ పేస్ట్ కావచ్చు.
రాజ్‌దీప్: అయితే అది ట్యాపింగ్ కాదా?
బా: తూచ్! అలాంటి కఠినమైన ప్రశ్నలు అడిగితే ఇకనుంచి కేవలం పచ్చ టీవిలకే ఇంటర్వ్యూ ఇస్తా!
-*-
ఎ.కె.ఖాన్: మేం ఎలాంటి ఫ్యోన్ ట్యాపింగ్ చేయలేదు. దీనిపై ఈసీకి నివేదిక ఇచ్చాం.
-*-
బా: ఠాఠ్! అయినా మీరేవరు? ఎన్నికల సమయంలో ఎంక్వయిరీలు కేవలం ఎలక్షన్ కమీషనే చేయాలి.
-*-
ఇ.సి: ఎంక్వయిరీ కొనసాగించాల్సింది గా తెలంగాణా ACBకి లేఖ రాశాం.
-*-
బాబు: (మోడీతో) దీనిపై మీరు వెంటనే జోక్యం చేసుకోవాలి. సెక్షను 8 పెట్టి KCRను, ACBలోని ఐపీయస్‌లను ఐయేయెస్‌లను అరెస్టు చేయాలి.
మోడి: ""
రాజ్‌నాథ్: ఆ వ్యవహారాలు హోం శాఖ చూసుకుంటుంది. మా ప్రత్యక్ష జోక్యం వుండదు.
కొత్తకోట దయాకర్ రెడ్డి: కొన్ని గంటల్లో తెలంగాణ ఐయేయెస్‌లు, ఐపీయెస్‌లు, తెరాస నాయకులు అరెస్టు కాబోతున్నారు.
-*-
బా (అండ్ గ్యాంగ్): వా! దీనిపై గవర్నరు జోక్యం చేసుకోవాలి. నాపై ఎంక్వైరీలను ఆపెయ్యాలి.
-*-
గవర్నరు: ""
-*-
అచ్చెం: గవర్నరు గంగిరెద్దు.
అచ్చెం(కాసేపటికి): వా!! నేనామాట ఆ వుద్దేశంతో అనలేదు (బాబు చెపితే తెలీక అన్నా). క్షమించండి.
-*-
-*-

Friday, February 13, 2015

వాస్తు?



ఇటీవల తెరాస ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విచిత్రంగా వుంటున్నాయి. కేసీఆర్ ఇటువంటి నిర్ణయాలపై పునరాలోచిస్తే మంచిది.

1. సెక్రెటేరీయట్ స్థలమార్పు, పునర్నిర్మాణం. 

విచిత్రంగా చాతీ దవాఖానను అనంతరిగిరికి మార్చడాన్ని మాత్రమే ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. నిజానికి దానికన్నా అభ్యంతరకరమైనది వాస్తు పేరుతో సెక్రెటేరీయట్‌ని మార్చడం. వాస్తు పేరుతో కార్యాలయాన్ని మార్చడం ఏమాత్రం సహేతుకంగాలేదు. ఒకవేళ ఇప్పుడున్న సెక్రెటేరియట్ భూములను అంతకన్నా మంచి పనులకు వాడదలిస్తే ఆ విషయం బహిరంగంగానే చెప్పాలి తప్ప వాస్తు అని కుంటి సాకులు చెప్పడం సరికాదు.

ఒకవేళ వాస్తు అన్నదే అసలు కారణమైతే అంతకన్నా ఘోరం మరొకటి వుండదు. ముఖ్యమంత్రే ఇలా వాస్తు పేరుతో డబ్బులు దుబారా చేస్తుంటే ఇక చేప్పాల్సిందేముంది. కలెక్టరు కార్యాలయం నుండి అటెండరు క్వార్టరు దాకా అన్ని భవనాలూ వాస్తు మార్పులకోసం రడీగా వుంటాయి. అదొక కోట్లాది రూపాయల వృధా కర్చుకు దారి తీస్తుంది.

2. వాస్తు నిపుణుడిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం.

ఇకనేం? వాస్తు నిపుణుల వారిని కూడా నియమించుకున్నారు. అంటే సదరు నిపుణుల వారు సలహాలివ్వడం తరువాయి ఉన్న గోడలు కూల్చడం, కొత్తవి కట్టడం జరుగుతాయన్న మాట! భవన నిర్మాణాలు శాస్త్రీయంగా హేతుబద్ధంగా జరగాలి. కట్టే భవనం దాని అవసరాలకు తగ్గట్టుగా నిర్మించాలి తప్ప వాస్తును గుడ్డిగా అనుసరించి కాదు. ఇప్పుడు నిర్మించే ఆధునిక హంగులున్న కార్యాలయాలకు కాలం చెల్లిన వాస్తు నియమాలను వర్తింప జేయడం అంటే మట్టిగోడలపై వంద అంతస్తుల భవనం నిర్మించడం లాంటిది. పైగా అవసరాలకు అనుగుణంగా భవంతుల డిజైన్లు చేసే ఇంజనీర్లకు, వాస్తు వితండ వాదిని జతచేసి అనవసరమైన గొడవలు సృష్టించడమే అవుతుంది.

ప్రజల్లోంచి వ్యతిరేకత రాకముందే ముఖ్యమంత్రి ఇటువంటి విచిత్రమైన ఆలోచనలను మానుకుంటే మంచిది. ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులకు మూఢ విశ్వాసాలు లేక పోతే మంచిది. ఒకవేళ వున్నా కూడా వాటిని వ్యక్తిగత విషయాలకే పరిమితం చేసుకుంటే మంచిది. అంతే కానీ అధికారం వుంది కదా అని ప్రతీ దాంట్లో తన విశ్వాసాలను జొప్పించడానికి ప్రయత్నిస్తే అది శతృవులకు బలాన్నిచ్చి చివరికి అధికారమే కోల్పోయే అవకాశం వుందని గ్రహించాలి.


Tuesday, January 27, 2015

47 రోనిన్ (సినిమా)



సెలవు రోజున టీవీ ఆన్ చేసేసరికి 47 Ronin అనే ఇంగ్లీషు సినిమా వస్తోంది. ఇదేదో బాగుంది కదా అనుకుని మొత్తం చూశాను. చూశాక అది మీతో పంచుకొవాలనిపించింది. దాని ఫలితమే ఈ వ్యాసం.

అది 18 శతాబ్దం నాటి జపాను జానపద గాధ. జానపదుల గాధల్లో కథ ముక్కు సూటిగా వుంటుంది. ఏ పాత్రను కూడా వెనకేసుకు రావడం కాని, కావాలని భ్రష్టుపట్టించడం కాని జరగదు. ఎవరి మెప్పునో ఆశించి అలాంటి పనులు చేయడం రాజాశ్రయం పొందిన కవులకు ఉంటుంది తప్ప జానపదులకు కాదు. అందువల్లనే జానపదుల గాధలు వాస్తవ పరిస్థితులకు బాగా అద్దం పడతాయి.

కథలోనికి వెళ్లేముందు అప్పటి జపాన్ రాజకీయ పరిస్థితుల గురించి కొంత తెలుసు కోవాలి. అప్పట్లో జపాన్ చక్రవర్తి ఉన్నా ఆయనది నామమాత్రపు పాలనే. ఆయన వద్ద వుండే షోగన్ అనబడే సైనికాదికారులదే  అసలు పెత్తనమంతా.  ఈ షోగన్ లు  ప్రాంతీయ ప్రభువులపై ఆజమాయిషీ చేసేవారు. ప్రతి ప్రభువు వద్దా సమురాయ్ వంశానికి (కులం అంటే సరిగా వుంటుందేమో) చెందిన యోధులు ఆయనకు విశ్వాస పాత్రంగా వుంటూ ఆయన్ని (ఆయనతో పాటు ప్రజలని) కాపాడుతూ వుంటారు. యుద్ధాలు చేస్తే ఈ సమురాయ్ లే చెయ్యాలి. ఇతర రైతు, వృత్తి పనుల వారు యుద్ధాలు కాదుగదా కనీసం కత్తులూ, కవచాలు కూడా ముట్టు కోరాదు.  ఏ కారణంగా నైనా ప్రభువు లేకుండా మిగిలిన  సమురాయ్ లు రోనిన్ లు గా మారతారు. అంటే తమ హక్కులు కోల్పోతారన్న మాట. ఇప్పుడు అర్థమైంది కదా, మన కథ పేరు '47గురు రోనిన్ లు'. వీరి సమాధులు ఇప్పటికీ జపాన్లో పూజించ బడుతున్నాయట!  ఇదీ కదా నేపథ్యం. ఉపోద్గాతం కాస్త ఎక్కువే అయినట్టుంది కదా?

వర్తకం కోసం ఓడ లో వచ్చిన అమెరికా తెల్లవాడికి, జపాన్ వనితకి అక్రమంగా పుట్టిన సంకరజాతి (కులహీనుడు) బిడ్డని ఆ తల్లి పురిట్లోనే విసిరేస్తుంది. ఆ బిడ్డని మామూలు ప్రజల చేత  చీదరించ బడే తంత్రగాళ్ళు చేరదీసి పెంచి, కై(కీను రీవ్స్) అని పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పిస్తారు, శస్త్రవిద్యలతో సహా. హింసించడం పట్ల విరక్తితో కై ఆ తంత్రగాళ్ళ వద్దనుండి పారిపోతాడు. అడవిలో అసహాయంగా పది వున్న కై ని అసానో అనబడే ప్రభువు చేరదీస్తాడు. ఎంత ప్రభువు చేరదీసినా అతని తక్కువ జాతి కారణంగా ఇతర సమురాయ్ ల హోదా అతనికి వుండదు. ఆయుధం పట్టగూడదు, యుద్ధాలు చేయగూడదు. అయితే అసానో కూతురు అకో కై మీద మనసు పారేసుకుంటుంది.  అయితే మరో బలమైన పొరుగు ప్రభువు కీరా, అకోని తనకిచ్చి పెళ్లి చెయ్యమని అసానో పై ఒత్తిడి తెస్తుంటాడు, కాని అసానోకు అది ఏమాత్రం ఇష్టం వుండదు.

ఇదిలా వుండగా అసానో  రాజ్యాన్నితనిఖీ చేయడానికి షోగన్  వచ్చిన సందర్భంగా అసానో, కీరా రాజ్యాల మధ్య యుద్ధ క్రీడలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా కీరా రాజ్యానికి చెందిన యోధుడిని ఎదుర్కోవలసిన అసానో పక్షపు సమురాయ్ కీరా మంతగత్తె ప్రభావంతో  డ్రెస్సింగ్ రూములోమూర్చిల్లుతాడు.  ప్రభువు పరువు నిలపడానికి సంకరజాతి వాడైన కై ఎవరికీ తెలియకుండా సమురాయ్ వేషంలో వచ్చి యుద్ధం చేస్తూ, శిరస్త్రాణం పడిపోవడం వల్ల  దొరికి పోతాడు. జరిగిన తప్పుకు బాధ్యతను తనపై వేసుకుంటాడు అసానో. అదేరాత్రి మంతగత్తె మాయాజాలం చేత కీరా తన కూతుర్ని మానభంగం చేస్తున్నట్టు భ్రాంతికి లోనైన అసానో, కీరా పై దాడి చేసే ప్రయత్నంలో దొరికి పొతాడు. షోగన్ తీర్పు పరిణామంగా అసానో ఆత్మాహుతి చేసుకొని మరణిస్తాడు. తమ వారి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం సమురాయ్ ల పధ్ధతి. కాని షోగన్ వారికి ఆ అవకాశం ఇవ్వకుండా అతని 46గురు అనుచరులని రోనిన్ లు గా ప్రకటించడమే కాక ప్రతీకార ప్రయత్నాలు చేయొద్దని శాసిస్తాడు. వారి ఆయుధాలను సంగ్రహించి తరిమేస్తాడు.

ఆ 46గురితొ కలిసిన సంకరజాతి కై ఎలా 47వ రోనిన్ గా మారింది, ఆయుధాలు సంపాదించి దుష్కరులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నదీ, దాని పర్యవసానాలు తరువాతి కథ. ఇందులో అంతర్లీనంగా నడిచేది కై,  అకో ల ప్రేమ కథ. కథాగమనం, నటన, గ్రాఫిక్స్ హాలివుడ్ స్థాయికి తగ్గట్టుగా వున్నాయి. ఈ సినిమాను చూసినప్పుడు జపాన్ లో కూడా ఒకప్పుడు మనలాంటి కుల వ్యవస్థ ఉన్నట్టు తెలియడం ఆశ్చర్య పరుస్తుంది.