మీ కమ్యూనిస్టుల సంగతి మరీ విచిత్రంగా వుందన్నా!
ఏమయింది? బాగానే వున్నాంగా?
రాను రాను మీరు ఏ సిద్దాంతం అమలు చేస్తున్నారో తెలియకుండా వుంది.
ఇంకేం సిద్ధాంతం? మేం కారల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలనే పాటిస్తాం.
మార్క్స్ ఏం జెప్పాడు?
పెట్టుబడి దారుడు కార్మికుడి శ్రమను దోచుకుంటాడు. కార్మికుడి వైపు నిలిచి పోరాడాలి అని.
మరి మీరేం జెస్తున్నారు?
ఏం జేస్తున్నాం?
ఆ టీవీ చానెళ్ళ వాళ్ళూ, పత్రికాధిపతులూ ఉద్యోగుల పొట్టలు గొట్టే పనులు చేస్తుంటే, జీతాలు సగానికి సగం కోత వేస్తే అదేంటని మాట్లాడరు.
మార్క్స్ కాలంలో టీవీ చానళ్ళు లేవు. పేపర్లు ఉన్నా ఇంత పెద్ద మీడియా సంస్థలు లేవు. కాబట్టి మార్క్స్ కు వాటి సంగతి తెలియదు. ఆయన రాయకుండా మేం ఏపనీ చేయం.
సరే! మరి MSOలు ప్రసారాలు నిలిపివేస్తే పోరాడాలని చెప్పాడా మార్క్సు?
MSOల సంగతి చెప్పలేదు. కాని "పోరాడాలని" మాత్రం చెప్పాడు. కాబట్టి ఎవరు పోరాటం చేసినా మేం సంఘీభావం తెలుపుతాం! ఆవేశంగా స్పీచులు దంచుతాం.
ఆఖరికి ఆ పోరాటాలు పెట్టుబడి దారులు చేస్తున్నా కూడానా?
పోరాటం ముఖ్యం. చేసేది పెట్టుబడిదారుడా, సామాన్యుడా అన్నది ముఖ్యం కాదు. ఇంక్విలాబ్ జిందాబాద్!! ఆ KCR "పాతరేస్తాం" అనడమేంటి? దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
ఆ మాట అనడం తప్పని మార్క్సు గారే చెప్పరా?
లేదు, కొన్ని కొన్ని మేం ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకుని ఆలోచిస్తాం.
అవునా! మరి ఎమ్మెల్యేలను "పాచి కల్లు తాగే మొఖాలకు ఫారిన్ విస్కీ", "ల్యాప్‌టాప్ మడిచి ఎక్కడో పెట్టుకుంటారు" అంటూ మాట్లాడడం సరైనదేనా?
ఏమో, దాని గురించి ఇంకా నిర్ణయించలేదు. కమిటీ వెయ్యాలి. సమావేశం కావాలి, చర్చించాలి. నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా మార్క్సు చెప్పని విషయాలను మార్క్సిజం లోకి అన్వయించడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఏళ్ళు పట్ట వచ్చు. లేక పోతే చారిత్రిక తప్పిదాలు జరుగుతాయి!
Marxist Hegelian Yesterday 18:32
ReplyDeleteCPI, CPMలు వర్గ పోరాటం చేసే పార్తీలు కావు, వర్గ సహకారం చేసే పార్తీలు. వాటిని కమ్యూనిస్త్ పార్తీలు అనలేము