Saturday, March 29, 2014

చంద్రబాబు BC కార్డు

జన్మించబోతున్న తెలంగాణా రాష్ట్రానికి ఇప్పటికే వున్న జీవన్మరణ సమస్యలు:
- హైదరాబాదును సీమాంధ్ర కబ్జా నుంచి విడిపించడం.
- ఉద్యోగుల ఆప్షన్లను అడ్డుకోవడం
- పోలవరం కోరల నుండి భద్రాచలం డివిజన్ను రక్షించడం.
- తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు సాధించడం
- విద్యుత్ ప్రాజెక్టులు... తద్వారా మిగులు విద్యుత్ సాధించడం.
- రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం.
- తెలంగాణా ప్రాంతపు విద్యావకాశాలను ఆంధ్రులనుండి పరిరక్షించడం.
ఇదీ తెలంగాణాకి ఉండవలసిన ఎజెండా.
కాని చంద్రబాబు ప్రమోట్ చేస్తున్న BC నాయకుడు ఏం ప్రకటించాడో చూడండి. ఆయనకు తెలంగాణా సమస్యలు పట్టవట! పదవిలో వుండి కూడా BC ఉద్యమమే చేస్తడట! జాతీయ స్థాయిలో BC రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లకోసం ఉద్యమాలు చేస్తడట!
ఆయన దృష్టిలో అవి ముఖ్యమైన విషయాలే కావచ్చు. కాని రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం వల్ల అవి ఎలా సాధ్యమో ఆయన చెప్పలేక పోయాడు. ఉద్యమాలు చేయడానికి ముఖ్యమంత్రి పదవలు అవసరమా?
ఆయన ఎజెండా చెప్పడంలో కృష్ణయ్యకు నిజాయితీ వుంది. కాని ఆ BC నాయకున్ని తీసుకురావడంలో చంద్రబాబుకు నిజాయితీ లేదు. తెలంగాణ ప్రజలను తికమక పెట్టే, దారి మళ్ళించే ఉద్దేశం మాత్రమే కనపడుతుంది.


No comments:

Post a Comment