విభజన ప్రక్రియ వేగవంతమైన ఈ తరుణంలో సీమాంధ్ర అధికారుల కుట్రలు కూడా అంతే ఊపందుకున్నట్టు వస్తున్నా వార్తలను బట్టి అర్థమైతుంది. గత అరవై సంవత్సరాల సీమాంధ్రుల చేతి వాటం చూసిన వారికెవరికైనా విభజన సమయంలో సీమాంధ్ర అధికారులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించ గలరని నమ్మకం కలగదు.
దురదృష్ట వశాత్తూ అన్ని శాఖల్లోనూ ఉన్నతాధికారులు మొత్తంగా సీమాంధ్రకు చెందిన వారే తిష్ట వేశారు. విభజన సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి ప్రభుత్వం ఒక వెబ్ సైటును కూడా ఏర్పాటు చేసింది. ఆ వివరాల సేకరణ, అప్లోడ్ పనులకు తెలంగాణా ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగుల, అధికారుల ప్రాతినిధ్యం వీలయినంత తక్కువగా ఉండేటట్టుగా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది.
స్థిరాస్తులను ఏమీ చేయలేనప్పటికి, మూవబుల్ వాటి విషయంలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వాహనాలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఫర్నిచర్, యంత్ర పరికరాలు, ఇతర పనిముట్ల విషయంలో కాలం చెల్లినవి, పాతవి తెలంగాణా ప్రాంతానికి అంటగట్టి కొత్తవి, ఖరీదైనవి సీమాంధ్రకి తరలించేందుకు కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తుంది.
విభజన ప్రక్రియ సక్రమంగా జరగాలంటే మొత్తం విధానం పారదర్శకంగా ఉండాల్సిన అవసరం వుంది. విభజన ప్రక్రియకు ఉపయోగిస్తున్న వెబ్సైటుని పబ్లిక్ యాక్సెస్ లో వుంచడం వల్ల కొంత నష్టాన్ని నివారించ వచ్చు. అలాగే ప్రక్రియలో తెలంగాణా వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ విషయంలో తెలంగాణా ప్రాంత నాయకులు పూనుకుని గవర్నర్ కు, కేంద్ర ప్రభుత్వానికి చెందినా విభజన అధికారులకు తగు సూచనలు చేయ వలసిందిగా తెలంగాణా వాదులు కోరుతున్నారు.
No comments:
Post a Comment