తెలంగాణా బిల్లు అసెంబ్లీ గడప దాటినప్పటి నుంచి సీమాంధ్ర నాయకులు, మీడియా పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా మొరుగుడు మొదలు పెట్టిన్రు.
అసలు బిల్లు అసెంబ్లీ దాట నివ్వం
రాష్ట్రపతి క్లియరెన్సు ఇవ్వదు
కోర్టు బిల్లును పార్లమెంటుకు పోకుండా ఆపి వేస్తది
అసలు పార్లమెంటులో పెట్టనే పెట్టరు.
బీజేపి అడ్డు కుంటది.
ఇట్ల ఇష్టం వచ్చినట్టు కూతలు కూసుడు మొదలు పెట్టిన్రు. కాని వీళ్ళు ఎట్ల ఎట్ల కూసిన్రో, సరిగ్గా దానికి వ్యతిరేకంగా జరిగినై.
బిల్లు అసెంబ్లీ దాటింది
రాష్ట్రపతి క్లియరెన్సు ఇచ్చిండు
కోర్టు చెత్త కేసులన్నీ కొట్టేసింది
బిల్లు పార్లమెంటుకు వచ్చింది
బీజేపి మాత్రం కొంత తొండి మాటలు మాట్లాడుడు మొదలు పెట్టింది. అయినా వాళ్ళ నాయకులు ఆ వెంటనే మేం తెలంగాణా ఏర్పాటుకు పూర్తీ మద్దతు ఇస్తాం అని కూడా చెప్తున్నరు. వాళ్ళు ఏం చెప్పినా... గలాటా చేస్తున్న సీమాన్ధ్ర ఎంపీలను ఇంటికి పంపిన కాంగ్రెస్, సొంత బలంతోనే బిల్లు నెగ్గిన్చుకుంటనని గట్టిగనే చెప్తున్నది.
తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని రాష్ట్రంల ఈ పాటికే బఫూన్ గా మారిన లగడపాటి, పార్లమెంటు మెంబర్లు, స్పీకర్ పై పెప్పర్ స్ప్రే దాడి చేసి భారత దేశం మొత్తానికి తన బఫూన్ గిరీ చాటుకున్నడు. మిగతా సీమాంధ్ర ఎంపీలు కూడా పార్లమెంటులో గూండాయిజం చెలాయిస్తూ, తెలంగాణా ఇవ్వడం ఎంత అవసరమో ఇతర రాష్ట్రాల వారికి వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పకనే చెప్పిన్రు. వీళ్ళ వికృత చేష్టలు చూసి చేష్టలుడిగిన దేశ ప్రజలు వీళ్ళ చెరనుండి తెలంగాణా విముక్తి ఎంత అవసరమో అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏ బీజేపీ మొకాలడ్డినా బిల్లు పాసై తీరుతది.
రెండు కళ్ళ సిద్దాంతం చెప్తున్న చెంద్రబాబు ఎక్కిన కడుప, దిగిన కడుప అనకుండా తిరుగ బట్టిండు, తెలంగాణా ఆపెతందుకు. ఇంకోదిక్కు నుండి జగను, ఇంకో పక్కనుండి కిరణ్, మరో పక్కనుండి రెండు నాల్కెల నాగ భైరవ! వీళ్ళకు దగ్గట్టు పూటకో మాట చెప్పే బీజేపీ. వీళ్ళందరి గుణపాఠం ఒక్క బిల్లుతోటి కుదరబోతున్నది!
ఇందరి డ్రామాల మధ్యన నిజంగా మోసపొతున్నది మాత్రం సీమాన్ధ్ర ప్రజలే. బఫూన్ గాళ్ళను, పగటేశ గాండ్లను నాయకులుగా ఎన్నుకున్న పాపానికో ఏమో... పార్లమెంటుల వాళ్ళ పక్షంల మాట్లాడే సీమాంధ్ర నాయకుడే కరువయ్యిండు పాపం!

No comments:
Post a Comment