ఘుమఘుమలాడే బిర్యానీ.. కమ్మటి సువాసనల ఇరానీ చాయ్.. వెండి తెరను వెలిగించిన సెకండ్ షో సినిమాలు.. తెల్లవారు ఝాముదాకా మేల్కొని ఉండే నగరం! ఇదీ హైదరాబాద్‌కు కొన్నేళ్ల క్రితంవరకూ ఉన్న ప్రఖ్యాతి! ఇంకాస్త ముందుకు వెళితే.. గంగా జమునా తెహజీబ్ యాదొస్తుంది! అంగళ్లలో ముత్యాలు రాశులు పోసి అమ్మి న వ్యాపార వైభవం తలంపుకొస్తుంది! పారసీలు, చెట్టియార్‌లు, మార్వాడీలు సహా దేశ విదేశాల నుంచి వచ్చిన ఎంతోమందిని అక్కున చేర్చుకుంది భాగ్యనగరం. వ్యాపార రంగంలో హైదరాబాద్‌ను శిఖరాక్షిగాలపై నిలబెట్టారు వీరంతా! ఒకప్పుడు వ్యాపా రం రంగంలో హైదరాబాద్ ప్రఖ్యాతిగాంచింది! కానీ.. ఇదే వ్యాపార రంగంలోకి చొరబడిన కొత్త శక్తులు.. నగరం ప్రతిష్ఠను మంటగలుపుతున్నాయి! నిజాం కాలంలోనే సర్వతోముఖాభివృద్ధిని సాధించిన రాష్ట్రరాజధానిలో పాగావేసిన సీమాంధ్రులే ఆ కొత్త శక్తులు! వీరెవరూ హైదరాబాదీలు కాదు! హైదరాబాద్ షాన్‌తో వీరికి సంబంధం లేదు! వివిధ వ్యాపారాల్లో అదనపు సంపద పోగేసుకుని.. ఇక్కడి భూములపై కన్నేసి.. వాటి కోసం అవినీతి అక్రమాలకు పాల్పడి.. రాజకీయ అధికారం మాటున పబ్బం గడుపుకున్న వాళ్లే వీరంతా! అందరూ అందరినీ అన్ని కాలాల్లోనూ మోసం చేయలేరన్న నానుడిని నిజం చేస్తూ ఇప్పుడు కటకటాలపాలయ్యారు! ఒక జగన్‌మోహన్‌డ్డి.. ఒక రామలింగరాజు.. ఒక ఒక గాలి జనార్దన్‌డ్డి.. ఒక నిమ్మగడ్డ ప్రసాద్... ఎవరైతేనేం? ఒక్కొక్కరూ మహాదోపిడీదారులు! హైదరాబాద్ సంపదను కొల్లగొట్టి.. సంస్కృతిని నాశనం చేసిన స్కామ్‌స్టర్స్! ఈ సీమాంధ్ర దోపిడీదారుల నుంచి తెలంగాణ విముక్తి కోసమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నినదిస్తోంది!
హైదరాబాద్‌కు వ్యాపారం కొత్త కాదు.. స్థానికులే కాదు.. స్థానికేతరులూ ఇక్కడి వ్యాపారాల్లో పాలుపంచుకుని.. నగర ప్రతిష్ఠను దిగంతాలకు చాటిన సందర్భాలున్నాయి! కానీ.. ఈ ప్రతిష్ట మొత్తం ఒకనాటి కథ! ఇప్పుడు ఆ స్థానంలో కుంభకోణాధీశులు.. అక్రమార్కులు.. దోపిడీదారులు తిష్టవేసుకుని కూర్చున్నారు. తమ తమ వ్యాపారాల్లో పోగేసుకున్న మిగులు సంపదతో.. గుట్టలు పడిన నోట్ల కట్టలతో.. సంపాదన కాంక్ష తీరక.. హైదరాబాద్‌ను గుప్పిట పట్టిన సీమాంధ్ర వ్యాపారులు.. రాజకీయ పెట్టుబడిదారులు! ప్రతిష్టస్థానంలో అప్రదిష్టను మూటకట్టిచ్చిన నయా వలసవాదులు! వీరి దెబ్బకు కోఠీలోని నీలకంఠం పట్టుచీరల దుకాణాల్లాంటివి ఎన్నో తెరమరుగైపోయాయి. రాజ్‌కపూర్ సినిమాలకు చిరునామాగా నిలిచిన దిల్‌షాద్‌లాంటి థియేటర్లు కమర్షియల్ కాంప్లెక్సులుగా మారిపోయాయి.
నోరూరించే పాయా హోటళ్లు పోయి ఆంధ్రా మెస్‌లు...రాయలసీమ రుచులు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడితో ఆగిపోయిందా?...అంటే అదీ లేదు. అడ్డదారిలోనైనా సరే సంపదను కూడబెట్టుకోవటమే తెలిసిన కొందరు సీమాంధ్రుల కారణంగా కడిగిన ‘ముత్యం’లాంటి భాగ్యనగరానికి కుంభకోణాల సిటీ అన్న పేరు సైతం వచ్చేసింది. ఎక్కడి నుంచో వచ్చి.. ఇక్కడ పెట్టుబడులు పెట్టి.. కుంభకోణాల్లో ఇరుక్కుపోయి కటకటాల వెనక్కు వెళ్లిన కొందరు పెట్టుబడిదారుల బాగోతాలను ఇటీవల ఔట్‌లుక్ మ్యాగజీన్ ప్రచురించింది. విశేషం ఏమిటంటే.వీరందరూ సీమాంధ్రులు కావడమే!
సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌పై కన్నేసిన సీమాంధ్రులు.. కాలక్షికమేణా ఇక్కడ తమకంటూ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మొదలైన సీమాంధ్ర పెట్టుబడిదారుల దోపిడీ పరంపర.. వైఎస్ రాజశేఖర్‌డ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వేయి నాలుకలు సాచినట్లయిందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి! ప్రత్యేకించి రెండు మూడు అగ్రవర్ణాలకు చెందిన పెట్టుబడిదారుల హవా మొదలైంది. వారికి కొందరు పొలిటికల్ గాడ్‌ఫాదర్లు తోడయ్యారు! వారి కనుసన్నల్లో పని చేసే కొందరు బ్యూరోక్రాట్లు. వీరి దోపిడీకి ద్వారాలు తెరిచారు! మొన్నటి హైటెక్ సిటీ కావచ్చు... తదుపరి ఔటర్‌రింగ్ రోడ్డు వ్యవహారం కావచ్చు.. తాజా శంషాబాద్ ఎయిర్‌పోర్టు కావచ్చు.. అభివృద్ధి పేరిట ఇక్కడ జరిగింది మాత్రం ఫక్తు దోపిడీ! ప్రఖ్యాత ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. దానిని బయటికి వెల్లడించముందే ఆ సమాచారం కాస్తా సీమాంధ్ర పెట్టుబడిదారులకు చేరిపోతుంది! ఇంకేం.. ఆ అభివృద్ధి ప్రాజెక్టులకు సమీపంలో భూములు మాయమైపోతాయి! సీమాంధ్ర పెట్టుబడిదారుల గుప్పిట్లో నామ మాత్రపు ధరలకు చిక్కుకుపోతాయి! ఆ వెంటనే రేట్లు పెరిగిపోతాయి. కారు చౌకగా కొనటం.. కళ్లు తిరిగే రేట్లకు అమ్మటం! ఇదీ దందా! మరోవైపు సాఫ్ట్‌వేర్ పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న వారు... మనీ సర్క్యులేషన్ స్కీంలు నడిపి ఇక్కడి ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టినవారు.. సెటిల్‌మెంట్లనే వృత్తిగా చేసుకున్న ‘పాలెగాళ్లు’.. ఎక్కడి నుంచో ఊడిపడి.. హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకుని అడ్డగోలుగా సంపాదించిన ఉదంతాలు ఇక్కడ కోకోల్లలు! ఇన్నిప్రయోజనాలు నెరవేర్చిన రాజకీయ నాయకులు మాత్రం తక్కువతిన్నారా? హార్డ్‌వేర్‌పార్కులు, సెజ్‌ల పేరిట అస్మదీయులకు భూ పందేరాలు చేసి.. కోట్లకు కోట్లు వెనకేసుకున్నఘనాపాఠీలపై రోజూ పత్రికల్లో విమర్శలు.. వ్యాసాలు చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్‌కు వలసలు కొత్త కాదు. దశాబ్దాల క్రితమే ఇక్కడకు వచ్చిన పార్సీలు.. మార్వాడీలు.. చెట్టియార్‌లు వ్యాపారాలు మొదలుపెట్టారు.
ఇప్పటికీ చేస్తున్నారు. అయితే.. వారి కారణంగా హైదరాబాద్‌కు మంచి పేరు వచ్చిందే తప్ప.. చెడ్డపేరు మాత్రం రాలేదు. కారణం.. నగరాన్ని తమ నగరంగా భావించి.. న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసుకోవటమే. నాలుగు రాళ్లు వెనకేసుకుని.. నలుగురు వ్యక్తులకు ఉపాధి కల్పించటమే! కానీ.. లాభార్జనే ధ్యేయంగా.. సంపాదనే లక్ష్యంగా వచ్చిన సీమాంధ్ర వ్యాపారులు మాత్రం రాత్రికి రాత్రి కోట్లు సృష్టించే మార్గన్వేషణ చేశారు! ఫలితమే నగరం కేంద్రంగా బద్దలైన పాపాలు! వేలు.. లక్షల కోట్ల విలువ చేసే కుంభకోణాలు! వెరసి.. ముత్యాల నగరంగా ఒకనాడు భాసిల్లిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు కుంభకోణాల నిలయమైందని.. మినీ భారత్‌గా గర్వంగా చెప్పుకునే హైదరాబాద్ నగరం.. పరువు పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నదని ప్రత్యేక తెలంగాణవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వెనుక ఈ దోపిడీ శక్తుల నుంచి విముక్తి కోరుకోవటం కూడా ఓ ప్రధాన కారణమని వారు అంటున్నారు. హైదరాబాద్ ప్రతిష్ఠను మసకబార్చిన కొందరు ఇప్పుడు చెంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఊచలు లెక్కబెడుతున్నారు. వారిలో కొందరు ప్రముఖులు....
వైఎస్ జగన్‌మోహన్‌డ్డి
2004లో వైఎస్ సీఎం కావటానికి ముందు.. బంజారాహిల్స్‌లోని తన నివాసాన్ని సైతం అమ్ముకోవటానికి సిద్ధమయ్యారట. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులే చెబుతుంటాయి. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించకపోతే ఆయన పొలిటికల్ కెరీర్ కూడా ప్రమాదంలో పడేదని వివరిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర ద్వారా ప్రజలను ఆకట్టుకున్న రాజశేఖర్‌డ్డి ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. దాదాపు ఐదున్నరేళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ఆయన కుటుంబం వేల కోట్ల రూపాయలకు పడగలెత్తింది. ఆయన కొడుకు వైఎస్ జగన్‌మోహన్‌డ్డి లక్ష కోట్ల రూపాయలనుఅక్షికమంగా ఆర్జించార్న ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ ఆస్తులపై కేసులు నమోదు చేసిన సీబీఐ.. ఇప్పుడు ఆ వివరాలను బయట పెడుతోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ‘మేళ్లు’ పొందిన కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు దానికి ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీల్లో వందల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టిన వైనాన్ని వెల్లడిస్తోంది. క్విడ్-ప్రొ-కో పద్ధతిలోనే జగన్ కంపెనీల్లోకి నిధుల ప్రవాహం జరిగిందని ఇప్పటికే నేరాభియోగాలు మోపిన సీబీఐ ఈ భాగోతాన్ని వివరిస్తూ కోర్టుకు చార్జిషీట్లు కూడా సమర్పించింది. ప్రస్తుతం జగన్ చెంచల్‌గూడ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు.
వెంకట్రాం రెడ్డి
పత్రికా రంగం నుంచి ఐపీఎల్ దాకా ప్రస్థానం సాగించిన వెంకట్రాం రెడ్డి తన సంస్థను నమ్మి పెట్టుబడులు పెట్టినవారిని నిలువునా వంచించారు. నమ్మి నిధులు సమకూర్చిన సంస్థలను సైతం మోసం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రమోటర్లు ఉమ్మడిగా కంపెనీ ఈక్విటీలో యాభైనాలుగు శాతం షేర్లను తాకట్టుగా పెట్టటం ద్వారా ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ ఫ్యూచర్ క్యాపిటల్ నుంచి రూ.170 కోట్లు సేకరించారు. ఈ మొత్తం నుంచి రూ.150 కోట్లు దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు, మిగతా రూ.20 కోట్లు ఎనియోటెక్ ప్రమోటర్లు (ఇద్దరూ ఒక్కటే) తీసుకున్నారు. నిధులను సేకరించటానికి ముందు స్టాక్ బ్రోకింగ్ డిపాజటరీ సర్వీసుల్లో ఉన్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌లోని తమ డీమ్యాట్ ఖాతాల్లో మొత్తం 11,28,51,000 దక్కల్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు ఉన్నట్టుగా ఫ్యూచర్ క్యాపిటల్‌కు తెలియచేశారు.
వీటిని తాకట్టు పెట్టిన నేపథ్యంలో ఫ్యూచర్ క్యాపిటల్ అనుమతి లేనిదే ఈ షేర్లకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపటానికి వీల్లేదు. అయితే, వెంకవూటాండ్డి తమ షేర్లలో కొంత భాగాన్ని ఆ సంస్థ ద్వారానే రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ అనే మరో సంస్థలోని తమ డిపాజిటరీ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. మరికొన్ని షేర్లను ఐడీఎఫ్‌సీకి తాకట్టు పెట్టి కొత్తగా రుణాలు తీసుకున్నారు. ఫ్యూచర్ క్యాపిటల్‌తో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఒప్పందం రద్దయిందని నమ్మిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ దీనికి అభ్యంతరం చెప్పలేదు. ఆ తరువాత అసలు విషయం బయటపడటంతో కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ వెంకట్రాంరెడ్డిపై హైదరాబాద్ నేరపరిశోధక విభాగానికి ఫిర్యాదు చేసింది.
నిమ్మగడ్డ ప్రసాద్
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి నిమ్మగడ్డ ప్రసాద్. పదేళ్ల క్రితం వరకు సాధారణ ఉద్యోగి. అంతలోనే వందలు.. వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టే స్థాయికి ఎదిగిన చమత్కారి. స్వల్పకాలంలోనే కోట్లకు పడగలెత్తిన నిమ్మగడ్డ ప్రసాద్ సైతం జగన్‌కు చెందిన కంపెనీల్లో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టారు. వాన్‌పిక్ ప్రాజెక్టు పేరిట వైఎస్ ప్రభుత్వం నుంచి దాదాపు 14 వేల ఎకరాల భూములను నిమ్మగడ్డ ప్రసాద్ దక్కించుకున్న వైనాన్ని ఇప్పటికే సీబీఐ రట్టు చేసింది. దాంతోపాటు అప్పటి ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డ ప్రసాద్ పొందిన మినహాయింపులను కూడా బయటపెట్టింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు మోపిదేవి వెంకటరమణ...ధర్మాన ప్రసాదరావు ఈ వ్యవహారంలో చేసిన మంత్రాంగాన్ని సైతం వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈయన అడ్రస్ కూడా కేరాఫ్ చెంచల్‌గూడ జైలు.
గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్
రమేశ్ గెల్లీ.. బ్యాంకింగ్ గురూగా పేరున్న వ్యక్తి. వైశ్యాబ్యాంక్‌ను ప్రారంభించి కొద్ది కాలంలోనే అభివృద్ధి చేసిన ఆయన ఆ తరువాత దాంట్లో నుంచి బయటకు వచ్చారు. గ్లోబల్ ట్రస్ట్ పేరుతో మరో బ్యాంక్‌ను ప్రారంభించారు. తెరవెనక మతలబు ఏంటోగాని ఇష్టానుసారంగా రుణాలు ఇవ్వటం ద్వారా బ్యాంకును కష్టాల్లోకి నెట్టేశారు. కేతన్ పారేక్ సహాయంతో గట్టెక్కాలనుకున్న వీలుపడక పోవటంతో పతనమైపోయారు.
సత్యం రామలింగరాజు
సత్యం కంప్యూటర్స్.. అందులో ఉద్యోగం చేస్తున్నవాడైతే పాతిక లక్షలైనా కట్నం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేయవచ్చని ఒకప్పుడు అనుకునేవారు. అయితే అదంతా గతం. సత్యం ప్రతిష్ట మంటగలిసిపోవడానికి కారణం తేలికగా డబ్బు సంపాదించాలన్న దురాశే. సాఫ్ట్‌వేర్ వ్యాపారంలో కోట్లు వెనకేసుకున్న రామలింగరాజు ఆ తరువాత రియల్ ఎస్టేట్ వైపు దృష్టిని సారించారు. రియల్ ఎస్టేట్ బూమ్ సమయంలో మార్కెట్ రేటుకన్నా ఎక్కువ డబ్బు ఇస్తానని ఎకరానికి ఇరవై వేల నుంచి.. రెండు లక్షల రూపాయల వరకు వెచ్చించి హైదరాబాద్ చుట్టు పక్కల వందలు...వేల ఎకరాల భూములు కొన్నారని చెబుతారు. బెంగళూరుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆస్తులను కూడబెట్టారని సమాచారం. దీనికోసం సత్యం కంప్యూటర్స్ నిధులను మళ్లించినట్లు తెలుస్తోంది. రియల్ బూమ్ ఢామ్మనటంతో బొక్కబోర్లా పడ్డారు. ఈ నిజాన్ని వెంటనే వెల్లడించారా? అంటే అదీ లేదు. చేసిన నిర్వాకంతో సత్యం కంప్యూటర్స్ నిలు ఊబిలో కూరుకుపోయినా, తమ సంస్థకు పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయని ప్రకటిస్తూ వచ్చారు. చివరకు పులి మీద స్వారీ అన్న చందాన పరిస్థితి పూర్తిగా చేయి జారిపోయిన తరువాత అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సీబీఐ చెబుతున్న ప్రకారం ఈ కుంభకోణం విలువ ఏడువేల కోట్ల రూపాయల పై చిలుకే ఉంటుంది. కొద్ది కాలం క్రితం బెయిల్‌పై బయటకు వచ్చారు రామలింగరాజు.
కోనేరు ప్రసాద్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు కోనేరు ప్రసాద్. తిమ్మిని బమ్మి చేయటంలో మహా దిట్ట అని ఆయన గురించి తెలిసినవారు చెబుతారు. ఎమ్మార్-ఎంజీఎఫ్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను పరిశీలిస్తే ఈ విషయం అక్షర సత్యమని స్పష్టమవుతుంది. అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటళ్లు, గోల్ఫ్‌కోర్స్‌తోపాటు విల్లాలను అభివృద్ధి చేసే నిమిత్తం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మణికొండ పరిసరాల్లో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్-ఎంజీఎఫ్ సంస్థకు 535 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ వెంటనే కోనేరు ప్రసాద్ రంగంలోకి దిగారు. నామినేటెడ్ డైరెక్టర్‌గా ఎమ్మార్-ఎంజీఎఫ్‌లో చేరి చక్రం తిప్పారు. గజం యాభైవేల రూపాయల చొప్పున అమ్మించి రికార్డుల్లో మాత్రం కేవలం అయిదువేల రూపాయలకు విక్రయించినట్టుగా చూపించి కోట్లు కొల్లగొట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి జరిపిన విచారణలో ఈ భాగోతం బయటపడింది. ప్రస్తుతం ఈయన నివాసం చెంచల్‌గూడ జైలు.
గాలి జనార్దన్‌డ్డి
గాలి జనార్దన్‌డ్డి.. ఈ పేరు వింటేనే బంగారు కుర్చీలు... రోల్స్ రాయిస్ కార్లు...హెలికాప్టర్లు గుర్తుకొస్తాయి. అలాంటి వైభవం అనుభవించాడు మరి. మన ఖనిజ సంపదను కొల్లగొట్టటం ద్వారానే గాలి జనార్దన్‌డ్డి ఇంత వైభోగాన్ని అనుభవించాడు. వైఎస్ రాజశేఖర్‌డ్డితో సన్నిహితంతో ఆంధ్ర-కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ముడి ఇనుప ఖనిజం గనులను దక్కించుకున్న గాలి పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. సీబీఐ చెబుతున్న ప్రకారం 65 లక్షల టన్నుల ముడి ఇనుప ఖనిజాన్ని తవ్వుకొన్న గాలి జనార్ధన్‌డ్డి దానిని విదేశాలకు ఎగుమతులు చేయటం ద్వారా 5వేల కోట్ల రూపాయలకు పైగానే సంపాదించాడు. మొన్నటిదాకా చెంచల్‌గూడ జైల్లో ఉన్న గాలి.. ప్రస్తుతం బెంగళూరు జైల్లో కటకటాలు లెక్కవేసే పనిలో ఉన్నారు.
కుంభకోణాల్లో కూరుకు పోయిన మహామహులందరు సీమాంధ్ర వారు కావడం యాదృచ్చికం కాక పోవచ్చు. అలా అని సీమాంధ్ర కు చెందిన వారందరూ అవినీతి పరులని చెప్పడం నా ఉద్దేశం కాదు. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణాలో ఇలాంటి అవినీతి పరులు రారని చెప్పలేం. అవినీతి వ్యతిరేక పోరాటం దేశమంతా కలిసి చేయ వలసిందే. కాని ఇలా ఒక ప్రాంతం వారే రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైనం రాష్ట్రంలో రాజ్యాధికారం ఒక ప్రాంతం వారికి ఎలా పాదాక్రాంతమైనదనే విషయానికి అద్దం పడుతుంది.